కణ్ణినుణ్ శిరుతాంబు – తనియన్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

nammazhwar-madhurakavi-nathamuni నమ్మాళ్వార్ మధురకవి ఆళ్వార్, మరియు నాథమునులు, కాంచీపురం

అవిదిత విషయాంతర: శఠారేః ఉపనిషదాం ఉపగానమాత్ర భోగ: |
అపి చ గుణవసాత్ తదేక శేషీ మధురకవి హృదయే మమావిరస్తు ||

ప్రతి పదార్థము:

అవిదిత విషయాంతర : నమ్మాళ్వార్ ను తప్ప మరేదీ తెలియని వారు

శఠారేర్ : నమ్మాళ్వారుల శ్రీసూక్తులు

ఉపనిషదాం : దివ్య ప్రబంధము

ఉపగానమాత్ర భోగ : నిరంతరము ఆనందముగా పాడుతూ

గుణవసాతపి చ : అలౌకిక అనుభూతిని పొందుతూ

తదేక శేషీ : నమ్మాళ్వార్ ఒకరే తమకు ఉజ్జీవకులని

మధురకవి : మధురకవి ఆళ్వార్

మమ హృదయే : నా హృదయములో(వారి హృదయములో)

ఆవిరస్తు : నిలచి వుండు గాక

భావము :

మధురకవి ఆళ్వార్లు వారి హృదయములో,  దివ్య ప్రబంధములోని నమ్మాళ్వార్ల శ్రీ సూక్తులను నిరంతరము ఆనందముగా పాడుతూ, అలౌకిక అనుభూతిని పొందుతూ, నమ్మాళ్వార్కరే తమకు ఉజ్జీవకులని విశ్వసిస్తారు. అలాంటి మధురకవి ఆళ్వార్లు నా హృదయములో సదా నిలిచివుండు గాక.

పిళ్ళై లోకం జీయరు వ్యాఖ్యానము :

అవిదిత విషయాంతర: – నమ్మాళ్వార్, తిరువాయ్  మొళి 7.10.10లో చెప్పినట్లుగా “చింతై మత్తొన్ఱిన్ తిఱత్తతల్లా” (నా చింతన పరమాత్మ మీద తప్ప వేరెవరి మీద నిలవవు) అన్నారు. అదే తిరుప్పాణాళ్వార్మట్ట్ఱొన్ఱినై క్కాణావే” (శ్రీరంగనాధుని తప్ప మరి వేటిని నా కన్నులు చూడవు) అన్నారు. మధురకవి ఆళ్వార్ “విషయాంతరం శఠారేః” (నమ్మాళ్వార్లను మాత్రమే చూస్తారు). ఇతర ఆళ్వార్లందరికీ, “విషయాంతరం” అంటే లౌకిక విషయాలు. మధురకవి ఆళ్వార్లకు మాత్రం, “విషయాంతరం” అంటే “భగవత్ విషయం”. వీరికి భాగవత విషయం (నమ్మాళ్వార్) మాత్రమే ముఖ్యము .

నమ్మాళ్వార్, “ఇళం దైవం” (ఇతర దేవతలు లేక చిన్న దేవతలు)లను వదిలివేసారు .మధురకవి ఆళ్వార్ “పెరుం దైవం” (పరమాత్మ)ను కూడా వదిలి వేసారు.

శఠారేర్ ఉపనిషదాం ఉపగానమాత్ర భోగ : – మధురకవి ఆళ్వార్,  నమ్మాళ్వార్లను శరణాగతి చేయటమే కాదు వారి విషయములందు (తిరువాయిమొళి) మాత్రమే ప్రవీణులై వుంటారు.

అపిచ గుణవసాత్ తదేక శేషి – నమ్మాళ్వార్ల విషయములో, మధురకవి ఆళ్వార్ల స్వరూప ప్రయుక్త దాస్యము (గుణక్రుథ దాస్యం) ఈ పాదములో చూపబడింది.

నమ్మాళ్వార్ల ముందు నిలబడి, వారు చెప్పిన దివ్య ప్రబంధమును గ్రంథస్థము చేసిన ఆ రూపము నాలో నిలిచి వుండనీ అని కోరుకుంటున్నారు.

వేఱొన్ఱుం నాన్ అఱియేన్

వేదం తమిళ్ చెయిత మాఱన్ శటకోపన్

వణ్కురుకూర్ ఏఱెంగళ్ వాళ్వాం ఎన్ఱేథ్థుం మధురకవియార్

ఎమ్మై ఆళ్వార్ అవరే అరణ్

ప్రతి పదార్థము:

వేఱొన్ఱుం నాన్ అఱియేన్ : నమ్మాళ్వార్లు తప్ప మరేదీ నాకు తెలియదు

వేదం తమిళ్ శెయిత : వేదార్థములను తమిళములో అనుగ్రహించిన

మాఱన్ : మాఱన్ అను వారు

వణ్ క్కురుగూర్ : తిరుక్కురుగూర్ నాయకుడైన

శఠకోపన్ : శఠవాయువుపై కోపించినవారు,శఠకోపులు

ఎఱెంగళ్ వాళ్వాం ఎన్ఱు : మా జీవితాలను

ఏత్తుం : ఉజ్జీవింపచేయు

మధురకవియార్ : మధురకవులు

ఎమ్మై ఆళ్వార్ : మమ్ము పాలించు

అవరే : వారే

అరణ్ : ఆధారము

భావము:

“వేదార్థాములను తమిళములో అనుగ్రహించిన మాఱన్ అను తిరుకురుగూర్ నాయకుడైన శఠవాయువుపై కోపించినవారు, మాజీవితాలను ఉజ్జీవింపచేయగలవారు, మమ్ము పాలించు వారు, శఠకోపులు అనేబడే నమ్మాళ్వార్లు తప్ప మరేదీ నాకు తెలియదు” అంటున్నారు మధురకవులు.

పిళ్ళై లోకం జీయరు వ్యాఖ్యానము

నాథమునులు , మధురకవుల ప్రబంధములోని పదములనే ఈ తనియన్ లో ప్రయోగించారని పిళ్ళై లోకం జీయరు అభిప్రాయము.

మధురకవులకు సర్వస్వము మరియు నాథుడు నమ్మాళ్వారే .అలాగే మనకును  మధురకవుకు సర్వస్వము మరియు నాధుడును నమ్మాళ్వారే  .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

ఆధారము: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-thaniyans/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment