శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ప్రస్తావన
ముందరి పాశురమునకు, ఈ పాశురమునకు ఉన్న సంబందము “ఉన్ భోగం నన్ఱో ఎనై ఒళిన్ద నాళ్” అను వాక్యబాగము తెలియబరచుచున్నడి. మునుపటి పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులను తాను సంసారమున కష్టపడునప్పుడు వారు పరమపద భోగములను ఎట్లు అనుభవించగలరని ప్రశ్నించెను. ఈ ప్రశ్నను విని శ్రీ రామానుజులు తనకు సమాధానము ఇచ్చునట్లు మణవాళ మామునులు భావించెను. ” ఓ! మణవాళ మాముని! ఎటుల మీరు నా వంక వ్రేళు చూపి మిమ్ము విడిచి నేను మాత్రమే పరమపదమునందు భోగములను అనుభవించుచున్నానని చెప్పెదరు. యోగ్యమైన కాలము వచ్చినప్పుడు, ఆ రోజు మిమల్ని కూడా పరమపదమున చేర్చెదను. అంతవరకు మీ బుద్ధి పక్వమును మరియు ఆధ్యాత్మికమును పెంపొందించుము. యుక్త సమయము వచ్చినచో, నేను మిమ్ము తీసుకొనిపోయెదను’, అని సమాధానము చెప్పెను. మణవాళ మాముని ఈ పాశురమున, శ్రీ రామానుజులచే ప్రశ్నించబడిన సందర్భమునకు సమాధానము చెప్పెను. ” స్వామీ, మీరు చెప్పిన సత్యము ‘అనుకూలు’ లకు (ఎవరైతే శాస్త్రములు చెప్పినట్టి ధర్మమును అనుసరించి ముక్తి మార్గమున నడుచెడరో, వారు ఇతర అనుకూలులను ఆదరించెదరు). కాని అడియేన్ అనుకూలులను కాను, అడియేన్ ఒక ‘ప్రతికూలు’డను ( ముక్తిని పొందుటకు శాస్త్రములచే చెప్పబడిన ధర్మ కార్యములను పాటించని వారు, వారు ఇతర అనుకూలులను సమర్దించరు). నా వంటి ప్రతికూలులకు, ఒక క్షణం గడిచినా, ప్రతికూల భారము గుణించును. అందువలనా అన్నిచెడు లక్షణములకు ఆధారముగా ఉండు ఈ శరీరమునుండి విముక్తి కలిగించుము” అని ప్రార్ధించెను.
పాశురం 6
వేంబు ముఱ్ఱక్ కైప్పు మిగువదుపోల్ వెవ్వినైయేన్
తీంబు ముఱ్ఱుమ్ దేగముఱ్ఱిచ్ చెల్లుంగాల్ – ఆమ్పరిసాల్
ఏఱ్కవే సిందిత్తు యతిరాసా ఇవ్వుడలై
తిఱ్కవేయాన వళి సెయ్
ప్రతి పద్ధార్ధం
యతిరాసా – (ఓ! యతిరాజ!!!)
వేంబు – వేప చెట్టు ఎటులైతీ ఎప్పుడు
ముఱ్ఱక్ – పక్వమైనప్పుడు
కైప్పు మిగువదు – చేడు ఎక్కువగును
పోల్ – అటులనే
వెవ్వినైయేన్ – అడియేన్, ఎవరి శరీరము గోరమైన పాపములకు నిలయమో
దేగముఱ్ఱి – అట్టి దేహము పెరిగినచో మరియు
చెల్లుంగాల్ – అటులనే పక్వపడుటున్నచో
తీంబు – చెడు కర్మములు (మాత్రమే)
ముఱ్ఱుమ్ – దానిలో అంతయూ కానవచ్చును
ఆమ్పరిసాల్ – (కావున) నా ఆత్మ యొక్క నిజ టట్వమును తిరిగి పెంపొందించుటకు
ఏఱ్కవే సిందిత్తు – (అడియేన్ ప్రర్ధిస్టునాను) సమయము గడుచుటకు మునుపే ఆలో చించి, ఇప్పుడే వ్యవహరిమ్చుము
సెయ్ – చేయుము
వళి – మిక్కిలి ఉచితా మార్గమున
తిఱ్కవేయాన – మరియు అంతముచేయుము
ఈవ్వుడలై – అన్ని చెడు గుణములకు నివాసమగు ఈ దేహమును
సామన్య అర్ధం
ఈ పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులను అన్ని దారుణమైన పాపములకు మూలమైన ఈ భౌతిక శరీరమును అంతముచేయమని ప్రార్ధించెను.వారు వేప చెట్టును ఇక్కడ ఉపమానముగా చూపెను. రోజులు గడిచిన కొద్ది వేప చెట్టు యొక్క చేదు గుణము పెరుగును. అదే విధముగా ఈ శరీరముచే కలుగు పాపములు పలురెట్లుగా పెరుగును. అందువలన వారు రామానుజులను వెంటనే తన దేహమును అంతుచేయుటకు సరియగు మార్గమును ఆలోచించమని కోరెను.
వివరణ
మణవాళ మామునులు శ్రీ రామానుజులతో ” ఓ యతిరాజా! చెఱుకు స్వతహగా తీపైనను, దాని యొక్క మాధుర్యము రోజులు గడిచిన కొద్ది పెరుగును. అటులనే వేప చెట్టు యొక్క చేదు రుచి కాలముతొ అధికమగును. అధే విధముగా దారుణ పాపములకు నివాసమగు ఈ శరీరము కూడను కాలముతో పాపములు పెరుగుచుండును. నేను ఈ పాపములకు మూలమైన అదమ గుణముల సారాంశము. అందువలన త్వరగా దయ చూప వలెను. అడియేన్ మిమ్ము అదమ గుణములకు మాత్రమే నివసమగు ఈ శరీరమౌను అంతముచేయుటకు సరియగు మార్గమును ఆలోచింపుము” అని చెప్పెను.
అడియేన్ వైష్ణవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-6/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org