జ్ఞానసారము 39

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 38

అవతారిక

పై పాశురముల సారము  ఆచార్యల ఔన్నత్యమును తెలియజేయుట , అది తెలిసుకున్నవారు , ఆచార్యుని శ్రీపాదముల యందు భక్తి కలిగి వున్న వారు గొప్ప జ్ఞానులు. ఆ గురు భక్తిని తెలుసుకోలేని లోకులు వీరిని మీద ‘ భగవంతుడి కన్నా గురువునే గొప్పగా భావించి వారి వెనక తిరుగుతున్నారన్న ‘ నిందను మోపు వారికి ఈ పాశురములో జవాబు కనపడుతుంది . భగవంతుడి విషయములో ఆయన స్వరూప , రూపవిభవములను తెలుపు కథల యందు ప్రేమ కలిగియున్న భగవద్భక్తులు ఆచార్యుల  గొప్పదనమును గ్రహించక , ‘ భగవంతుడి యందు కాక మానవ మాత్రుడైన ఆచార్యుల యందు ప్రేమను కలిగి వున్నారు అని  మాట్లాడే వారికి ఇక్కడ సమాధానము దొరుకుతుంది . ఆచార్యుల యందు భక్తి చేయువారిని నిందిస్తే ఆ నింద వారికి స్తుతియే అవుతుంది కాని నింద కాదు . ఇది నిందాస్తుతి  అలంకారములాగా అమరుతుంది .

ఇక్కడ ఒక చిన్న కథను చూద్దాము .భగవద్రామానుజుల వారి కాలములో  శ్రీరంగములో ఒక సారి శ్రీరంగనాధుల శోభాయాత్ర జరుగుతున్నది . రామానుజులతో పాటు ఎందరెందరో భక్తులు ఆ శోభాయాత్రనుకన్నుల పండుగగా తిలాకిస్తున్నారు . అందులో కొందరు పెరుమాళ్ళ ముందర భగవద్రామానుజుల శ్రీపాదములకు దాసోహాలు సమరపించి ముందుకు సాగుతున్నారు .ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళమహారాజు సభలోఆస్తాన పండితులు సుభ్రమణ్యభట్టర్ ఆ దృశ్యాన్ని చూసి ‘ జీయరు స్వామి ఒక సందేహము తమరిని అడిగితెలుసు కోవాలను కుంటున్నాను ‘ అన్నారు. అడగండి  మన్నారు రామానుజులవారు . శ్రీరంగనాధుల శోభాయాత్రజరుగుతుండగా కొందరు స్వామి ముందు తమరికి దాసోహములు సమర్పించి వెళుతున్నారు కదా!  స్వామి ముందర నన్ను సేవిచ వద్దని తమరు  చెప్పవలసి ఉండగా చెప్పనే లేదు .  కారణమేమిటి? ‘ అని అడిగారు . అడగవలసిన ప్రశ్ననే అడిగారు . కాని మీరు అడగడమే ఆశ్చర్యముగా వుంది ‘ అన్నారు రామానుజులు . దానికి సుభ్రమణ్యభట్టర్ ‘ నాకున్న గొప్పతన మే మున్నది ‘ అన్నారు .  దానికి ఆచార్యులు , ‘ మీరు రాజసభలో సేవ చేస్తునారు కదా! రాజానుగ్రహము కోరి వచ్చే వాడు ముందుగా రాజుగారి పాదుకలను తల మీద పెట్టుకొని తన రాజ భక్తిని చాటుకుంటాడు. అది చూసి మెచ్చిన రాజుగారు అతడి కోరికలను నెరవేరుస్తాడు  . వాడి కోరికను నెరవేర్చింది పాదుకలు  కావు . రాజు గారు మాత్రమే అలాగే ఇక్కడ భగవంతుడు మహారాజు దాసుడు ఆయన పాదుకలు. భగవంతుడి కృపనుకోరేవారు పాదుకలైన దాసుడికి దాసోహములుసమర్పిస్తున్నారు . దాసుడి మీద ప్రేమ కలవారిపై భగవంతుడు  ప్రేమను చూపిస్తాడు. ‘ అని రామానుజువారు సమాధానము చెప్పారు . ఇది విన్న  ఆస్తాన పండితులు సుభ్రమణ్యభట్టర్ చాలా సంతోషించారు . ‘ తిరువిరుత్తం ‘ వ్యాఖ్యానములో ఈ విషయమును చూడవచ్చు 

            కావున భగద్భక్తి గలవారు అచార్య భక్తి గలవారిని తక్కువ చేసి మాట్లాడనవసరము లేదు.  ఒక వేళ వారు దూషించినా అది వీరి విషయములో పొగడ్తయే కాని దూషణము కాదు అని ఈ పాశురములో నొక్కిచెపురున్నారు .

putna1

పాశురము

అలగై ములై సువైతార్కు అన్ బర్ అడికన్ బర్

తిలద మెన తిరివార్ తమ్మై – ఉలగర్ పళి

తూఱ్ఱిల్ తుదియాగుం తూఱ్ఱాదు అవర్ ఇవరై

పోఱ్ఱిల్ అదు పున్మయేయాం

ప్రతిపదార్థము

అలగై ములై = పూతన అనే రాక్షసి పాలను

సువైతార్కు = తాగిన కృష్ణునికి

అన్ బర్ అడిక్కు = భక్తులైన దాసుల శ్రీపాదములందు

తిలద మెన = నుదుటి బొట్టులాగా

తిరివర్ తమ్మై = ప్రవర్తించే పెద్దలను

ఉలగర్ = లోకులు

పళి తూఱ్ఱిల్ = భగవంతుడి యందు కాక మనుష్యులపై ఆసక్తి పెంచుకున్నారని నిందలు వేస్తే  

తుదియాగుం = అది ఆ దాసుల భక్తిని తెలియపరిచేది కాబట్టి అది వీరికి పొగడ్తే అవుతుంది

అవర్ = ఆ లోకులు

తూఱ్ఱాదు = అలా నిందించని

ఇవరై =దాసుల భక్తులైన  వీరిని

పోఱ్ఱిల్ = మంచి వారని పొగిడితే

అదు = ఆ పొగడ్త

పున్మయేయాం = నిందయే అవుతుంది

వ్యాఖ్యానము

అలగై ములై సువైతార్కు …...‘ అలగై అంటే అబద్దము అని ఒక అర్థము . వయ్యతుల్ అలగయ్యా వైక్కపడుం” అని తిరువళ్ళువర్ అన్నారు . రాక్షసి అని మరొక అర్థము .ఇక్కడ పూతనను ‘ అలగై ‘ అన్నారు .రేపల్లెలో కృష్ణుడు ఉండగా కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షసి యశోద లాగా వచ్చి పసిబిడ్డను వడిలోకి తీసుకొని పాలను ఇచ్చే నెపముతో విషమును ఇచ్చిన విషయమును ఇక్కడ చెపుతున్నారు . కృష్ణుడు ఆమె దగ్గర పాలతో పాటు అమె ప్రాణాలనను కూడా ఒక్క సారే  తాగేసాడు . ఇది ‘ అగలై ములై సువైతార్కు ‘ అని చెప్పబడింది . ఈ విషయముగా   తిరుమంగై ఆళ్వార్లు , “పెఱ్ఱ తాయి పోల్ వంద పేయ్చి పెరు ములైయోడు  ఉయిరైవఱ్ఱ వాంగి ఉండ వాయాన్” అని ,

కణ్ణ్ సోర వెంగురుది వందిళియ వెందళల్ పోల్ కూందలాళై మణ్సోర ములైయుండ మామదలోయ్ ”. అని అన్నారు .

స్వామి నమ్మాళ్వార్లు , “విదపాల్ అముదాగ అముదు సెయిదిట్ట మాయన్” అన్నారు . 

అన్ బర్ అడిక్కన్ బర్……..  కృష్ణ చేష్టితాలతో మనసు కొల్లగొట్టబడిన భక్తుల శ్రీపాదముల యందు ప్రీతి కలిగియన్నవారు అని అర్థము . పూతన కృష్ణుడికి అవధ్యము కలిగించాలని వచ్చింది .  కృష్ణుడు ఆమెను సమ్హరించాడు. ఈ చరిత్రను తలచుకున్న వాళ్ళు ,” తనకు  అవధ్యము తలపెట్టిన పూతనను    కృష్ణుడు  సమ్హరించి మనకు మేలు చేసాడు కదా! ఆ రాక్షసిని ఆనాడు  సమ్హరించక పోతే   కృష్ణుడు మనకు దక్కేవాడా ! అని ఆయన కల్యాణగుణములకు దాసులై ఆయన మీద అపారమైన ప్రేమతో దాసాను దాసులవుతారు . అలాంటి వారి శ్రీపాదములను పట్టిన వారు ”  అన్ బర్ అడిక్కన్ బర్ “

తిలద మెన తిరివార్ తమ్మై…… దాసులకు దాసులకు దాసులైన వారు లోకమునకే తిలకము వంటి వారని పెద్దలచే కొని యాడబడతారు. తిలకము మంగళకరము.  అందు వలన దాసులకు దాసులకుదాసులైన వారి ఔన్నత్యము తిలకముతో పోల్చి కీర్తించ బడినది. దీనిని స్వామి నమ్మాళ్వార్లు పయిలుం సుడరొళి” , “నెడుమార్కు అడిమై”  తిరువాయిమొళిలో అనుభవించారు . స్వామి తిరుమంగై అళ్వార్లు పెరియతిరుమొళి కణ్ణ్ సోర వెంకురుది” , “నణ్ణాద వాళవుణర్ ఇడైపుక్కు” పదిగములలో అనుభవించారు . స్వామి కులశేఖరఆళ్వార్లు పెరుమాళ్ తిరుమొళిలో తేట్టరుం తిరల్ తేనిలుం” పదిగములో స్వామి తొండరడిపొడి ఆళ్వార్లుమేం పొరుళ్ పోగ విట్టు”  అనే పాశురములో ఈ భావమునే వ్యక్తీకరించారు .ఇది కాక ఇతిహాస పురానములలోను దీనికి సంభందించిన ఉదాహరణములు అనేకములు కనబడతాయి . శ్రీవచనభూషణములోని  226చూర్ణికలోను ఈ విషయమును చూడవచ్చు.

ఉలగర్ పళి తూఱ్ఱిల్ తుదియాగుం……..ఇంతటి ఆచార్య నిష్ట గల భక్తులను కుల ,ఆశ్రమ భేధములను చూడక భాగవతులన్న ఒక్క విషయాన్నే పరిగణలోకి తీసుకొని , భగవంతుడి కన్నా ఎక్కువగాభాగవతులను సమ్మానించి వారి వెవంట తిరుగుతున్నారని లోకులు నిందించినా ,ఆ నింద వారికి స్తుతిగానే అమరుతుంది.

తూఱ్ఱాదు అవర్ ఇవరై పోఱ్ఱిల్ అదు పున్మయేయాం……పైన పేర్కొన్న భక్తులు నిరంతరము భాగవత సేవలో ఉండటము వలన లోకుల లాగా కొన్ని నిత్యానుష్టానములు చేయనవసరము లేకున్నను,వీరిని చూసి సామాన్యులు కూడా నిత్యానుష్టానములు చేయకుండా మాని వేస్తారని చేయవలసి వుంది. అలాంటి సమయములో వాటిని సూష్మ పద్దతిలో చేయటము చూసి లోకులు ‘ నిత్యానుష్టానము బాగా చేస్తున్నారే ‘ అనిస్తుతించినా అది నిందలాగా అమరుతుంది . 

అడియార్కు అడియార్…… భాగవతులకే కాక లోకమునకే తిలకము వంటి వారని పెద్దలచే కీర్తించబడినవారు వీరు . అలాంటి వారిని లోకులు భగవంతుడిని వదిలి ఆయన దాసులకు దాసోహములుచేప్పుకుంటూ తిరుగుతున్నారని నిందిస్తే అది పొగడ్తగాను ,వారు పొగిడితే నిందగాను వీరికి అమరుట వలన వీరు ‘ అడియార్కు అడియార్ ‘ (దాసులకు దాసులు )అన్న మాట స్థిరపడుతున్నది.

వివరణ:

             “శ్రీరామాయణములో   రామలక్ష్మణభరతశతృజ్ఞులు ధర్మము కోసము నిలబడిన వారు , ధర్మమునకు ఉదాహరణగా నిలిచిన వారు. నలుగురిలో శతృజ్ఞుడు మన పూర్వాచార్యులచే కీర్తించబడిన వాడు ఎందుకనగా  శతృజ్ఞుడు రామ భక్తుడైన   భరతునికి దాస్యము చేసినవాడు. ఆయనకు సకల కైంకర్యములను చేసి ‘ అడియా ర్కడియార్ ‘ అన్న మాటకు ఉదాహరణగా నిలిచాడు

      తొండర్ తొండర్ తొండర్ తొండన్ శఠకోపన్”, “అడియార్ అడియార్ అడియార్ ఎంకోకళ్ అన్న స్వామి నమ్మాళ్వార్ల మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి . ఈ  సందర్భములో స్వామి తిరుపాణాళ్వార్లు అడియార్కు  ఎన్నైఆట్పడుత్త విమలన్” అని స్వామి తొండరడిపొడి ఆళ్వార్లు  అడియార్కు ఎన్నై ఆట్పడుత్తాయ్” అని స్వామి పెరియాళ్వార్లు అడియార్గళ్  ఎం తమ్మై విర్కవుం  పెరువార్గళె” అని స్వామి కులశేఖరాళ్వార్లు తొండర్తొండర్గళానవర్” అని అన్నారు . పై ఉదాహరణలన్ని చూసినప్పుడు ఆళ్వార్లందరూ అడియార్కు అడియార్” (దాసులకు దాసులుగా ) ఉండాలని కోరుకున్నారు అని బొధపడుతుంది . స్వామి అరుళాళ పెరుమాళ్ఎంబెరుమానార్తమ  ఆచార్యులైన స్వామి రామానుజులనే సర్వస్వమని భావించి కైంకర్యము చేసారు . అన్ బర్ అడిక్కు అన్ బర్” , “తిలదం ఎన తిరివార్ ” అన్న ప్రయోగములు వారికి సరిగ్గా సరి పోతాయి .అందువలననే  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లుతెరుళారుం మదురకవి నిలై తెళింధోన్ వాళియే”.అని కీర్తించబడ్డారు .

             స్వామి తిరువరంగత్తముదనార్లు స్వామి రామానునుజులను  ఇలాగే భావించి తమ ఆచార్యుల మీద ప్రేమతో రామానుజ నూఱ్ఱందాది’ ని రాశారు . అలాగే  స్వామి పరాసర భట్టర్లు నంజీయర్లకు కైంకర్యము చేసిన విషయము చరిత్రలో కనపడుతుంది . 

                స్వామి మణవాళ మామునులు  స్వామి రామానుజులను గురించి  యతిరాజ వింశతి” , స్వామి ఎఱుంబియప్పా మణవాళ మామునులను గురించి పూర్వ దినచర్య”, “ఉత్తర దినచర్య”, “వరవరముని శత  కము ”,  “వరవర ముని కావ్యం”, ”వరవరముని చంపు ” మొదలైనవి రాశారు . సెరుకిల్లాదవర్గళుం ఆచార్య నిష్టైగళిల్ ఇరుప్పవరుంశాస్తిర సారార్థంగళై అఱిందవరుం పణత్తాసైపెణ్ణాసై ముదలియ ఆసైయఱ్ఱవర్గళుంపెరుమయఱ్ఱవర్గళుంఅనైత్తు ఉయిర్గళ్ ఇడత్తిల్ అన్బు ఉడయవర్గళుంకోబంఉలోబం ముదలియ కుఱ్ఱంగళై కదిందవగలుమాన మణవాళ మామునిగళిన్ అడియార్గళోడు అడియేనుక్కు ఎన్ఱుం ఉఱవు ఉండాగ వేణ్డుం”                    గర్వము లేని వారు ఆచార్య నిష్టలో ఉన్న వారు శాస్త్ర సారములను తెలుసుకున్న వారుసంపద మీద ఆశ లేని వారు ,స్ర్తీలోత్వము లేని వారు పెద్దల పట్ల, సకల జీవుల పట్ల ప్రేమ గల వారుకోపములోభము మొదలైనవి లేని వారు అయిన మామునుల శిష్యులతో ,దాసునికి నిరంతర సంబంధము ఉండాలని కోరుకుంటున్నాను. ) అన్నారు . అర్థాత్  ఆళ్వార్లుఆచార్యులు దాసులకు దాసులుగా వుండాలని కోరుకున్నారు.ఇదియే  తెలుసుకోవలసిన సారమైన విషయముఈ ప్రబంధము యొక్క సారము . 

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/04/gyana-saram-39-alagai-mulai-suvaitharkku/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment