ఆర్తి ప్రబంధం – 48

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 47

పరిచయము:

మునుపటి పాశురములో, భక్తులకు అన్ని రకాల కైంకర్యాలు చేయడం గురించి మాముణులు ప్రస్తావించారు. “ఇరామానుజాయ నమః” అనే మంత్రాన్ని ధ్యానించేటప్పుడు, కైంకర్యం చేయాలనే కోరికను, సంకల్పాన్ని ఎవరు ఇచ్చారో వారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాశురములో శ్రీ రామానుజులకు, వారి దాసులకు కైంకార్యం చేయమని, తనకు ఇంద్రియాలను, అవయవాలను అనుగ్రహించినది పెరియ పెరుమాళ్ళేనని వివరిస్తున్నారు. ఈ విషయాన్ని వారు మిక్కిలి సంతోషముతో తెలియజేస్తున్నారు.

పాశురము 48:

ఎణ్ణదు ఎన్నెంజం ఇశైయాదు ఎన్ నావు ఇరైంజాదు శెన్ని
కణ్ణానవై ఒన్ఱుం కాణలుఱా కలియార్ నలియ
ఒణ్ణాద వణ్ణం ఉలగు అళిత్తోన్ ఎతిరాశన్ అడి
నణ్ణాదవరై అరంగేశర్ శెయ్ద నలం నమక్కే!!!

ప్రతి పద్ధార్ధములు:

నణ్ణాదవరై – శరణు వేడుకోని వ్యక్తులు ఉన్నారు
ఎతిరాశన్ అడి –  శ్రీ ఎంబెరుమానార్ల దివ్య తిరువడి
అళిత్తోన్ – రక్షించారు
ఉలగు – ఈ లౌకిక
కలియార్ – కలియుగ వాసులు, మనస్సాక్షి ఉన్నవారు
నలియ ఒణ్ణాద వణ్ణం –  కలి క్రూరత్వంలో చిక్కుకోకుండా
ఎన్నెంజం – (అటువంటి వాళ్ళ పట్ల) నా మనస్సు  ఉండదు
ఎణ్ణదు – వాటి గురించి ఆలోచించు
ఎన్ నావు – నా వాక్కు
ఇశైయాదు – వారి గురించి ఉండదు, అది మాట కానీ / ప్రశంస కానీ.
శెన్ని– నా శిరస్సు
ఇరైంజాదు – తల వంచను (వాళ్ళ యందు).
కణ్ణానవై – నా కళ్ళు
ఒన్ఱుం కాణలుఱా – ఏదీ చూడను (వాటికి సంబంధించినవి).
అరంగేశర్ –  దానితో సంబంధించిన చింతన, ఇంద్రియాలను నాకు పెరియ పెరుమాళ్ళు అనుగ్రహించారు.
శెయ్ద నలం నమక్కే – ఈ ఇంద్రియాలు వేరొకరికి లోబడి ఉండవు.  శ్రీ రామానుజులు మాత్రమే వాటికి అర్హులు. ఈ గొప్ప సహాయం కేవలం నంపెరుమాళ్ళ  ఆశీర్వాదము ద్వారానే సాధ్యమైంది.

(కలియార్ నలియ ఒణ్ణాద వణ్ణం ఉలగు అళిత్తోన్ ఎతిరాశన్ – ఈ వాఖ్యానికి “క్రూరమైన కలి తీవ్రత నుండి ప్రపంచాన్ని రక్షించిన శ్రీ రామానుజ” అని కూడా అర్ధము చెప్పుకోవచ్చు.

సరళ అనువాదము:

శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలకు శరణాగతి చేయని వాళ్లని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, అతని మనస్సు, కళ్ళు, నోరు మరియు శిరస్సు అవి చేయవలసిన పనులను చేయవని మాముణులు తెలుపుతున్నారు. తన కళ్ళు వారిని చూడవు, తల వంచదు, మనస్సు ఆలోచించదు, నోరు వాళ్ళ గురించి మాట్లాడదని వివరిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళు శ్రీరంగరాజుల అనంత కృపతో ఈ అనుగ్రహ అవకాశం తనకు లభించిందని కీర్తిస్తున్నారు.

వివరణ: 

“తాళ్వొన్ఱిల్లా మఱై తాళ్ందు తల ముళుదుం కలియే ఆళ్గిన్ఱ మాళ్వందాలిత్తవన్” అని ఇరామానుశ నూఱ్ఱందాది 16వ పాశురములో వివరించినట్లుగా,” క్రూరమైన కలి క్రోధము నుండి ఈ ప్రపంచాన్ని ఎంబెరుమానార్లు రక్షించారు”, అని మాముణులు వివరిస్తున్నారు. మన అంతిమ గమ్యం సాధనము రెండూ ఎంబెరుమానార్ల దివ్య తిరువడియే అని ఇరామానుశ నూఱ్ఱందాది 16వ పాశురములో “పేర్ ఒన్ఱు మఱ్ఱిల్లై” అని చెప్పబడింది. దీనిని గ్రహించక ఎంబెరుమానార్ల తిరువడి యందు శరణాగతి చేయని వారి పట్ల నా ఇంద్రియాలు మరియు అవయవాలు వేరే విధంగా ప్రవర్తిస్తాయి. “నైయుం మనం అన్ గునంగళై ఎణ్ణి”, “నిత్యం యతీంద్ర (యతిరాజ వింశతి 4)” లో వర్ణించినట్లు నా మనస్సు ఉప్పొంగి ఎంబెరుమానార్ల అద్భుత గుణానుభవంలో మునిగిపోతుంది. కానీ ఎంబెరుమానార్ల తిరువడి యందు శరణాగతి చేయని వాళ్ళ విషయానికి వస్తే, ఇంద్రియాలతో పాట్లు నా మనస్సు కూడా ఆలోచించడం, ప్రశంసించడం, మాట్లాడటం, చూడటం మానేస్తాయి. పెరియ పెరుమాళ్ళు శ్రీ రంగరాజుల దివ్య కృపయే నా ఈ ప్రవర్తనకు కారణం. “నణ్ణాదవరై అరంగేశర్ శెయ్ద నలం” తో కలిపి ఉపయోగించిన “నలం” అనగా ఇక్కడ “సంపద” అని అర్ధం. “మనః పూర్వో వాగుత్తరః” అనే వాఖ్యము ప్రకారం, మన నోటితో మన మనస్సు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది, మన మనస్సు బుద్ది తమ ఆలోచనలను మాటల ద్వారా తెలియపరచుతాయి.  అయినప్పటికీ, “నావియల్ ఇశై మాలైగళ్ యేత్తి” అని తిరువాయ్మొళి  4.5.4 వ పాశురములో చెప్పినట్లు నా నోరు వారి గురించి మాట్లాడదు, కీర్తించదు. “ప్రణమామి మూర్ధ్నా (తనియన్ కూరత్తాళ్వాన్లు అనుగ్రహించిన)” లో చెప్పిన్నట్లుగా శ్రీ రామానుజులకు  నమస్కరిస్తున్న నా శిరస్సు ఎప్పటికీ వాళ్ళని నమస్కరించదు. “కాణ్ కరుదిడుం కాణ” అని ఇరామానుశ నూఱ్ఱదాది 102 వ పాశురములో మరియు “శ్రీ మాధవాంగ్రి” అని యతిరాజ వింశతి 1వ పాశురములో వివరించినట్లుగా, నా కళ్ళు వాళ్ళని ఎప్పటికీ చూడవు. “కాలియార్” అనే పదము కలి యుగానికి స్వరూపము. “ఏవినార్ కలియార్” అని పెరియ తిరుమొళి 1.6.8వ పాశురములో వివరించినట్లుగా, కలి ప్రభావాలు చాలా శక్తివంతమైనవి, అవి తమ హృదయాలలో భయాన్ని కలిగించి వారిని భయంతో వంచుకునేలా చేస్తాయి. 

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-48/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment