ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 4-6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురు 4

మణవాళ మామునులు ఈ పాశురములో ఆళ్వార్ల తిరు అవతార క్రమమును తెలుపుచున్నారు.

పొయ్ గైయార్ పూదత్తార్ పేయార్ * పుగమళిశై అయ్యన్ అరుళ్ మారన్ శేరలర్ కోన్ * తుయ్యపట్టనాదన్ అన్బర్ తాళ్ తూళి నఱ్పాణన్ నఱ్ కలియన్! ఈదివర్ తోత్తత్తడైవామ్ ఇజ్గు!!

ఆళ్వార్ల అవతార క్రమమేమనగా మొదలాళ్వార్లుగా కీర్తింపబడే 1. పొయ్గై ఆళ్వార్, 2. పూదత్తాళ్వార్, 3. పేయాళ్వార్, 4. లబ్ధప్రతిష్టులైన తిరుమణిశై ఆళ్వార్, 5. కృపా పూర్ణులైన శ్రీనమ్మాళ్వార్, 6. చేర వంశానికి నాథులైన కులశేఖర పెరుమాళ్,  7. పరిశుధ్ధ మనస్కులైన పెరియాழ்వార్, 8. భక్తాంఘ్రి రేణువుగా ప్రసిద్ధులైన తొండరడిపొడి ఆళ్వార్, 9. పరమ పవిత్రులైన తిరుప్పాణాళ్వార్ మరియు 10. పరమ పవిత్రులైన తిరుమంగై ఆళ్వార్.

పాశురం 5

ఈ ఐదవ పాశురములో మణవాళ మామునులు దయతో ఈ విధముగా ఆళ్వార్లవతరించిన మాసములు మరియు తిరునక్షత్రములను వివరించుట మొదలు పెట్టినారు.

అన్దమిళాల్ నఱ్కలైగళ్ ఆయన్దురైత్త ఆళ్వార్గళ్! ఇన్ద వులగిరుళ్ నీజ్ఞ్గ * వన్దుదిత్త మాదజ్ఞ్గళ్ నాళ్ గళ్ దన్నై మణ్ణులగోర్ తామఱియ! ఈదెన్ఱు శొల్లువోమ్ యామ్!!

ఏ ఆళ్వార్లు అయితే వేద శాస్త్రములలోని లోతైన అంతరార్థములను ఈ లోకములోని అజ్ఞాన చీకటులను పారద్రోలునట్లుగా ఉపదేశించారో అటువంటి ఆళ్వార్లు అవతరించిన మాసములను మరియు తిరునక్షత్రములను ఇప్పుడు ఈ లోకములోని చేతనులు తెలుసుకొను విధముగా తెలియజేయుచున్నారు.

పాశురు 6

ఈ ఆరవ పాశురములో మొదలాళ్వార్లుగా కీర్తింపబడే మొదటి ముగ్గురాళ్వార్ల అవతార విశేషములను తెలుపుచున్నారు.

ఐప్పశియిల్ ఓణమ్ అవిట్టమ్ శదయమివై!
ఒప్పిలవానాళ్ గళ్ ఉలకత్తీర్ * ఎప్పువియుమ్ పేశుపుగళ్ ప్పొయ్గైయార్ పూదత్తార్ పేయాళ్వార్! తేశుడనే తోన్ఱు శిరప్పాల్!!

ఓ మానవులారా! ఆశ్వీజ మాసములో వచ్చు శ్రవణం, ధనిష్ట మరియు శతభిషం అను ఈ మూడు విశేషమైనవి. ఎందుకంటే ఈ రోజులలోనే మొదలాళ్వార్లుగా గొప్పగా కీర్తంపబడే తేజోపూర్ణులైన పొయ్గై, పూదత్త మరియు పేయాళ్వార్లనే మొదలాళ్వార్లు అవతరించారు.

అడియేన్ వేదగోపురం వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-4-6-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment