దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – తొమ్మిదవ భాగం (ఇరామానుశ నూట్రన్దాది)

పూర్తి వ్యాసమాలిక

ఎనిమదవ భాగం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

మన  శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రధానంగా రామానుజ దర్శనం అనే పేరుతో పిలవబడుతూ, ఆదరింపబడుతోంది. మన రామానుజాలవారి మహిమ ఇరామానుశ నూట్రన్దాదిలో విస్తృతంగా కీర్తింపబడింది. దీనిని పరమ కృపతో తిరువరంగత్తు అముదనార్ అనుగ్రహించారు. ముందుగా ఎమ్పెరుమానార్లను అంగీకరించక, కేవలం లోకాసక్తి వ్యాపారాలలో మాత్రమే ఉన్న తిరువారంగత్తు అముదనార్ ను, పెరియ పెరుమాళ్ భక్తునిగా మార్చినది రామానుజలవారి కృపే.

అనంతరం, తిరువరంగత్తు అముదనార్ రామానుజలవారికి పరమ భక్తులగా మారి, తమ జీవితం మొత్తం ఎమ్పెరుమాన్ కోసం మాత్రమే గడిపారు. 

ప్రపన్న గాయత్రి 

మనవాళ మామునిగళ్ ఇరామానుశ నూట్రన్దాదికి  సంక్షిప్తమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అందులో  వారు-  బ్రాహ్మణుడికి 108 గాయత్రీ జపముప్రధానమైనట్టు, శ్రీవైష్ణవునికి ఇరామానుశ నూట్రన్దాది అత్యంత ముఖ్యమైనది, గాయత్రీకి సమానం అని సాయించారు. 

అందువలన దీన్ని ప్రపన్న గాయత్రీ అని పిలుస్తారు. కాబట్టి, ప్రతి శ్రీవైష్ణవుడు దీన్ని ప్రతి రోజు జపించవలెనని విశేషంగా సూచించబడింది. ఇరామానుశ నూట్రన్దాదిలో 108 పాశురాలు ఉన్నాయి. ఆ 108 పాశురాలలో ప్రతి పాశురంలో అముదనార్ రామానుజుల తిరునామంను చాలా అద్భుతంగా అమర్చారు. దీన్ని జపించినప్పుడు రామానుజుల తిరునామాన్ని 108 సార్లు పలుకే అవకాశం లభిస్తుంది.

పాశురం-1

పూమన్ను మాదు| పొరున్దియ మార్బన్|పుగళ్ మలిన్ద 
పామన్ను మాఱన్| అడి పణిన్దు ఉయ్ న్దవన్| పల్ కలైయోర్ 
తామ్ మన్న వన్ద ఇరామానుశన్ శరణారవాన్దమ్|
నామ్ మన్న వాళ్| నెఞ్జే శొల్లువోమ్| అవన్ నామఙ్గళే ||

అర్థం: ఓ మనసా! తామర పుష్పంలో ఆసీనురాలైన శ్రీ మహాలక్ష్మీ ఎవరి వక్షస్థలంలో వేంచేసి ఉంటారో, వారి వైభవాన్ని ఎల్లప్పుడూ పాడినవారు (స్తుతించినవారు) నమ్మాళ్వార్లు. వారి శ్రీ పాదములను ఆశ్రయించి ఉజ్జీవించినవారు శ్రీ రామానుజుల వారు. అట్టి రామానుజులు వారి పాదపద్మములను శరణువేడి, వారి తిరునామమును ఎల్లప్పుడూ కీర్తించు.

గమనించవలసిన విషయం ఏమిటంటే, అముదనార్ పాశురాన్ని నేరుగా రామానుజలవారితో ప్రారంభించలేదు.

 పాశురం అందంగా “పూమన్ను మాధు పోరుందియా మార్బన్” అని ప్రారంభమవుతుంది. దీని అర్థం ఎమ్పెరుమాన్  హృదయంలో (వక్షస్థలం) కూర్చున్న మహాలక్ష్మి అని.
తర్వాత, అముదనార్ చెబుతారు  – “పుగళ్ మలింద పామన్ను మారన్” అని, తన హృదయంలో  పద్మంలో ఉన్న వారిని స్తుతించే ప్రసిద్ధమైన నమ్మాళ్వార్ గురించి.
అందుకనే, తరువాతే అముదనార్ రామానుజులను గౌరవిస్తూ, “మాఱన్ అడి పణిన్దు ఉయ్ న్దవన్” అని, మారన్ (నమ్మాళ్వార్) పాదపద్మాలకు తాను సమర్పించుకున్నవాడుగా తెలిపి, ఓ మనసా! అతని పేరును కీర్తించు – “రామానుశన్”.

ఈ పాశురం  ఎమ్పెరుమాన్ హృదయంలో కూర్చున్న తాయార్ నుండి ప్రారంభించి, నమ్మాళ్వార్ ఎవ్వరికీ శరణాగతి చేశారో,  ఎవ్వరికి రామానుజుల వారు  శరణాగతి చేశారో, మరియు చివరగా నా మనసు చేసిన శరణాగతి వరకు కొనసాగే పరంపరను చూపిస్తుంది.

అన్ని పాశురాలు అద్భుతమైన వరుసలో కొనసాగుతాయి, వాటిలో రామానుజ తిరునామం అద్భుతంగా అమర్చబడింది.

అముదనార్ తన పాశురాలలో మొత్తం ఆచార్య భక్తిని విశేషంగా ప్రతిపాదిస్తారు.
ఒక పాశురంలో: “మొళియై క్కడక్కుమ్ పెరుమ్ పుకళాన్”  అని, తమ ఆచార్యలు కూరత్తాళ్వాన్ యొక్క మహిమలను పదాలు వర్ణించలేవు; ఎవరితోనూ పోల్చలేని లేని  కూరత్తాళ్వాన్, మూడు రకాల అహంకారాన్ని అధిగమించారు – అంటే విద్యామదం, ధనమదం, మరియు అభిజాత్యమదం (ఉన్నత సామాజిక స్థితి వల్ల కలిగే అహంకారం).
కూరత్తాళ్వాన్  అత్యంత గౌరవనీయ కుటుంబంలో జన్మించి, సంపదలో ధనవంతులు, పండితుడు; ఇంతకీ ఆయన ఆచార్య రామానుజులు  కూడా ఆయనను గౌరవించేవాడు. అయినా, కూరత్తాళ్వాన్ వద్ద అహంకారం ఏమీ లేదు.
ఈ గుణం అముదనార్ ని ఆశ్చర్యపరిచింది, అందుకే ఆయన తన ఆచార్య కూరత్తాళ్వాన్ ని మహిమాన్వితంగా ప్రస్తావిస్తున్నారు.
తమ ఆచార్యవారిలో ఇతరుల హృదయాల నుండి దుఃఖాలను తొలగించే అద్భుతమైన గుణం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. 

ఈ అద్భుత రచన “ఇరామానుశ నూట్రన్దాది” ద్వారా అముదనార్ రామానుజుల మరియు ప్రతి అళ్వార్‌ల మధ్య ఉన్న అతి పవిత్రమైన సంబంధాన్ని అర్దంగా చూపించగలిగారు.

ఈ తరువాతి పాశురాలు మన సంప్రదాయంలో అత్యంత వైభవాన్ని పొందాయి. 

పాశురం- 45

పేఱు ఒన్ఱు మర్ట్రు ఇల్లై| నిన్ శరఱ్ అన్ఱి| అప్పేఱు అళిత్తఱ్కు
ఆఱు ఒన్ఱుమ్ ఇల్లై| మర్ట్రు అచ్చరణ్ అన్ఱి| ఎన్ఱు ఇప్పొరుళై
తేఱుమ్ అవర్ క్కుమ్ ఎనక్కుమ్ ఉనైతన్ద శెమ్మై శొల్లాల్|
కూఱుమ్ పరమన్ఱు|  ఇరామానుశ| మెయ్ మ్మై కూఱిడిలే||

ఈ పాశురంలో రామానుజులవారు లేకపోతే, తాము ఏమి కాము అని ఆముదనార్ సాయిస్తున్నారు. 

పాశురం- 76

నిన్ఱ వణ్ కీర్తయుం| నీళ్ పునలుం| నిఱై వేఙ్గడ ప్పొన్
కున్ఱముం వైకున్దనాడుం| కులవియ పాఱ్కడలుమ్|
ఉన్ఱనక్కు ఎత్తనై ఇన్బం తరుం ఉన్ ఇణై మలర్ త్తాళ్|
ఎన్ఱనక్కుం అదు| ఇరామానుశా| ఇవైఈన్దరుళే||

అర్ధం- ఈ పాశురంలో, రామానుజుల పై ధ్యానం చేయుట ద్వారా దివ్యదేశాలులో పొందే సమస్త దివ్య అనుభవాలను పొందవచ్చని, వారి పాదపద్మాలు (తిరువడి) జీవితం యొక్క పరమ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి అదే తిరువడి ఉపకరిస్తుందని సాయించారు. 

తాము పూర్తిగా రామానుజుల కృపపై ఆధారపడి ఉన్నట్లు, ఇతర ఏ మార్గం లేకుండా ఉన్నట్లు చూపించారు. 

పాశురం- 98

ఇడుమే| ఇనియ శువర్ క్కత్తిల్| ఇన్నుమ్ నరకిల్ ఇట్టు
చ్చుడుమే| అవర్ట్రై త్తొడర్ తరు తొల్లై| శుళల్ పిఱప్పిల్
నడుమే ఇని నమ్ ఇరామానుశన్ నమ్మై నమ్ వశత్తే 
విడుమే| శరణమెన్ఱాల్| మనమే| నైయల్ మేవుదఱ్కే||

అముదనార్ రామానుజులవారు అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తపరిచారు. .
ఎవరైనా రామానుజల శరణాగతి చేస్తే, వారు ఆ ఆత్మ  స్వర్గానికి, కానీ నరకానికి వెళ్ళకుండా, జన్మ మరణ చక్రాన్ని వదిలి పరమపదంకు తీసుకెళ్లుతారని చెప్పారు. 

ఈ విధంగా రామనుజులవారు జీవులకు పరమపదం చేర్చడంలో ప్రధాన భూమిక వహిస్తున్నట్లు  అముదనార్లు ఈ ప్రబంధం ద్వారా స్పష్టం చేసారు. 

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్ 

ఆధారం:  https://www.youtube.com/live/W4vjhU2FUlo?si=eFYneOKITgOVfmdG

ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-9/

కోశం : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment