జ్ఞానసారము 14

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 13

satya

 అవతారిక

దేహమున్నంతవరకూ కుల,మత, జాతి, స్థితి బేధములు తప్పవు కదా అన్న ప్రశ్నకు సమాధాన ముగా ఈ పాశురము అమరినది. వాటి వలన ప్రయోజనమేమున్నది? అందరికి ఆ లక్ష్మీపతి శ్రీపాదములే ఉత్తా రకములు అంటున్నారు ఇక్కడ .

“ బూదంగళ్ ఐందుం పోరుందు ఉడంబినార్ పిఱంద

సాదంగళ్ నాన్గినోడుం సంగాతమాం- బేధం కొండు

ఎన్న పయన్ పెరువీర్ ఎవ్వుయిరుక్కుం ఇందిరై కోన్

తన్నడియే కాణుం  శరణ్ “

ప్రతిపదార్థము

బూదంగళ్ ఐందుం పోరుందు = మృణ్, అప్, అనలం, వాయు, ఆకాసము అనే పంచబూతాత్మమయమైనది

ఉడంబినాల్ =  శరీరముతోను

సాదంగళ్ నాన్గినోడుం = నాలుగు వర్ణములతోను ( బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య,శూద్ర )

సంగతమామ్-= చేరివున్న

భేదంకొండు పిఱంద = భేదములతో పుట్టి

ఎన్న పయన పెరువీర్ = ఏమి ఫలితం పొందుతారు

ఎవ్వుయిరుక్కుం = సర్వ ప్రాణులకు లక్ష్మీనారాయణని శ్రీపాదములే శరణ్యములు గ్రహించండి

ఇందిరై కోన్ = లక్ష్మీనారాయణని

తన్నడియే = శ్రీపాదములే

శరణ్ =శరణ్యములు

కాణుం = తెలుసుకోండి ,గ్రహించండి

వ్యాఖ్యానము

“ బూదంగళ్ ఐందుం  పోరుంది ఉడలినాల్ పిఱంద “‘

“మంజు సేర్ వానెరి నీర్ నిలం కాలివై మయక్కి నిన్ ఱ

అంజు సేర్ ఆక్కై…..” అని తిరుమంగై ఆళ్వార్లు పాడారు.

“ సువై ఒళి ఊరు ఓసై నాఱఱమ్ ఇవ్వైన్దిన్ “

వగై తెరివాన్ కట్టే ఉలగు “ అని తిరు వళ్ళువర్ అన్నారు.

మట్టి మొదలైన పంచబూతముల సమాహారమే ఈ దేహము . దీని వలన ఆత్మ వేరు దేహము వేరని బోధ పడుతుంది. పైగా శరీరము సైశవము , బాల్యము, కౌమారము, యవ్వనము, ముదిమి మొదలగు మార్పులకు లోనవుతుంది , శరీరము నిలకడ లేనిది, అపార్థాలకు నెలవు. కావున ఆత్మకు ఈ శరీరము తాత్కాలిక మైన ఏర్పాటు మాత్రమే అని అర్థమవుతుంది.

సాదంగళ్ నాన్గినోడుం…. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వర్ణములు నాలుగు. పంచబూతముల సమాహారమే ఈ దేహము ఈ నాలుగు వర్ణములలొ జన్మిస్తాయి .

‘నాన్గినోడుం సంగాతమాం- బేధం కొండు….పైన చెప్పిన నాలుగు వర్ణములలొ పుట్టి హెచ్చుతగ్గులు,రూప బేధాలు , రంగులో బేధములు, స్థితిలో బేధములు, ఆశ్రమ బేధములు ఇంకా అనేక రకమైన బేధములకు   లోనవుతారు. దీని గురించి  పరిమేలళగర్ అనువారు నాలుగు వర్ణాలు , నాలుగు స్థితులు , నాలుగు ఆశ్రమములు …ఇలా నాలుగు నాలుగుగా చాలా చెప్పారు.

ఎన్న పయన్  పెరువీర్….. ఈ బేధముల వలన పొంద దగిన ఫలితములేవిటని లోకులను అడుగుతున్నారు.  ఫలితము శూన్యమని తెలుస్తున్నది. పైగా నాది,నేను అన్న భావము ఏర్పడటము వలన ఆత్మ హానికి హేతువవుతున్నది. ఎన్న పయన్ కెడువీర్…( ఈ బేధముల వలన పొంద దగిన చెరుపు ఏమిటని వ్యంగాముగా ప్రశ్నిస్తే సమాధానము చాలా పెద్దగా వుంటుంది . )

ఎవ్వుయిరుక్కుం ఇందిరై కోన్ ,తన్నదడియే కాణుం  శరణ్ …… సర్వ ప్రాణులకు లక్ష్మీనారా యణుని శ్రీపాదములే శరణ్యములు అని  గ్రహించండి…. సర్వ ప్రాణులకు అనటము చేత స్వపర బేధము లేకుండా అందరికీ అని అర్థము. ఆత్మలన్నింటికీ ఆ లక్ష్మీనారాయణుని శ్రీపాదములే శరణ్యములు. మరి ఏవీ కావు అని నొక్కి చెపుతున్నారు .అలా చెప్పడము వలన పరమాత్మ ముందు బేధము లేవీ లేవు , బేధములున్నాయని చెప్పటము సరి కాదు అని తెలుస్తున్నది.

“పొదు నిన్ ఱ పొంనంకళలే తొళుమిన్    ముళు వినైగళ్ మున్నం కళలుం తొళుమిన్ “(ఇరండాం తిరువందాది -2369 ) అన్నారు బూదత్తాళ్వావార్లు. తామర పూవులో నివసించే శ్రీమహాలక్ష్మి నాధుడు అందరికి సమానమే అని “ పొదు “ అన్న ప్రయోగముతో తెలుపుతున్నారు. దేవాలయములలో సేవించుకొవటానికి వెళ్లి నవారందరికి సమానముగా శ్రీశఠారి అనే  ఆయన శ్రీపాదాలను తలపై ఉంచటము చూస్తున్నాము కదా !అందువలన పరమాత్మ ముందు అందరు సమానమని స్పష్ట్టమవుతున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-14-buthangkal-aindhum/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment