శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
జీవుడు తాను చేసిన కర్మ మంచిదైనా చెడ్దదైనా దాని ప్రభావమును అనుభవించే తీరాలి. నీది నూల్ లో “ఉరఱ్పాల నీక్కల్ ఉఱువర్కుం ఆగా” అని చెప్పబడింది. కర్మ అగేది కాదు. వర్షము కురవక పోతే ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఒక వేళ ఉధృతముగా కురిసినా ఆపలేరు. అలాగే జీవుడి కర్మ ఫలమును ఎవరూ ఆపలేరు. శ్రీమన్నారాయణుడే వీటిని సృష్టించాడు. పురాకృత పాప పుణ్యములు ఈ జన్మలో ఫలిస్తాయి. ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యములు పైజన్మలో ఫలిస్తాయి. ఇది ఒక చక్రము . జీవుడికి ఎప్పటికైనా ఈ చక్రము నుండి విముక్తి ఉందా? ఈ ప్రశ్నకు జవాబుగా ఈ పాశురము అమరింది.
ఎప్పటికైనా ఈ కర్మజన్మల చక్రము నుండి బయట పడగలమా? అంటే ఆ శ్రీమన్నారాయణుని క్రృప ఉంటే ఇవన్నీ నిప్పు పడ్డ దూదిలా కాలిపోతుంది.
“ఉడైమై నాన్ ఎన్ఱుం ఉడైయాన్ ఉయిరై
వడమధురై వందుతిత్తాన్ ఎన్ఱుం – తిడమాగ
అఱిందవన్ తన్ తాళిల్ అడైందవర్కుం ఉణ్డో?
పిఱందు పడు నీళ్ తుయరం పిన్.”
ప్రతిపదార్థము
నాన్ = నేను అనే ఆత్మ
ఉడైమై = భగవంతుడికి దాసుడైన
ఉయిరై ఉడైయాన్ = ఈ ఆత్మను పొందిన వాడు
వడమధురై వందుతిత్తాన్ ఎన్ఱుం = ఉత్తర మధురలో అవతరించాడని
తిడమాగ అఱిందు = దృఢముగా తెలుకున్న వారికి
అవన్ తన్ తాళిల్ = భగవంతుడి శ్రీపాదములను
అడైందవర్కుం = శరణాగతి చేసిన వారికి
పిన్ పిఱందు పడుం = మళ్ళీ ఒక జనమ నెత్తి పొదవలసిన ఫలితములు
నీళ్ తుయరం = సంచిత కర్మలు
ఉణ్డో? = ఉంటాయా?
వ్యాఖ్యానము
ఉడైమై నాన్ ఎన్ఱుం…..ఆత్మలన్ని శ్రీమన్నారయణుని సొత్తేనని వేదాలన్ని ఘోషిస్తున్నాయి . మనమందరము ఆజ్ఞానమునున్ పొందాలి .
ఉడైయాన్ ఉయిరై వడమధురై వందుతిత్తాన్ ఎన్ఱుం……ఆత్మలన్నింటికి యజమాని అయిన శ్రీమన్నారయణుడే ఉత్తర మదుర శ్రీకృష్ణుడుగా అవతరించాడని తెలుసుకోవాలి. ఆయన జీవాత్మల ఉన్నతికై భగవద్గీతలో తాను సర్వ జ్ఞడుననని, సకల జీవులకు యజమానిననీ చెప్పి, ఎవరైతే తనను శరణాగతి చేస్తారో వారికి పునర్జన్మ లేదని, జన్మ కర్మల చక్రము నుండి విడివడతారని ఉపదేశించాడు.
తిడమాగ అఱిందు…..దృఢముగా తెలుసుకొని… తెలుసుకోవలసినది అంటే …శాస్త్రములన్నీ శ్రీమన్నారయణుడే సమస్త వస్తువులకు యజమాని అని ఘోషిస్తున్నాయి. ఈ పాశురములో “ఉడమై” “ఉడైయాన్” అని రెండు పదాలను ప్రయోగించారు. “ఉడమై”…సంపద, జీవులు, సమస్త వస్తువులు , “ఉడైయాన్”….యజమాని. అయిన ప్పుడు, ఆయన వస్తువులను ఆయనే తీసుకుంటాడు. అలా తీసుకోవటములో ఆయనకే ఆనందము . యజమాని తన వస్తువులను స్వీకరించి , భద్రపరచడములో ఆనందమును పొందుతాడు కదా! కాబట్టి జీవాత్మలను ఉద్దరించటము పరమాత్మ ఆనందము కొరకేనని దృఢముగా తెలుసుకోవాలి .
అవన్ తన్ తాళిల్ అడైందవర్కుం……“ద్వయ” మంత్రములో చెప్పిన విధముగా “పిరాట్టితో కూడి వున్న శ్రీమన్నారయణుని శ్రీపాదములకు శరణాగతి చేసిన వారికి
ఉణ్డో? పిఱందు పడు నీళ్ తుయరం పిన్…..’ .నీళ్ తుయరం ‘ దీర్గకాలిక కష్టాలుంటాయా? జన్మకర్మల చక్రభమణముంటుందా? ఉండవు .
స్వామి నమ్మాళ్వార్లు పెరియ తిరువందాది (54)లో ఇలా చెప్పారు.
“వానో మరికడలో మారుదమో, తీయగమో,
కానొ ఒరుంగిఱ్ఱుం కణ్డిలమాల్ – ఆనిన్ఱ
కన్ఱుయర తామెఱిందు కాయుదితార్ తాళ్ పణిన్ణ్దోం
వంతుయరై అవా మరుంగు”
అనగా ఆకాశమా! , గాలా! ,నీరా! , నిప్పా!, ఏది మా కష్టాలన్నింటినీ సునాయసముగా, హఠాత్తుగా తొలగించి వేసింది.! అని ఆశ్చర్య పడుతున్నారు. ఆయనను శారణాగతి చేస్తే , ఆయన కృప వుంటే , ఇలాగే జరుగుతుందన్న దృఢ విస్వాసము ఉండాలని ఈ పాశురములో తెలియజేస్తున్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-22-udaimai-nan/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org