కణ్ణినుణ్ శిఱుత్తాంబు – సరళ వ్యాఖ్యానము


శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ముదలాయిరము

నమ్మాళ్వార్ - మధురకవి
నమ్మాళ్వార్ – మధురకవి  ఆళ్వార్

శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 26వ పాసురంలో కణ్ణినుణ్ శిఱుత్తాంబు యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు.

వాయ్ త్త తిరుమందిరత్తిన్ మద్దిమమాం పదంపోల్

శీర్ త్త మధురకవి శెయ్  కలైయై – ఆర్త పుగళ్

ఆరియర్గళ్ తాంగళ్ అరుళిచ్చెయళ్ నడువే

శేర్విత్తార్ తార్పరియం తేర్ న్దు

తిరుమంత్రం అని కూడా పిలువబడే అష్టాక్షరము, పదాలు మరియు అర్థ పరంగా పూర్ణత కలిగి ఉన్నది, మధ్యలోని ‘నమః’ పదం విశిష్థతమైనది. మధురకవి ఆళ్వారుల అద్భుతమైన కణ్ణినుణ్ శిఱుత్తాంబుకి అదే విశిష్థతను వెలికితీస్తుంది. దీని అర్ధాలని అనుసందానము చేసుకుని, గౌరవనీయమైన మన పూర్వాచార్యలు దీనిని అరుళిచ్చెయల్ (4000 పాసురముల దివ్యప్రబంధము) లో చేర్చారు, కాబట్టి మిగిలిన వాటితో పాటు ఇది కూడా పఠించబడుతుంది.

మధురకవి ఆళ్వారులు నమ్మాళ్వార్ తప్ప వేరే ఇతర ఏ దేవున్నిఎరుగరు. వారు రచించిన గొప్ప ప్రబంధం  ఈ కణ్ణినుణ్ శిఱుత్తాంబు. ఈ ప్రబంధం ఆచార్యులు (గురువు) భగవంతునితో సమామనమనే మన సాంప్రదాయ ముఖ్య సూత్రాన్ని తెలియజేస్తుంది. నమ్మాళ్వార్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఈ ప్రబంధం, మన సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. 

ఈ ప్రబంధం యొక్క సరళమైన అనువాదం మన పూర్వాచార్యుల వ్యాఖ్యానం సహాయంతో వ్రాయబడింది.

*****

తనియన్లు

అవిదిత విషయాంతరః శఠారేః ఉపనిషదాం ఉపగానమాత్ర భోగః |
అపి చ గుణవశాత్ తదేక శేషీ మధురకవి హృదయే మమావిరస్తు ||

మధురకవి ఆళ్వార్ నా యొక్క హృదయంలో నిలిచి ఉండాలి – నమ్మాళ్వార్ తప్ప మరెవరినీ ఎరుగనివాడు, నమ్మాళ్వారుల దివ్య సంకీర్తనల గొప్పతనాన్ని పాడటం అతనికి ఆనందాన్ని ఇస్తున్నట్లు భావించినవాడు, నిరంతరము నమ్మాళ్వారి గుణాలలో మునిగి ఉండి వారినే స్వామిగా భావించినవాడు.

వేరొన్ఱుం నాన్ అఱియేన్ వేదం తమిళ్ సెయ్ద

మాఱన్ శడగోపన్ వణ్ కురుగూర్ ఎంగళ్

వాళ్వాం ఎన్రేత్తుం మధురకవియార్ ఎమ్మై

ఆళ్వార్ అవరే అరణ్

“అందమైన కురుగుర్ నాయకుడైన నమ్మాళ్వార్,  వేదార్ధాలను కరుణతో తమిళం వల్లించినవారు, మనందరినీ ఉద్ధరించగల సామర్థ్యం కలిగిన నమ్మాళ్వార్ తప్ప నేనేమీ ఎరుగను” అని మధురవ ఆళ్వార్ మాత్రమే అన్నారు. మనలాంటి ప్రపన్నులకు (శరణాగతులు) వారు ఆశ్రితులు.

*****

మొదటి పాశురము. నమ్మాళ్వార్ గురించి పాడటం ప్రారంభించిన మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్కు చాలా ప్రియమైన శ్రీ కృష్ణుని అనుభవము పొందుతున్నారు.

కణ్ణినుణ్ చిఱు త్తాంబినాల్

కట్టుణ్ణ ప్పణ్ణియ పెరుమాయన్ ఎన్నపనిల్

నణ్ణి త్తెంకురుకూర్ నంబి ఎన్ఱక్కాల్

అణ్ణిక్కుం అముతూఱుం ఎన్నావుక్కే

శ్రీ కృష్ణుడు, నా స్వామి మరియు అత్యున్నతమైన తత్వము. తనను తాను యశోదమ్మ చేత సన్నని చిన్న చిన్న తాడు ముక్కలతో కట్టివేయబడ్డాడు. ఆ ఎమ్పెరుమానుడికి బదులుగా, దక్షిణ దిశలో ఉన్న తిరుక్కురుగుర్ నాయకుడైన నమ్మాళ్వార్ నామాన్ని పఠించడం నా నోటికి అత్యంత తీపికరమైన తేనెలాంటిది.

రెండవ పాశురము. మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ యొక్క పాశురములు మాత్రమే అతనికి చాలా తీపిగా ఉన్నాయని, వాటిని మాత్రమే పదేపదే పఠించడం ద్వారా తాను నిలిచి ఉన్నారని వివరిస్తున్నారు.

నావినాల్ నవిఱ్ఱు ఇన్ బం ఎయ్ తినేన్

మేవినేన్ అవన్ పొన్నడి మెయ్ మ్మైయే

దేవు మఱ్ఱరియేన్ కురుకూర్ నంబి

 పావిన్ ఇన్నిసై పాడి త్తిరివనే

నా నోటితో ఆళ్వార్ యొక్క పాశురములను పఠించడం ద్వారా నేను అమితానందాన్ని పొందుతున్నాను. నేను వారి దివ్య చరణాల వద్ద శరణాగతి చేశాను. శుభ లక్షణాలతో సంపూర్ణమైన ఆళ్వార్, తిరుక్కురుగుర్ నాయకుడైన ఆళ్వార్ తప్ప వేరే దేవుడి గురించి నాకు తెలియదు. నేను సంగీతాన్ని జత చేసి ఆళ్వార్ పాశురములను పాడుతూ పల దేశాలకు వెళతాను.

మూడవ పాశురము. నమ్మాళ్వారి సేవకుడై నందున భగవానుడు తనకు ఎలా దర్శనము ఇచ్చాడో వివరిస్తున్నారు.

తిరితంతాగిలుం దేవపిరానుడై

కరియకోల త్తిరువురు కాణ్బన్ నాన్

పెరియ వణ్ కురుకూర్ నగర్ నంబిక్కు

ఆళురియనాయ్ అడియేన్ పెఱ్ఱ నన్మైయే

సంపూర్ణంగా ఆళ్వార్ సేవకుడిగా ఉన్న నేను ఒకానొక సమయాన ఆ స్థానం నుండి తప్పాను.  ఆళ్వార్ చూపించినట్లుగా,  నల్లని వర్ణంలో ఉన్న నిత్యసూరుల నాయకుడైన శ్రీమన్నారయణను నేను చూశాను. గొప్ప తిరుక్కురుగూర్లో అవతరించిన ఆళ్వారుకి నిజమైన దాసుడైన నేను పొందిన ఈ గొప్ప ప్రయోజనాన్ని చూడండి.

నాల్గవ పాశురము. తనపై నమ్మాళ్వార్ కురిపించిన ప్రయోజనాన్ని చూసి, నమ్మాళ్వార్ ఇష్టపడే ప్రతిదాన్ని తానూ ఇష్టపడతానని మధురకవి ఆళ్వార్ తెలియజేస్తున్నారు. ఇంకా, తన దైన్యతను వెల్లడి చేస్తూ నమ్మాళ్వార్ అతన్ని ఎలా స్వీకరించారో తెలుపుతున్నారు.

నన్మైయాల్ మిక్క నాన్మఱైయాళర్గళ్

పున్మైయాగ క్కరుతువర్ ఆతలిల్

అన్నైయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆణ్దిడుం తన్మైయాన్

శడకోపన్ ఎన్ నంబియే

వేద పరిజ్ఞానము మరియు ప్రావిణ్యం కలిగి ఉన్నవాళ్ళు, అణగారిన తనానికి నేను ఉదాహరణ కనుక నన్ను విడిచిపెట్టారు. అయినప్పటికీ నమ్మాళ్వార్, నాకు తల్లిగా మరియు తండ్రిగా తన ఆశ్రయంలోకి తీసుకున్నారు. అతను మాత్రమే నాకు స్వామి.

ఐదవ పాశురము. మునుపటి పాశురములో తాను ప్రస్తావించిన తన తక్కువ తనాన్ని వివరిస్తూ, మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ యొక్క నిష్కారణమైన కృప కారణంగా ఇప్పుడు తాను  సరిదిద్దబడ్డాడు అని తెలియజేస్తున్నారు, వారికి కృతజ్ఞతలు.

నంబినేన్ పిఱర్ నంపొరుళ్ తన్నైయుం
నంబినేన్ మడవారైయుం మున్నెలామ్
శెమ్బొన్మాడ,తిరుక్కురుగూర్ నమ్బిక్కు
అన్బనాయ్,అడియేన్ శదిర్తేనిన్ఱే

నా గత జీవితములో, నేను ఇతరుల సంపదను మరియు స్త్రీలను కోరుకునేవాడిని. ఏదేమైనా ఇప్పుడు నేను నమ్మాళ్వార్ చేత సరిదిద్దబడి ఘనతను పొందాను, వారికి దాసునిగా మారాను. అటువంటి నమ్మాళ్వారులు సువర్ణ భవనాలు కలిగిన తిరుక్కురుగూరుకి నాయకుడు.

ఆరవ పాశురము. “మీరు ఇంత గొప్పతనాన్ని ఎలా పొందారు?” అని అడిగినప్పుడు అతను నమ్మాళ్వార్ కృప వల్ల దాన్ని సాధించారని తెలియజేస్తున్నారు. ఈ స్థాయి నుండి దిగజారే అవకాశమే లేదు.

ఇన్ఱు తొట్టుం ఎళుమైయుం ఎంపిరాన్

నిన్ఱు తన్ పుగళ్ ఏత్త అరుళినాన్

కున్ఱమాడ త్తిరుక్కురుకూర్ నంబి

ఎన్ఱుం ఎన్నై ఇగళ్విలన్ కాణ్మినే

తిరుక్కురుగూర్ నాయకుడిగా, నా స్వామి నమ్మాళ్వార్ వారి కృపా వర్షమును నాపై కురిపించి వారిని స్తుతించి పాడేలా చేశారు. వారు నన్నేన్నటికీ  విడిచిపెట్టరని మీరు గమనించవచ్చు.

ఏడవ పాశురము. మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ చేత  అనుగ్రహింపబడిన తరువాత, అతను నమ్మాళ్వార్ గురించి తెలియక బాధపడుతున్న వారందరికీ ఆళ్వార్ యొక్క గొప్పతనాన్ని వివరించి వారి కృపకు పాతృలను జేసి ఉద్ధారపడేలా చేస్తాను అని తెలియజేస్తున్నారు.  

కణ్దు కొణ్దు ఎన్నై కారిమాఱప్పిరాన్

పణ్దై వల్వినై పాఱ్ఱి అరుళినాన్

ఎణ్దిసైయుం అఱియ ఇయంబుగేన్

ఒణ్దమిళ్ శటకోపన్ అరుళైయే

పొర్కారి కుమారుడైన నమ్మాళ్వారిని కారిమాఱన్ అని కూడా పిలుస్తారు. వారి కృపా వర్షాన్ని తనపై కురిపించి నన్ను వారి సేవలోకి తీసుకున్నారు. అనాది కాలం నుండి మూట కట్టుకున్న నా పాపాలన్నింటినీ వారు తొలగించారు. అద్భుతమైన తమిళ పాసురములను వల్లించిన ఆళ్వార్ యొక్క దయను కీర్తిని నేను అష్ట దిక్కులలోని ప్రజలకు వివరిస్తాను.

ఎనిమిదవ పాశురము. ఈ పాసురంలో ఎమ్పెరుమాన్ కృప కంటే ఆళ్వార్ యొక్క దయ గొప్పదని వారు వివరిస్తున్నారు. ఎమ్పెరుమాన్ యొక్క భువత్గీత కంటే ఆళ్వార్ యొక్క తిరువాయ్మొళి చాలా గొప్పదని తెలియజేస్తున్నారు. 

అరుళ్ కొణ్డాడుం అడియవర్ ఇంబుఱ

అరుళినాన్ అవ్వరుమఱైయిన్ పొరుళ్

అరుళ్ కొణ్డు ఆయిరం ఇన్ తమిళ్పాడినాన్

అరుళ్ కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే

భగవంతుని స్తుతించే వారి దాసుల ఆనందం కోసం, వేద సారాంశంగా నమ్మాళ్వార్ వెయ్యి పాసురముల రూపంగా తిరువాయ్మొళిని పాడారు. నమ్మాళ్వార్ యొక్క ఈ దయ అన్నిటికంటే గొప్పది.

తొమ్మిదవ పాశురము. తన యొక్క తక్కువతనాన్ని పట్టించుకోకుండా, భగవత్ దాసుకు దాసునిగా ఉండాలనే  వేద సారాన్ని నమ్మాళ్వార్ తనకు వెల్లడి చేశారని మధురకావి ఆళ్వార్ తెలియజేస్తున్నారు. నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుళ్

నిఱ్కప్పాడి ఎన్ నెంజుళ్ నిఱుత్తినాన్

తక్క సీర్ శటకోపన్ ఎన్నంబిక్కు

ఆళ్ పుక్క కాతల్ అడిమైప్పయన్ అన్ఱే

గొప్ప పండితులు పఠించే వేదముల యొక్క సారాంశాన్ని నా హృదయంలో స్థిరముగా ఉండేలా నమ్మాళ్వార్ గొప్ప దయతో నాకు ఉపదేశించారు. దీని ఫలితంగా వారిని సేవించడంలో ఉన్న ఈ గొప్పతనాన్ని నేను గ్రహించాను.

పదవ పాసురం. ఈ పాసురంలో మధురకవి ఆళ్వార్, తాను తిరిగి చెల్లించలేని అనేక గొప్ప ఉపకారాలు నమ్మాళ్వార్ తనకు చేశారని, వారి దివ్య పాదాల పట్ల అభిమానాన్ని పెంచుకున్నానని తెలియజేస్తున్నారు.

పయన్ అన్ఱాగిలుం పాంగల్లర్ ఆగిలుం

శెయల్ నన్ఱాగ త్తిరుత్తి ప్పణి కొళ్వాన్

కుయిల్ నిన్ఱార్ పొళిల్సూళ్ కురుగూర్ నంబి

ముయల్గిన్ఱేన్ ఉన్ తన్ మొయ్ కళర్కు అన్బైయే

తోటలతో చుట్టుముట్టబడి కోకిల శబ్దాలు ప్రతిధ్వనిస్తున్న తిరుక్కురుగూర్లో నివసించే ఓ నమ్మాళ్వార్! ఏ ఫలితాన్ని ఆశించకుండా  ఈ భూమిపై ఉన్న ప్రజలను మీ యొక్క ఆచరణ విచారములతో సరిదిద్ది  వారు భగవత్ సేవలో పాల్గొనేలా చేశారు. నేను మీవంటి వారి పట్ల భక్తి అభివృద్ధి అయ్యేలా ప్రయత్నిస్తున్నాను.

పదకొండవ పాశురము. ఈ ప్రబంధాన్ని నేర్చుకొని పఠించేవారు నమ్మాళ్వార్ నియంత్రణలో ఉన్న శ్రీవైకుంఠంలో నివసిస్తారు [చేరుకుంటారు] అని ఈ పాసురములో, మధురకవి ఆళ్వార్ తెలియజేస్తున్నారు. ఇక్కడ సూచించిన అర్ధం ఏమిటంటే, ఆళ్వార్ తిరునగరిలో ఆదినాధుడు (ఆలయంలోని మూల దైవం) మరియు నమ్మాళ్వార్ ఇద్దరూ అక్కడ నాయకులే అయితే, శ్రీవైకుంఠంలో మాత్రం నమ్మాళ్వార్ మాత్రమే నాయకుడు అని వివరిస్తున్నారు.

అంబన్ తన్నై అడైందవర్క్ కెల్లాం

అన్బన్ తెన్కురుకూర్ నగర్ నంబిక్కు

అన్బనాయ్ మధురకవి సొన్న సొల్

నంబువార్ పది వైకుందం కాణ్మినే

ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపేవాడు భగవానుడు (ముఖ్యంగా తన సేవకుల పట్ల).  భగవానుడి యొక్క అటువంటి దాసుల పట్ల ఆప్యాయత చూపించేవాడు నమ్మాళ్వార్. అటువంటి నమ్మాళ్వార్ పట్ల ఆప్యాయత ఉన్నవాడిని నేను (మధురకవి ఆళ్వార్). నేను భక్తితో పాడిన ఈ పాశురములను పఠించే వారు శ్రీవైకుంఠానికి చేరుకుని అక్కడ నివసిస్తారు అని తెలియజేస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://divyaprabandham.koyil.org/index.php/2020/04/kanninun-chiruth-thambu-simple/

మూలము : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment