శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము-26
“తప్పిల్ గురు అరుళాల్ తామరైయాళ్ నాయగన్ తన్
ఒప్పిల్ అడిగళ్ నమక్కు ఉళ్ళత్తు – వైప్పెన్ఱు
తేఱి ఇరుప్పార్గళ్ తేసు పొలి వైగుంతత్తు
ఏఱి ఇరుప్పార్ పణిగట్కే ఏయిందు”
అవతారిక
శరణాగతి మార్గము శ్రీమన్నారాయణునిచే చెప్పబడినది. ఈ విషయమును తమిళ కవి తిరువళ్ళువర్ “పొఱి వాయిల్ ఐయందవిత్తాన్ పొయ్దీర్ ఒళుక్క నెఱి” అన్నారు. అనగా సర్వస్వామి అయిన సర్వేశ్వరుడు చెప్పిన నిజమైన మార్గమే ఉన్నతమైన మార్గము . మరొక చోట ఇలా అన్నారు. “పఱ్ఱఱ్ఱాన్ పఱ్ఱినై”, (కోరికలే లేని వాడు కోరిన మార్గము). ” నెఱి ” అనగా మార్గము, శరణాగతి మార్గము . ఇది సదాచార్యుని పురుషకారముతో చేయాలి . శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు శరణాగతి చేసి పరమపదము చేరి నిత్య కైంకర్యము చేయాలనే కొరిక , అందులో రుచి , ఆయనే మనకు ఉత్తారకుడన్న మహా విశ్వాసము , ఆ మార్గములో ప్రయాణించి అంతిమ ముగా పరమపదము చేరి నిత్య కైంకర్య భాగ్యమును పొందుట సదాచార్యులను ఆశ్రయించటము ద్వారానే పొందగలుగుతారు.
ప్రతిపదార్థము:
తప్పిల్ = జ్ఞాన అనుష్టానములలో లోపము లేనివారు
గురు = ఆచార్యులు
అరుళాల్ = కృపతో
తేఱి ఇరుప్పార్గళ్ = ధృఢ విశ్వాసము గలవారు
తామరైయాళ్ నాయగన్ తన్ = తామరలో పుట్టి అందులో వేంచేసి వుండే శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయ ణుని
ఒప్పిల్ = అసమానమైన
అడిగల్ = దాసులు
నమక్కు –= మన వంటి అజ్ఞులకు
ఉళ్ళత్తు = మనసులో ఉండే
వైప్పెన్ఱు = సుసంపద అని
తేరి ఇరుప్పార్గల్ = విశ్వాసము గలవారు
తేసు పొలి =తేజస్సుతో ప్రకాశించు
వైగుంతత్తు = పరమపదమును
ఏఱి = చేరు మార్గములో పయనించి చేరి
పణిగట్కే = అక్కడ కైంకర్యము చేయుటకు
ఏయిందు ఇరుప్పార్ = సిద్దమై ఉంటారు
తప్పిల్ గురు అరుళాల్……’ : తప్పిల్ గురు ‘ అంగా ఎప్పుడు ఏ తప్పు చేయని ఆచార్యుడు. తిరుకుఱళ్ లో “కఱ్క అదఱ్కు తగ నిఱ్క” ( నేర్చిన దానికి కట్టుబడి వుండు) అన్నారు. సుజ్ఞానమును నేర్చిన ఆచార్యుడు దోషములను చేయజాలడు అని అర్థము.
తామరైయాళ్ నాయగన్ తన్....: తామరలో పుట్టి అందులో వేంచేసి వుండే శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు . 1. శ్రీమన్ ,2. నారాయణుడు అనే రెండు పదాలు ద్వయ మంత్రములో మొదటిభాగములో ఉంటుంది .తామరైయాళ్ నాయగన్ అంటే ద్వయములో చెప్పిన నారాయణుడు…. వాత్శల్యము, స్వామిత్వము , సౌశీల్యము , సౌలభ్యము గల శ్రీమన్నారాయణుడు . దానికి తోడు ఆయనకు గల అపారమైన జ్ఞానము ,శక్తి ,ప్రాప్తి , పూర్తి వలన , ఆయన మాత్రమే దాసులను ఉజ్జీవింప చేయగలడు . ఆయననే దాసులందరు ఆశ్రయిస్తారు. నాయ గన్ తన్ అన్న పదము పై గుణములన్నింటినీ ప్రతిబింబిస్తుంది . ద్వయ మహా మంత్రములోని ‘ నారాయణ ‘ పదము కూడా దీనినే తెలియజేస్తుంది .
ఒప్పిల్ అడిగళ్…....అసమానమైన శ్రీమన్నారాయణుని శ్రీపాదములు …ద్వయ మహా మంత్రములోని ‘చరణౌ ‘ ఇందులో ఇమిడి వున్నడి .’ ఒప్పిల్ ..’అసమానమైన ‘ అని ఎందుకు అంటున్నారంటే మరెవరి సహాయము తీసుకోకుండా ఆ శ్రీపాదములే దాసులను రక్షించ గలవు .
నమక్కు ఉళ్ళత్తు …… మన వంటి అజ్ఞులైన వారు….. మన వంటి వారిని రక్షించుటకు ఆయనే తగిన వాడన్నది లోక విదితమే . అది తెలిసిన వాడు ఆయనను తప్ప మరెవరినీ ఆశ్రయించడు . ద్వయ మహా మంత్రములోని“చరణౌ ” , “ప్రపద్యే” అన్న పదములు ఇక్కడ ఇమిడి వున్నాయి . ఆ శ్రీపాదములను హృదయములో నిలుపుకోవట మంటే గొప్ప నిధిని హృదయములో నిలుపుకున్నట్లే . కాయికముగా ఆయన శ్రీపాదములను పట్టుకోవటము కాక మానసికముగా పట్టుకోవటము గనక దీనిని “మానస స్వీకారము” అంటారు .
తేఱి ఇరుప్పార్గళ్ …… అనుమానములేవీ లేకుండా ధృఢ విశ్వాసము కలిగి వుండుట ….. ఆయన శ్రీ పాదములే రక్ష అని ధృఢ విశ్వాసము కలిగి వుండుట . అటువంటి విశ్వాసము ఏర్పడటము అంత శులభము కాడు .శరణాగతి చేసిన వారికి ఈ విషయములో అనుమానములు ఉండవు. అలా ఎవరికైనా అనుమానములు ఉంటే వారికి పరమపదము దక్కదు . అటువంటి వారినే ‘ తేఱి ఇరుప్పార్గళ్ ‘ అన్నారు .
తేసు పొలి వైగుంతత్తు…… వారు అంతిమ గమ్యమైన పరమపదమునకు చేరుకుంటారు. దీనినే అళివిల్ ( చెదరని ఇల్లు)అంటారు . పరమపదములో శ్రీమన్నారాయణునికి నిత్యకైంకర్యము చేస్తూ నిత్యానందమును పొందుతారు.
ఏఱి ఇరుప్పార్ పణిగట్కే ఏయిందు……..ఈ దాసులు పరమపదములో కైంకర్యము చేయుటకు తగిన వారు. “పణిగల్” (కైంకర్యము) అన్న పదము దీనినే తెలియజేస్తున్నది. “ఏయంధు ఇరుప్పార్”…అలా కైంకర్యము చెయటానికి అర్హత కలిగి , ఆతృతతో ఎదురు చూస్తారు. ‘ పణి ‘ అన్న పదానికి మరొక అర్థము కూడా వుంది. ‘ పణి ‘ అంటే “ఆదిశేషుడు” అని కూడా అర్థం ఉండి. అర్థాత్ ఈ దాసులు శ్రీమన్నారాయణునికి కైంకర్యము చెయటములో ఆదిశేషునికి సమానమైన వాళ్ళని చెపుతున్నారు . ఆదిశేషుడు” శ్రీమన్నారాయణునికి కైంకర్యము ఎలాచేస్తాడంటే “సెన్ఱాల్ కుడయాం, ఇరుందాల్ సింగాసనమాం, నిన్ఱాల్ మరవడియాం, నీళ్ కడలుళ్ ఎన్ఱుం పునైయాం మణి విళక్కాం, పూంపట్టాం, పుల్గుం అణైయాం తిరుమార్కు అరవు”. శ్రీమన్నారాయణునికి ఆదిశేషుడు నడుస్తే గొడుగు , కూర్చుంటే సింహాసనం, నిలబడితే పీట, చేతి దిండు, మణి దీపము, పట్టుపరుపు…. ఇలా సకల సేవలు చేస్తాడని మన ఆళ్వార్లు ప్రబందములో పడారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-26-arram-uraikkil/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org