ఆర్తి ప్రభందం – అవతారిక

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<< తనియన్

emperumAnAr_mElkote

శ్రియః పతి శ్రీమన్ నారాయణుడు, తన భక్తులు తనను చేరవలెనని నిశ్చయముగా ఉండును. దానికొఱకు, అతను వారిలో తనను చేరవలననే ఆశను కలిగించును.ఆ ఆశ కొంచం కొంచముగా పర భక్తి, పర ఙ్ఞానం, పరమ భక్తి గా వికసించును.శ్రీమన్ నారాయణుడు మెల్లగా అట్టి నిర్మలమైన భక్తిని నమ్మళ్వారులకు కల్పించి, తదకు అతన్ని భౌతిక శరీరంతో స్వీకరించెను.నమ్మళ్వారులే దీని గూర్చి ” మయవఱ మది నలం అరుళినన్ (తిరువాయ్ మొళి 1.1.1) ” మరియు  ” అవావఱ్ఱు వేడు పెఱ్ఱ (తిరువాయ్ మొళి 10.10.11) ”  పాశురాలలో తెలియపరిచెను.నమ్మళ్వారుల సంబందముతోనే  ప్రతి ఒక్కరు ఆశ నుండి పర భక్తి, పర ఙ్ఞానము, మరియు పరమ భక్తి అను పరిణామమును అనుభవించగలము.అందువలనే మన పూర్వీకులు, శ్రీమన్ నారాయణుడు నమ్మాళ్వార్లకు అనుగ్రహించిన ఆ భక్తి కోసం అపేక్షించెను. “భగవన్ భక్తిమపి ప్రయచ్చమే” మరియు “పరభక్తియుత్తం మామ్ కురుశ్వ” అను వాఖ్యములచే మనుకు ఈ విషయము అర్థమగును. అలాంటి భక్తిని అపేక్షించి, ఎందరో పూర్వీకులు ఇహలోకము నుండి శ్రీ మన్ నారాయణుడి నిత్య వాసమగు శ్రీవైకుంఠము లేదా పరమపదమునకు అదిరోహించెను.

ఆ పూర్వీకులు శ్రీమన్ నారాయణుని నిష్కారణమైన కారణముచే ఈ భూమిని అతిక్రమించి పరమపదమును చేరెను. అట్టి గొప్ప పూర్వికులకు ప్రతినిదులుగా పరాంకుశులు (నమ్మళ్వార్లు) మరియు పరకాలన్ (తిరుమంగై ఆళ్వార్లు) ఉన్నారు. అట్టి శ్రేష్ఠులతో కూడి శ్రీ రామానుజులు పరమపదము నందు ఉన్నరు. శ్రీ రామానుజుల ప్రఖ్యాతి ఇది మాత్రమే కాదు, అది అంతులేనిది. పరమపదమునకు వెళ్ళు ఆశ ఉన్న జీవులందరికి అతను ఒక్కడె ఆశ్రయము/శరణ్యము. అతను అర్చా రూపములో దివ్యదేశమునందే కాకుండ ఇతర ఆలయములలోను మరియు వారి వారి గృహములోను వ్యక్తమై ఉండెను. తాను పరమపదం వెళ్ళుటకు, తన తరపున ఒక యోగ్యత/ గుణము కూడలేనందు వలన అనార్హులని తెలిసుకొన్న తరువత, అంతటి రామానుజలునే తిరువాయ్ మొళి పిళ్ళై పూర్తిగా ఆశ్రయించెను. ఆఖరికి శ్రీ రామానుజుల కృప/ అనుగ్రహమే అతన్ని పరమపదం చేర్చెను. మణవాళ మామునులు తన ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళై ల బాటనే అనుసరించేను. మణవాళ మామునులు, తన గురువు వలెనే రామానుజుల యెడల వెఱ్ఱియై ఉండెను. నమ్మళ్వార్లు “కృష్ణ తృష్ణా తత్వం” అని ప్రసిద్ధి, అనగా కృష్ణ ప్రేమ మాత్రమే తత్వం. అదేవిధముగా, రామానుజుల యెడల ప్రేమ మాత్రమే తత్వముగా ఉండే వారి ఉదాహరణ వెదకినచో, తప్పక అది మణవాళ మామునులే అని తెలియును. అందువలనే, మణవాళ మామునులు ” యతీంద్ర ప్రవణర్” అని ప్రఖ్యతి చెందెను.

“పాలేపోల్ సీరిల్ పళుతొళిందేన్ (పెరియ తిరువందాది 58) ” మరియు “నైయుం మణం ఉన్ గుణంగళైయున్ని” (రామానుస నూఱ్ఱన్తాది 102) పాశురాలలో తెలిపిన వలే, మామునులు ఎల్లప్పుడు రామానుజుల దివ్య గుణముల యందే నిమగ్నులైయుండెను. అతని సహజ స్వభావమే ఎమ్పెరుమాన్ల అగాధమైన గుణములలో  మునిగి తేలుటయే. రామానుజుల దివ్య గునముల చింతనలోనే ఎప్పుడు ఉండుట వలన, మామునులు ఎమ్పెరుమాన్ల యెడల వెఱ్ఱియై అతని పాడ పద్మములను చేరుటకు ఆకంక్షించెను. రామానుజుల పాడపద్మములను ఇప్పుడు చేరలెకపోవడం వలన అతని శరీరము తెల్లపారిపొయెను. మణవాళ మామునులు ఎమ్పెరుమాన్లను చేరుటకు అపేక్షించెను మరియు ఈ యెడబాటును భరించలేకుండెను. అఖరికి, ఎమ్పెరుమాన్ల అనుగ్రహముచే, మణవాళ మామునులు అతని యెడల పరమ భక్తిని పొందెను. ఎమ్పెరుమాన్ల పాదపద్మములను చేరవలెనను తన ఆకంక్షను నెరవేర్చినట్టి ఎమ్పెరుమాన్ల అపార కరుణను మణవాళ మామునులు “ఆర్తి ప్రభందం” అను ఈ రచనలో కొనియాడెను. ఇందున మామునులు ” చరమ పర్వ నిష్టై” ( భక్తులే ఒక్కగానొక్క ఉపాయం / శరణ్యం) అను భవముచే తనను ఎమ్పెరుమాన్లు అనుగ్రహించిన విధమును కొనియాడెను. ఆ భావము ఉన్న వారు ఈ గ్రంధం నుండి ప్రేరణపొంది, రామానుజుల పాదపద్మములను చేరవచ్చును.

మణవాళ మామునులకు “పత్తి ఎల్లాం తంగియదెన్న”(రామానుజ నూఱ్ఱందాది 108) పాశురమున వివరించిన విధముగ, శ్రీ రామానుజుల పాదపద్మములందు పరమ భక్తి పెంపొందెను. పరమ భక్తి అను స్థితిలో తాను కోరినదిని చేరని యెడల, జీవించుటయే దుర్లభమగును. అట్టి స్థితి లోనే మణవాళ మామునులు శ్రీ రామానుజుల పాదపద్మముల చెంత లేకుండ ఉండుట కష్టమైయ్యెను. ఈ రచనలోని పాశురములు, శ్రీ రామానుజుల పాదపద్మలను చేరవలెనన్న అగాధమైన అపేక్ష యొక్క ఉద్ద్రేకమును వ్యక్తపరచుట వలన దీనిని “ఆర్తి” అనగా ఆశ/అపేక్ష/ప్రేమ అని చెప్పబడుచ్చున్నది. అతని పాదములను చేరు అపేక్షకు మూలము ఈ భౌతిక ప్రపంచమీద ఉన్న ద్వేషముచేకావచ్చు లేదా శ్రీమన్ నారాయణుని కళ్యాణగుణములను (మణవాళ మామునులకు శ్రీ రామానుజుల పాదపద్మమును) అనుభవించు ఆనందము ఉండవచ్చును.ఈ భౌతిక ప్రపంచము యందు ఉన్న ద్వేషమగు – సంసార సాగరమును నమ్మళ్వార్లు “మున్నీర్ గ్యాలం”  అను తిరువాయ్ మొళి పతిగమున మిక్కిలి అందముగ వివరించెను. శ్రీమన్ నారయణుని యందున్న ప్రేమను తిరువాయ్ మొళిలోని “అఱుక్కుం వినై” పతిగంలొ తరువాత స్పష్టముగా వివరించేను. అదే విధముగా ఇంతకు ముందు చూసిన రెండు తనియన్ లు అనగ – “వంబవిళ్ తార్” మరియు “తేన్ పయిలుం తారాన్”  లో ను సంసారము నందు ద్వేషమును మరియు శ్రీ రామానుజుల యందున్న ప్రేమను వర్ణించెను. మణవాళ మామునుల విషయములో ఆర్తి – ఆశ/ అపేక్ష, పై చెప్పబడ్డ రెండు కారణమున పెంపొందిననూ, శ్రీ రామానుజుల పాదపద్మముల యెడల ఉన్న ప్రేమే ముఖ్య ప్రేరణగా ఉండెను.అది చాల పాశురాలలో మనకు బాగ తెలియవచ్చెను.

మణవాళ మామునులు శ్రీ రామనుజుల సమకాలికులు కారు. అందు వలన రామానుజులతో కూడి ఉండి అనుభవించలేకపోయెను మరియు కూరత్తాళ్వాన్ వంటి ఆచార్యుల వలే ఎమ్పెరుమానులకు వారి ఈడులేని పాద పద్మములకు సేవ చేయు భాగ్యమును పొందలేకుండెను. అతను రామానుజులకు సేవచేయుటకు కాంక్షించిననూ, కాలము తనకు సహాయము చేయడంలేదు. అతను శ్రీ రామానుజులను స్వయంగ చూడలేకుండను, శ్రీ రామానుజులు జీవించిన స్థానమున అనగా శ్రీరంగమున నివసించెను. కనీసము రామానుజులు నివసించిన స్థలమున తాను ఉండుటను తలచి ఆనందిచెను మరియు “వళువిలా అడిమై” (తిరువాయ్ మొళి 3.3.1) పాశురంలో చెప్పినట్లు రామానుజులకు నిత్యము సేవచేయవలెనని ప్రాధించెను.  అతను రామానుజులను ధ్యానించుచూ, అతనికి నిత్య కైంకర్యము చేయవలెనని కోరెను.

అందువలనే అతను “వడుగనంబి తన్ నిలయై ఎన్ తనక్కుత్ తందు యతిరాసా ఎన్నాళుం ఉన్తనక్కే ఆట్కొళ్ ఉగందు” (ఆర్త్తి ప్రభందం 11) పాశురములో శ్రీ రామనుజులను వడుగ నంబి యొక్క మనస్తత్వమును తనకు ప్రసాదించమని ప్రార్ధించేను. “అహం సర్వం కరిష్యామి” (శ్రీ రామా, నీ కొఱకు అన్ని చేశెదను) అని చెప్పినట్టి లక్ష్మణునితో శ్రీ రామానుజులను పోల్చెను. శతృగ్నాళ్వారు భరతుడే తను అన్ని అని తలెచెను, కాని భరతునకు శ్రీ రామాడే సర్వమని తలెచెను. శఋగ్నులు శ్రీ రామున్ని అతని అందమునకు శ్రద్ధ చూపలేదు. అతను “శ్రీ రామ భక్తి” అను శతృవును జయించినవారు. రామ భక్తి భరతునికి చేయు సేవకు భంగము కలిగించును. అందుకే శ్రీ రామాయనములో అతనిని “శతృగ్నో నిత్య శతృగ్న ః ” అని చెప్పబడెను. శ్రీ రామానుజులు, రామునికి సేవ చేయు లక్ష్మనుని అంశమగుటచే, మణవాళ మామునులను శతృగ్నుని అంశగా చెప్పెదరు. మామునులు శ్రీ రామానుజులే సర్వం అని జీవించినందున ఆ ఉపమానము సరియగును.

నమ్మాళ్వాలుకు, ఎమ్పెరుమానార్లుకు మరియు మణవాళ మామునులుకు విశిష్టమైన సంబందము ఉండెను. “ముగిల్ వణ్ణన్ అడియై అడైందు ఉయ్న్దవన్” (తిరువాయ్ మొళి 7.2.11) పాశురంలో చెప్పబడినట్లు నమ్మాళ్వార్లు , నీలమేఘశ్యాముడైన శ్రీమన్ నారాయణుని పాదపద్మమును చేరెను. శ్రీ రామానుజులు నమ్మాళ్వార్ల పాదపద్మములను మాత్రమే ఆధారపడి అతని కటాక్షముతో శ్రీ మన్ నారాయణుని నిత్య విభుతిని చేరెను. మణవాళ మామునులు ,రామానుజులను తప్ప మరో ఆశ్రయము లేదని అతని పాదపద్మములనే శరణు కోరి కైంకర్యము చేసెను. ఇదే ఆళ్వార్లకు (నమ్మాళ్వార్లకు) , ఎమ్పెరుమాన్లకు ( శ్రీ రామానుజులకు) మరియు జీయర్లకు (మణవాళ మామునులకు) ఉన్న విశిష్టమైన సంబందము.

నమ్మళ్వార్లు మరియు శ్రీ రామానుజుల శ్రేష్ట సమితిలో ఒక్కరిగా కొనియాడబడు మణవాళ మామునులు, వారి ఇరువురి కీర్తిని తన ఇతర రచనలైన “తిరువాయ్ మొళి నూఱ్ఱందాది”, “ఉపదేశ రత్తిన మాలై” మరియు “యతిరాజ వింశతి” లో వర్ణించెను.  అదే విధముగా తన ఆఖరి రచనయైన ఆర్త్తి ప్రభందంలో తన తుది   అవధిని అనగ “చరమ పర్వం ” తో ముగించెను. ప్రతిఒక్కరు వారి అంతిమ గమ్యము (ప్రాప్యము) ఏదని ఆలోచిస్తుండగా, మణవాళ మామునులు శ్రీమన్ నారాయణుని భక్తుల పాదపద్మములే చరమ గమ్యము/ ధ్యేయము అని వివరించెను. భువిన తన చివరి కాలములో రచించిన చివరి ప్రభందములో మణవాళ మామునులు ఈ శ్రేష్ఠమైన సిద్ధాంతమును గూర్చి మాట్లాడెను. మణవాళ మామునులు యతిరాహ వింశతిని “రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ద్నా” (యతిరాజా విమ్శతి 1) తో ప్రారంభించి, “తస్మాద్ అనన్య శరణౌ భవతీతి మత్వా” (యతిరాజ విమ్శతి 20) తొ ముగించి, శ్రీ రామానుజుల పాదపద్మములే ప్రాపకం (దారి) యనియు దాని విశిష్టతను తెలిపెను. ఆత్తి ప్రభందంలో వారు “వాళి ఎతిరాసన్” (ఆర్త్తి ప్రభందమ్ 1) అని ప్రారంభించి “ఇందవరంగత్తు ఇనిదిరునీ” (ఆర్త్తి ప్రభందమ్ 60) అని పూర్తిచేసి, ప్రాప్యము ( చేరవలసిన గమ్యము) యొక్క వైశిష్ట్యాని అనగా రామానుజుల పాదపద్మములకు చెయవలసిన కైంకర్యమునును గూర్చి వివరించెను.కనుకా యతిరాజ వింశతి “ప్రాపక పరము” (గమ్యమునకు పోవు దారిని తెలుపునది), ఆర్త్తి ప్రభందము “ప్రాప్య పరం” (గమ్యమును గూర్చి తెలుపునది). ఈ సందర్భమున రెండు వాఖ్యము గల ద్వయమంత్రము గూర్చి తెలుసు కొనుట ఉచితముగానుండును. ద్వయ మంత్రము యొక్క రెండవ భగము దివ్య దంపతులైన శ్రీమన్ నారాయణునుకీ మరియు శ్రీ మహాలక్ష్మికీ కైంకర్యము చేయుటకు ఉండ వలసిన తపనను తెలుపును.ఈ ఆర్త్తి ప్రభందము గమ్యమైన శ్రీ రామానుజుల చరణపద్మములను చేరుటకూ మరియు వాటికి కైంకర్యము చేయుటకు ఉండే తపనను గూర్చి వివరించెను. తుది లక్ష్యము  “తదీయ కైంకర్యం” అనగా శ్రీమన్ నారాయణుని యొక్క భక్తులకు చేయు కైంకర్యము. మామునులు దీనిని గ్రహించి మనకు ఈ పశురాలలో చూపెను. శ్రీ రామానుజుల పట్ల ఉన్న “తదీయ కైంకర్య” మే ఈ ప్రభందము యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. వారు తన ఈ సిద్ధాంతమును మనకు వివిధ ఛందములో ఉన్న ఆర్త్తి ప్రభందమును వివరించెను.

ఆర్త్తి ప్రభందం యొక్క మొదటి పాశురంలో మణవాళ మామునులు శ్రీ రామానుజులకు మంగళాశాసనము పాడెను. శ్రీ రామాయణం లో ఇందుకు సమానమైన సంఘటన ఉంది. శ్రీ దండకారణ్యములో పలు ఋషులు శ్రీ రామున్ని చూచెను. వారందరూ రాక్షసులచేతనూ, స్వయం రావణుని చేతనూ హింసించబడి, సరీరమున పలు చోట్ల తీవ్ర గాయముతో డీన స్థితిలో ఉండెను. వారు “యేహి పశ్య శరీరాణీ” అనగా శరీరమున ఉన్న ఈ గాయములను చూడు అని చెప్పి, రామునితో మొరపెట్ట వలెనని తలచిరి. కాని శ్రీ రాముల వారు వనమున ప్రవేశించగానే, వారి అందమునకు ముగ్దులై తమ శరీర గాయమును పూర్తిగామరచెను. వారు శ్రీ రామునీ అంగ సౌందర్యమున నిమగ్నులై, ఇట్టి దివ్య సుకుమార శరీరమునకు రాక్షసులచే ఏ ఆపద కలగకూడదని బయపడి, వెంటనే “మంగళాని ప్రయుగ్జానాః” అని శ్రీ రామునకు మంగళము పాడెను. అదే విధముగా పెరియ ఉడైయార్ (జటాయు) కూడ రావణునితో చేసిన పరాక్రమమైన యుద్దము తరువాత మరణ సమయమున శ్రీ రాముని చూసెను. ఆ సమయమునూ అతను, శ్రీ రామును సౌందర్యమునకు ముగ్దులై “ఆయుష్మాన్” అనగా చిరాయువుతో వర్ధిల్లుగాక అని చెప్పెను. అటులనే మణవాళ మామునులు కూడ శ్రీ రామానుజుల అప్రాకృత విగ్రహం ( పంచ భూతములతో చేయని శరీరం) మునకు మంగళము పాడెను. మణవాళ మామునులు, శ్రీ రామానుజుల పాదపద్మములందు ఆశ్రయం కోరి వచ్చెను. కాని రామానుజుల అప్రాకృత విగ్రహమును చూచి ఋషులు మరియు జటాయు వలే, మంగలము పాడెను. తన సమస్యలను చెప్పుటకు ముందే, అతనికి ఏ చెడు దృష్టీ తగలరాదని తలెచెను.

ఈ విధముగా మంగళాశాసనము ఎవరైన చేసినచో , నిత్యసూరులు వారిని మిక్కిలి పరవశముతో కొనియాడును.  తిరువరంగత్తముదనార్ “అన్బాల్ మయల్ కొండు వాళ్తుం ఇరామానుసన్” (రామానుస నూఱ్ఱన్తాది 6) అను పాశురములో చెప్పినట్లు, శ్రీ రామానుజులు తానే మంగళము పాడెదరు. నమ్మాళ్వార్లు, 10.9 తిరువాయ్ మొళి (సూళ్ విసుంబణిముగిల్) పతిగములో నుత్యసూరులు ఎట్లు ఇతర భక్తులకు మంగళము పాడువారిని కొనియాడి స్వాగతిస్తారనియూ మరియు ఇదియే పరమపదమునకు మార్గమనియూ కనులకు కట్టిన విధముగ వర్ణించిరి. ఇతను ఒక్కప్పుడు పరమపదము చేరుటకు అర్హులు కాదని తలచియు, శ్రీమన్ నారాయణుని భక్తులకు మంగలము పాడుట కొనసాగించెను. అట్టి వ్యక్తులే కాకుండ వారి సంతతులను కూడ నిత్యసూరులు  వారిని తలచి, అనుభవించి మరియు కొనియాడును. ఇదియే మొదటి పాశురము యొక్క కీలకాంశము. పెరియాళ్వార్లు కూడ “పల్లాణ్డు పల్లాణ్డు” (తిరుపల్లాన్ణుడు 1) అని ప్రారంభించి, “అప్పాంచచన్నియముం పల్లాన్డే” (తిరుపల్లాణ్డు 2) అని శ్రిమన్ నారాయణుకే కాకుండ, అతని భక్తులగు దివ్యమైన శంఖమునకు, సారంగమునకు మొదలగు వారికి కూడ మంగళాశసనము చేస్తూ కొనసాగారు. అదే విధముగ శ్రీ రామాయణములో “జయతిభలో రామో లక్ష్మణశ్చ మహాభలహ రాజాజయతి సుగ్రీవో రాగవేనపిపాలితహ” అను శ్లోకానుసారం శ్రీ రామునకు, లక్ష్మణునకు, సుగ్రీవునకు మొదలగు వారికి మంగళము పాడెనని గమనించ వచ్చు.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము:  https://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-introduction/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Comment