యతిరాజ వింశతి – 8

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 7

ధుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిబోగనిరతః శరణాగతాఖ్యః |
త్వత్పాదభక్త ఇవ శిష్టజనైగమధ్యె మిథ్యా చరామి యతిరాజ !తతోsస్మి మూర్ఖః ||

 

ప్రతి పదార్థము:

యతిరాజ != ఓ యతిరాజ

శరణాగతాఖ్యః = శరణాగతుడనే ( ప్రపన్నుడు) పేరు మాత్రమే గలవాడను

శబ్దాదిబోగనిరతః = శబ్దాదిబోగములలో పూర్తిగా మునిగిపోయిన వాడిని

దుష్టచేష్టః = శాస్త్రము నిషేదించిన పనులను చేయుటలో సిధ్ధహస్తుడనైన

తవ = తమరికి

ధుఃఖావహం = ధుఃఖమును కలిగించువాడనైన

అహం = దాసుడు

శిష్టజన ఓహమనిశం ! = పురుషార్థము తమరికి కైంకర్యము చేయుటయేకై

త్వత్పాదభక్త ఇవ = తమరి శ్రీపాదముల మీద భక్తి కలిగి వున్న ప్రపన్నునిలా

శిష్టజనైగమధ్యె = కూర్తాళ్వాన్ వంటి శిష్టజన కూటమి మధ్యలో

మిథ్యా చరామి = కపట వేషములో తిరుగుతున్నాను

తతః = ఆ కారణము వలన

మూర్ఖః అస్మి = మూర్ఖుడిగా,బుధ్ధి హీనుడుగా అవుతున్నాను

తత్ వరాయ = అటువంటి అజ్ఞానమును పోగొట్టి కృప చూపాలి

 

భావము:

ఎంబార్ మొదలైన వారు స్వామి మనసుకు సంతోషమును కలిగించునట్లుగా నడచుకుంటారు. దాసుడు విడువ వలసిన లౌకిక విషయములలో మునిగి వుండి తమరికి ధుఃహేతువునవుతున్నాను. ఆ గుణమును దాసునిలో నశింప చేయ వలసినదిగా కోరుతున్నాను. శరణాగతాయః– శరణాగతుడనే ( ప్రపన్నుడు) పేరు మాత్రమే గలవాడను కాని దాని లక్షణములైన సత్కర్మలను ఆచరించుట ,చెడు పనులను పూర్తిగా మనివేయుట, రామానుజులు తప్పక కాపాడుతారన్న విశ్వాసము కలిగి యుండుట, కాపాడే బాధ్యతను ఆయనకే వదిలి వేయటము, వేరు ఉపాయము కాని, మరొక దైవము కాని లేరన్న నిశ్చయము కలిగి వుండుట మొదలైన వేవి లేని వాడను.  దుఃఖావః– శరణాగతుడవుట వలన వీడిని రక్షించాలా! లేక దుష్ట చేష్టితములు గలవాడని వదిలి వేయాలా అనే ధర్మ సందేహానికి తమరిని గురి చేసి తమరి ధఃకానికి కారణ మవుతున్నాను. మూర్ఖుడై మంచి చెడు వివేచన లేని దాసుడిని తమరే కృపతో సరిదిద్దలని ప్రార్థిస్తున్నారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-8/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment