పెరియ పిరాట్టి వాళి తిరునామ వైభవం

సేనై ముదళియార్, అంటే విశ్వక్సేనులు, ఒక నిత్యసూరి.
నిత్యసూరులు అంటే — పరమపదంలో నిత్యంగా నివసిస్తూ, ఎప్పటికీ ఎంపెరుమాన్‌కు కైంకర్యం చేసేవారు. వారికి సంసార బంధాలు ఏవీ ఉండవు.
విశ్వక్సేనులు ఈ నిత్యసూరులలో నాయకుడు. ఆయన ఎంపెరుమాన్‌కు సేనాధిపతి, అంటే పరమపదంలో జరిగే అన్ని పాలనా వ్యవహారాలను నిర్వహించే ప్రధాన అధికారి. ఎంపెరుమాన్ తన పిరాట్టులతో, నిత్యసూరులతో, ముక్తులతో పరమానందంలో విరాజిల్లుతుండగా, విశ్వక్సేనులు ప్రధాన మంత్రిలా వ్యవహరించి, అన్ని కార్యాలను సమర్థంగా నిర్వహిస్తాడు.
ఆళవందార్ తన స్తోత్రరత్నం 42లో ఆయనను ఇలా స్తుతించాడు:
“త్వదీయ భుక్తోజ్జిత శేషభోజినా” — అంటే ఎంపెరుమాన్‌కు నైవేద్యం చేసిన అనంతరం వచ్చే శేషప్రసాదాన్ని మొదట స్వీకరించే మహానుభావుడు. అందుకే ఆయనను “శేషాసనర్” అని కూడా పిలుస్తారు — అంటే ఎంపెరుమాన్ శేషప్రసాదాన్ని భుజించే వాడు. ఆయన తిరునక్షత్రం ఐప్పసి పూరాడం (తెలుగులో – ఆశ్వీయుజం / కార్తీకం, పూర్వాషాడ). “జన్మలేని నిత్యసూరులకు తిరునక్షత్రం ఎలా?” అనే సందేహం రావచ్చు. ఎంపెరుమాన్ ఆర్చావతార కాలంలో భూలోకంలో ప్రత్యక్షమైనట్లే, విశ్వక్సేనులు కూడా ఆర్చావతార కాలంలో ప్రత్యక్షమయ్యాడు.
దివ్యదేశాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో, ఎంపెరుమాన్ ఊరేగే వీధులను పర్యవేంక్షించే నగరసోదనై కార్యక్రమాన్ని విశ్వక్సేనులు నిర్వహిస్తాడు. అందువల్ల, సేనై ముదళియార్ శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యులు. పెరియ పిరాట్టి తరువాత మూడవ ఆచార్యులు.
సేనై ముదళియార్ వాళి తిరునామం
ఓఙ్గు తులాప్పూరాడత్తుదిత్త సెల్వన్ వాళియే
ఒణ్డొడియాల్ సూత్తిరవతి యుఱై మార్పన్ వాళియే
ఈఙ్గులకిల్ శడగోపఱ్కు ఇతమురైత్తాన్ వాళియే
ఎళిల్ పిరమ్బిన్ సెఙ్గోలై యేన్దుమవన్ వాళియే
పాఙ్గుడన్ ముప్పత్తుమూవర్ పణియుమవన్ వాళియే
పఙ్గయత్తాళ్ తిరువడియైప్పట్ట్రినాన్ వాళియే
తేఙ్గుపుకళ్ అరఙ్గరైయేశిన్దై సెయ్వోన్ వాళియే
సేనైయర్కోన్ సెఙ్గమలత్తిరువడికళ్ వాళియే
సేనై ముదళియార్ వాళి తిరునామం — వివరణ
ఐప్పసి నెల పూరాడం నక్షత్రంలో ప్రత్యక్షమై, ఎంపెరుమాన్‌కు నిరంతర కైంకర్యం అనే అపారమైన సంపద కలిగిన ఆ మహానుభావుడు చిరకాలం నిలిచి ఉండుగాక.
ఒణ్డొడియాల్ సూత్తిరవతి యుఱై మార్పన్ వాళియే
“ఒణ్డొడియాల్” అంటే అందమైన, వంపులుగల చేతులు కలిగిన అని అర్థం. సూత్రవతి శ్రీ విశ్వక్సేనుల వారి ధర్మపత్ని. అలాంటి వంపులుగల సుందర హస్తాలు కలిగిన సూత్రవతి ఎల్లప్పుడూ నివసించే దివ్యస్థానం — విశ్వక్సేనుల వక్షస్థలం. అందువల్ల, సూత్రవతి ఎల్లప్పుడూ ఆయనతో విడిపోని సహచరిగా ఉంటుందని ఈ వాక్యం సూచిస్తుంది. నమ్మాళ్వార్ కూడా తన పాసురాల్లో “ఒండొడియాళ్” అనే పదాన్ని ఉపయోగించారు. పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి)ను వర్ణించేటప్పుడు,
ఆమెను అందమైన వంపులుగల చేతులు కలిగిన తల్లిగా పిలుస్తారు. పిరాట్టి “అగలగిల్లేన్ ఇరైయుమే” అని చెప్పి ఎంపెరుమాన్ వక్షస్థలాన్ని ఎప్పుడూ విడిచిపెట్టనట్లే, సూత్రవతి కూడా విశ్వక్సేనులను ఎప్పుడూ విడువదు. విశ్వక్సేనులు ఎంపెరుమాన్ యొక్క అంశావతారం అని కూడా చెప్పబడతారు. అనేక దివ్యదేశాల్లో బ్రహ్మోత్సవం ప్రారంభానికి ముందు జరిగే తిరుముళైచ్చారు (విత్తనాలు నాటే శాస్త్రోక్త కార్యక్రమం) విశ్వక్సేనుడి పర్యవేక్షణలోనే జరుగుతుందని ఐతిహ్యం. నగరశోదనై (వీధి పరిశీలన)కు బయలుదేరే ముందు, విశ్వక్సేనులు పల్లకిలో, ఎంపెరుమాన్ వైపు వెనుక భాగం చూపే విధంగా తీసుకెళ్తారు. ఇతర ఆళ్వార్లు, ఆచార్యులు ఉరేగింపు (పురప్పాడు) లో ఎంపెరుమాన్ వైపు ముఖం చూపిస్తారు కానీ విశ్వక్సేనుడు మాత్రం ఎంపెరుమాన్ ప్రతినిధి (ప్రతినిధి స్వరూపం) కావడంతో, వారిని కూడా ఎంపెరుమాన్‌లాగే గౌరవిస్తారు. అంతటి మహిమ వారిది. అందమైన వంపులుగల చేతులు కలిగిన సూత్రవతి ఎల్లప్పుడూ నివసించే దివ్యవక్షస్థలం కలిగిన విశ్వక్సేనుడు ఎప్పటికీ వర్ధిల్లాలి (పల్లాండు)!
ఈఙ్గులకిల్ శడగోపఱ్కు ఇతమురైత్తాన్ వాళియే
శ్రీ విశ్వక్సేనులు ఈ లోకంలో శఠకోపనైన నమ్మాళ్వార్‌కు శ్రేష్ఠమైన ఉపదేశాలను ప్రసాదించినవారు. ఎంపెరుమాన్ స్వయంగా నమ్మాళ్వార్‌కు మయర్వర మతినలం(నిష్కళంకమైన జ్ఞానం) ఇచ్చినప్పటికీ, పంచసంస్కారం చేసి, ఉపదేశం అందించినది విశ్వక్సేనులే. అలాగే, గురుపరంపరలో తన తరువాతి ఆచార్యస్థానాన్ని నమ్మాళ్వార్‌కు అనుగ్రహించినవారు కూడా సేనైముదలియర్. అంతటి మహిమగల విశ్వక్సేనులు నమ్మాళ్వార్‌కు ఉపదేశం చేసి,ఆయనను గురుపరంపరలో స్థాపించినందుకు, అలాంటి సేనైముదలియర్ కల కాలం వర్ధిల్లాలి కావాలి (పల్లాండు)!
ఎళిల్ పిరమ్బిన్ సెఙ్గోలై యేన్దుమవన్ వాళియే
సెఙ్గోల్ (ధర్మదండం), పిరంబు (కర్ర) ధరించి ఎంపెరుమాన్ తరఫున పాలన నిర్వహిస్తూ, ధర్మపాలకుడిగా నిలిచే విశ్వక్సేనులు చిరకాలం నిలిచి ఉండుగాక.
పాఙ్గుడన్ ముప్పత్తుమూవర్ పణియుమవన్ వాళియే
“ముప్పత్తుమూవర్” అనే పదం ప్రతి బ్రహ్మాండంలో ఉన్న ముప్పత్తుమూడు దేవతలను సూచిస్తుంది. అవి: అశ్విని దేవతలు – 2, ద్వాదశ ఆదిత్యులు – 12, ఏకాదశ రుద్రులు – 11, అష్ట వసువులు – 8. ఈ ముప్పత్తుమూడు దేవతలందరూ విశ్వక్సేనుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు. అంతటి మహిమగల, ఈ ముప్పత్తుమూడు దేవతలు సేవించే శ్రీ విశ్వక్సేనుడు చిరంజీవులు కావాలి (పల్లాండు)!
పఙ్గయత్తాళ్ తిరువడియైప్పత్తినాన్ వాళియే
కమలంలో అవతరించిన శ్రీ మహాలక్ష్మి తిరువడులను భక్తితో సేవించే శిష్యుడు విశ్వక్సేనులు. వారు చిరకాలం నిలిచి ఉండుగాక.
తేఙ్గుపుకళ్ అరఙ్గరైయేశిన్దై సెయ్వోన్ వాళియే
శ్రీరంగంలో రెండవ ప్రాకారంలో వారి సన్నిధి ఉంది. ఎల్లప్పుడూ శ్రీరంగనాథుడినే ధ్యానించే ఆ మహానుభావుడు చిరకాలం నిలిచి ఉండుగాక.
సేనైయర్కోన్ సెఙ్గమలత్తిరువడికళ్ వాళియే
సేనాధిపతి, పదైత్తళపతి అయిన విశ్వక్సేనుల యొక్క ఎర్రకమలాల వంటి దివ్యచరణాలు చిరకాలం నిలిచి ఉండుగాక.
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
మూలం : https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-senaimudhaliyar-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org