తిరువెళుకూట్ఱిరుక్కై 11వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 10వ భాగము

1-2-3-4-5-6-7-] 6-5 – 4-3-2-1

అఱు వగైచ్చమయముం అఱివరు నిలైయినై
ఐంపాల్ ఓదియై ఆగత్తు ఇరుత్తినై
అఱముదల్ నాంగవైయాయ్ మూర్త్తి మూన్ఱాయి
ఒన్ఱాయి విరిందు నిన్ఱనై

ప్రతి పదార్థము:

అఱు వగైచ్చమయముం – ఆరు రకముల తత్వవేత్తలు

అఱివరు – అర్థము చేసుకోలేరు

నిలైయినై – నీ తత్వము అటువంటీది

ఐంపాల్ ఓదియైపిరాట్టి కురులు ఐదు రకముల కురులకు సంకేతము

ఆగత్తు ఇరుత్తినై – ఆమెను నీ హృదయసీమలో నిలిపినవి

 అఱముదల్ నాంగవైయాయ్ – నాలుగు పురుషార్థ్హములు (ధర్మ,అర్థ,కామ.మోక్షము )ఇవ్వగలవాడవు

 మూర్త్తి మూన్ఱాయి – త్రిమూర్తులకు అంతర్యామివి

 ఇరువగైప్పయనాయి – కర్మానుసారముగా సుఖదుఖముల  నిచ్చు వాడు

ఒన్ఱాయి విరిందు నిన్ఱనై – ప్రళయ కాలములో ఏకమూర్తిగా ఉండి సృష్టి కాలములో అంతటా విస్తరించి

భావము:

భగవంతుడి ఐశ్వర్యము (పరత్వము) గురించి ఈ భాగములో చెపుతున్నారు.

భగవంతుడిని విస్మరించి, ఆరు రకముల తత్వములను అనుసరించేవారికి ఆయనను చేరుకోవటము అసాధ్యము. శ్రీదేవి నీ హృదయసీమలో కూర్చుని పురుషకారము చేయుటకు సిద్దముగా ఉంది. త్రిమూర్తులకు అంతర్యామివి నీవే. కర్మానుసారముగా సుఖఃదుఖఃముల నిచ్చు వాడవు నీవే.  ప్రళయ కాలములో నువ్వు ఒక్కడివీ ఈ సృష్టి కాలములో అనేకములుగా మారి నామ రూపముల నిస్తావు.

కావున నిన్ను పొందలేక పోవటము ఉండదు.

వ్యాఖ్యానము:

అఱువగైచ్చమయముం అఱివరు నిలైయినై చార్వాక,  బౌద్ద,  శమణులు,  నైయాయిక వైశేషిక (తార్క్కికులు),  సాంఖ్య,  పాశుపతులు మొదలైన వారు నిన్ను అంగేకరించరు. అలాంటివారికి నువ్వు అర్థము కావు అని ఆళ్వార్లు అంటున్నారు.

ఐంపాల్ ఓదియై ఆగత్తు ఇరుత్తినై (ఐదు శుభలక్షణములు గల శ్రీదేవి కురులు) ఉంగరాలు తిరిగి, సువాసనతో, మెరుస్తూ, వత్తుగా, మెత్తగా ,నల్లగా ఉండే శ్రీదేవి కురులు.

ఆగత్తు ఇరుత్తినైహనుమ (తిరువడి) పిరాట్టి చే సరిదిద్దబడ్డాడు. పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమ   కార్యం కరుణమార్యేణ   న కశ్చిత్ నాపరాద్యతి “ [రామాయణం యుధ్ధ కాణ్దము 116-44]       

‘ఓ వానరా! లోకములో తప్పు చేయని వారే ఉండరు’ అని పిరాట్టి చెప్పింది. ఆమె సదా నీ హృదయ సీమను అలంకరించి వుంటుంది.  ఆమె పురుషకారము వలననే దాసుల వంటివారు నీ సన్నిధికి చేరుకొగలుగుతారు. మంగైయర్ ఇరువరుం వరుడ”. కిందటి భాగములో  ఉభయ దేవేరులను గురించి చెప్పారు. ఇక్కడ హృదయ పీఠమునలంకరించిన  శ్రీదేవి,  స్వామి ఐశ్వర్యము (పరత్వము),  సౌలభ్యము, అందము మొదలగు గుణములకు కారణమంటున్నారు.

pApAnAm_va

అఱం ముదల్ నాంగవైయాయ్ఐశ్వర్యాది నాలుగు పురుషార్థములు-అవి  ధర్మము/దయ, ఐశ్వర్యము/వస్తువులు,    సంతోషము/ఆనందము, శ్రీ వైకుంఠము.

దేవేంద్ర స త్రిభువనం అర్థమేకపింగ:

సర్వార్ది త్రిభువనగాం చ కార్థవీర్య: |

వైదేహ: పరమపదం ప్రసాధ్య విష్ణుం

సంప్రాప్థ: సకల పల ప్రదోహి విష్ణు: ||” [విష్ణు ధర్మం 43-47]

(విష్ణువును పూజించటము వలన దేవేంద్రుడు మూడు లోకములను,   కుభేరుడు సంపదను,   కార్త వీర్యుడు మూల్లోకములలో  కీర్తిని,  జనక మహారాజు పరమపదమును పొందగలిగారు. చేతనులకు నాలుగు  పురుషార్థములను ఇవ్వగలిగిన వాడు  విష్ణువు ఒక్కడే.  అసలు పురుషార్థములు ఆయనే అని ఆళ్వార్లు అంటున్నారు.

మూర్తి మూన్ఱాయి  బ్రహ్మా, రుద్రఇంద్రులలో అంతర్యామిగా ఉండి సృష్టి,  రక్షణ, లయ కార్యము చేసేది విష్ణు మూర్తి.

సృష్టి  స్థితి  అంతకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం |

స సంజ్యాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్ధన: ||”   [విష్ణు పురాణం 1-2-66]

 సృష్టి, రక్షణ,లయ కార్యములను  జనార్ధనుడే చేస్తున్నాడు అని  పరాసర ఋషి  విష్ణు పురాణములో అంటున్నారు.

 ఇరువగైప్ పయనాయి –  సుఖఃదుఃఖములనే రెండు కర్మలను నియంత్రిచువాడు అతడే.

ఒన్ఱాయి విరిందు నిన్ఱనై –  ప్రళయ కాలములో సమస్త పదార్థములు నామరూపాలు లేకుండా శ్రీమన్నారాయణుని బొజ్జలో అతుక్కొని వుంటాయి.   దినినే సదేవఅని [చాందొగ్యోపనిషద్ 6-2-1],లో అన్నారు. మళ్ళీ సృష్టి కాలములో ఆయనే  బహు స్యాం” [చాందొగ్యోపనిషద్ 6-2-3]  అని సంకల్పించిన వెంటనే అనేకములుగా విడి పోతాయి.

ప్రళయ కాలములోను, సృ ష్టి కాలములోను,  చేతనాచేతనములన్నీ ఆయనలో భాగమే.  పరమాత్మ ఒక్కడే సత్యము.  ఆయన తనలో ఉన్న చేతనాచేతనముల వలన కళంకములేవీ అంటని వాడు.

 ‘అఱమ్  ముదల్  నుండి  ఇక్కడి దాకా పరమాత్మ ఐశ్వర్యము  (పరత్వము) గురించి చెప్పారు.  ఆళ్వార్లు పరమాత్మ ఐశ్వర్యమును (పరత్వము) కారణముగా చూపి అది నీ వద్ద  ఉనందున నిన్ను నేను వదులుకోలేను అంటున్నారు.

    ఇక్కడి దాకా రథము ఆకారములో సంఖ్యలు వచ్చాయి. తరువాతది,  ఆఖరిది అయిన భాగములో ఆళ్వార్లు  తిరుక్కుడందై పెరుమాళ్ళను శరణాగతి చేస్తున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-11/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment