ఆర్తి ప్రబంధం – 46

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 45

పరిచయము:

మునుపటి పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తించారు, వారి దయ వల్లనే తాను ఉద్దరింపబడ్డారని వివరించారు. ఈ పాశురములో, వారు దానిని మరింత లోతుగా వివరిస్తున్నారు.

పాశురము 46:

తిరువాయ్మొళి ప్పిళ్ళై తీవినైయోందమ్మై
గురువాగి వందు ఉయ్యక్కొండు – పొరువిల్
మది తాన్ అళిత్తరుళుం వాళ్వన్ఱో నెంజే
ఎతిరాశర్కు ఆళానోం యాం

ప్రతి పద్ధార్ధములు:

నెంజే– ఓ నా మనసా!!!
యాం– మనము
ఆళానోం – వారి సేవకులుగా మారాలి
ఎతిరాశర్కు – ఎంబెరుమానార్ల

(దానికి కారణం)
తిరువాయ్మొళి ప్పిళ్ళై – తిరువాయ్మొళి ప్పిళ్ళై (మాముణుల ఆచార్యులు)
గురువాగి – ఆచర్యులుగా అవతరించారు
వందు – మనము ఉన్న ప్రదేశానికి వచ్చారు
తీవినైయోందమ్మై – వాస్థవానికి మనము క్రూరమైన పాపపు మేఘము వంటి వాళ్ళము
ఉయ్యక్కొండు – వారి కృప ద్వారా స్వీకరింపబడ్డాము మరియు “ఉద్ధరింప తగినది” గా భావించబడ్డాము
అళిత్తరుళుం – వారు మనల్ని ఆశీర్వదించారు
మది తాన్ – తిరుమంత్ర జ్ఞానంతో వికసించే జ్ఞానం
పొరువిల్– ఇది సాటిలేనిది
వాళ్వన్ఱో – (ఓ నా మనసా!!!) ఈ గొప్ప అవకాశం వల్ల కాదా? (ఖచ్చితముగా వారి వల్లనే మనం ఎంబెరుమానార్ల దాసులుగా మారాము.

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. వారు తాను ఉన్న చోటికి వచ్చి తిరుమంత్రాన్ని ప్రసాదించినందువల్ల, తాను ఆ శ్రీమన్నారాయణ దాసులకు దాసునిగా నిలవగలిగారని వివరిసున్నారు.

వివరణ: 

ఇక్కడ మొదట తిరువాయ్మొళి పిళ్ళై గొప్పతనం వివరించబడింది. శ్రీమన్నారాయణుని యొక్క భక్తులకు (‘భూసురులు’ (ఈ ప్రపంచంలోని  దివ్య జీవులు) అని కూడా పిలువబడే శ్రీవైష్ణవులకు) తిరువాయ్మొళి అనెడి దివ్య ప్రబంధము మధువు వంటిదని, దాని గురించి నమ్మళ్వార్లు స్వయంగా “తొణ్డర్ క్కముదుణ్ణచ్చొల్ మాలైగళ్ సొన్నేన్ (తిరువాయ్మొళి 9.4.9)”లో వివరించారు. తిరువాయ్మొళి పిళ్ళై అనే ఒక ఆచార్య పురుషులు తిరువాయ్మొళిని ఊపిరిగా  పీల్చుకుని, అందులోనే జీవిస్తుండేవారు. వారు దానిలోని వివిధ రకాలైన మాధుర్యాలను ఆస్వాదించగలిగారు. 1) ఆ ప్రబంధ పదాల అమరిక నుండి వచ్చే మాధుర్యము, 2) వాటి అర్థాల నుండి వచ్చే మాధుర్యము, 3) పాశురాలలో నుండి ఉట్టి పడే రస అనుభవ మాధుర్యము వంటివి అనేకము వారు అతిమధురముగా అనుభవించినారు. వారు తిరువాయ్మొళి యొక్క ఉద్దేశ్యంతో జీవించారు, మిగతా అన్ని శాస్త్రాలను గడ్డిపోచతో సమానముగా భావించేవారు. వారు నమ్మాళ్వార్ల దివ్య పాద పద్మాలకు శరణాగతులై అన్ని వేళలా వారికి అనేక కైంకర్యాలు చేసేవారు. తిరువాయ్మొళితో ఉన్న అనుబంధం ద్వారా వారు ప్రపంచానికి సుపరిచితులు కాబట్టి, వారు “తిరువాయ్మొళి పిళ్ళై” గా ప్రసిద్దికెక్కారు. మాముణులు తమ హృదయంతో ” ఓ నా ప్రియమైన హృదయమా! మనల్నిద్దరినీ చూడు. “ఒప్పిల్లాత్ తీవినైయేనై ఉయ్యక్కొండు (తిరువాయ్మొళి 7.9.4)” లో వివరించిన విధంగా మనము క్రూరమైన పాపాల పుట్టకి సూచకముగా ఉన్నాము. తిరువాయ్మొళి పిళ్ళై అచార్యునిగా అవతరించి మమ్మల్ని విముక్తి చేశారు”, “తేనార్ కమల త్తిరుమామగళ్ కొళునన్ తానే గురువాగి” అని మాముణులు  స్వయంగా దీనిని తమ ఉపదేశ రత్న మాల 61 పాశురములో ఉల్లేఖించారు. “వారు మనమున్న చోటికి వేంచేసి, తిరుమంత్రం మూల ప్రవాహముగా వచ్చిన జ్ఞానాన్ని మనకిచ్చారు. ఇది ఇతర శాస్త్రముల నుండి వచ్చిన జ్ఞానానికి భిన్నంగా ఉంటుంది. హే నా మనసా! ఈ గొప్ప అవకాశం వల్ల మనం ఉద్ధరించబడి, మన ఆచార్యులైన ఎంబెరుమానర్లను సేవించే సువర్ణావకాశం మనకు  లభించించి కదా? కచ్ఛితముగా మనకు ఈ అవకాశం లభించడానికి ఏకైక కారణం వారే. శ్రీమన్నారాయణుని దాసులకు దాసులుగా ఉండుటయే తిరుమంత్రంలో తెలియజేయబడిన పరార్థము. ఈ వాస్తవాన్ని గ్రహించినందువల్ల, మనము ఎంబెరుమానర్ల నిత్య దాసులముగా మారాము”.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-46/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment