యతిరాజ వింశతి – 13

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

యతిరాజ వింశతి

<< శ్లోకము 12

తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి దేహాస్థితౌ మమ రుచిస్తు న తన్నివృత్తౌ |
ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథ! త్వమేవ హర తధ్యతిరాజ! శీఘ్రం ||

పతి పదార్థము:

యతిరాజ = ఓ యతిరాజ

తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి = మూడు విధములైన దుఃఖములలో పడి కొట్టుకుపోతున్నప్పటికీ

మమతు = అతి నీచుడినైన దాసుడికి

దేహాస్థితౌ = శరీరము మార్పులకు లోను కాకుండా నిలకడగా ఉండు స్థితిలో

రుచిః = ఇష్టము

భవతి = కలుగుతున్నది

తన్నివృత్తౌ = శరీరము మార్పులకు లోనైనప్పుడు

న రుచిః = కష్టము

భవతి = కలుగుతున్నది

ఏతస్య =  దానికి శరీరములో కలుగు మార్పులు కాదు కారణము

అహో మమ పాపమేవ = అయ్యో దాసుడి పాపమే ఒక్కటే

కారణం = నిజమైన కారణము

నాథ!= దాసుడి పాపములను పోగొట్టగలిగిన వారైన స్వామీ

త్వమేవ = తమరు మాత్రమే

తత్ = ఆ పాపమును

శీఘ్రం  = త్వరగా

హర = పోగొట్టి అనుగ్రహించండి

 

భావము:

‘ అయ్యా, మీరు ఇప్పటి వరకు చూపిన దోషాలన్నీ మీ శారీరకమైనవి. మీరు శరీరముపై పెంచుకున్న ప్రేమ, శారీరక రుగ్మతలు, కారణము కావచ్చును. అటువంటి దేహాభిమానాన్ని మీరే తొలగ దోసేయండి.’  అని యతిరాజులు చెప్పినట్లు భావించుకొని దానికి జవాబుగా ఈ శ్లొకమును విన్నవిస్తున్నారు.  త్తత్రయీ- మూడు విధములైన ధఃఖ హేతువులు1.అధ్యాత్మికము-గర్భవాసము మొదలైన శారీరికమైనవి.  2.ఆదిభౌతికము- పంచభూతముల  వలన కలుగు కష్టములు.  3. ఆది దైవికము- యముని వలన కలుగు నరక భయము మొదలైనవి. మరొక రకముగా ‘ శరీరములో వుండే రక్త మాంసములు బయటికే కనబడితే వాటి కోసము పరుగెత్తే కాకి, కుక్కల నుండి తమను కాపాడుకొనుట కోసము కర్ర పట్టుకు పరుగులు తీస్తాడు ‘ అన్న  అర్థములో  ‘ యతినామాస్య  కాయస్య యత్ అనంతః తత్ బహిర్భవేత్ ‘ అన్న ఈ శ్లొకము దీనికి ప్రమాణముగా నిలుస్తున్నది.

‘  తన్నివృత్తౌ న రుచి ‘-విరొధి స్వభావములో వచ్చే ‘న ‘కారము ‘ రుచిః ‘ తో చేర్చి రుచికి వ్యతిరేకమైన ద్వేషము అన్న అర్థము గ్రహించబడింది.శబ్దాది విషయములందు ఉండు మోహమున కన్నా దేహమును రక్షించుకోవాలన్న తపన తీవ్రమైనది. దానికి కారణమైన పాపమును మరుక్షణములో తొలగించాలని ఇక్కడ ప్రార్థిస్తున్నారు.  వీరికి బాధ కలిగినా వీరి వలన ఈ లోకములో మరికొందరు ఉజ్జీవింప బడతారన్న ఆశ వలన వీరు అలా  ప్రార్థిచినా యతిరాజులు వీరి కోరికను మన్నించ లేదని గ్రహించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-13/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment