శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
1-2]3-4-5-6[-5-4-3-2-1
ముత్తు ణై నాన్మరై వేళ్వి
అఱు తొళిల్ అన్దణర్ వణంగుం తన్మయై
ప్రతిపదార్ధము :
అన్దణర్ వణంగుం తన్మైయై –బ్రాహ్మణులచే పూజింపబడువాడు
ముత్తీ – త్రై అగ్నులు (మూడు విధము లైన అగ్నులు)మరియు
నాల్ మఱై – నాలుగు రకములైన వేదములు మరియు
ఐవగై వేళ్వి – ఐదు విధములైన యఙ్ఞములు మరియు
అఱు తొళిల్ – ఆరు విధములైన కర్మలు.
భావము:
నిన్ను పొందటము కోసము ధర్మములను, కర్మయోగములను పాటించు బ్రాహ్మణులచే పూజింపబడువాడవు. దాని కొరకు వారు హోమములను చేసి మూడు విధములైన అగ్నులను కాపాడుతూ, నాలుగు వేదములను అధ్యయనము చేసి, ఐదు విధములైన యఙ్ఞములను చేస్తూ, ఆరు విధములైన కర్మలను పాటిస్తారు. అలాంటి బ్రాహ్మణులకు పరమాత్మ అడిగినవన్నీ సమకూరుస్తాడు.
వ్యాఖ్యానము:
‘వాళియిన్ అట్టనై’ పిరాట్టి కోసము బాణ ప్రయోగముతో శతృ సంహారము చాశాడు) ; ‘మడువుళ్ తీర్త్తనై’ఇంధ్రుడి అన్య ప్రయోజనములను నేవేర్చటము కోసము సహాయము చేసాడు అంటున్నారు తిరుమంగై ఆళ్వార్లు.
ప్రబంధములోని తరువాతి పాదములలో భగవంతుడిని తమ ప్రయోజనార్థము వినియోగించుకొని, అదే సమయములో ఇతర ప్రయత్నముల వలన కూడ తమ ప్రయోజనములను నెరవేర్చుకునే వారికి కూడ సహాయము చేసే పరమాత్మ గొప్పగుణములను, ఆళ్వార్లు వర్ణిస్తున్నారు.
ముత్తీ … – “యోగో యోగవిధాం నేతా” [విష్ణు సహస్రనామం 18,19] అన్నట్లుగా, పరమాత్మ అన్నింటికీ కారణభూతుడు. అయినా అన్య ప్రయత్నముల ద్వారా ఆయనను పొదగోరు వారికి కూడా ఆయన సులభుడు. బ్రాహ్మణులు నిర్వహించే కర్మ యోగమును ఆళ్వార్లు ఇక్కడ అన్య ప్రయత్నము అన్నారు.
ముత్తీ – గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్నులను త్రైయగ్నులంటారు. ఏక కాలములో జన్మించిన ముగ్గురు బిడ్డలకు పాలు పట్టడము తల్లికి ఎంత కష్టమో బ్రాహ్మణులకు ఏక కాలములో త్రైయగ్నుల నిర్వాహణ అంత కష్టము.
నాన్మఱై – కర్మ యోగులు , సక్రమముగా ఋక్, యజుర్, సామ, అథర్వణ మనే నాలుగు వేదములను అధ్యయనము మరియు అధ్యాపనము చేస్తూ ఉంటారు.
ఐవగై వేళ్వి – దేవయఙ్ఞము , పితృయఙ్ఞము, భూతయఙ్ఞము , మానుషయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము అనేవి ఐదు విధములైన యఙ్ఞములను బ్రాహ్మణులు నిత్యము అనుష్ఠిస్తూ ఉంటారు.
అఱు తొళిల్ – బ్రాహ్మణులు ఆరు విధముల కర్మములను చేస్తూ వుంటారు.– యజనం (వారి కొరకు యఙ్ఞము చేయటము), యాజనం (ఇతరుల కొరకు యఙ్ఞము చేయటము ), అధ్యయనం (వేదములను వల్లె వేయుట),అధ్యాపనం (ఇతరులకు వేదములను నేర్పించుట), దానము , ప్రతిగ్రహణం (దానము స్వీకరించటము). బ్రాహ్మణేతరులకు ఇందులో కొన్నింటిని మాత్రమే చేయటానికి అధికారము ఉంది.
దీని వలన కర్మయోగమును ఆచరించటములోని కష్టములను తెలియజేస్తున్నారు. యఙ్ఞము కలిగి కర్మ యోగము చేయు బ్రాహ్మణుల ఔన్నత్యమును ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
అందణర్ వణంగుం తన్మైయై – కర్మ యోగము చేసి,బ్రాహ్మణులు నిన్ను చేరగోరేటతటి మహిమాన్వితుడివి నువ్వు అని ఆళ్వార్లు అంటున్నారు.
అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-5/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org