తిరువెళుకూట్ఱిరుక్కై 4వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 3వ భాగము

1-2-3]4-5-4-3-2-1[1-2

నాల్ దిశై నడుంగ అంజిఱై ప్పఱవై ఏఱి
నాల్వాయ్  ముమ్మతత్తు ఇరుశెవి
యొరుతని వేళత్తు అరందైయై
ఒరునాళ్ ఇరునీర్ మడువుళ్ తీర్తనై

ప్రతిపదార్థము 

ఒరునాళ్ – ఒకానొకప్పుడు

 నాల్ దిశై నడుంగ – నాలుగు దిక్కులు వణికిపోగ

అంజిఱై  ప్పఱవై ఏఱి – అందమైన పక్షిని ఎక్కి(గరుడవాహనము నెక్కి)

ఇరునీర్ మడువుళ్ – లోతుగా నీరుగల మడుగులో

అరందైయై – బాధ పడుతున్న

నాల్వాయ్ – వేలాడుతున్న నోరుగల

ముమ్మదం – మూడు ద్వారములగుండా మదము స్రవిస్తుండగా

ఇరుశెవి – రెండు చెవులు

ఒరుతని వేళత్తు – అసమానమైన ఏనుగు(గజేంద్రుడు) దుఃఖమును 

తీర్తనై – తొలగించావు

gajendramoksham

భావము:

తిరుమంగై ఆళ్వార్లు ,  ‘ఙ్ఞానము శక్తి గల ఇంద్రుడికి సహాయము చేసావు,  ఏనుగును కాపాడావు.  నువ్వు సునాయాసముగా సమస్త పదార్థములను, సర్వ లోకములను సృష్టించావు.  అలాంటి వాడివి నీ భక్తుల రక్షణార్థము సర్వము మరచి,  బ్రహ్మతో సహా అందరూ ఆశ్చర్య పోయే విధముగా పరుగులు తీశావు’ అని ఏనుగును(గజేంద్రుడు) రక్షించిన విధమును  కొనియాడుతున్నారు. 

 ఆణ్దాళ్  తమ  నాచ్చియార్ తిరుమొళిలో తనను కాపాడ రమ్మని పాడినట్లుగా,  ఆళ్వార్లు తనను  సంసారము నుండి,  ప్రధాన  శతృవులైన పంచేంద్రియముల నుండి  కాపాడ రమ్మని ప్రార్థిస్తున్నారు.

వ్యాఖ్యానము:

 ఙ్ఞానము శక్తి గల ఇంద్రుడికి మాత్రమే  సహాయము చేస్తాడా భగవంతుడు?  తన భక్తులు పిలిస్తే ఉన్నవాడు ఉన్నట్టు పరుగులు తీస్తాడా? (అరై కులైయ, తలై కులైయ )జుట్టు చెదిరి పోయివస్త్రము తొలగిపోయి-  పోతన భాగవతములో-  సిరికింజెప్పడు…. లో వర్ణిచినట్లు.

నాల్ తిశై నడుంగ పరమాత్మ సంకల్ప మాత్రమున సకలమును సృష్టించాడు.  ఆ సృష్టిని తిరిగి సంకల్ప మాత్రముననే లయము చేసాడని బ్రహ్మాది దేవతలకు తెలుసు. కాని తన భక్తులను రక్షించే సమయములో మాత్రము అసాధారణ త్వరను, కోపమును ప్రదర్శించటము చూసి బ్రహ్మాది దేవతలు తల్లడిల్లి పోయారు. అసాధారణ సంఘటన ఏదో జరగబోతున్నదని భయపడ్డారు.

అం శిఱైప్పఱవై ఏరి  బంగారు వర్ణము గల మేరు పర్వతము మీద నల్ల మబ్బులు కదలినట్లు, విష్ణు మూర్తి గరుడుడి మీద ఎక్కి ఎందుకిలా పరిగిడుతున్నారని తిరుమంగై ఆళ్వార్లు అడుగుతునారు.

నాల్ వాయి ముమ్మదతు ఇరు శెవి ఒరు తని వేళత్తు అరందైయై –  (నాల్ వాయి) తొండమును పైకి లేపడము వలన నోరు వేలాడుతున్నది. మూడు వైపుల మద జలము స్రవిస్తున్నది.  చేటంత చెవులు రెండు విచ్చుకున్నవి, రక్షించే వారెవరూ లేక ధైర్యము కోల్పోవటము గొప్ప విషాదము- అరందైయై. (పోతన భాగవతములో లావొక్కింతయు లేదు…..) 

ఒరు నాళ్ ఇరు నీర్ మడువుళ్ తీర్త్తనై –  లోతైన మడుగులో స్థాన బలము గల మొసలి చేత చిక్కిన  స్థాన బలము లేని గజేంద్రుడి ని చూసి ప్రమాదమును  గమనించి రక్షించడానికి నువ్వు వచ్చావు.  

ఒరు నాళ్   గజేంద్రుడుని రక్షించడాటినికి మహావిష్ణువు వచ్చిన సన్నివేశాన్ని తలచుకొని పొంగిపోతున్నారు తిరుమంగై ఆళ్వార్లు. ‘గజేంద్రుడి దుఖఃమును తీర్చిన నువ్వు నన్ను కూడా ఈ సంసారమనే దుఖఃము నుండి కాపాడవా!  అని అడుగుతున్నారు.  గజేంద్రుడు ఒడ్డు వైపుకిమొసలి నీటిలోనికి 1000 దేవ సంవత్సరాలు (విష్ణు ధర్మము 69) హోరాహోరిగా పోరు సలిపాయి.  అక్కడ ఉన్నది ఒక మొసలియే,  కాని ఇక్కడ నన్ను పంచేంద్రియములనే ఐదు మొసళ్ళు సంసారములోకి లాగుతున్నాయి. అక్కడ ఏనుగు బలమైనది. ఇక్కడ నేను బలహీనమైనవాడను. కాబట్టి నన్ను కాపాడటానికి పరుగున రావా!’ అని  ప్రార్థిస్తున్నారు.   

వేఅత్తు అరంధైయై ఇరు నీర్ మడువుళ్ తీర్త్తనై విష్ణు ధర్మములో చెప్పినట్లు,  గ్రాహం చక్రేణ మాధవ:, పరుగున వచ్చి ఏనుగు పాదమునకు ఒక్క ముల్లు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా సుదర్శన చక్రమును ప్రయోగించి మొసలిని చంపి ఏనుగును రక్షించాడు విష్ణుమూర్తి. ఈ సందర్భములో భట్టర్ , “ రాజుగారితో రోజూ కుస్తీ పోటీ చేసినందుకు సేవకుడికి కూడా ఆయనతో పాటు మంచి ఆహారము దొరికినట్లు, ఏనుగుతో  మొసలి పోరాడినందుకు మొసలికి కూడ మోక్షము లభించింది ” అన్నారు.

శోబై ….   బావిలో పడిన పిల్లను కాపాడి పైకి తీసిన తరవాత ఆ బిడ్డ అందాన్నిచూసి మురిసి పోతారు.

(వాళిప్పు)ఆహా! ఎమేఏ దీని చెవులు, ఎంత అందం ఈమెది,  అందమైన కాళ్ళు చూడు, తల అన్నింటిని తన్నే అందం -అని రకరకాలుగా చెప్పుకుంటారు.   

నాల్వాయి ముమదత్తు ఇరు సెవి ఒరు తని వేళత్తు–  ఆళ్వార్లు ఎందుకు  ఒక్కొక్క భాగాన్ని, మొత్తము అందాన్ని ఇంతగా వర్ణిస్తున్నారు? (సముదాయ) అందరు కలసి కాపాడినందున బిడ్డ అందాన్ని మరీ మరీ వర్ణించినట్టుగా ఆళ్వార్లు  ప్రబంధములోని ఈ భాగములో మహా విష్ణువు  కాపాడిన ఏనుగును ఇంతగా వర్ణిస్తున్నారు. 

వేళత్తు అరందైయై  చిన్న శరీరమైతే  ప్రమాదము కొద్దిగా వుండేది. కాని ఇక్కడ శరీరము పెద్ద ది ప్రమాదము కూడా పెద్దగానే ఉంది. పరమాపదం ఆపన్న: మనసా{శ్} చింతయత్ హరిం” [విష్ణు ధర్మం] ఋషులు ఏనుగుకు కలిగిన ఆపదను గొప్ప ఆపదగా చెపుతున్నారు-‘. “పరమాపదం …. అందు వలననే గజేంద్రుడు నోరు తెరచి పిలవటానికి శక్తి లేక పరమాత్మను మనసులోనే తలచుకున్నాడని  చెపుతున్నారు-మనసా చింత్యాత్ ‘

ఒరు నాళ్ తీర్తనై –   పెరియాళ్వార్ల కుమార్తె,    నారాయణుడికి ప్రియమైనది అయిన గోదాదేవి, నారాయణుడి కృప కోసము   కాలైక్కదువిడుగిన్ఱ కయలొడు వాళై విరువి [నాచ్చియార్ తిరుమొళి 3-5] అని పాడింది. –( నీటిలో ఒక్క పురుగు వున్న సహించలేవు. అలాంటిది రెండు చేపలుంటే సహించగలవా?) అదేవిధముగా తిరుమంగై ఆళ్వార్లు పరమాత్మను అడుగుతున్నారు, “బలవంతమైన  గజేంద్రుడిని మొసలి కొంత కాలము పట్టుకుంటేనే సహించలేవే!  పంచేంద్రియములు నన్ను ఇంత కాలము బాధిస్తుంతే తట్టుకోగలవా?”

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-4/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment