యతిరాజ వింశతి – 2

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

 

యతిరాజ వింశతి

<< శ్లోకము 1

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం!
శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం !!
శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం!
శ్రీవత్సచిన్హశరణం యతిరాజమీడే!!

ప్రతిపదార్థము:

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం = శ్రీరంగరాజ స్వామి పాదములనే పద్మముల నీడలో ఒదిగిన రాజహంస లాంటి వారు

శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం = శ్రీమత్పరాంకుశులైన నమ్మళ్వార్ల పాదములనే పద్మములలోని తేనెలను తాగుటకు ఒదిగిపోయిన తుమ్మెదల వంటి వారు

శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం = శ్రీభట్టనాథులైన పెరియాళ్వార్లు , పరకాలులైన తిరుమంగై ఆళ్వార్లు ముఖకమలములను వికశింపచేయు సూర్యుని వంటి వారు

శ్రీవత్సచిన్హశరణం = శ్రీవత్సచిన్హులైన కూరత్తళ్వాన్లను  చరణములుగ కలిగియున్న వారు

యతిరాజం = యతిరాజులైన ఎంబెరుమానార్లకు

ఈడే =  నమస్కరిస్తున్నాను

భావము:

మానుష జన్మము అతి దుర్లభము అంతే త్వరగా ముగిసిపోతుంది అని శ్రీమద్భాగవతములో చెప్పబడింది. మానవ జన్మము దొరికినా వైకుంఠనాధునికి ప్రియమైన భాగవతులను చూడటము ఇంకా కష్ఠము. (శ్రీ భాగవతము 11-2-29). దీనిని బట్టి భాగవతుల సంఖ్య ఎంత తక్కువో అర్థమువుతున్నది. అలాంటి భాగవతులచే చేయబడిన యతిరాజ వింశతికి ఎంత ఔన్నత్యము ఉందో ఆలోచించాల్సిందే. మామునులు  శ్రీ రంగరాజా అని మొదలయ్యే  మరొక మంగళ శ్లోకముతో యతిరాజులను కీర్తిస్తున్నారు. ” శ్రీ”  అంటే ఇక్కడ శ్రీ వైకుంఠము అని అర్థము , రంగరాజుల తామర వంటి పాదము అని చెప్పుకోవచ్చు.  ఎందుకంటే వాటికి సహజ సిద్దమైన అందము మృధుత్వము, సువాసన ఉంటాయి. పరాంకుశులకున్న సంపద మూడు విధములు .అవి 1. పరమాత్మ అనుభవము 2. ఆయనకు చేయగల కైంకర్యము 3.జీవాత్మ పరభక్తి, ఫరజ్ఞానము, పరమ భక్తి పొందుటకోశము కైంకర్యము చేయుట. పరభక్తి అంటే పరమాత్మను చూడాలన్న కోరిక. ఫరజ్ఞానము అంటే పరమాత్మను చూసాక ఆయనలో ఐక్యమవాలనే కోరిక. పరమ భక్తి అంటే పరమాత్మలో  ఐక్యమయ్యాక విడిపోవాల్సి వస్తుందేమోనన్న శంఖ. ఆహారము తీసుకోవడానికి ఆకలి ఎంత అవసరమో,  పరమాత్మకు కైంకర్యము చేయడానికి ఈ మూడు అర్హతలుగా వుందాల్సిందే. ఆకలి లేకుంటే ఆహారము రుచించదు. ఈ మూడు లేని పూజ వృధా ప్రయాస మాత్రమే అవుతుంది.  కాబట్టి ఇక్కడ శ్రీమత్ అన్న పదము  నమ్మళ్వార్లకు పై మూడు గుణములు అపారముగా గలవని తెలుపున్నది. శ్రీ భట్టనాథ ఫరకాల అనటము వలన ఆళ్వారిద్దరికి ఇది వర్తిస్తున్నది. పరమాత్మకు తిరుప్పల్లాండు పాడటము వలన భట్టనాథులకు ఈ సంపద అబ్బినది. శ్రీ పరకాలులకు ఇతర మతములను గెలుచుట శ్రీరంగములోని కోవెలకు ప్రాకారాము నిర్మించుట వలన ఈసంపద అబ్బినది. శ్రీ పరకాలులు పెరియ తిరుమొళి 4.9.6. లో ఈ విషయమును చెప్పుకున్నారు. అణ్ణావప్పన్గార్అ స్వామి ఇక్కడ  తిరువిందలూరు  పెరుమాళ్ళను కూరేశులతో పోల్చారు.  శ్రీవత్సచిహ్న అంటే వక్షము మీద చిహ్నము కలవారు అని అర్థము. పరమాత్మ వక్షము మీద చిహ్నము కలవారు కదా! అలాగే కూరేశులు కూడా వక్షము మీద చిహ్నము కలిగి వున్నారు.  శ్రీని  శ్రీవత్సచిహ్నులతో పోలిక చేశారు. సీత అశోక వనములో తనను బాధించిన ఒంటి కంటి రాక్షసులను రక్షించినట్లు కూరేశులు కూడా తన కళ్ళు పోవడానికి కారణమైన నాలూరానును ఈ లోకపు క్లేశములనుండి రక్షించి మోక్ష సామ్రాజ్యములో స్థానము కల్పించారు. “ ప్రణమామి మూర్ద్న” అన్న ప్రయోగముతో మొదటి శ్లోకములో శిరసు వంచి నమస్కరించారు. ఈ  శ్లోకములో “ ఈడే “అన్న ప్రయోగము వాచిక కైంకర్యమును సూచించారు. మనసులో చింతన చేయనిదే వాచిక కైంకర్యము సాద్యము కాదు. కావున మొదటి రెండు శ్లొకములలో త్రికరణ సుద్దిగా మంగళము పాదారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-2/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment