శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః

ఉయ్యక్కొండార్ అసలు పేరు పుండరీకాక్షులు. వారు శ్రీమన్ నాథమునులకు శిష్యులు. నాథమునులు వద్ద నుంచే నాలాయిర దివ్యప్రబంధం నేర్చుకున్నారు. పుండరీకాక్షులు తిరువెళ్ళరైలో చిత్తిరై (చైత్ర) మాసం, కార్థిగై (కృత్తిక) నక్షత్రమందు జన్మించారు.
నాథమునులు యోగశాస్త్రంలో నిపుణులు అని మనకు తెలుసు. వారి ప్రధాన శిష్యులలో ఉయ్యక్కొండార్ మరియు కురుగైక్కావలప్పన్ ఇద్దరూ ముఖ్యులు. నాథమునులు యోగశాస్త్రం బోధించాలనుకున్నప్పుడు, ఉయ్యక్కొండార్ ఇలా అన్నారు: “పినం కిడక్క మణం పుణర్వార్ ఉండో?” అంటే — ఇంట్లో శవం ఉన్నప్పుడు పెళ్లి వంటి శుభమైన విషయాలు ఎలా మాట్లాడగలం? అంటే, “సంసారంలో ప్రజలు బాధపడుతుంటే, నేను ఒక్కడే యోగశాస్త్రం నేర్చుకుని, దాని ద్వారా భగవంతుని అనుభవించడం ఎలా సరైనది?” అని ప్రశ్నించారు. వారు “నేను నాలాయిర దివ్యప్రబంధంలోని అన్ని పాశురాలను సంపూర్ణంగా నేర్చుకుని, ఈ లోకంలోని ప్రజలకు బోధిస్తాను. వారు తమ బాధల నుండి విముక్తి పొందాలి” అని ప్రతిజ్ఞ చేశారు. అందుకే ఆయనకు “ఉయ్యక్కొండార్” అనే తిరునామం వచ్చింది. ఉయ్యక్కొండార్ అంటే — ఇతరులను ఉద్ధరించడానికి వచ్చినవారు అని అర్థం.
ఉయ్యక్కొండార్ వాళి తిరునామములు:
వాల వెయ్యోన్ తన్నై వెన్ఱ వడివళగన్ వాళియే
మాల్ మణక్కాల్ నంబి తొళుం మలర్పదత్తోన్ వాళియే
శీలమిగు నాథముని శీర్ ఉరైప్పోన్ వాళియే
శిత్తిరైయిల్ కార్తిగైనాళ్ శిరక్క వన్దోన్ వాళియే
నాలిరెణ్డుమైన్దుమ్ నమక్కు రైత్తాన్ వాళియే
నాలెట్టిన్ ఉట్పొరుళై నడత్తినాన్ వాళియే
మాల్ అరఙ్గర్ మణవాళర్ వళం ఉరైప్పోన్ వాళియే
వైయమ్ ఉయ్యక్కొణ్డవర్ తాళ్ వైయగత్తిల్ వాళియే
వాల వెయ్యోన్ తన్నై వెన్ఱ వడివళగన్ వాళియే
ప్రాతః కాల, బాల సూర్యుడి కాంతిని మించిపోయే అందమైన రూపం కలిగిన ఉయ్యక్కొండార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).
మాల్ మణక్కాల్ నంబి తోళుం మలర్ప్పదత్తోన్ వాళియే
మాల్ అంటే ప్రేమ. ఉయ్యక్కొండార్ల యొక్క శిష్యులు మణక్కాల్ నుండి గారు.ప్రేమ నిండిన మణక్కాళ్ నంబి గారి ద్వారా వారి ఆచార్యులైన ఉయ్యక్కొండార్ల పాద కమలములు పూజించబడుతున్నాయి.అటువంటి ఉయ్యక్కొండార్లకు పల్లాండు.అని ఈ వాక్యం తెలుపుతుంది.ఆచార్యుని వైభవం వారి శిష్యుని పేరుతో స్తుతించడం ఈ వాక్యం ప్రత్యేకత.
శీల మిగు నాథముని శీర్ ఉరైప్పోన్ వాళియే
ఉత్తమ గుణాలలతో అవతరించిన శ్రీమన్నాథమునుల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఉయ్యక్కొండార్ చిరకాలం వర్ధిల్లాలి.
చిత్తిరైయిల్ కార్తిగై నాళ్ శిఱక్క వన్దోన్ వాళియే
చైత్ర మాసంలో కృత్తిక నక్షత్రంలో జన్మించి ఆ నక్షత్రానికే వన్నె తెచ్చిన ఉయ్యక్కొండార్ చిరకాలం పల్లాండుగా వర్ధిల్లాలి
నాలిరణ్డుం ఐయైందుం నమక్కురైత్తాన్ వాళియే
‘నాలిరండు’ (4×2 = 8) — అష్టాక్షరీ మహా మంత్రం.‘అయ్యైందు’ (5×5 = 25) — 25 అక్షరముల గల ద్వయ మహామంత్రం. ఈ రెండు మంత్రాలను మనకు బోధించిన ఉయ్యక్కొండార్ చిరకాలం వర్ధిల్లాలి.
నాలెట్టిన్ ఉట్పొరుళై నడత్తినాన్ వాళియే
‘నాలెట్టు’ (4×8 = 32) — చరమశ్లోకంలోని 32 అక్షరాలు. భగవద్గీతలోని “సర్వధర్మాన్ పరిత్యజ్య…” అనే ఉపదేశం. తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం, ఈ మూడింటిని రహస్య త్రయం అని అంటారు. ఈ మూడు మంత్రములు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనవి మరియు పంచసంస్కార సమయంలో ఆచార్యుని ద్వారా ఉపదేశించబడునవి. వాటి లోతైన అర్థాన్ని గ్రహించి,ఈ లోకంలో ప్రజలను ఉద్ధరించిన ఉయ్యక్కొండార్ చిర కాలం వర్ధిల్లాలి.
మాల్ అరఙ్గ మణవాళర్ వళం ఉరైప్పోన్ వాళియే
తిరువరంగంలో నివసించే శ్రీరంగనాథుడు.ఈ పెరుమాళ్ళని అళగియ మణవాళన్ అని కూడా అంటారు. వారి వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఉయ్యక్కొండార్ చిరకాలం వర్ధిల్లాలి.
వైయమ్ ఉయ్యక్కొణ్డవర్ తాళ్ వైయగత్తిల్ వాళియే
ఈ లోకంలో మానవవులను ఉజ్జీవింప చేసే మార్గంలో నడిపించిన ఉయ్యక్కొండార్ దివ్య చరణారవిందములకు (తిరువడికి) పల్లాండు,
ఆళ్వార్, ఎంబారుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
మూలం : https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-uyyakkondar-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org