శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్ – శ్రీవిల్లిపుత్తుర్
నీంగామల్ ఎన్ఱుం నినైత్తుత్ తొళుమింగళ్ నీళ్ నిలత్తీర్
పాంగాగ నల్ల ప్రమేయ సారం పరిందళిక్కుం
పూంగావళం పొళిల్ సూళ్ పుడై వాళుం పుదుప్పుళి మన్
ఆంగారం అఱ్ఱ అరుళాళ మాముని అంపదమే!
ప్రతిపదార్థము:
నీళ్ నిలత్తీర్ = ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా!
పూంగా వళం పొళిల్ = అందమైనన తోటలు, పెద్ద తోపులు
సూళ్ పుడై = నాలుగు దిక్కుల విస్తారముగా వున్న
పుదు ప్పుళి = పుదు ప్పుళి అనే ప్రాంతములో
మన్ వాళుం = పండిత గొష్టికి నాయకులుగా విరాజిల్లుతున్న
ఆంగారం అఱ్ఱ = గర్వము లేని
అరుళాళ మాముని = అరుళాళ మాముననుల
పాంగాగ = అనుకూలమైన , ఉపయోగకరమైన
నల్ల ప్రమేయ సారం = ఆత్మోజ్జీవనానికి ఉపకరించే ఉన్నతమైన తిరుమంత్ర సారమును
పరిందళిక్కుం = దయతో కృపచేసే
అంపదమే = శ్రీపాదములను
ఎన్ఱుం నీంగామల్ = ఎన్నటికీ వదలక
నినైత్తు తొళుమిన్ గళ్ = స్మరించి నమస్కరింతురు గాక!
వ్యాఖ్యానము:
ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా! అరుళాళ మాముననుల శ్రీపాదములను ఎన్నటికీ మరవక స్మరించి నమస్కరింతురు గాక! ‘ ఎన్ఱుం ‘ ( ఎన్నటికీ ) అన్న ప్రయోగం ‘ నీంగామల్ ‘ (వదలక) , ‘ నినైత్తు ‘ ( స్మరించి) అనే రెంటికీ వర్తిస్తుంది. విషయ సాంద్రతను కొలవడానికి ఉపకరణము ప్రమాణము . చెప్పబడిన విషయము ప్రమేయము . దాని సంగ్రహ రూపము ‘ సారము ‘ , అదిఏ ‘ ప్రమేయ సారము ‘అని పిలవబడుతుంది.
ప్రమాణము – కొలమానము
ప్రమేయము – కొలవబడిన విషయము
సారము – సంగ్రహము
మానము, మేయము – సారము
అర్థాత్ ప్రమాణము తిరుమంత్రము . దాని అర్థము ప్రమేయము . ఆ అర్థము యొక్క సంగ్రహ రూపము ప్రమేయ సారము అని చెప్పబడింది . ‘ నల్ల ప్రమేయ సారం ‘ అనగా దోష రహితమైన గ్రంధము అని చెప్పటము .
పాంగాగ …..అభ్యాసకుల శక్తికి తగినట్టుగా….సులభముగా , పది పాశురములలో సులభముగా అర్థమయ్యే రీతిలో ,తిరుమంత్రము యొక్క సారాన్ని వివరించారు. అందువల్లనే ఈ ప్రబంధానికి ప్రమేయ సారమని పేరు పెట్టారు .
పరిందళిక్కుం…....సమస్త జీవుల క్షేమాన్ని కోరి కారుణ్యముతో ఈ ప్రబంధాన్ని ‘ఓరాణ్వళి ‘ (గురుశిష్య పరంపరగా) అనుగ్రహించారు.
ఆంగారం అఱ్ఱ అరుళాళ మాముని …….అరుళాళ మాముని ..అంటే సమస్త జీవులపై కృపగలవారు అని అర్థము. ఇటువంటి ఉన్నతమైన గుణము మునులలో గాని , తపస్వులలో గాని కనపడదు. అందుకే వీరు మామునులు (మహా మునులు).’ ఆంగారం అఱ్ఱ ‘ అహంకార రహితుడైన….. ఇంతటి గొప్పగుణము నాలోనే ఉంది కదా అన్న అహంకారము లేశమైనా లేని వారు .అందుకే ‘ మామునులు ‘.అంతటి ఆచార్యుల శ్రీపాదాలను కొలవండి అంటున్నారు . కొలిచేటప్పుడు ఆ శ్రీపాదాలను మనసులో నిలుపుకోవాలి .అంతే కాదు రూపము- నీడ లాగా ఎప్పుడు వదలక వుండాలి.
అంపదత్తై……..‘ అం ‘ ‘ పదత్తై ‘..అందమైన పాదములు …. అనగా అందమైన ఉన్నత పాదములు ఏవి అంటే, తమ శిష్యులను ఎప్పుడు వదలక కాపాడు తత్వము గల పాదములు. ఆ అందమైఅన పాదమునే కొలవండి ….అంటున్నారు . ఆ పాదములను కొలిస్తే చాలు . ఇతర దైవములను ఆశ్రయించనవసరము లేదు అని నొక్కి చెప్పటము అవుతుంది .
పుదుప్పుళి మన్ …..వేద శాస్త్రములను వడపోసిన పండిత గొష్టికి నాయకులుగా విరాజిల్లుతున్న వారు అని అర్థము .దట్టంగా తోటలు,తోపులతో నిండి వున్న’ పుదుప్పుళి ‘ అనే ప్రాంతము….అని , జ్ఞాన సంపదకు ఆలవాలమైన ప్రాంతము అని సంకేతముగా చెపుతున్నారు .
పుడై ……నాలుగు దిక్కులు. ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా! ఉన్నతమైన స్థానము, పేరు పొందడానికి హేతువైన తిరు మంత్రసారమును మహా కారుణ్యముతో సులభ శైలిలో తమిళములో చెప్పబడిన ” ప్రమేయ సారము ” అనే ఈ ప్రబంధమును అనుగ్రహించిన వారు గర్వము లేని అరుళాళ మాముననులు . వారు అందమైనన తోటలు, పెద్ద తోపులు , అన్నివైపుల విస్తారముగా వున్న పుదు ప్పుళి అనే ప్రాంతములో పండిత గొష్టికి నాయకులుగా విరాజిల్లుతున్నరు .వారి శ్రీపాదములను వదలక , నిరంతరము స్మరించి ధన్యులవుదురు గాక! అని అర్థము.
ఆడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-thaniyan/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org