ఆర్తి ప్రబంధం – 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 46

పరిచయము:

మాముణులు సంతోషంగా “ఎతిరాశర్ క్కాళానోం యాం” అని పలికి, “రామానుజ” అనే దివ్య నామము యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని ఆశిస్తున్నారు. గతంలో “మాకాంత నారణనార్”,  “నారాయణన్ తిరుమాల్” అని చెప్పినట్లుగా ఇది “నారాయణ” అనే దివ్య నామము కంటే చమత్కారమైనది, భిన్నమైనదని మాముణులు వివరిస్తున్నారు.

పాశురము 47:

ఇరామానుశాయ నమవెన్ఱు ఇరవుం పగలుం శిందిత్తిరా
మానుశర్గళ్ ఇరుప్పిడం తన్నిల్ ఇఱైప్పొళుదుమిరా
మానుశర్ అవర్ క్కు ఎల్లా అడిమైయుం శెయ్యవెణ్ణి
ఇరా మానుశర్ తమ్మై మానుశరాగ ఎంకొల్ ఎణ్ణువదే

ప్రతి పద్ధార్ధములు:

మానుశర్గళ్ – కొంత మంది ఉన్నారు
ఇరా – చేయనివారు
ఇరవుం పగలుం – రాత్రింబగళ్ళు
శిందిత్తు  – ధ్యానిస్తూ
ఇరామానుశాయ – శ్రీ రామానుజ
నమవెన్ఱు –  “ఇరామానుశాయ నమః” అని జపిస్తూ  (“నేను నా కోసము కాదు రామానుజుల కోసము అని”)
మానుశర్ అవర్ క్కు – కొంత మంది (కూరత్తాళ్వాన్ల వంటి వారు)
ఇరా – జీవించని వారు
ఇఱైప్పొళుదుం – ఒక్క అణు క్షణము కూడా
ఇరుప్పిడం తన్నిల్ – పైన పేర్కొన్న వాళ్ళు ఉన్న దేశము (రాత్రింబగళ్ళు “ఇరామానుశాయ నమః” అని జపిస్తూ ఉండని)
మానుశర్ తమ్మై – మనుషులు
ఇరా – చేయనివారు
శెయ్యవెణ్ణి– ఆచరించు
ఎల్లా అడిమైయుం – అన్ని రకాల కైంకర్యములు (కూరత్తాళ్వాన్ల వంటి వారికి),
మానుశరాగ ఎంకొల్ ఎణ్ణువదే – వారిని మనుషులుగా ఎలా పరిగణించవచ్చు, అవి కేవలం ఆవులతో సమానమైనవి.

సరళ అనువాదము:

మూడు వర్గాల మనుషులు ఉంటారు. మనకి సరళంగా ఉండడం కోసం వారిని A వర్గము, B వర్గము, C వర్గము అని పిలుద్దాం. A వర్గము వాళ్ళూ “ఇరామానుశాయ నమః” అని రాత్రింబగళ్ళు జపించని వాళ్ళు. B వర్గము వాళ్ళు A వర్గము వాళ్ళతో సహవాసము చేయరు. B వర్గము వాళ్ళ ఉదాహరణ మనము కూరత్తాళ్వాన్లను తీసుకోవచ్చు. చివరి వర్గము C వాళ్ళు  B వర్గము వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించడంలో విఫలమై వారికి కైంకార్యం చేయటానికి ఇష్టపడరు. వర్గము C వాళ్ళని మనుషులుగా ఎలా పరిగణించగలమని మాముణులు ప్రశ్నిస్తున్నారు, వాస్తవానికి వాళ్ళు కేవలం పశువుల వంటి వాళ్ళు, వారి పనుల బట్టి వాళ్ళు ఆవు వంటి వారని వివరిస్తున్నారు.

వివరణ: 

“ప్రతి ఒక్కరూ ‘ఇరామానుజాయ నమః’ అన్న పవిత్ర మంత్రాన్ని ఏక ధాటిగా ప్రతి నిత్యము జపించాలి” అని మాముణులు వివరిస్తున్నారు. పెరియ తిరుమోళి 1.1.15 – “నళ్ళిరుళ్ అళవుం పగలుం నాన్ అళైప్పన్” లో తిరుమంగై ఆళ్వార్లు  వివరించిన విధంగా దీనిని అందరూ పగలు రాత్రి తేడా లేకుండా ఆచరించాలి.  అయినప్పటికీ, ఇది పఠించని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.”ఇరామానుజాయ నమః” అన్న పవిత్ర మంత్రాన్ని ధ్యానించని అటువంటి వాళ్ళ మధ్య ఉండకూడదని మనము గ్రహించాలి. ఆవుతో పోల్చదగిన ఈ వర్గపు వారితో ఎటువంటి అనురాగము లేదా ఆప్యాయత ఉంచుకో కూడదు. శాస్త్రం  నియమాలను అనుసరించేవారు (కూరత్తాళ్వాన్ వంటివారు), ఈ రకమైన వాళ్ళతో ఎన్నడూ సహవాసము చేయకూడదు. రెండవది, “ఇరామానుజాయ నమః” అన్న ఈ పవిత్ర మంత్రాన్ని ధ్యానించని మునుపటి వర్గము వారితో సంబంధం లేని ఈ వ్యక్తుల గొప్పతనాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మరియు అభినందించడం చాలా ముఖ్యం. తిరువరంగత్తముదనార్లు “ఎత్తొళుంబుం సొల్లాల్ మనత్తాల్ కరుమతినాల్ సెయ్వన్ సోర్విన్ఱియే” అని ఇరామానుశ నూఱ్ఱందాది 80వ పాశురములో వెల్లడిజేసినట్లు, అటువంటి ఉన్నత ఆత్మలకు నిత్యము కైంకర్యము చేయడానికి ప్రయత్నించాలి, పరితపించాలి.  “మానిడవరల్లర్ ఎన్ఱే ఎన్ మనత్తే వైతేన్” అని వివరించినట్లుగా అటువంటి ఉన్నత వ్యక్తులకు కైంకార్యం చేయని వ్యక్తులను, ఆవులతో పోల్చదగినవారని సెలవిస్తున్నారు. మాముణులు చివరకు తనను తాను ఒక ప్రశ్న అడిగి ముగిస్తున్నారు. “ఇరామానుజాయ నమః” అన్న ఈ పవిత్ర మంత్రాన్ని ధ్యానించని వారితో సాంగత్యము చేయని వారికి కైంకర్యము చేయని ఇటువంటి వాళ్ళని మనుషులుగా నేను ఎలా పరిగణించాలి?  నేను వారిని ఎప్పుడూ మనుషులుగా ఊహించలేను”, అని మాముణులు ముగిస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-47/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment