శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పదకొండవ పాశురము: తిరుప్పాణాళ్వార్ యొక్క దివ్య చరణములను తమ శిరస్సుపై ఆభరణము వలే ధరించిన రామానుజులను ఆశ్రయించిన వారి గొప్పతనము గురించి తాను ఎక్కువగా మాట్లాడలేరని అముదనార్ తెలియజేస్తున్నారు.
శీరియ నాన్మఱై చ్చెం పొరుళ్ । శెందమిళాల్ అళిత్త
పార్ ఇయలుం పుగళ్ । పాణ్ పెరుమాళ్ చరణాం పదుమ
త్తార్ ఇయల్ శెన్ని ఇరామానుశన్ తన్నై చార్‌ందవర్ తమ్।
కారియ వణ్మై । ఎన్నాల్ శొల్లొణాదు ఇక్కడల్ ఇడత్తే ॥ (11)
ఎంబెరుమాన్ యొక్క విషయములను తెలియజెప్పే నాలుగు వేదముల విశిష్ట అర్థములను అందమైన తమిళ పూమాల తో మనకు కృప చేసినవారు తిరుప్పాణాళ్వార్.కమలాల వలె ఉన్న వారి యొక్క దివ్య చరణములను తమ దివ్య శిరస్సున అలంకరించుకున్నవారు రామానుజులు. ఈ ప్రపంచములో అటువంటి రామానుజులను ఆశ్రయించిన వారి గురించి నేను ఎక్కువ చెప్పలేను.
పన్నెండవ పాశురము: తిరుమళిశై ఆళ్వార్ యొక్క దివ్య పాదములు నివాసముగా ఉన్న రామానుజులను ఆరాధించు వారిపై కాక ఇంకెవరిపై నైనా అనురాగము తనకు ఉండగలదా అని అముదనార్ ప్రశ్నిస్తున్నారు.
ఇడం గొండ కీర్‌త్తి । మళిశైక్కిఱైవన్ । ఇణై అడిప్పోదు
అడంగుం ఇదయత్తి రామానుశన్ * అం పొర్పాదం ఎన్ఱుం
కడం కొణ్డు ఇరైంజుం తిరు మునివర్ క్కు అన్ఱి క్కాదల్ శెయ్యా
త్తిడంగొండ ఞ్ఙానియర్‌క్కే । అడియేన్ అన్బు శెయ్వదువే॥ (12)
తన గుణాల కీర్తి ఈ భూమంతటా నలు మూలలు వ్యాపించి ఉన్న వారు తిరుమళిశై ఆళ్వార్. అప్పుడే వికసించిన పుష్పాల వలె లేతగ ఉన్న తిరుమళిశై ఆళ్వార్ యొక్క చరణాలు తన దివ్య తిరుమేనిలో ఉంచుకున్న వారు ఎంబెరుమానార్. అటువంటి ఎంబెరుమానార్ యొక్క చరణారవిందములను నిరంతరము ధ్యానించే వారు ఉన్నారు, వారి స్వరూపానికి అనుగుణమైనదని భావించి వారి దివ్య చరణములను ఆరాధించే సంపద కలిగినవారూ ఉన్నారు. ఎంబెరుమానార్ యొక్క చరణారవిందముల పట్ల భక్తి లేని కఠోర హృదయము గల వారి పట్ల ప్రేమ చూపించగలనా?
పదమూడవ పాశురము: తొండరడిప్పొడి ఆళ్వారుల దివ్య చరణములు తప్పా ఇంకేదీ ఆశించని రామానుజుల దివ్య చరణములే మనకు లక్ష్యము.
శెయ్యుం పశుం తుళవ త్తొళిల్ మాలైయుం । శెందమిళిల్
పెయ్యుం । మఱైత్ తమిళ్ మాలైయు౦ * పేరాద శీర్ అరంగత్తు
ఐయన్ కళర్కు అణియుం పరన్ తాతమిళ్ అన్ఱి । ఆదరియా
మెయ్యన్ । ఇరామానుశన్ చరణే గది వేఱు ఎనక్కే॥ (13)
దాస్య భావానికి పరాకాష్ట అయిన తొండరడిప్పొడి ఆళ్వార్, నిగూఢ వేదార్థముల గురించి తెలిపే తమిళ వేదపూమాలలతో, తుళసి మాలలతో శ్రీరంగములో శాశ్వతంగా శయనించి ఉన్న ఎంబెరుమాన్ యొక్క చరణాలను అలంకరించేవారు. తొండరడిప్పొడి ఆళ్వార్ యొక్క చరణాలు తప్పా ఇంకొకటి ఆశించని సత్యపూరితులైన రామానుజుల దివ్య చరణములే నాకు అంతిమ లక్ష్యము.
పద్నాలుగవ పాశురము: కుళశేఖర ఆళ్వారుల పాసురములను పఠించు వారిని ప్రశంసించే రామానుజులను విడ నందుకు, ఇతరోపాయముల సహాయముతో లాభాలను పొందే స్వభావమును విడిచానని అముదనార్ తెలియజేస్తున్నారు.
కదిక్కుప్పదఱి । వెమ్ కానముం కల్లుం కడలుం ఎల్లాం ।
కొదిక్క త్తవం శెయ్యుం । కళ్గైయత్తేన్ * కొల్లి కావలన్ శొల్
పదిక్కుం కలై క్కవి పాడుం పెరియవర్ పాదంగళే ।
తుదిక్కుం పరమన్ । ఇరామానుశన్ ఎన్నై చ్చోర్విలనే॥ (14)
శాస్త్రములను రత్నాలుగా అలంకరించిన కుళశేఖర ఆళ్వారుల పాసురములను నిష్థగా పఠించు వారిని ప్రశంసించే ప్రముఖులైన రామానుజుల నుండి నేను వేరు కాలేను. కావున కోరుకున్న లాభాలు పొందాలని కొండలలో, అరణ్యాలలో తొందరపాటుతో కఠోర తపస్యలు చేయాలనే స్వభావాన్ని మానుకున్నాను.
పదిహేనవ పాశురము: పెరియాళ్వార్ దివ్య చరణముల వద్ద తన మనస్సునుంచిన ఎంబెరుమానార్ యొక్క దివ్య గుణాలను ధ్యానించని వారితో తాను కలవనని, తనకు ఇంక ఏ లోపమూ లేదని అముదనార్ తెలియజేస్తున్నారు.
శోరాద కాదల్ పెరుంజుళిప్పాల్ । తొల్లై మాలై ఒన్ఱుం ।
పారాదవనై । ప్పల్లాండెన్ఱు కాప్పిడుం * పాన్మైయన్ తాళ్
పేరాద ఉళ్ళత్తు ఇరామానుశన్ తన్ పిఱంగియ శీర్।
శారా మనిశరై చ్చేరేన్ । ఎనక్కెన్న తాళ్వివినియే ॥ (15)
ఎంబెరుమాన్ నిత్యము స్థిరంగా ఉండి దృఢమైన విశ్వాసముగల వారిని, సుడికుండములో చిక్కుకున్న వారినీ అందరికీ రక్షణ ఇస్తారు. అటువంటి భగవాన్ కి పెరియాళ్వార్ మామూలు మనిషికి చేసినట్టుగా ఏ భేదము లేకుండా మంగళాశాసనములు చేస్తారు. పెరియాళ్వార్ యొక్క దివ్య చరణములను వీడని దివ్య మనస్సు గల వారు ఎంబెరుమానార్. ఎంబెరుమానార్ అసీమితమైన గుణాలను ఆశ్రయముగా పరిగణించని వారితో నేను కలవను. ఈ ఆలోచన కలిగిన పిమ్మట , నాలో ఏ లోపము ఉండును?(ఏ లోపము లేదు).
పదహారవ పాశురము: తనకు అతి ప్రియమైన ఆండాళ్ కృపకు పాత్రులైన ఎంబెరుమానార్ ఈ ప్రపంచానికి చేసిన ఉపకారము గురించి అముదనార్ దయతో వ్రాస్తున్నారు.
తాళ్వొన్ఱల్లా । మఱై తాళ్ న్దు। తలముళుదుం కలియే
ఆళ్గిన్ఱ నాళ్ వన్దు। అళిత్తవన్ కాణ్మిన్* అరంగర్ మౌళి
శూళ్గిన్ఱ మాలైయై చ్చూడి క్కొడుత్తవళ్ తొల్ అరుళాల్
వాళ్గిన్ఱ వళ్ళల్ । ఇరామానుశన్ ఎన్నుం మా మునియే ॥ (16)
ఆండాళ్ పూష్ప మాలలను ముందు తాను అలంకరించుకొని చూసి ఆపై పెరియ పెరుమాళ్ యొక్క దివ్య కిరీటాలంకరణకి ఇచ్చేది. ఆండాళ్ కృప చేత ఎంబెరుమానార్ ఎంతో గొప్పగా యతులకు రాజుగా ఉద్ధరింపబడ్డాడు. సమస్థ భూమండలము చీకటిలో కలుముకొని ఉన్న కలి కాలములో, ఏ కల్మశములేని వేదములను ఇతర తత్వవేక్తలు దూషింస్తున్న సమయములో ఎవరూ అడగకుండానే ఎంబెరుమానార్ వేదోద్ధారణ గావించారని మనము గమనించాలి.
పదియేడవ పాశురము: తిరుమంగై ఆళ్వార్లకు అంకితులైన ఎంబెరుమానార్ ని చేరుకున్న వారు, ఎటువంటి కష్టము వచ్చినా ధైర్యముగా ఎదుర్కొనుదురు.
మునియార్ తుయరంగళ్। ముందిలుం । ఇన్బంగళ్ మొయ్ త్తిడినుం
కనియార్ మనం । కణ్ణమంగై నిన్ఱానై * కలై పరవుం
తనియానై యై త్తణ్ తమిళ శెయ్ద నీల తనక్కు ఉలగిల్
ఇనియానై। ఎంగళ్ ఇరామానుశనై వందు ఎయ్దినరే॥ (17)
అన్ని శాస్త్రములు భగవాన్ ని గొప్పగా కీర్తించాయి, తిరుక్కణ్ణమంగైలో గర్వముగా నిలుచొని ఉన్న ఎంబెరుమాన్ ని ‘సర్వ స్వతంత్ర గజము’ అని తిరుమంగై ఆళ్వార్ ప్రశంసించారు. మనందరి స్వామి అయిన రామానుజులు తిరుమంగై ఆళ్వార్ పట్ల అమితమైన భక్తి గలవారు. అటువంటి రామానుజులను చేరుకున్నవారు ఎటువంటి దుఃఖము వచ్చినా ధైర్యముగా ఎదుర్కొనగలరు, సంతోషము వచ్చినా స్థిరముగా ఉండగలరు.
పద్దెనిమిదవ పాశురము: మధురకవి ఆళ్వార్ తమ హృదయములో నమ్మాళ్వార్ ని నివాస పరచుకున్నారు. సమస్థ ఆత్మలు ఉద్దరింపబడాలని ఎంతో కృపతో మధురకవి ఆళ్వార్ యొక్క గుణాలను ఎంబెరుమానార్ మనకు వివరిస్తున్నారు అని అముదనార్ తెలియజేస్తున్నారు.
ఎయ్దర్కు అరియ మఱైగళై। ఆయిరం ఇన్ తమిళాల్
శెయ్దర్కు ఉలగిల్ వరుం శడగోబనై * చ్చిందైయుళ్ళే
పెయ్దర్కు ఇశైయుమ్। పెరియవర్ శీరై ఉయిర్గళ్ ఎల్లాం
ఉయర్కుదవుం। ఇరామానుశన్ ఎం ఉఱుతుణైయే॥ (18)
వేదార్థాలను స్థ్రీలు పిల్లలు కూడా సులువుగా అర్థము చేసుకునేందుకు తిరువాయ్మొళి వేయి పాశురముల రూపములో నమ్మాళ్వార్ ఈ భూమిపైన అవతరించి మనకు కృపచేశారు. వేదములను ధిక్కరించి తప్పుగా అర్థము చేసుకునేవారికి శత్రువుగా వారిని ‘శఠకోపుడు’ అని కూడా పిలిచేవారు. మధురకవి ఆళ్వార్ తమ హృదయములో నమ్మాళ్వార్ ని నివాస పరచుకునేంత గొప్పతనము కలిగినవారు. అటువంటి మధురకవి ఆళ్వార్ యొక్క జ్ఞానము మొదలైన ఉన్నత గుణాలను అర్థమైయ్యేలా చేసి ఆత్మలన్నీ ఉద్దరింపబడేందుకు సహాయము చేసిన ఎంబెరుమానార్ తన సహచరుడు అని అముదనార్ తెలియజేస్తున్నారు.
పంతొమ్మిదవ పాశురము: “నమ్మాళ్వార్ తన సర్వస్వము” అని దయతో చెప్పిన ఎంబెరుమానార్ తనకు ప్రీతిపాత్రులు అని అముదనార్ తెలియజేస్తున్నారు.
ఉఱు పెరుం శెల్వముం। తందైయుం తాయుం। ఉయర్ గురువుం
వెఱి తరు పూమగళ్ నాదనుం * మాఱన్ విళంగియ శీర్
నెఱి తరుం శెందమిళ్ ఆరణమే । ఇన్ఱిన్నీర్ నిలత్తోర్।
అఱిదర నిన్ఱ। ఇరామానుశన్ ఎనక్కారముదే॥ (19)
మన అంతిమ లక్ష్యాలు, అంతులేని సంపద, తల్లి, తండ్రి, గురువు, పద్మములో నుండి ఉద్భవించిన పెరియ పిరాట్టి అన్నింటిలోకీ సర్వేశ్వరుడు (భగవాన్) గొప్పవాడు. ఈ వృత్తాంతమంతా భగవాన్ అనుగ్రహపూరితముగా నమ్మాళ్వార్ కి వ్యక్త పరచిన వేంటనే, ఆళ్వార్ ద్రావిడ వేదముగా (తమిళ వేదము) కీర్తించబడే తిరువాయ్మొళిని పాడారు. ఈ ప్రపంచములో అందరూ అర్థము చేసుకునేలా తిరువాయ్మొళిని వివరించిన ఎంబెరుమానార్ నాకు మధువు (తేనె) లాంటివారు.
ఇరవైయవ పాశురము: నాథమునిని కోరికతో ఆనందించిన ఎంబెరుమానార్ నాకు నిధి లాంటివారు అని అముదనార్ తెలియజేస్తున్నారు.
ఆర ప్పొళిల్ తెన్ కురురై ప్పిరాన్। అముద త్తిరువాయ్
ఈర త్తమిళిన్ । ఇశై ఉణర్‌ందోర్గట్కు * ఇనియవర్ తం
శీరై ప్పయిన్ఱుయ్యుం। శీలం కొళ్ నాదమునియై నెఞ్ఙాల్
వారి ప్పరుగుం। ఇరామానుశన్ ఎందన్ మానిదియే॥ (20)
చందనపు తోటలతో చుట్టి ముట్టి ఉన్న అందమైన తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వార్, కృపతో వారి దివ్య అధరముల గుండా తిరువాయ్మొళి ని పాడారు. ఆ దివ్య పాశురములకు సంగీత శైలిని జోడించిన వారిని నాథమునులు పొగిడారు. అటువంటి నాథమునిని తన హృదయములో నివాసపరచుకున్న ఎంబెరుమానార్ నాకు మహా నిధి.
తదుపరి శీర్శికలో, ఈ ప్రబంధము యొక్క పై పాశురములను అనుభవిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-11-20-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org