రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 81- 90

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్శిక

యెనభై ఒకటవ పాశురము:  తాను ఎలా సరిదిద్దబడ్డానో తలంచుకుంటూ తనను తాను ఎంబెరుమానార్లకి సమర్పించుకొని, వారి కృపకు సమానమైన ఏదీ లేదని అముదనార్లు తెలుయజేస్తున్నరు.

శోర్విని ఉందన్ తుణై అడిక్కీళ్‌ । తొండు పట్టవర్ పాల్‌
శార్విన్ఱి నిన్ఱ ఎనక్కు* అరంగన్‌ శెయ్య తాళ్‌ ఇణైగళ్‌
పేర్విన్ఱి ఇన్ఱు పెఱుత్తుమిరామానుశ  ఇనియున్‌
శీరొన్ఱియ కరుణైక్కు। ఇల్లై మాఱు తెరివుఱిలే (81)

లౌకిక విషయాసక్తి లేకుండా, మీ దివ్య చరణ సంబంధము ఉన్న వారి పట్ల నాకు ఆసక్తి ఉండేది కాదు.  ఓ రామానుజ! పెరియ పెరుమాళ్ళ నల్లని దివ్య తిరుమేనికి విరుద్దమైన రంగుతో ఉన్న,  ఒకదానికొకటి సంపూర్ణతనిచ్చే వారి ఎర్రని దివ్య పాదములను ఈ వేళ నాకిచ్చితిరి. దీనిని మనము తరచి చూస్తే, నీ గొప్ప దయకు సమానమైనదేదీ లేదు.

యెనభై రెండవ పాశురము: పెరియ పెరుమాళ్ళ దివ్య తిరువడి పట్ల భక్తి అనురాగములు పెంచుకోమని ఆదేశించిన రామానుజులు గౌరవనీయులు అని అముదనార్లు  పరమానందముతో తెలియజేస్తున్నారు.

తెరివుత్త ఞ్ఙాలం శిఱియ ప్పెఱాదు । వెన్ తీవివైయాల్‌
ఉరువత్త ఞ్ఙానత్తు ఉళల్గిన్న ఎన్నై* ఒరు పౌళుదిల్‌
పొరువత్త కేశ్వియన్ ఆక్కి నిన్ఱాన్ ఎన్న పుణ్ణియనో !
తెరివుత్త కీర్‌త్తి । ఇరామానుశన్ ఎన్నుం శీర్‌ ముగిలే॥ (82)

సత్ మరియు అసత్ అనెడు విషయములకు సంబంధించి స్పష్థత లేకుండా ఉండినాను. కృరమైన కర్మల కారణముగా సరైన మార్గదర్షకత్వము లేక లభములేని జ్ఞానముతో లక్ష్యం లేని ప్రయాణము చేస్తుండగా,  కీర్తి ప్రఖాతులు కలిగిన నల్లని మేఘమువంటి రామానుజులు, క్షణకాలములో అసమానమైన జ్ఞానముతో నన్ను మనిషిని చేశారు. అతను ఎంతటి పుణ్యాత్ముడు!

యెనభై మూడవ పాశురము: శరణాగతి చేయుట అందరికీ సంబంధించినది కాదా? అని ఎంబెరుమానార్లు ప్రశ్నించినపుడు, భగవానుడికి శరణాగతి చేసి శ్రీవైకుంఠానికి చేరుకునే వాళ్ళ సమూహానికి తాను చేందిన వాడు కాదని, ఎంబెరుమానార్లు యొక్క ఔదార్యముతో వారి దివ్య చరణాలను చేరు మోక్షాన్ని పొందుతానని అముదనార్లు వివరిస్తున్నారు.                                                  

శీర్‌ కొండు పేరఱమ్ శెయ్ దు । నల్వీడు శెఱిదుం ఎన్ను౦
పార్‌ కొండ మేన్మైయర్‌ కూట్టనల్లేన్ * ఉన్పద యుగమామ్
ఏర్‌ కొండ వీట్టై ఎళిదినిల్‌ ఎయ్దువన్ ఉన్నుడైయ
కార్ కొండ వణ్మై । ఇరామానుశ ఇదు కండు కొళ్ళే॥ (83)

ఓ రామానుజ! తమ సొంతంగా ఏమీ చేయలేని లక్షణము కలిగినవారు, తమ బాహ్య మరియు అంతర్గత ఇన్ద్రియములను నియంత్రించుకొని మహోన్నత పుణ్యకార్యమైన భగవానుడికి శరణాగతి చేసి, విశిష్ట ప్రయోజనమైనటువంటి శ్రీవైకుంఠము చేరుకునే వారి జట్టులో నేను లేను. నీ దివ్య పాదముల ఉన్నత మొక్షమును నేను సునాయాసముగా చేరుకుంటాను. దానికి కారణమేమిటంటే, భేదము చూపకుండా కురిసే వర్షపు మేఘము లాంటి ఔదార్య స్వభావము మీలో ఉన్నవారు కాబట్టి. దీనిని మీరే చూడగలరు.

యెనభై నాల్గవ పాశురము: భవిష్యత్తులో తాను పొందవలసిన ప్రయోజనాలు ఎన్నో ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పటికే తాను పొందిన ప్రయోజనాలకు పరిమితి లేదని తెలుపుతున్నారు.

కండు కొెండేన్ ఎం ఇరామానుశన్ తన్నై। కాండలుమే
తొండు కొండేన్ అవన్ తొండర్‌ పొన్ తాళిల్ ఎన్ తొల్లె  వెన్నోయ్‌
విండు కొండేన్ అవన్ శీర్‌ వెళ్ళ వారియై వాయ్మడుత్తు  ఇన్ఱు
ఉండు కొండేన్ । ఇన్నం ఉత్తన ఓదిల్‌ ఉలప్పిళ్లియే॥ (84)

నన్ను రక్షించడానికి వచ్చిన నా స్వామి ఎంబెరుమానార్ని నేను దర్శించాను. వారిని చూసిన పిదప, వారి కోసమే జీవించు వారి దాసుల అందమైన దివ్య చరణములకు దాసుడనైనాను. అనాదిగా నాతో ఉన్న నా అతి కృరమైన కర్మలను తొలగిపోయాయి. వారి దివ్య మంగళ గుణాల సాగరాన్ని నేను సంపూర్ణముగా ఆనందించాను. వారు నాకు చేసిన ఉపకారములకు అంతులేదు.

యెనభై ఐదవ పాశురము: “రామానుజులను యదార్థముగా దర్శించానని మీరు  చెప్పారు. వారి దాసుల దివ్య పాదముల సేవకుడనని కూడా చెప్పారు. ఈ రెండిటిలో దేనిలో మీ ప్రమేయము ఎవ్వువ ఉంది?” కేవలము రామానుజుల కోసమే జీవించే వారి దివ్య పాదాలే ఈ ఆత్మకి శరణు అని వారు తెలుపుతున్నారు.

ఓదియ వేదత్తిన్ ఉట్పొరుళాయ్ । అదనుచ్చిమిక్క
శోదియై  నాదనెన అఱియాదుళల్గిన్ఱ తొండర్‌*
పేదైమై తీర్‌త్త ఇరామానుశనై త్తొళ్లుం పెరియోర్‌।
పాదం అల్లాల్‌ ఎన్ తన్ ఆరుయిర్‌క్కు యాదొన్ఱుమ్‌ పత్తిల్లైయే॥ (85)

వేదముల అంతరార్థము భగవానుడని, వేదాంతములలో పేర్కొన్నట్టుగా వారు అనంత తేజస్సు గలవాడని తెలియనివారు కూడా ఉన్నారు. లక్ష్యములేని గమనము సాగిస్తూ లౌకికులకు దాసత్వము చేస్తున్న వాళ్ళ అజ్ఞానాన్ని ఎంబెరుమానార్లు తొలగించారు. అటువంటి ఎంబెరుమానార్ల దివ్య తిరువడిని సేవించే గొప్ప గుర్తింపుగల వారి దివ్య చరణములు తప్పా నా ఆత్మకు శనణు లేదు అని అముదనార్లు వివరిస్తున్నారు.

యెనభై ఆరవ పాశురము: ప్రాపంచిక వ్యవహారాలలో పాల్గొంటున్న వారి పట్ల ఆయనకున్న ఆప్యాయతను జ్ఞప్తి చేసుకుంటూ, ఇకపై ఆ ప్రవర్తనను మానుకొని రామానుజులను ధ్యానించువారే తనను ఏలేందుకు సరైనవారని చెబుతున్నారు.        

పత్తా మనిశర్లై ప్పత్తి । అప్పత్తు విడాదవరే
ఉత్తార్‌ ఎన ఉళ్ళన్దు ఓడి నైయేన్ ఇని ఒళ్ళియ నూల్‌
కాత్తార్‌ పరవుం ఇరామానుశనై కరుదుం ఉళ్ళం
పెత్తార్‌ ఎవర్। అవర్‌ ఎమ్మై నిన్ఱాళుం పెరియవరే॥ (86)

గౌరవము లేని అల్పులను చేరి, ప్రేమానురాగములను వీడక వాళ్ళు నా బంధువులను కొని, వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తు వాళ్ళ వెనక పరుగిడి, చివరికి ఆ విషయాలలో నా హృదయము ముక్కలైనది. నేను ఇకపై అలాంటి వారిని వెంబడించను. శాస్త్రములను నేర్చుకున్నవారిచే భక్తితో కీర్తింపబడే వారు ఎంబెరుమానార్లు. వంశము, పుట్టుతో సంబంధము లేకుండా నిరంతము ఎంబెరుమానార్ల యొక్క చింతన చేస్తూ వారిని తమ హృదయములో దాచుకున్నవారే తనను ఏలేవారు.

యెనభై యేడవ పాశురము: ఇది కలి కాలమని గుర్తుచేస్తూ, కలి తన నిష్థను కదిలించి వేస్తుందని గుర్తుచేసినపుడు, ఎంబెరుమానార్లు మనకందించిన జ్ఞానాన్ని అనుసరించని వారిపైనే కలి ప్రభావము ఉండునని తెలుపుతున్నారు.

పెరియవర్‌ పేశిలుం  పేదైయర్‌ పేశిలుమ్। తన్ కుణంగట్కు
ఉరియ శొల్‌ ఎన్ఱుం ఉడైయవన్ ఎన్ఱు ఎన్ఱు * ఉణర్విల్ మిక్కోర్
తెరియుం వణ్‌ కీర్‌త్తి ఇరామానుశన్ మఱై తేర్‌ందులగిల్‌
పురియుం నల్‌ జ్ఞానం । పొరుందాదవరై ప్పొరుం కలియే॥ (87)

జ్ఞానము మరియు సమర్థత ఉన్నవారు, జ్ఞానము అసలు లేనివారు ఇరువురూ, రామానుజుల గురించి పరిపూర్ణముగా మాట్లాడలేరు. ఎందుకనగా జ్ఞానము మరియు సమర్థత ఉన్నవారు వారిని సంపూర్ణముగా వర్ణించలేరు. జ్ఞానము లేనివారు వారి అజ్ఞానము అసమర్థత కారణముగా వర్ణించలేరు.  రామానుజులు గొప పాండిత్యము గలవారిచే వారి స్వరూప, రూప, గుణాలకు తగిన పదాలతో స్తుతింపబడే గొప్ప ఖ్యాతిగలవారు. వేదముల నుండి సేకరించబడిన గొప్ప జ్ఞానమును రామానుజులచే ఉపదేశింపడిన వారిని కలి  బాధించదు.

యెనభై అనిమిదవ పాశురము: సింహము లాంటి ఎంబెరుమానార్లు ఈ భూమిపైన అవతరించి, పులులలాంటి కుదృష్థులను నాశనము చేయు విధానమును తాను కీర్తిస్తాను అని చెబుతున్నారు.

కలి మిక్క శెన్నెల్ కళ్ళనిక్కుఱైయల్‌ । కలై ప్పెరుమాన్‌
ఒలిమిక్క పాడలై ఉండు।  తన్నుళ్ళం తడిత్తు * అదనాల్‌
వలి మిక్క శీయం ఇరామానుశన్ మఱై వాదియరాం
పులి మిక్కదెన్ఱు । ఇప్పువనత్తిల్‌ వందమై పోత్తువనే॥ (88)

వ్యవసాయ పనుల సందడితో సమృధ్ధమైన ఎర్రటి వరిని పండించే పొలాతో కూడిన తిరుక్కురయలూర్కి నాయకుడు తిరుమంగై ఆళ్వార్, వారు శాస్త్రములను ప్రతిబింబించే దివ్య ప్రబంధములను పాడిన ప్రఖ్యాతి గలవారు. అటువంటి తిరుమంగై ఆళ్వార్ల తిరుమొళిని సంగీత స్వరాలతో కూర్చి ఆస్వాదించి గర్వపడినవారు ఎంబెరుమానార్లు. వేదములకు తప్పుడు అర్థములను ప్రచారము చేసి ఈ ప్రపంచాన్ని పతనము చేయు పులుల వంటి అనేక కుదృష్థులను నాశనము చేయుటకు ఈ భూమిపైన అవతరించిన ఎంబెరుమానార్లని నేను స్తుతిస్తాను.

యెనభై తొమ్మిదవ పాశురము: తాను ఎంబెరుమానార్లని స్తుతిస్తానని మునుపటి పాశురములో చెప్పారు.  తన ప్రశంస గురించి భయపడుతూ ఎంబెరుమానార్లకు తనను తాను సమర్పించుకుంటున్నారు.

పోత్తరుం శీలత్తు ఇరామానుశ। నిన్ పుగళ్‌ తెరిందు
శాత్తువనేల్‌ అదు తాళ్వదు తీరిల్ ‌* ఉన్ శీర్‌ తనక్కోర్‌
ఏత్తం ఎన్ఱే కొండిరుక్కిలుం ఎన్‌ మనం ఏత్తి అన్ఱి
ఆత్తగిల్లాదు  ఇదఱ్కెన్ నినైవాయ్‌ ఎన్జిట్టంజువనే॥ (89)

ఓ రామానుజ! నీ గొప్ప గుణాలను పూర్తిగా ప్రశంసించలేము ! నీ శుద్ద మంగళ గుణాలను అర్థము చేసుకొని చెప్పడానికి సాహసిస్తే అది నీకు అవమానమాత్రంగానే తోచును. నీ శుద్ద మంగళ గుణాలను కదిలించక నేను మాట్లాడకుండా ఉంటేనే వాటికి ఆ గొప్పదనము ఉంటుందని నాకు తెలిసినా, నా మనస్సు నీ  గొప్ప గుణాలను స్తుతించకుండా ఉండలేదు. మీరు దీన్ని ఎలా పరిగణిస్తారో నాకు భయంగా ఉంది.

తొబ్బైయవ పాశురము: భయము తొలగాలని కరుణ పూరిత దృష్థితో రామానుజులు అతనిని చూశారు. భయము తొలగిన పిదప, మంచి జ్ఞానము ఉన్నవారు కూడా  మనసా వాచా కర్మణా ఏ రకముగానైన రామానుజులను స్తుతించి తమను తాము ఉద్దరించుకోకుండా ఈ దుఃఖకరమైన జనన మరణ చక్రములో చిక్కుకొని ఉన్నారు అని అముదనార్లు జాలిపడుతున్నారు.

నినైయార్‌ పిఱవియై నీక్కుం పిరానై। ఇన్నీళ్‌ నిలత్తే
ఎనై ఆళవంద ఇరామానుశనై * ఇరుంగవిగళ్‌
పునైయార్‌ పునైయుం పెరియవర్‌ తాళ్గళిల్‌  పూందొడైయల్‌
వనైయార్ పిఱప్పిల్‌ వరుందువర్‌ మాందర్‌ మరుళ్‌ శురందే॥ (90)

రామానుజులను స్తుతిస్తే వారి జనన మరణ చక్రాన్ని వారు తొలగించగలరని ఆలోచించేవారు ఎవరూ లేరు. సమస్థ ప్రపంచము వారి అధీనములో ఉండగా నన్ను వెతుక్కుంటూ వచ్చిన రామానుజుల గొప్ప గుణాలను వర్ణిస్తూ పద్యాన్ని రచించగల వారెవరూ లేరు. అటువంటి రామానుజుల గుణాలను వర్ణిస్తూ పాశుర మాలలు  అల్లేవారెరు లేకపోయినా, రామానుజుల గొప్ప గుణాలను వర్ణిస్తూ పాశుర మాలలను పడేవారి పాదాల వద్ద పుష్పమాలలను సమర్పించు వారెవరూ లేరు. మనిషిగా జన్మించిన వాళ్ళు ఈ సమర్థత కలిగి ఉన్నా, వాళ్ళు అజ్ఞానము కారణముగా జన్మ మరణ చక్రములో  చిక్కుకుపోయి ఉన్నారు.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-81-90-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment