శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
పాశుర అవతారిక:
వేదములో చెప్పబడిన భాగవతశేషత్వము యొక్క సారమును తిరువాయిమొళి 3.7 “పయిలుం శుడరొళి” లోను, తిరువాయిమొళి 8.10 “నెడుమాఱ్కడిమై” దశకములలోను స్పష్టముగా చెప్పారు. ఆ విషయమును ఈ పాశురములో మధురకవి ఆళ్వార్లు పాడుతున్నారని నంజీయర్ల అభిప్రాయము.
నమ్మాళ్వార్ల కరుణ ఎలాంటిదని మధురకవి ఆళ్వార్లను అడిగితే, ఎంపెరుమాన్ తిరువాయిమొళి 3.3.4లో చెప్పినట్లుగా “నీశనేన్ నిఱై ఒన్ఱుం ఇలేన్, నం కణ్ పాశం వైత్త పరం శుడర్చోతిక్కే” (నీచుడిని, సుగుణములేమీ లేని వాడిని. అయినా భగవంతుడు నాపై కృపను చూపడము వలన , కీర్తి మంతుడయ్యాడు.) అని చెప్పారు. అని నంపిళ్ళై అభిప్రాయము.
పెరియవాచ్చాన్ పిళ్ళై : లోకములో నమ్మాళ్వార్ల కరుణ కృప అన్నింటికన్నా గొప్పది ఎలా అయిందని మధురకవి ఆళ్వార్లను అడగగా దానికి వారు నమ్మాళ్వార్లు దాసుడి దోషములను గణించక వేద సారమును అనుగ్రహించటము చేత అని చెప్పారు. నమ్మాళ్వార్లు తిరువాయిమొళి 3.3.4 “నీశనేన్ నిఱై ఒన్ఱుం ఇలేన్, నం కణ్ పాశం వైత్త పరం శుడర్చోతిక్కే”( నీచుడను ఏగుణములు లేని వాడిని పరమాత్మ దాసుడిపై దయ చూపడము చేత మరింతగా ప్రకాశిస్తున్నాడు.) అని భగవంతుడి పరముగా చెప్పిన విషయమును మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల విషయములో చెప్పారు.
అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్: వెనకటి పాశురములో నమ్మాళ్వార్లు తనపై కృప చేయటము చేత వారిని 6వ పాశురములో కీర్తించానని చెప్పుకున్నారు. 7వ పాశురములో తన దోషాలను, పాపాలను పూర్తిగా తొలగించారని అందుచేత నమ్మాళ్వార్ల కీర్తిని నలుదిశల చెపుతూ తిరుగుతానని అన్నారు. 8వ పాశురములో నమ్మాళ్వార్ల దయ, భగవంతుడి కన్నా గొప్పదని చెప్పారు. నమ్మాళ్వా ర్లు తనకు ఙ్ఞాన ప్రధానము చేసిన విషయము గురించి ఈ పాశురములో చెపుతున్నారు. 4వ పాశురములో ఆచార్యులపై తనకున్న విశ్వాసమును, 5వ, 6వ పాశురములలో ఆచార్య వైభవమును , ఉప కార వైభవమును వివరించారు. వేదసారమును అనుగ్రహించటము చేత నమ్మాళ్వార్ల శ్రీపాదములే ఉత్తారకముగా భావించి సేవిస్తాను అని ఈ పాశురములో ఆచార్యుల పట్ల కృతఙ్ఞతను తెలియ జేస్తున్నారు.
పాశురము-9
మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుళ్
నిఱ్కప్పాడి ఎన్ నెంజుళ్ నిఱుత్తినాన్
తక్క సీర్ శటకోపన్ ఎన్నంబిక్కు
ఆళ్ పుక్క కాతల్ అడిమైప్పయన్ అన్ఱే
ప్రతి పర్థదాము:
మిక్క వేదియర్ వేదత్తిన్ = వేదమును అధ్యయనము చేసిన వైదికులు
ఉళ్పొరుళ్ = అంతరార్థము
నిఱ్క = దృఢముగా
ప్పాడి = తిరువాయిమొళిని పాడి
ఎన్ నెంజుళ్ = నా హృదయములో
నిఱుత్తినాన్ = నిలిపాడు
తక్క సీర్ = తగిన విధముగా
శటకోపన్ ఎన్నంబిక్కు =ఉన్నతులైన శఠకోపులకు
ఆళ్ పుక్క = సేవ చేయు
కాతల్ = కోరిక
అడిమైప్పయన్ అన్ఱే = నెరవేరినది
భావము:
వేదములోని రహస్యార్థములను ఇమిడ్చిన తిరువాయిమొళిని వైదికులతో కలసి పాడటము వలన, శఠకోపులకు సేవ చేయాలను కోరిక నెరవేరినదని అంటున్నారు.
నంజీయర్ వ్యాఖ్యానము:
* మిక్క వేదియర్: భగవంతుడికి సంబంధించిన అపారమైన ఙ్ఞానము, భక్తి కలవారు.
*వేదత్తిన్ ఉట్పొరుళ్: వేదములోని రహస్యార్థముల సారమైన తిరువాయిమొళి. తిరువాయిమొళి 3.7 “పయిలుం శుడరొళి” మరియు 8.10 “నెడుమాఱ్కడిమై” (భాగవత శేషత్వమును గురించి పాడిన దశకములు) లలో కూడ ఇదే విషయమును ప్రస్తావించారు.
*నిఱ్కప్పాడి ఎన్ నెంజుళ్ నిఱుత్తినాన్: తిరువాయిమొళిని నా హృదయములో స్థిరముగా నిలిపారు.
*ఆళ్ పుక్క కాతల్ అడిమైప్పయన్ అన్ఱే: ప్రేమతో వారి దాసుడనయ్యాను.
నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:
*మిక్క వేదియర్ – వేద ప్రమాణములు తెలిసిన వాడు, శాఖలను అధ్యయనము చేసిన వాడు .
*నిఱ్కప్పాడి – వేదార్థములను స్థాపించిన వాడు,
*తక్కశీర్ శఠకోపన్ – తిరువాయిమొళి 1.1.1 “అయర్వఱుం అమరర్గళ్ అధిపతి ”(నిత్యసూరి నాయకుడు)అని చెప్పింట్లుగా భగవంతుడి గురించి పాడగల అర్హత గలవాడు. తిరువాయిమొళి 3.9.11 “ఏఱ్కుం పెరుంపుగళ్ వానవర్ ఈశన్ కణ్ణన్ తనక్కు ఏఱ్కుం పెరుంపుగళ్ వణ్కురుకూర్ చటకోపన్” ( నిత్యసూరి నాయకుడు అయిన కృష్ణ భగవానుడు, నమ్మాళ్వార్ల స్తుతికి తగిన వాడు.)లో అంత గొప్పగాను స్తుతించారు.
*ఎన్నంబిక్కు – దాసుడిని అంగేకరించి, సరిదిద్దిన వాడు.
*అన్ఱే – వెంటనే భగవానుడి విషయములో కోరికను వెంటనే నెరవేర్చు కోవాలి. అర్చిరాది గతిలో వెళ్ళే వాడు విరజా స్నానము చేసి, పరమపదము చేరి, పరమాత్మకు కైంకర్యము చేస్తాడు. కాని నమ్మాళ్వార్ల విషయములో మధురకవులు వెంటనే ఫలితమును పొందాడు.అదే నమ్మాళ్వార్లకు తిరువాయిమొళి మొదటి పాశురములో కోరిక కలిగితే 10.10 “మునియే నాన్ముగనే” లో కోరిక తీరింది.
అన్ఱే – భగవద్విషయములో కోరిక వేంటనే నేరవేరాలని కోరుతున్నారు. ఒక జీవాత్మ ఉన్నతగతిని పొందాలంటే అర్చిరాది గతిలో ప్రయాణము చేసి విరజా స్నానము తరువాత పరమపదమును చేరవలసి వుంది. కాని నమ్మాళ్వార్ల విషయములో, తిరువాయిమొళి 10.10 “మునియే నాన్ముగనే” దశకములో చివరి పాశురము పాడగానే పరమపదము లభించింది. మధురకవుల , నమ్మాళ్వార్లు వేంటనే అనుగ్రహించారు.
పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:
*వీరి వ్యాఖ్యానము నంపిళ్ళై వ్యాఖ్యానమును పోలి వుంటుంది.
*మిక్క వేదియర్ – ప్రమాణ శ్రేష్టలు – నమ్మాళ్వార్ల తిరువాయిమొళి 1.1.7 “ఉళన్ శుడర్మిగు శురుతియుళ్”(గొప్ప వేదమును చెప్పిన వాడు) అని చెప్పినట్లుగా.
*వేదత్తిన్ ఉళ్ పొరుళ్ – వైదిక శాస్త్రము – భగవత్ శేషత్వము నుండి తదీయ శేషత్వము వరకు అనే వేదాంత రహస్యమును (ప్రణవం) ధృఢపరుస్తుంది.
అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:
*మిక్క వేదియర్ – వేదియర్ అంటే ఇతర శాస్త్రములను ( వేదమునకు సంబంధించని శాస్త్రములు)గ్రహించక నిత్యము, నిర్ధోషము అయిన వేదమును విశ్వసించువారు. నారదీయ పురాణం 18.33 “వేదాశాస్త్రం పరం నాస్థి” అన్న సూక్తాన్ని అర్థము చేసుకున్న వారు. తిరుచ్చంద విరుత్తము 72 “వేద నూల్ ఓతుగిన్ఱతు ఉణ్మై అల్లతు ఇల్లై” (వేదశాస్త్రము ఉపదేశించునది సత్యము కానిది అందులో లేదు.)
మిక్క వేదియర్- భగవత్ కైంకర్యము కన్నా ఇతరమైన లక్ష్యము లేదని, దానిని పొందుటకు భక్తి, శరణాగతి మాత్రమే మార్గములని తెలిసిన వారు.
*వేదత్తిన్ ఉళ్ పొరుళ్ – వేదప్పొరుళ్-వేదము యొక్క అర్థము. భగవంతుడే గీత 15.15 లో “వేదై సర్వైశ్చరహమేవ వేద్య:” (వేదము పూర్తిగా నా గురించే చెపుతుంది) అని చెప్పారు. పెరియాళ్వార్ తిరుమొళి 2.9.6లో “వేదప్పొరుళే వేంకడవా” (ఓ శ్రీనివాసా! వేదము యొక్క అర్థమే నీవు) అనీ, అలాగే పెరియాళ్వార్ తిరుమొళి 4.3.11 “వేదాంత విళుప్పొరుళ్” (వేదాంతములోని అర్థమూ నీవే)అన్నారు. తిరువాయిమొళి 3.7 “పయిలుం శుడరొళి”,8.10 “నెడుమాఱ్కడిమై“ దశకములలో నమ్మాళ్వార్లు భాగవత శేషత్వము గురించి చెప్పారు.
*నిఱుత్తినాన్ – (నమ్మాళ్వార్లు) స్థిరముగా నిలిపారు. ఆయనే నన్ను మార్చడానికి ప్రయత్నించినా మారను.
* ఎన్నెంజుళ్ నిఱుత్తినాన్ – భగవత్శేషత్వము గురించి తెలియని నాకు భాగవత శేషత్వము గురించి చెప్పారు.
*మిక్క … నిఱుత్తినాన్ – వేదసారమును తిరువాయిమొళిలో అనుగ్రహించి గొప్ప మేలు చేశాడు. ఆచార్యుల గొప్పతనము తెలిసిన వారికే వేద సారమును అవగాహన అవుతుంది. నమ్మాళ్వార్లు ప్రమాణం (వేదము), ప్రమేయము (వేదప్పొరుళ్ – భగవంతుడు), ప్రమాత్రు (మిక్క వేదియర్) మరియు అభిమత విషయము( మధురకవులకు నమ్మాళ్వార్లు) ఏర్పాటు చేసారు.
*తక్క శీర్ శ్చఠపన్ ఎన్ నంబి _ నమ్మాళ్వార్లు నాలోని అఙ్ఞానమును నిశ్శేషముగా తొలగించి పరిపూర్ణుడిగా చేశారు. ఆయన తిరుక్కుఱుంగుడి నంబి ( తిరుక్కుఱుంగుడి దివ్య దేశము లోని పెరుమాళ్ళు) కాదు. తిరుక్కురుకూర్ నంబి. తిరువాయిమొళి 5.5.5 లో “తక్క కీర్త్తిత్ తిరుక్కుఱుంగుడి నంబి” నమ్మాళ్వార్లు వారి నంబి గురించి చెప్పారు. మధురకవులకు మాత్రము నంబి అంటే తిరుక్కురుకూర్ నంబియే.
*అడిమైప్ పయనన్ఱే – మొదట ఆచార్యులకు దాసులు కావాలి. తరవాత అభిమానమును పొంది, కైంకర్యము చేయాలి. ఈ మూడు శిష్యుల కుండ వలసిన లక్షణములు. నమ్మాళ్వార్లు వీరికి ఈ మూడు నేర్పారు. భగవశ్చేషత్వము , భగవ త్ప్రే మ, శేషత్వవృత్తి (కైంకర్యము). నమ్మాళ్వార్లు లౌకిక విషయములలో వైరాగ్యము కలిగి, భగవంతుడి విషయములో పై మూడు గుణములు కలిగి వుండే, మధురకవులకు, భగవంతుడి విషయములో వైరాగ్యము కలిగి, నమ్మాళ్వార్ల విషయములో పై మూడూ గుణములు కలిగి వున్నారు.
అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiruth-thambu-9-mikka-vedhiyar/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org