యతిరాజ వింశతి – 3

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 2

azhwan-emperumanar-andan

ఆళ్వాన్, ఎమ్పెరుమానార్, ఆణ్డాన్ – వారి యొక్క అవతార స్థలములలో

వాచా యతీంద్ర మనసా వపుషా చ యుష్మత్పాదారవిందయుగళం భజతాం గురూణాం !
కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం పాదానుచింతనపరస్సతతం భవేయం !! 

ప్రతి పదార్థము:

హే యతీంద్రా = ఓ యతిరాజా

మనసా = మానసిఖముగా

వాచా = వాక్కు చేత

వపుషా చ = కర్మణా

యుష్మత్ = తమరి

పాదారవిందయుగళం = పాదారవిందములను

భజతాం = సేవించుకుంటాను

గురూణాం = అచార్యులైన

కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం = కూరేశాదుల నుండి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ మొదలగు పూర్వాచార్యులను

సతతం పాదానుచింతనపరః = సతతం వారి శ్రీపాదములను చింతన చేయుటలో తరించేవాడిని

భవేయం = అవుతాను

భావము:
యతిరాజులను, వారి శిష్యులను సేవించుకోవటానికి అనుమతించ వలసినదిగా మామునులు ప్రార్థిస్తున్నారు.” కూరాధినాథ ” అంటే కూరేశులు,”కురుకేశు ” లనగా తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. వీరు రామానుజులకు మానస పుత్రులు.” ముఖ ” అంటే ఎంబార్, ముదలియాండాన్ ఇంకా ఇతర శిష్యబృందం.  “గ్రుణాంతి ఇతి గురవః ”  గురువు అన్న పదానికి ఉపదేశించు వాడు అని వ్యుత్పత్తి అర్థము. ఇంకా “గు ” అంటే అజ్ఞానము ,అంధకారము అని అర్థము. ” రు ” అంటే ఆ అజ్ఞానమును ,అంధకారమును తొలగించు వాడు. అర్థాత్ గురువనగా ఉపదేశము చేత అజ్ఞానమును ,అంధకారమును తొలగించు వాడు. ఇది కూరేశాదులందరికి వర్తిస్తుంది.        ” పుంసాం ” – పునాంతి ఇతి పుమంసుః- అనగా పరిశుధ్ధులు అని సాధారణ అర్థము.ఇక్కడ అది భగవంతుడికి దాసులైన కూరేశాదులకు,వారి శిష్యులకు, ముఖ్యముగా ఎంబార్లకు అన్వయము.” అనుచింతన ” అనగా కూరత్తళ్వాన్ ,వారి శిష్యులు రామానుజులను వారి పతిగా తలచి ధ్యానము చేయటము. వాక్యార్థము కూరత్తళ్వాన్ ,వారి శిష్యులకు మాత్రమే వర్తించినా రామానుజులకు కూడా అనువర్తిస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-3/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment