శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము-6
పుండరీకై కేళ్వన్ అడియార్ అప్పూమిశైయోన్
అండమొరు పొరులా ఆదరియార్ మండి
మలంగ ఒరు మీన్ పురండ మాత్తిరత్త్ ఆల్ ఆర్తు
క్కలంగిడుమో మున్నీర్ కడల్
ప్రతి పదార్థము
పుండరీకై = తామరలో పుట్టిన లక్ష్మీ దేవికి
కేళ్వన్ = భర్త అయిన శ్రియఃపతి
అడియార్ = దాసులు
అప్పూమిశైయోన్ = భగవంతుడి నాభి కమలము లందు పుట్టిన బ్రహ్మ చే సృష్టించ బడిన
అండం = పదునాలుగు లోకాలున్న అండమును
ఒరు పొరులా = ఒక వస్తువుగా
ఆదరియార్ = గణించరు
ఒరు మీన్ = ఒక చేప
మండి = తన తాపములన్నింటితో దరి చేరి
మలంగ = ఆర్తితో
పురండ = పొర్లిన
మాత్తిరత్తాల్ = మాత్రము చేత
మున్నీర్ కడల్ = మున్నీరైన సముద్రము
ఆర్త్ = స్తాన భ్రం శమై గొప్ప శబ్దమునకు
క్కలంగిడుమో = చలించి పోతుందా? పోదు.
అవతారిక
కర్మ,జ్ఞాన ,భక్తి యోగలను భగవంతుడిని పొందడానికి ఉపాయముగా శాస్త్రములలో చెప్పబడింది. అయినప్పటికీ ఆచరణలో అవి కష్ట సాధ్యములవుట, ఈ ఉపాయములను చేపట్టుట ఆత్మ దాస్యమునకు వ్యతిరిరేకమగుట చేత వీటిలోని లోపాలను సహేతుకముగా నిరూపించటము వలన వాటిని ఆచరించవీలు లేకుండా పోయింది. చాలా కాలముగా బహు జన్మలలో ఇంద్రియ భోగములను అనుభవించడానికి అలవాటు పడిన ఆత్మలకు శాస్త్రములు తప్పు అని చెప్పిన వాటిమీద మనసు పోకుండ వుంటుందా? సంపదల మీద కోరిక మనసును కలచి వేయకుండా వుంటుందా? అన్న ప్రశ్నలుదయిస్తే ఈ పాశురములో దానికి జవాబు లభిస్తుంది. భగవంతుడికి కైంకర్యయము చేసి దాని రుచి తెలుసుకున్న వాళ్ళకు ,సంపదలలో కెల్ల గొప్పదైన పరమపదము లభిస్తే లౌకిక సంపదలను ఒక వస్తువుగా కూడా చూడరు, దాని వలన మనో చాంచల్యమును పొందరు, అని ఈ పాశురములో చెపుతున్నారు. దీనికి ఉదాహరణగా శ్రీరామాయణములో చరిత్రను చూడవచ్చు.
శ్రీరాముడు దండకారణ్యములో శరభంగ మహా ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ సమయములో ఇంద్రుడు ఆ మునితో మాట్లాడుతున్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తరువాత శ్రీరాముడు ఆ ముని సమీపమునకు వెళ్ళి తాను వచ్చిన కారణమును చెప్పి నిలబడ్డారు. ఆ ముని తన జ్ఞాన నేత్రము శ్రీ రాముని రాకను ముందే అనుమానించారు. శ్రీరాముడిని చూసి “ఆళియిల్ అరితుయిలవన్”, అని సంతోషించి ఇందిరన రుళినన్ ఇరుది శెయ్ పగలా వంతనన్ మరువుతి మలర్ అయన్ ఉలగం తందనెన్ “, ” ఎన్ ఉరవోయ్!అందమిల్ ఉయర్ పదం అలైతలై ముయల్వేన్” అని అన్నారు. అర్థాత్, బ్రహ్మ దేవుడు మునిని తనలోకమునకు రమ్మని ఇంద్రుడి ద్వారా ఆహ్వానించారు. ఆ ముని ఆ లోకమునకు నేను రాను అని చెప్పారు. ” నీ ఇవన్ వరుగితి ఎనుం నినైవు ఉడయేన్” అర్థాత్ నీ రాక కై ఎంతో కాలమునుండి ఎదురు చూస్తున్నాను . నీ శ్రీ పాదముల తో మా ఆశ్రము ను పావనము కలుగుటయే మాకు లభించే భాగ్యము. ఇటువంటి భాగ్యము ముందు, మరి ఎటువంటి లౌకిక విషయములు ఉదాహరణకు లోకాలకు అనింటికి రాజు అగుటయో , బ్రహ్మలోకం లో స్థానమో నన్ను కలంగనివ్వవు, నా లక్ష్యము (నిన్ను చేరుట) నుండి దారిని మలుచజాలరు. నేను ఇంద్రుడి తో చెప్పాను “అటువంటి భోగములు నాకు వొద్దు, అనింటికన్నా గొప్ప ఐశ్వర్యం శ్రీ రాముని దాసుడిగా ఉండటమే”. శరభంగ ముని బ్రహ్మపదమును ఒక వస్తువుగా కూడా గణించలేదు. పరమపదమే ఉన్నతమైన సంపద అని కోరుకొని దానినే పొందారు. సత్యమును తెలుసుకున్న జ్ఞానులు ఇతరములైన వాటిని తృణప్రాయముగా చూస్తారు అని ఈ చరిత్ర వలన తెలుస్తున్నది.
వ్యాఖ్యానము
” పండై నాళాలే నిన్ఱిరువరుళుం పంగయతాళ్ తిరువరుళుం కొండు ” తిరువాయ్మొళి (9.2.1) ( అనాది కాలముగా అమ్మతో కూడి అనుగ్రహిస్తున్న పాదపంకజముల వాడి కృప వలన) భగవంతుడు, పిరాట్టి ఇద్దరి అనుగ్రహము అపారముగా ఉన్నపుడు ప్రాచీన పాపముల నుండి బయట పడగలము అని నమ్మాళ్వార్లు అన్నారు. ” యానే యెన్నై అరియగిలాతే , యానే యనతనతే ఎన్రిరుందేన్. యానే నీ ఎన్ ఉడైమైయుం నీయే “( నేను నన్ను తెలుసుకోకుండా నేనే నాది అని అని వున్నాను, నేనే నువ్వు నాదంతా నువ్వే) అనేట్లుగా మారుతారు. ఇలాంటి వారు భగవంతుడికి దాసులుగా వుండుట తమకు గొప్ప చిహ్నముగా భావించి , ఆయనకు ప్రీతికరమైన కైంకర్యములు చేయుటలో నిమగ్నమై ఆనందమును పొందగలుగుతారు.”అప్పూమిశైయోన్ అండం ఒరు పొరుళా ఆదరియార్ “( ఆ తామరను పూయించిన వాడి అండమును ఒక వస్తువుగా ఆదరించరు) సంప్రదాయ గ్రంథములలో ఉన్నతమైన సంపదగా చెప్పబడేది పరమపదము. చతుర్ముఖుడైన బ్రహ్మ పరమాత్మ నాభికమలము నుండి ఉద్భవించిన వాడు, భగవంతుడి ఆనందమునకు హేతువుగా పదునాలుగు లోకములు ఉన్న ఈ బ్రహ్మాండమును ఆయన దాసులు ఏ మాత్రము గణిించరట.
అపూమిశైయోన్ అండం ఒరు పోరుళా ఆదరియార్: శరణాగతులు ఎటువంటి సంపదను కాలతోస్తున్నారో తెలుస్తుతే, వారి గొప్పతనమును మనము అర్థం చేసుకోగలము. మనకు అర్థం అవుటకు 1౦౦౦౦౦౦ ట్రిలియన్ రుపాయలు మరియు ఇల్లు , ఆభరణములు ఇంకనూ మన ఆలోచనకు తోచినటువంటి సంపద కలిగి ఉండే మనిషి యొక్క ఆనందమును 1 యూనిట్ మనిషి ఆనందము అనుకుందాం.అటువంటి ఆనందమునకు 1౦౦౦ రెట్లు గంధర్వ ఆనందము. గంధర్వ ఆనందమునకు 1౦౦౦ రెట్లు ఇతర దేవతలది. దేవతల ఆనందమునకు 1౦౦౦ రెట్లు బ్రహ్మ యొక్క ఆనందము. అటువంటి బ్రహ్మ ఆనందమును ఒక శరణగతునికి , ఉదా: శరభంగ మునికి ఇస్తే , వారు దానిని ఒక ఆనందముగాను గణించరు ఎందుకంటే వారికి కలిగే గొప్ప ఆనందమును విలువ కట్టలేనిది. పెరుమాళ్, తాయార్ మరియు దాసులకు చేసే కైంకర్యము విలువైనది, దానిని కొలువుట సాధ్యం కానిది. ఇతర సంపదలకు సమయ సంబంధము ఉండును, కైంకర్యము అనే సంపదకు సమయము తో సంబంధము లేకుండా ఉంటుంది ఎందుకనగా శ్రీ వైకుంఠం లో సమయము అనే విషయము ఉండదు.
శరీరానికి, ప్రాణానికి భేదము పాటించని శరీరమేప్రాణమని బ్రమించే అజ్ఞానులకు ఈ ఆత్మ భగవంతుడికి దాసుడని తెలియక ,నేను-నాది, అని తనను స్వతంత్రముగా భావించే మూఢులకు భౌతికమైన సంపదలు ఆనంద దాయకము కావచ్చును.భగవంతుడికి దాసులమని భావించే వారికి సంపదలు ఆనంద దాయకము కాక పోగా అసహ్యముగా తోస్తుంది. అందువలన అటువంటి సంపదలను భగవంతుడి దాసులు ఆదరిస్తారా? సంపదలు మహా ఆకర్షములు. ఎలాంటి వారినైన ఆకర్షించకుండా వుండదు. మనసును చలింప చేస్తుంది. “మండి మలంగ ఒరు మీన్ పురండ మాత్తిరతాల్ ఆర్తు కలంగిడుమో మున్నిర్ కడల్?”( చేప ఒకటి తన బలము నుపయోగించి నెట్టినంత మాత్రాన మున్నీరైన సముద్రమునకు ముప్పు ఎముంటుంది ) అని ఈ ప్రశ్నకు జవాబు చెప్పారు . అనగా ఒక చేప తన బలమునంతా కూడగట్టి తోసినా సముద్రము కొంచము కూడా కదలదు. అలాగే భగవంతుడి దాసులు లౌకిక సంపదలు ఎంత ఆకర్షించినా వాటి వలన ఏ మాత్రము కదలి పోరు. సముద్రమును మున్నీరని అంటారు. ఊరిన నీరు, నదుల నుండి చేరిన నీరు, పైనుండి వానగా కురిసిన నీరు ఉండటము చేత దానికి ఆ పేరు వచ్చింది. చేప యొక్క చర్యలు బ్రహ్మలోకమంతటి సంపదను సూచకమైతే , సముద్రము భగవంతుని యొక్క దాసులై , పెరుమాళ్, పిరాట్టి మరియు వారి దాసులకు చేసే కైంకర్యమునకు ప్రతీతి.
అడియేన్ చుడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-6-pundarigai-kelvan/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org