యతిరాజ వింశతి – 12

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 11

అంతర్బహిస్సకలవస్తుషు సంతమీశం అంధః పురస్సిథతమివాహమవిక్షమాణః |
కందర్పవశ్యహృదయస్సతతం భవామి హంత త్వదగ్రగమనస్య యతీంద్ర నాహిః ||

ప్రతి పదార్థము:

యతీంద్ర! = ఓ యతీంద్రా

అహం = దాసుడు

సకలవస్తుషు = సమస్త వస్తువులను

అంతర్బహిస్సంత = లోపల బయట వ్యాపించి ఉన్న

ఈశం = సమస్త చిదచిత్వస్తువులను పాలించు శ్రీమన్నారాయణుని

పురస్సిథతం = ముందు నిలబడిన వాడిని

అంధః ఇవ = గ్రుడ్డి వాడిలాగా

అహమవిక్షమాణః సన్ = చూడకుండా ఉన్న వాడినై( అందు వలన )

కందర్పవశ్యహృదయః = మన్మధుడికి(కోరికకు)వశపడిన వాడినై

స్సతతం  భవామి = నిరంతరము ఉన్నాను

త్వదగ్రగమనస్య = ( అందు వలన) తమరి ముందుకి రావడానికి

న అర్హః = దాసుడు తగిన వాడు కాదు

హంత = ఎంత కష్టము

 

భావము:

కిందటి శ్లోకములో దాసుడికి శబ్దాది నీచ విషయములలో ఉండు మోహమును పోగొట్టి అనుగ్రహించ వలసినదిగా ప్రార్థిస్తున్నాను అని అన్నారు. దానికి యతిరాజులు ‘అయ్యో , అలాగైఅతే మీరు మేము వేంచేసి వున్న చోటుకు రండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ‘ అని అన్నట్లుగా భావించి  వారి సమీపించటానికి కూదా దాసుడు అర్హుడు కాడని ఈ శ్లోకములో బదులు చేపుతున్నారు.’వృత్తాయ పశుః నర వపుః అహం ‘ తల్లికి చెల్లికి ఇతరులకు తేడా కూడా తెలియని మనుష రూపములోని పశువును ‘అని 7వ  శ్లోకములో  కామ వశులైన తమ స్థితిని వివరించారు. యతిరాజులనే పేరును కలిగి వుండి కామాది సకల దోషములను జయించిన యతులలో రాజైన వాడు, యతులకు రాజైన వాడు అయిన రామానుజుల ఎదుటకు వచ్చి నిలబడే అర్హత లేదు.ఎందుకంటే తాను కామమునకు వశపడిన వాడిని. అయినా సాహసించి వచ్చి నిలబడినా తమరికి అసహ్యము కలుగ వచ్చు. అందు వలన తమరి ముందుకు రాలేను అని అంటున్నారని వ్యాఖ్యాత  అబిప్రాయము .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-12/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment