శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
పాశుర అవతారిక:
- నఙ్ఙీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు క్రిందటి పాశురములో(6వ)సంక్షిప్తంగా అనుగ్రహించిన వివరణను ఈ పాశురం మరియు రాబోవు రెండు పాశురములలో సవివరంగా వ్యాఖ్యానిస్తున్నారు. నఙ్ఙీయర్ ప్రధానంగా, ఇంద్రుడు మరియు సప్తఋషులు మొదలైన వారందరు ఆకాశమంతా నిండిపోయి ఎంపెరుమాన్ శ్రీపాదములను విశేష శ్లోకములతో కీర్తిస్తు ఆరాధిస్తున్నారు. పెరియవాచ్చాన్ పిళ్ళై ముఖ్యంగా ఇలా వివరిస్తారు- త్తైత్తరీయ ఉపనిషద్ లో పేర్కొన్న “బైశాస్మాత్” (దేవతలు ఎంపెరుమాన్ కు భయపడి అతని ఆఙ్ఞకు లోబడి నడుచుకుంటారు). ఇంద్రుడు తన దాస్యమును నెరవేర్చుకొనుటకు ఇక్కడికి విచ్చేసాడు.
అన్దరత్తమరర్ గళ్ కూట్టంగళ్ ఇవైయో అరుం తవ మునివరుం మరుదరుమివరో ఇన్దిరన్ ఆనైయుమ్ తానుమ్ వన్దివనో ఎంపెరుమాన్ ఉన్ కోయిలిన్ వాశల్ శున్దరర్ నెరుక్క విచ్చాదరర్ నూక్క ఇయక్కరుమ్ మయంగినర్ తిరువడిత్తొళువాన్ అన్దరం పార్ యిడమిల్లై మత్తిదువో అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే.
ప్రతిపదార్థం:
ఎంపెరుమాన్ = మా స్వామి / మా రక్షకుడా!
ఉన్ కోయిలిన్ వాశల్ = నీ కోవిల వాకిలి దగ్గర
ఇన్దిరన్ తానుమ్ = ఇంద్రుడు కూడ
ఆనైయుమ్= ఐరావతం
వన్దివనో = అందరును వచ్చిరి
అన్దరత్తమరర్ గళ్ ఇవైయో = స్వర్గలోక దేవతలు వీరు
కూట్టంగళ్= పరివారం(వాహన,కుటుంబ, పరిచారక సమేత)
అరుం తవ మునివరుం = దుర్లభమగు తపమాచిరించిన మునులు – సనక సనందాది ఋషులు
మరుదరుముం = మరుత్తులు వారి సేవకులతో(మరుద్గణములతో)
ఇయక్కరుమ్= యక్షులు
శున్దరర్ నెరుక్క = గంధర్వులు క్రిక్కిరిసి నిలబడి ఉన్నారు
విచ్చాదరర్ నూక్క = విద్యాధరులు ఒకరినొకరు త్రోసుకుంటున్నారు
తిరువడిత్తొళువాన్ మయంగినర్ = మీ పాదములను సేవించుటకు మోహించి ఉన్నారు
అన్దరం = ఆకాశం
పార్ = భూమి
యిడమిల్లై= చోటులేదు/స్థలాభావం
అరంగత్తమ్మా!శ్రీ రంగమున పవళించిన నా దేవాదిదేవా!
పళ్ళియెళుందరుళాయే= దయతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము
సంక్షిప్త అనువాదం:
ఓ దేవాది దేవా! దేవతలకధిపతైన ఇంద్రుడు తన పరివారంతో(వాహన,కుటుంబ, పరిచారక సమేత) మీ కోవిల వాకిలి వద్ద నిల్చొను ఉన్నాడు. వీరేకాక స్వర్గలోక దేవతలు, వారి పరిచారకులు, సనక సనందాది ఋషులు, మరుద్గణములు, విధ్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన వారందరు వచ్చిఆకాశమున మరియు భూమి యందున చేరుట వల్ల స్థలాభావంతో క్రిక్కిరిసి ఒకరినొకరు తోసుకుంటు నిల్చున్నారు. వారందరు తమ శ్రీపాదములను అర్చించడానికి వ్యామోహముతో వచ్చి ఉన్నారు. కాన ఓ దేవాది దేవా! శ్రీరంగమున పవళించిన నా స్వామి ! పడక నుండి లేచి మమ్ములను అనుగ్రహింపుము.
నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు
- ఇద్రాంది దేవతలు స్వర్గలోక దేవతలు, వారి పరిచారకులు, సనక సనందాది ఋషులు, మరుద్గణములు, విద్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన వారందరు ఎంపెరుమాన్ శ్రీపాదములను అర్చించడానికి విచ్చేయడం శ్రీమన్నారాయణుని ” సర్వస్వామిత్వం”(అందరికి రక్షకుడు/అధిపతి) ను తెలుపుతుంది.
- అరుం తవ మునివరుం అను పదము- దుర్లభమగు తపమాచిరించిన బ్రహ్మమానస పుత్రులగు (మనస్సు నుండి జన్మించినవారు) సనక, సనాతన, సనందన మరియు, సనత్కుమారులను ఋషులను తెలుపును.
- చాలా సమూహములు రావడం వల్ల ద్వారపాలకులు కూడ నిలబడుటకు స్థలాభావం ఏర్పడినది.
పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు
- ఈ పాశుర భావములో దేవతలు, ఋషులు మొదలైనవారి క్రమంలో 3వ వారిగ తెలుపబడ్డాడు ఇంద్రుడు. ఇంద్రుడు వీరికి మాత్రమే అధికారి కావున అతని ఆగమనం చెప్పబడింది మొదట. దీనికి సామ్యమైన ఉదాహరణ – ప్రణవం. దీనిలో పదాల వరుసక్రమం-(అ,ఉ,మ) జీవాత్మ యొక్క స్వభావమును తెలుపుతు -‘అ’ కార వాచ్యుడగు పరమాత్మకు ‘మ’ కార వాచ్యుడగు జీవాత్మ సదా దాసుడు. సారమేమనగా భగవానుడు సర్వులకు అధికారి
- అరుం తవ మునివరుం అను పదము- గొప్ప తపమాచరించిన సప్తర్షులను తెలుపుతుంది.
- విద్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన సమూహములు గానములో నృత్యములలో వివిధ సామర్థ్యం కలిగిన వారు.
అడియేన్ నల్లా శశిధర్ రమానుజదాస
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-7-antharaththu/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org