ఎంపెరుమానార్ వడివళగు పాశురం – సరళ వివరణ 

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః 

పూర్తి వ్యాసమాలిక

పఱ్పమెనత్ తిగళ్ పైంగళల్ ఉన్ఱన్ పల్లవవమే విరలుమ్

పావనమాగియ పైందువరాడై పదింద మరుంగళగుమ్

ముప్పురినూలొడు మున్కైయిల్ ఏన్దియ ముక్కోల్ తన్నళగుమ్

మున్నవర్ తందిడుమ్ మొళిగళ్ నిఱైందిడుమ్ ముఱువల్ నిలావళగుమ్

కఱ్పగమే విళి కరుణై పొళన్దిడు కమల క్కణ్ణళగుమ్ 

కారి సుదన్ కళల్ సూడియ ముడియుమ్ కననఱ్చిగైముడియుమ్

ఎప్పొళుదుమ్ ఎదిరాసన్ వడివళగు ఎన్నిదయత్తుళదాల్

ఇల్లై ఎనక్కెదిర్ ఇల్లై ఎనక్కెదిర్ ఇల్లై ఎనక్కెదిరే 

ఈ పాశురంలో ఎంబార్, పెరియ పెరుమాళ్‌ యొక్క దివ్య మంగళ ఆపాదమస్తక రూపాన్ని తిరుప్పాణాళ్వార్ అనుభవించినట్లే, ఎంబెరుమానార్ యొక్క దివ్య సౌందర్యంలో పూర్తిగా లీనమై, దానిని మనమందరం అనుభవించాలని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, తాను ఎల్లప్పుడూ ఎంబెరుమానార్‌ యొక్క శారీరక సౌందర్యంలోనే నిమగ్నమై ఉన్నానని, తనకు సరితూగే వారు ఇంకెవ్వరూ లేరని ఆయన ధైర్యంగా ప్రకటిస్తున్నారు.

పఱ్పమెనత్ తిగళ్ పైంగళల్ ఉన్ఱన్ పల్లవవమే విరలుమ్

ఎంపెరుమానార్ వారి దివ్య తిరువడి మరియు కాలి వేళ్లు తామర పుష్పములను, వాటి రేకులను పోలి మనోహరముగా ఉంటాయి.

పావనమాగియ పైందువరాడై పదింద మరుంగళగుమ్

ఎంబెరుమానార్ల దివ్య తొడలపై అలంకరించబడి ఉన్న కాషాయ వస్త్రం చాలా అందంగా కనిపిస్తోంది.

ముప్పురినూలొడు మున్కైయిల్ ఏన్దియ ముక్కోల్ తన్నళగుమ్

మూడు పోగులు కలిగి, ఎంబెరుమానార్ దివ్య భుజమును అలంకరించిన యజ్ఞోపవీతం (జంధ్యం) మరియు సన్యాసులు ధరించే త్రిదండం (ఎగువన తెల్లని పతాకము గల మూడు దండములు కలిగిన)  ఎంతో మనోహరంగా ఉంటాయి.

మున్నవర్ తందిడుమ్ మొళిగళ్ నిఱైందిడుమ్ ముఱువల్ నిలావళగుమ్

మందహాసంతో కూడిన ఎంపెరుమానార్ (రామానుజాచార్యుల) దివ్యమైన అధరాలు, ఆళ్వార్లు మరియు పూర్వాచార్యులు పలికిన దివ్యవాక్కులతో నిండి ఉన్నాయి. ఇవి చూసేందుకు ఎంతో అందంగా ఉన్నాయి.

కఱ్పగమే విళి కరుణై పొళన్దిడు కమల క్కణ్ణళగుమ్

కల్పక వృక్షం లాగా కరుణను కురిపించే ఎమ్పెరుమానార్ దివ్య నేత్రాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి.

కారి సుదన్ కళల్ సూడియ ముడియుమ్ కననఱ్చిగైముడియుమ్

ఎమ్బెరుమానార్లు తన దివ్యమైన శిరస్సును, గ్రామ పెద్ద అయిన కారి దివ్య పుత్రుడైన నమ్మాళ్వార్ యొక్క దివ్య పాదాలతో అలంకరించుకున్నారు. ఆ దివ్య శిరస్సుపై ఉన్న శిఖ అందంగా కనిపిస్తోంది.

ఎప్పొళుదుమ్ ఎదిరాసన్ వడివళగు ఎన్నిదయత్తుళదాల్

యతులకు రాజైన ఆ ఎమ్బెరుమానార్ యొక్క దివ్య మంగళ రూపాన్ని నేను నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తున్నాను.

ఇల్లై ఎనక్కెదిర్ ఇల్లై ఎనక్కెదిర్ ఇల్లై ఎనక్కెదిరే

నాకు సరిసమానమైన వారు ఎవరూ లేరు అని నేను మూడు సార్లు బిగ్గరగా ప్రకటిస్తున్నాను.

అదేమిటంటే, ఎంబార్ ఇలా చెబుతున్నారు – “నేను భగవత్ రామానుజుల తిరుమేని (దివ్య రూపం) యందు లీనమై ఉన్నాను కాబట్టి, నాకు ఎల్లప్పుడూ సత్వగుణం ఉంటుంది. దానివల్ల నేను నిరంతరం ఎంపెరుమాన్ (భగవానుడు) మరియు ఎంపెరుమానార్ (శ్రీ రామానుజుల) యొక్క అంశల యందే నిమగ్నమై ఉంటాను.” ఆయన దీనిని సాత్విక అహంకారంతో (మంచివారికే సహజమైన పవిత్రమైన గర్వంతో) ప్రకటిస్తున్నారు. మనం కూడా ఎంపెరుమానార్ యొక్క శారీరక సౌందర్యంలో మునిగిపోవాలని తెలియజేయడమే ఈ పాశురం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం 

ఆడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

ఆడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి

మూలం: https://divyaprabandham.koyil.org/index.php/2026/02/emperumanar-vadivazhagu-embar/

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment