శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము-3
ఆనై యిడర్ కడింద ఆళి అంగై అంపుయత్తాళ్
కోనై విడిల్ నీరిల్ కుదిత్తెళుంద మీన్ ఎనవే
ఆక్కై ముడియుంపడి పిఱ్ఱత్తల్ అన్నవంత్తాళ్
నీక్క మిల్లా అన్బర్ నిలై
ప్రతిపదార్థము
ఆనై = గజేంద్రుడికి
యిడర్ = మొసలి వలన ఏర్పడిన కష్ఠము
కడింద = పోగొట్టిన
ఆళి అంగై = సుదర్శనమనే శంఖమును చేతిలో ధరించిన వాడు
అంపుయత్తాళ్ కోనై = లక్ష్మి దేవికి నాయకుడిని
విడిల్ = విడిపోవుట
నీరిల్ = నీటి నుండి
కుదిత్తెళుంద = ఎగిరి దూకిన
మీనెనవే = చేప లాగ
ఆక్కై ముడియుంపడి పిఱ్ఱత్తల్ = శరీరమే నశించి పోవు స్థితి ఏర్పడినట్లు
అన్నవంత్తాళ్ = ఆ శ్రీదేవికి స్వామి అయిన వాడి శ్రీపాదములను
నీక్క మిల్లా = ఎడబాటు లేకుండా వుండటము
అన్బర్ నిలై = అభిమానులు కోరుకునే స్థితి
భావము
విశ్లేషములోని దుఃఖమును, సంశ్లేషములోని ఆనందము అనే పర భక్తి స్థితిని గురించి మునుపు చెప్పారు. ఈ పాశురములో పర భక్తి తరువాతి స్థితి అయిన పరమ భక్తిని గురించి చెప్పారు. అనగా విశ్లేషమును భరించలేక ప్రాణములు విడుచు వరకు భక్తి పార్వశ్యమును పొందుటను ఉదాహరణ సహితముగా చెపుతున్నారు.
వ్యాఖ్యానము
పురాణములలోను, ఆళ్వార్ల పాశురములలోను గజేంద్ర మోక్షము చరిత్ర తరచుగా వస్తూవుంటుంది. గజేంద్రుండంటే ఏనుగుల రాజు. అది ఒక తామర పూవును శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు సమర్పించాలని తామరల కొలనులోనీకి దిగి స్నానము చేసి , ఒక తామరను కోసి వొడ్డు ఎక్కుతూ వున్నప్పుడు , శాపవశాత్తు చాలా కాలముగా ఆ కొలనులోఈ ఏనుగుకొసము ఎదురు చూస్తూ వున్న మొసలి దాని కాలిని పట్టేసింది . ఏనుగు వొడ్డుకు, మొసలి నీటీలోకి లాగుతూ1000 దేవ సంవత్సరములు గడచి పోయాయి. మొసలికి నీటిలో బలముఎక్కువ . ఏనుగుకు నీటిలో బలము తక్కువ శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు తామరను సమర్పించలేక పోయానన్న భాదతోను దాని బలము తగ్గసాగింది.
ఇక ఏ మాత్రము దు:ఖమును భరింప జాలనని గజేంద్రుడు భక్త రక్షకుడైన శ్రీమన్నారాయణుడే రక్షకుడని భావించి ,”నారాయణా !మణివర్ణా, పన్నగ శయనా ,నా బాధలను తొలగించవా ” అని పిలవగానే భగవంతుడు పరుగు పరుగున వచ్చి మకరిని సమ్హరించి గజేంద్రుని దుఃఖమును తీర్చాడు. గజేంద్రుని దుఃఖము మకరి నోటిలో పడి తన శరీరము బలమును కోల్పోయి మరణము సమీపించినందులకు కాదు. తాను తొండముతో తుంచి పట్టుకున్న తామర పూవును శ్రీమన్నారాయణుని శ్రీపాదాలకు సమర్పించలేక పోయినందుకు. శ్రీమన్నారాయణుడు పరుగున వచ్చి గజేంద్రుడు పట్టుకొని వున్న తామర పూవును స్వీకరించి దాని దుఃఖమును తీర్చాడు అని చరిత్ర. ఇక్కడ ” యానై ఇడర్ కడింద ‘ అన్న ప్రయోగము వలన తెలుస్తున్నది.
ఆళి అంగై –” చేతిలో చక్రమును ధరించి యున్న ” అని అర్థము. గజేంద్రుడినిరక్షించడానికి దాని శత్రువైన మకరిని సంహరించడానికి వెళ్ళినప్పుడు చేతిలో చక్రమును ధరించారని చెపుతున్నారు.
” మళుంగద వైన్నుదియ చక్కర నల్ వలత్తై
తొళుంగాదర్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోడ్రినయే ”
అని నమ్మాళ్వార్లు పాడారు. గజేంద్రుడిని రక్షించడనికి చేతిలో చక్రాయుధమును ధరించి వచ్చారు అన్నది స్పష్టము, కాని చేతిలో చక్రాయుధమును ధరించినది కూడా గుర్తు లేదు . అలా అయితే ఉన్న చోటు నుండే ఆయుధమును ప్రయోగించ వచ్చు కదా అని ఒక సందేహము. చేతిలో చక్రాయుధమును ధరించిన విషయము గుర్తు వుంది. అందుకనే ఆ ఆయుధముతో పరుగున వచ్చి సమ్రక్షించారు అని ఒక భావము. కారణము,గజేంద్రుడు భక్తితో భగవంతుడిని పిలిచాడు అని ఆళ్వార్లు చెపుతున్నారు. గజేంద్రుడు భగవంతుడు చేతిలో చక్రాయుధమును ధరించివుండే అందమును చూడాలనుకున్నాడు. ఆయనకు తామర పూవును సమర్పించాలని ఆశతో వున్నాడు. అందుకని తానున్న చోటు నుండి కాక గజేంద్రుడు ఉన్నతామర కొలనుకు వెళ్ళి రక్షించాడు . ‘ తనను దర్శించాలని కోరుకున్న భక్తులకు వారు కోరుకున్నట్లుగానే దర్శనమిస్తాడని అర్థము.
విడిల్: తన భక్తుల పట్ల ఇలా ప్రేమ ఉన్న వాడిని వీడి వుందవలసి వస్తే
నీరిల్ కుదిత్తెళుంద మీనెనవే: నీటిని విడిచి పైకి లేచిన చేపలాగా
ఆక్కై ముడియుంబడి పిరందాల్: శరీరము నశించు పోవు స్థితి ఏర్పడుతుంది. కలిసి వున్నప్పుడు సుఖము, విడిపోయినప్పుడు దుఃఖము అనేది ప్రేమ వ్యాకరణము. దానికంటే భక్తిలో ఆ భావన ఇంకా ఎక్కువగా వుంటుంది. అంటే వీడి వున్నప్పుడు ప్రాణములే పోవు స్థితి. ఇదే భక్తిలోని గొప్పదనము. దీనినే నీటిని వీడిన చేప లాగా అని ఉదహరించారు.
అన్నవన్: ” అంబుయత్తళ్కోన్ “_ ఆయుధమును ధరించిన భగవంతుడు ” అన్నవన్ “,అనగా అలాంటి వాడు అని ఒక అర్థము. చేపలకు నీటి లాగా భక్తులకు భగవంతుడు అని మరొక అర్థము .
తాళ్ నీక్క మిల్లా అంబర్ నిలై : వాడి శ్రీపాదములను వీడి దరింపలేని వాడు. అలా జరిగితే నీటిని వీడిన చేపలాగా ప్రాణములను విడుస్తాడు. ఇది పరమ భక్తి స్థితి.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-3-anai-idar/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org