ఆర్తి ప్రబంధం – 9

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<<ఆర్తి ప్రబంధం – 8

EmperumAnAr-tkeni

ప్రస్తావన

మణవాళ మామునులు వారితో ఉన్న కొందరికి సమాధానము చెప్పుచున్నరు. వారందరు మామునులని ఇట్లు ప్రశ్నించెను ” ఓ! మణవాళ మామునులు!! “నోఱ్ఱేన్ పల్ పిఱవి (పెరియ తిరుమొళి 1.9.8) అను వాఖ్యానుసారం ఈ ఆత్మకు అసంఖ్యాకమైన జననములు, ప్రతీసారి వేరు వేరు శరీరమున కలుగును. ఆ జననములు కర్మములచే శాసించబడిఉండును.మీరే చెప్పుచున్నారు మీకు చాల కర్మములు ఉన్నవని, కావున మీరు కర్మములచే ఈ మరల మరల జననించ వలసిఉన్నది. మీ పరిస్థితి ఇట్లుండగా, మీరు చెప్పునట్లు  ఎమ్పెరుమానార్లు మిమ్ము ఎట్లు రక్షించెదరు?” మణవాళ మామునులు వారికితో ఎమ్పెరుమానార్లు తన కొఱకు పునరవతరీంచి, తనను ఈ సంసార బందము నుండి రక్షించి నిత్యవిభూతిన శ్రీమన్ నారాయణుని చెంత చేర్చెదరని చెప్పెను.

పాశురం 9

కూబత్తిల్ వీళుం కుళవియుడన్ కుదిత్తు
అవ్వాబతై నీక్కుమ్ అన్ద అన్నై పోల్
పాపత్తాల్ యాన్ పిఱప్పేనేలుమ్ ఇని ఎన్దై ఎతిరాసన్
తాన్ పిఱక్కుం ఎన్నై ఉయ్ప్పదా

ప్రతి పద్ధార్ధం

అన్నై – తల్లి
కుదిత్తు – దూకి
కూబత్తిల్ – బావిలో
నీక్కుమ్ – తీసుకెళ్ళు
అవ్వాబతై – ఆపద (ఆమె  చుట్టుముట్టి)
కుళవియుడన్ – ఏ శిశువు
వీళుమ్ – పడిన (ఇంతకముందు బావిన)
పోల్ – అలాగే
అన్ద – ఆ
ఇని యాన్ పిఱపేనేలుమ్ – నెను ఒక వేళ మరల మరల జనించినను
పాపత్తాల్ – నా పాపములచే
ఎన్దై – నా తండ్రి
ఎతిరాసన్ – యతిరాజ
తాన్ పిఱక్కుమ్ – మరల తాను పునరవతరించు
ఎన్నై ఉయ్ప్పదా – నను రక్షించుట కొఱకు

సామాన్య అర్ధం

మణవాళ మామునుల వద్దకు వచ్చి, వారికి బహు జనన మరణములను వారి కర్మలచే ఉన్నవని కొందరు చెప్పెను. ఏందుకనగ ప్రతిఒక్కరు కర్మ ఫలమును అనుభవించక తప్పదు మరియు ఆ కర్మ చక్రము యొక్క అంతమునందే మొక్షము ప్రాప్తించును. కావున మీ ఈ స్థితి నుండి ఎమ్పెరుమానార్లు ఎట్లు రక్షించగలరని వారు అడిగెను.వారితో మణవాళ మామునులు తల్లి తన శిశువు బావిన పడుట చూచినచో వెంటనే తానే బావిల్లో తానే దూకి బయటకు తెచ్చును. అదే విధముగా నా తండ్రి యగు యతిరాజులు కూడ నా కొఱకు మరల పునరవతరించి నన్ను రక్షించును.

వివరణ

మణవాళ మామునులు ఇక్కడ ఒక ఉపమానమును చెప్పుచున్నారు. ఒక శిశువు అప్పుడే బావిలో పడిపోయెను. అది చూచి, ఆ శిశువు యొక్క తల్లి ఏమి చేయును? వెంటనే ఆ శిశువును కాపాడుటకు తానే బావిలో దూకును. ఈ ఉపమానమును ఉపయోగించి మణవాళ మామునులు తన వద్ద నిలబడి, ఎందుకు మరియు ఎలా ఎమ్పెరుమానార్లు వీరిని రక్షించవలెనని ప్రశ్నించు వారికి ఇలా వివరించెను. ” ఏ విధముగా తల్లి తన శిశువును కాపాడుటకు శిశువుతో కూడ తాను బావిలో దూకునో, అటలే నా తండ్రియగు యతిరాజులు బావిలో పడిన శిశువు వలే, కర్మములో మునిగిన నన్ను రక్షించుటకు ఆ తల్లి వలే ఈ లోకమునందు పునరవతరించును” అని మణవాళ మామునులు చెప్పెను. వారు తిరువాయ్మొళి నందు ఒక పాశురమును ఇక్కడ పేర్కొనెను. “చరణమాగుమ్ తనతాళ్ అడైన్దార్క్కెల్లామ్ మరణమానాల్ వైకున్దమ్ కొడుక్కుమ్ పిరాన్ (తిరువాఇమొzహి 9.10.5)” లో చెప్పినట్లు, ఏవరైతే శ్రీమన్ నారాయణుని పాద పద్మములనే అశ్రయించెదరో వారికి ఈ భువిన భౌతిక శరీరమును తుదిగా విడిచినప్పుడు పరమపదమును చేరుట నిశ్చయమగును. ఇదియే ప్రపత్తి యొక్క తత్వము. కాని నా పాపములు మిక్కిలి ఘోరమైనవి, అవి ప్రపత్తి యొక్క నియమములను మరియు తాత్పర్యములనే ఉల్లంఘించును. ఇట్టి మిక్కిలి కఠినమైన పరిస్థితిన కూడా నా తండ్రియగు యతిరాజులు నాతో మరల ఈ భువిన పునరవతరించును. వారు నన్ను ఆని దిక్కులలోను చుట్టుముట్టి పట్టుకొని ఆపదలనుండి “ఎదిర్ సూళల్ పుక్కు (తిరువాయ్మొళి 2.7.6) అను వాఖ్యమున చెప్పినట్లు రక్షించును. వారు నన్ను రక్షించుటకు పునరవతరించెదరని అడియేన్ ధృడముగా నమ్ముటచే అడియేన్ కు దీని గూర్చి ఏ కలతయూ లేదు. వారు నాకు యజమాని నేను వారి సొమ్ము (సొత్తు). సొమ్ము ఒక మారే పడును, కాని ఆ సొమ్ము తనకు దక్కు వరకు దాని యజమాని మరల మరల దూకవలెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము :  https://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-9/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment