శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పరిచయము:
మునుపటి పాశురములో, మాముణులు “మాకాంత నారణణార్ వైగుం వగై” వాఖ్యములో సర్వవ్యాపి శ్రీమన్నారాయణ గురించి వివరిస్తున్నారు. ఈ పాశురములో, తాను మునుపటి పాశురములో వివరించిన విధంగా అత్యల్పులైన “మోహాంతకులు”లో తాను ఒకరని భావిస్తున్నారు, అనగా, శ్రీమన్నారాయణ అవగాహన లేని, అంధకార ఒంటరి తనాలను మాత్రమే చూసే వారి సమూహంలో తానూ ఒకరని, అత్యల్పమైన వ్యక్తిగా తనను తాను భావిస్తున్నారు. సర్వవ్యాపి శ్రీమన్నారాయణను, అతడితో తన నిత్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యాడని, అందుకని మోహాంతకులలో ఒకడు అయ్యాడని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇది కేవలము ఆచార్య సంబంధము వల్లనే తాను ఉద్ధరించబడ్డారని మాముణులు తన మనస్సుకి గుర్తుచేస్తున్నారు. ఇది ఈ పాశురములోని ముఖ్య అంశము.
పాశురము 45:
నారాయణన్ తిరుమాల్ నారం నాం ఎన్నుం ముఱై
ఆఱాయిల్ నెంజే అనాది అన్ఱో – శీరారుం
ఆచారియనాలే అన్ఱో నాం ఉయ్ందదు ఎన్ఱు
కూశామల్ ఎప్పొళుదుం కూఱు
ప్రతి పద్ధార్ధములు:
నెంజే – ఓ నా మనసా!!!
నారాయణన్ తిరుమాల్ – “తిరుమాలే నానుం ఉనక్కు పళవడియేన్”, అన్న వాఖ్యములో చెప్పబడినట్లుగా శ్రియః పతి శ్రీమన్నారాయణుడే సమస్థ ఆత్మలకు అధిపతి. “నారం” అని సమిష్టిగా పరిగణిస్తారు.
నారం నాం – మనము నిత్య ఆత్మలము.
ఆఱాయిల్ – ఒకవేళ అది నిరూపించబడాలంటే
ఎన్నుం ముఱై – ఆ నిత్య సంబంధము (శ్రీమన్నారాయణ ఆత్మల మధ్య)
అనాది అన్ఱో – ఇది నిన్నటి మొన్నటి నుండి మొదలైనదా? కాదు. అది శాశ్వతమైనదనుట నిజము కాదా? (అవును ఇది నిజమే)
(ఓ నా మనసా!!!)
శీరారుం – ఆ సంబంధాన్ని (మనకు) చూపించి బలపరచిన ఒక వ్యక్తి, అదే వ్యక్తి జ్ఞానము ఇత్యాది ఎన్నో శుభ లక్షణాలతో సంపూర్ణుడు.
ఆచారియనాలే అన్ఱో – వారు ఆచార్యులు. అది వారి వల్ల కాదా?
నాం ఉయ్ందదు ఎన్ఱు – మనము విముక్తి పొందటానికి కారణం ఖచ్చితంగా వారే.
(ఓ నా మనసా!!!)
కూఱు – దయచేసి వాటి గురించి చెప్పుతూ ఉండుము
ఎప్పొళుదుం – అన్ని సమయాల్లో
కూశామల్ – ఏ బిడియము లేకుండా
సరళ అనువాదము:
ఈ పాశురములో, మాముణులు శ్రీమన్నారయణకు ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని పునః స్థాపించి, బలపరచే వ్యక్తి అయిన ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఈ ఉద్దరణకి ముందు, ఏ అవగాహనలేని ఒక నిర్జీవునిగా ఉండేవాడని తెలుయజేస్తున్నారు. అందువల్ల, కేవలము ఆచార్య కృప వల్లనే ఉద్ధరించబడ్డారని తలచమని మాముణులు తన హృదయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వివరణ:
“హే! ప్రియమైన నా హృదయమా !!! “తిరుమాలే నానుం ఉనక్కు పళవడియేన్ (తిరుప్పల్లాండు 11)” గురించి పెరియాళ్వార్లు ప్రస్తావించారు అని మాముణులు చెబుతున్నారు. ఆతడు శ్రియః పతి, శ్రీకి దివ్య పతి శ్రీమన్నారాయణుడు. మనల్ని (ఆత్మలు) “నారం” అంటారు. శ్రీమన్నారాయణ ఆత్మల మధ్య సంబంధం శాశ్వతమైనది, అనాది నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది . ఈ సంబంధ మూలము గురించి పరిశోధిస్తే, ఈ సంబంధం నిన్న లేదా కొంతకాలం క్రితం సృష్టించబడినది కాదని మనకి తెలుస్తుంది. ఇది అనాది కాలం నుండి ఉంది, కనుక ఇది సృష్టించినది కాదు పరమ నిత్యమైనది. అయినప్పటికీ, మనము (మాముణులు, వారి మనస్సు) దీనిని గ్రహించలేదు, ఈ సంబంధం గురించి పట్టించుకోక, దాని గురించి ఎటువంటి జ్ఞాన విచారణ చేయలేకపోయాము. ఈ సంబంధాన్ని గ్రహించగల సామర్థ్యం లేని అచేతనులు లాగా ఉండేవాళ్ళము. మన ఆచార్యులు ఈ సంబంధాన్ని మనకు అర్థం చేయించి మనలో దాని ప్రాముఖ్యతను బలపరచాక అంతా మారిపోయింది. జ్ఞానం, శుభ గుణాలతో నిండిన ఉన్న మహా పురుషులు అచార్యులు. కేవలం మన ఆచార్యుల చేత మాత్రమే మనము ఉద్ధరింప బడ్డాము. “పెరుమైయుం నాణుం తవిర్ందు పిదఱ్ఱుమిన్ (తిరువాయ్మొళి 3.5.10)”లో చెప్పినట్లుగా, దయచేసి ఈ వాస్తవం గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకునేలా బహిరంగంగా మాట్లాడండి” అని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రమేయ సారము “ఇఱైయుం ఉయిరుం” 10 వ పాశురములో వివరించబడింది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-45/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org