కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

Nammazhwar-krishna

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 6

అవతారిక:

నంజీయర్  అభిప్రాయము :

మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల  నిర్హేతుక కృప వలన తనకున్న అవరోధాలన్నింటిని  తొలగించి అనుగ్రహించారని  ఈ పాశురములో  పాడుతున్నారని  నంజీయర్  అభిప్రాయ  పడుతున్నారు.

నంపిళ్ళై అభిప్రాయము:

నమ్మాళ్వార్ల  నిర్హేతుక కృపను  చేతనులందరూ  పాడుతూ  తమ కష్టాలను పోగొట్టుకోవలని  మధురకవి  ఆళ్వార్లు ఈ  పాశురములో పాడుతున్నారు.

పెరియవాచ్చాన్  పిళ్ళై అభిప్రాయము :

మధురకవి ఆళ్వార్లను నమ్మాళ్వార్ల నిర్హేతుక కృప వలన  తనకున్న అవరోధాలన్నింటిని  తొలగించి  అనుగ్రహించారు కదా!  చేతనులందరూ తమ కష్ఠాలను పోగొట్టుకోవటానికి, నమ్మాళ్వార్ల నిర్హేతుక కృపను పొందడానికి అర్హులే.  కాని, నమ్మాళ్వార్ల ఔన్నత్యము  అందరికీ  తెలియక పోవటము చేత మధురకవి ఆళ్వార్లు ఈ పాశురములో  నమ్మాళ్వార్ల  ఔన్నత్యమును పాడుతున్నారు.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ల  అభిప్రాయము:

*4వ పాశురములో  మధురకవి ఆళ్వార్లను  , మహా ఙ్ఞానులు కూడా తనను నిరాకరించగామ్మాళ్వార్లు మాత్రము తల్లిగా తండ్రిగా ఆదరించారు అని చెప్పారు.  5వ పాశురములో  తనలోని  లోపాలను  చెప్పుకున్నారు.  కిందటి  పాశురములో నమ్మాళ్వార్లు తనను ఎప్పటికీ  వదలరని  చెప్పి ఈ పాశురములో  వారి  కీర్తిని  గానము  చేస్తున్నారు.

*ఈ  పాశురములో  నమ్మాళ్వార్ల  నిర్హేతుక  కృప  వలన  అనాదిగా  తనకున్న అవరోధాలన్నింటిని   తొలగదోసి అనుగ్రహించారని,  అందువలన వారి కీర్తిని లోకమంతా తిరిగి గానము చేస్తున్నారు.  “గురుం  ప్రకాశయేన్నిత్యం” అని శాస్త్రములో  చెప్పినట్లుగా  మధురకవి  ఆళ్వార్లు  తమ  ఆచార్యులైన  నమ్మాళ్వార్ల   కీర్తిని  గానము  చేస్తున్నారు.

*నమ్మాళ్వార్లకు  భగవంతుడి స్వాతంత్ర్యము మీద  పూర్తి  విశ్వాసము వుంది.  దేవతాంతరములకు ఈ స్వాతంత్ర్యము లేదు. భాగవత  శేషత్వము వలన లౌకిక  కోరికలు తొలగిపోయాయి.  సంసారుల  మీది  దయతో తిరువాయ్ మొళిలోని-1.2 “వీడు మిన్ ముఱ్ఱవుం” నుండి  -10.5 “కణ్ణన్ కళలిణై” దశకము వరకు పాడారు. భగవంతుని  స్వాతంత్ర్యము గొప్పది. చేతనుడు ఆయనను ఆశ్రయించినప్పుడు  ఆయన  శిక్షించవచ్చు.  కాని  నమ్మాళ్వార్లు  అలా  శిక్షించరు.  ఈ విషయమునే  మధురకవి  ఆళ్వార్లు  ఈ  పాశురములో  చెప్పారు.

పాశురము –

కణ్దు కొణ్దు ఎన్నై కారిమాఱప్పిరాన్

పణ్దై వల్వినై పాఱ్ఱి అరుళినాన్

ఎణ్దిసైయుం అఱియ ఇయంబుగేన్

ఒణ్దమిళ్ శటకోపన్ అరుళైయే

 ప్రతి పదార్థము:

పిరాన్ =  పరమ ఉపకారకులు

కారిమాఱన్ = పొఱ్కారి సుపుత్రులు

ఎన్నై = నన్ను

కణ్దు = అనుగ్రహించిన

కొణ్దు = వారి కైంకర్యములో నియమించి

పణ్దై వల్వినై = అనాది పాపములను

పాఱ్ఱి అరుళినాన్ = కృపతో తొలగదోసారు

ఒణ్దమిళ్  శఠకోపన్ అరుళైయే = మధురమైన తమిళ పాశురములకు మూలమైన శఠకోపుల కృప ( అత్తనాయ్)

ఎణ్దిసైయుం = అష్ట దిక్కులు

అఱియ = తెలుసుకునే విధముగా

ఇయంబుగేన్ = పాడుతాను

భావము:

పొఱ్కారి సుపుత్రులైన నమ్మళ్వార్లు దాసుడికి  పరమ  ఉపకారములు  చేశారు. వారి  కృపతో  అనాది  పాపములను  తొలగదోసి, వారి కైంకర్యములను  చేయటానికి  అనుగ్రహించారు.  మధురమైన  తమిళ  పాశురములకు  మూలమైన శఠకోపుల  కృపను  అష్ట క్కుల  తెలుసుకునేలా  పాడుతాను.

 నంజీయర్ వ్యాఖ్యానము:

* తిరువాయిమొళి 8.7.2 ళోఏ నమ్మళ్వార్లు “ఇరుందాన్ కణ్దు కొణ్దు”(నా హృద యములో  చేరి నన్ను ప్రేమతో చూస్తున్నాడు  ) అని  చెప్పినట్లుగానే  మధురకవులు  ఇక్కడ   అన్నారు.

*పణ్డై వల్వినై – అనాది పాపములు -ఆత్మకు ఈ  సంసారములో  అంతమును (పరమపదమునకు  చేరితే తప్ప) ఊహించను కూడా లేము.  ఈ పాపములు తీరేవి కావు  తొలగేవి కావు  అనుభవించి  తీరవలసినవే. నమ్మళ్వార్లు వీటిని తొలగించారు. వీరు భగవతుణ్ణి కూడా  భాగవత కైంకర్యమునకు  అడ్డుగా  భావించి  వదులుకున్నారు.

*ఎణ్డిసైయుం  అఱియ  ఇయంబుకేన్ –  ఈ విషయాన్ని ఙ్ఞానులకు, అఙ్ఞానులకు చెపుతాను.

*ఒణ్దమిళ్ –  సంస్కృత వేదము  “యతో వాచో నివర్తంతే” అన్నట్లు వాక్కులు/మనసు అర్థము కావు.  ద్రావిడ వేదము అలాకాక  సులభ  గ్రాహ్యము.

* “శఠకోపన్ అరుళైయే” – నమ్మాళ్వార్ల  కృప , భగవంతుని  కృప  అందని  వారికి  కూడా  అందుతుంది.

 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*కారిమాఱప్పిరాన్ – మధురకవి  ఆళ్వార్లు,  నమ్మాళ్వార్లను  “పిరాన్” (కృప చేసిన వారు)  అని  కృతఙ్ఞతా భావముతో పిలిచారు. సంప్రదాయములో  భగవంతుడిని  “పిరాన్” అంటారు. అందు వలన  నమ్మాళ్వార్లను  “కారిమాఱ పిరాన్” అని  సంభోధించడం  జరిగింది.

*పణ్దై వల్వినై –  భగవంతుడి కి కైంకర్యము చెసే సమయములో అనేక రకముల  అనాది పాపములు  అవరోధములుగా నిలుస్తాయి. (రామాయణములో శూర్పణఖ  లాగా). అయినా  భగవత్కైంకర్యమే  లక్ష్యముగా  వుండాలి.

*పాఱ్ఱి అరుళినాన్ –   “ద్విషంత: పాపకృత్యాం”(పాప ఫలమును పరమపదమునకు పోవునప్పుడు శత్రువులకు ఇచ్చి వెళతారు) అని  శాత్యాయన  శాఖలో  స్పష్టముగా  తెలిపినట్లుగా  ఇక్కడ  నమ్మాళ్వార్లు,  మధుర కవుల  అనాది పాపములను  తొలగించారు.

*ఎణ్డిసైయుం  అఱియ ఇయంబుకేన్ –  తిరువాయ్ మొళి  5.2.2  “తొణ్డీర్ ఎల్లారుం వారీర్”అని నమ్మాళ్వార్లు చెప్పినట్ళుగా కోరిక గాలవారందరికి  తెలియజేస్తాను అని మధురకవులు అంటున్నారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం:

*కణ్దు కొణ్దు – నమ్మాళ్వార్లు  దాసుడిని  చూడగానే గొప్ప సంపదను చూసినట్లు ఆనందపడ్డారు.

*ఎన్నై –నమ్మాళ్వార్లకు  ఇతర  సంసారులకు  బేధము కూడా తెలియని , వారి నిర్హేతుకమైన  కృపను తెలుసుకోలేని దాసుడిని అనుగ్రహించారు.

*కారిమాఱప్పిరాన్ –  “సుహృదం సర్వ భూతానాం” అని  గీతలో  కృష్ణుడు  తనే  చెప్పగా,  నమ్మాళ్వార్లు  అంతకంటే కృపను చూపారు.

*ఒణ్దమిళ్ శఠకోపన్ అరుళైయే –  అందమైన తమిళములో  నమ్మాళ్వార్ల  కృపను గానము  చేస్తాను.  అదియే  దాసుడికి శరణ్యము.

  అళిగియ మణవాళ పెరుమళ్ నాయనార్  వ్యాఖ్యానం:

* నమ్మాళ్వార్ల   చిత్, అచిత్, ఈశ్వరుడు  అనే  తత్వత్రయ  ఙ్ఞానము,  ఈశ్వర భక్తి,  చిత్-అచిత్తుల  పట్ల వైరాగ్యము, చేతనులపై కృప అనే గొప్ప  గుణములు  ఈ  పాశురము  ప్రారంభములోనే  చెప్పబడింది.  నమ్మాళ్వార్ల  కృప భగవంతుడి కృప కంటే ఎక్కువైనది  అని  ఈ  పాశురములో  చెప్పబడింది.

*కణ్దు –  మహాభారతము శాంతి పర్వం  358.73  “జాయమానం  హి  పురుషం  యం  పశ్చేత్ మధుసూదన: …” (మధుసూదనుడి  చూపు  వలన  గర్భములోని  ఆత్మ  రక్షింప  బడినది). అలాగే  నమ్మాళ్వార్లు  దాసుడిని చూశారు.

*కొణ్డు –  దాసుని దోషములను చూసి కూడా అనుగ్రహించారు.

*ఎన్నై క్కణ్డు, ఎన్నైక్కొణ్డు –  దాసుడుపై దృష్టి  సారించారు, అంగీకరించారు. వారి  అంగీకారము వలన భగవంతుడు కూడా అంగీకరించాడు.

*కారిమాఱప్పిరాన్ – వారు భగవంతుడి లా స్వయంభువు (పిరాన్)  కాదు.  కారిమాఱన్    సుపుత్రులు (కారి మాఱప్పిరాన్).

*పాఱ్ఱి –   భగవంతుడు   గీత 18.66 లో   “మామేకం శరణం వ్రజ … మోక్షయిష్యామి” అని చెప్పారు. వీరు   శరణం  అనక  ముందే    అనుగ్రహించారు.

* ఎండిసైయుం… –  స్వతంత్రులుగా  భావించే వారికి,  దేవతాంతరము  పాటించే వారికి  ఉపదేశించి   కాపాడుతాను.

*అఱియ  ఇయంబుకేన్ – పెరియాల్వార్లు తమ తిరుప్పల్లాణ్డు-4లో “నాడు నగరముం నంగఱియ” అని పాడినట్లుగా దాసుడు నమ్మాళ్వార్ల పాటలను పాడుతూ,  కీర్తిస్తాడు.

*శ్రీ జాంబవంతుడు,  త్రివిక్రమ అవతారము తరవాత   “దేవా: స్వస్తానమాయాంధి ధైత్యా: సర్వే హతా గతా: | న భయం విద్యతే కించిత్ జితం భగవతా జగత్ ||” అని కీర్తించినట్లుగా  మధురకవి  ఆళ్వార్లు,  నమ్మాళ్వార్లను  కీర్తిస్తున్నారు. అక్కడ భగవంతుడి శక్తియుక్తులను కీర్తించినట్లుగా,  ఇక్కడ నమ్మాళ్వార్ల  ప్రేమను కీర్తించారు. అక్కడ ప్రయోజనాంతర పరులు  లభ్దిని పొందగా  ,ఇక్కడ  అనన్యప్రయోజన పరులు  (ప్రపన్నులు) లభ్దిని పొందారు. అక్కడ భగవంతుడి లీలలను ప్రస్తావించగా  ఇక్కడ నమ్మాళ్వార్ల  స్వచ్ఛత  ప్రస్తావించబడింది.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiru-thambu-7-kandu-kondu/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment