తిరువెళుకూట్ఱిరుక్కై – 2వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 1వ భాగము

ఈ రెండవ భాగములో రైతు తన చేనులోని కలుపును తీసినట్లు భగవంతుడు తాను సృజించిన లోకములను పాడు చేస్తున్న రాక్షసులను తొలగించాడని ఆళ్వార్లు పాడుతున్నారు.

 1-2-3-2-1 (1-2)

ఒరు ముఱై ఇరు శుడర్ మీదినిల్ ఇయఙ్గా

ముమ్మతిళ్ ఇలంగై ఇరుకాల్ వళైయ

ఒరు శిలై ఒన్ఱియ ఈర్ ఎయుత్తు అళల్వాయ్

వాలియిన్ అట్టనై

ప్రతిపదార్థము:

ఇరు శుడర్ – సూర్యచంద్రులు

మీదినిల్ ఇయఙ్గా – ఉన్నతమైన పరిధిలోకి

ఇలంగై – లంకాపురి

ఒరు ముఱై – భయముతో

ముమ్మదిళ్ –  మూడు ప్రాకారములు గల (జల,పర్వత,అటవి)

అట్టనై – (నీవు) నాశనము చేశావు

ఒరు శిలై – సారంగము

ఇరుకాల్ వళైయ – రెండంచులు వొంపు తిరిగి

వాలియిన్ – బాణములు సంధించగా

ఒన్ఱియ ఈర్ ఎయుత్తు – విల్లులోని రెండు పళ్ళ మధ్య సర్దుకొని

అళల్వాయ్ – నిప్పులు చెరిగిన

భావము: రెండు వైపుల మెలి తిరిగిన అసమానమైన ధనుస్సును చేపట్టి, నిప్పులు గ్రక్కే రెండంచులు గల బాణమును సంధించి, సూర్య చంద్రులు కూడా తొంగిచూడటానికి భయపడే లంకను తుత్తునియలు(నాశనం) చేశావు.

సంకల్ప మాత్రముననే   బ్రహ్మను సృష్టించిన నువ్వు శతృసంహారమునకు  మాత్రము  యుద్ధరంగమున ఎదురుగా నిలబడి అస్త్ర ప్రయోగము చేశావు.

పిరాట్టి (సీత)ని  నీ నుండి తనను దూరము చేసిన రాక్షసుడిని సంహరించలేదు. ఆమె కొరకు నువ్వు రాక్షస సంహారము చేశావు.  అలాగే,  నీ నుండి నన్ను దూరము చేసిన ఈ సంసారం, అవిద్య, కర్మ, వాసనా, రుచి అనే శతృవుల నుండి నువ్వు నన్ను  రక్షించాలి.

pt388-rama-ravana-courtesy-crafts-of-india-2

వ్యాఖ్యానము:

‘భీషో దేతి సూర్య:’ (పరమాత్మ  మీది భక్తి, వినయము, వలన సూర్యుడు ఉదయిస్తున్నాడు). లంకలో రావణుడి మీది భయము వలన తనప్రతాపమును చూపడు. (నైనం సూర్య: ప్రతాపతి – శ్రీ రామాయణము). ఆళ్వార్లు చంద్రుడికి కూడా ఇదే సూత్రమును ఆపాదిస్తున్నారు.

ఇలంగై –  (అమ్మణ కూత్తడిక్కుం )

ఇరుకాల్ వళైయ ఒరు శిలై ఒన్ఱియ ఈర్ ఎయుత్తు అళల్వాయ్ వాలియిన్ అట్టనై:    రెండువైపుల మెలి తిరిగిన అసమానమైన ధనుస్సును చేపట్టి, నిప్పులు గ్రక్కే రెండంచులు గల బాణమును సంధించి, సూర్య చంద్రులు కూడ తొంగిచూడటానికి భయపడే లంకను తుత్తునియలు చేసిన ఘనుడవు.

అళల్వాయ్ వాలి:  ధనుస్సులో  సంధించినపుడు అది బాణము. శతృవు పై  పడినపుడు అది నిప్పు.

 వాలియిల్  అట్టనై: అయనై ఈన్ఱనై’:   బ్రహ్మను సంకల్పమాత్రమున సృష్టించావు. రావాణుడిని సంహరించడానికి  మాత్రము  ఎదురుగా వచ్చినిలబడ్డావు.

 ఒరు ముఱై … అట్టనై – సీతా పిరాట్టి కొరకు రావణుని సంహరించినట్లు,   నా కొరకు ఈ సంసారము మరియు కర్మ అనే శతృ వులను తొలగించు.

అడైంద అరువినైయోడు అల్లల్ నోయి పావం
మిడైందవై మీణ్డ్దొళియ వేణ్డిల్ – నుడంగిడైయై
మున్ ఇలంగై వైత్తాన్ మురణ్ అళియ మున్ ఒరు నాళ్
తన్ విల్ అం కై వైత్తాన్ శరణ్”    (ముదల్ తిరువంతాది-59)

 పొయ్ ఘై ఆళ్వార్లు తమ   ‘ముదల్  తిరువందాది’ 59 వ పాశురములో కూడా ఇదే విషయమును స్పష్టముగా చెప్పారు.

ఇనుము స్వతహాగా వేడిగా, ఎర్రగా వుండదు. నిప్పుతో చేరడం చేత దానికి    ఆ లక్షణములు వస్తాయి. అలాగే ఆత్మ అచిత్తుతో(దేహము) చేరటము చేత  కర్మ (గత జన్మలలో చేసిన పాపపుణ్యములు),  వాసన గత జన్మలలో చేసిన పాపములు),  రుచి(పాప కర్మములమీది ఆసక్తి) ఇవన్నీ ‘అరు వినై’ తొలగించు కోవటానికి సాధ్యము కానివి అని ఆళ్వార్లు అంటున్నారు.

 మీణ్డు ఒళియ వేణ్డిల్ –    వీటిని  సమూలముగా తొలగించు కోవాలనుకుంటే   అంతటి బలవంతుడి కాళ్ళ  మీద పడటము  తప్ప  వేరే  దారి లేదు.

 నుడంగిడైయై:    పరమాత్మను చాలాకాలము వీడి ఉండడం వలన అలసిపోయి  నడుము సన్నబడింది (వైరాగ్యము).

 మున్ ఇలంగై వైత్తాన్ మురణ్ అళియ :  పూర్వము రావణుడు సీతను చెరపట్టాడు. రాముడు వాడిని చంపాడు.

 మున్ ఒరు నాళ్ తన్ విల్ అం కై వైత్తాన్ శరణ్ :   తన అందమైన చేతులను ధనుస్సు మీద ఉంచిన వాడే (రాముడు) మనకు శరణు.

మురణ్ అళియ విల్ అంకై వైత్తాన్ శరణ్:  ‘అందమైన చేతులు’- బాణము వలన రావణుడు చనిపోలేదట-  ఆ బాణమునకు  రాముడి అందమైన చేతులు తగలటము వలన రావణుడు చనిపోయాడట.

నుడంగిడైయై  మున్ ఇలంగై వైత్తాన్ :    భగవంతుడిది అయిన. మనది కాని,  ఆత్మను మనదని అనుకుంటాము.  అలాగే రావణుడు తనదికాని పిరాట్టిని  తనదనుకున్నాడు.

భారము భగవంతుడి మీద ఉంచిన వారిని ఆయనే రక్షిస్తాడు.  పిరాట్టిని రక్షించాడు కదా.

పరమాత్మతో పిరాట్టికి ఎటువంటి సంబంధమున్నదో,  జీవాత్మలకు కూడా అదే సంబంధము ఉన్నదని మనము తెలుసుకోవాలి.

అదే సమయములో మనము పరమాత్మను ఆశ్రయించేటప్పుడు పిరాట్టి యొక్క పురుషకారము అవసరము.

 “నుడంగిడైయయి”  తో మొదలయిన   ముదల్ తిరువందాది పాశురము ఈ విషయాన్నే స్పష్టీకరిస్తుంది.

తిరుమంగై ఆళ్వార్  తిరువెళుకూట్ఱిరుక్కై   ప్రబంధమును  “ఒరు పేర్ ఉంది” తో ప్రారంభించారు.  ఏమీ లేని స్థితి నుంచి అన్నీ సృష్టించిన  నీకు ఈ సంసారములో ఉన్న నన్ను రక్షించడం కష్టము కాదు.

రెండవ భాగములో  “ఒరు ముఱై ” లో నీకు పిరాట్టికి మధ్య నిలిచిన రావణుని సంహరించావు. కావున నన్ను రక్షించడం నీకు కష్టముకాదని ఆళ్వార్లు అంటున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/06/thiruvezhukurrirukkai-2/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment