శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీమన్యతీంద్ర! తవ దివ్యపదాబ్జసేవాం శ్రీశైలనాథకరుణాపరిణామదత్తాం |
తామన్వహం మమ వివర్ధయ నాథ! తస్యాః కామం విరుద్దమఖిలంచనివర్తయ త్వం ||
ప్రతి పదార్థము:
శ్రీమన్యతీంద్ర! = తమ అచార్యులకు, శిష్యులకు మోక్షమునివ్వగల గొప్ప సంపద కలిగియున్న ఓ యతీంద్రా!
త్వం = తమరి
మే = దాసుడికి
శ్రీశైలనాథకరుణాపరిణామదత్తాం = తమరి ఆచార్యులైన శ్రీశైలనాథులనబడే తిరుమలై ఆండాన్ (తిరువాయి మొళి పిళ్ళై)చే కృపతో ఇవ్వబడిన
తాం = ఉన్నతమైన
తవ దివ్యపదాబ్జసేవాం = తమరి శ్రీపాదములకు చేయు కైంకర్యమును
అన్వహం = నిరంతరము
వివర్ధయ = విశేషముగా కొనసాగునట్లు అనుగ్రహించాలి (తమరి దాస పరంపరలోని ఆఖరి వారి వరకు ఆ కైంకర్యమును చేయుటకు అనుగ్రహించాలి )
నాథ = స్వామి అయిన యతిరాజా
తస్యాః = దాస్యము చేయుటకు
విరుద్దం = విరుద్దముగా ఉన్న
అఖిలం = సమస్త అడ్డంకులను
కామం నివర్తయ = అడుగంట పోగొట్టి అనుగ్రహించాలి
భావము:
కిందటి శ్లోకాలైన ‘వాచా యతీంద్ర!(3), నిత్యం యతీంద్ర!(4) లలో చెప్పినట్లుగానే యతిరాజులకు, వారి దాసవర్గానికి కైంకర్యము చేయుటకు అనుగ్రహించమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు.’ సేవాం వరత్తయ ‘ అన్న ప్రయోగముతో యతిరాజులకు చేయు కైంకర్య ప్రాప్తిని,’ వరత్తయ ‘అన్న పదములోని ‘ వి ‘అనే ఉపసర్గ వలన యతిరాజుల దాసవర్గానికి చేయు కైంకర్య ప్రాప్తిని ప్రార్థిస్తున్నారు. అర్థాత్ తమ కైంకర్యమును యతిరాజులే పొందుట వలన వారే ప్రాప్యులు ,ఆ కైంకర్య విరోధిని నివర్తించటము వలన వారే ప్రాపకులు అవుతున్నారు. ఇహ లోక, పర లోక సుఖానుభవము , అత్మానుభవమైన కైవల్యము, యతిరాజుల తృప్తి కోసము కాక తమ తృప్తి కోసము చేసే భగవద్కైంకర్యము మొదలైనవి యతిరాజుల కైంకర్య విరోధులు అని గ్రహించాలి.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-19/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org