ఆర్తి ప్రభందం – తనియన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

bhagavad_ramanuja_2011_may

తనియన్ 1

తేన్ పయిలుం తారాన్ యెతిరాశన్ సేవడి మేల్*
తాన్ పరమపత్తి తలైయెడుత్తు*
మాన్దర్క్కు ఉణవాగ ఆర్త్తియుడన్ ఒణ్డమిళ్గళ్ సెయ్ దాన్*
మణవాళ మామునివన్ వన్దు

ప్రతి పదార్థం

మణవాళ మామునివన్ – పెరియ జీయర్, మణవాళ మామునిగళ్ అని కూడ ప్రసిద్దమైన వరు
వన్దు – ఈ భూమి లో అవతిరించెను
తాన్ – తన అవతార సమయములో
పరమపత్తి – భక్తి యొక్క ఉచ్ఛస్థాయి
తలైయెడుత్తు – అతని యెడల తాను ఆశిర్వదించబడ్డ
తారాన్ – మాల ధరించినవాడై
పయిలుం – స్రవించు
తేన్ – తేనే
యతిరాశన్ – యెతిరాశన్ అని కూడ ప్రసిద్ధమైన
సేవడి మేల్ – యెతిరాశుల పాద పద్మములను గూర్చి వాసిన
సెయ్ దాన్ –  ఆర్తి ప్రభందం అను గ్రంధమును
ఒణ్ – చాల అందమైన ( అనుభవించచు విషయము)ఆ
తమిళ్గళ్ – ద్రవిడ భాషలో (తమిళ్)
ఆర్త్తియుడన్ – వారి దీన స్థితిని చూచి వారిని మార్చు ఉద్ధెశమున
మాందర్క్కు – అఙ్ఞానుల కొరకు చేసిన రచన
ఉణవాగ – మరియు వారిని తీవ్రముగా ఆలోచనచేయించుటకు

సామాన్య అర్థం/ అనువాదం

పెరియ జియర్ అని ప్రసిద్ధిగాంచిన మణవాళ మామునులు, ఈ భువిలో అవతరించెను. ఆ సమయమున, తేనె స్రవించు అందమైన మాలను ధరించిన యతిరాజులే అతనికి భక్తి లో అత్యోనత అంతరమైన పరమ భక్తిని ప్రసాదించి, ఆశిర్వదించేను. ఆ మణవాళ మామునులు మిక్కిలి ఆసక్తితో యతిరాజుల పాదపద్మముల గొప్పతనము గూర్చి చెప్పెను, ఆ గ్రంధమే ఆర్తిప్రభంధం అని తమిళంలో ప్రసిద్ధిచెందింది. ఈ రచన అఙ్ఞానులను ఉద్ధేశించి, వారి మేధకు మేతగా వ్రాయబడినది.

తనియన్ 2

వమ్బవిళ్ తార్ వణ్మై మణవాళ మామునిగళ్*
అమ్పువియిల్ కాల్ పొరుందా ఆర్త్తియినాల్* ఉమ్బర్ తొళుమ్
విణ్ణులగిల్ చెల్ల విరైంద యెతిరాశన్ పదంగళ్
నణ్ణి ఉరైత్తార్ నమక్కు

ప్రతి పదార్థం

మణవాళ మామునిగళ్- పెరియ జీయర్, మణవాళ మామునిగళ్ అని కూడ ప్రసిద్దమైన వరు
ఉరైత్తార్ – ప్రసాదించి
నమక్కు – మనకు (తన ఆర్తి ప్రభందం అను రచన ద్వార)
వణ్మై – మిక్కలి ఔదార్యంతో ఉన్న
తార్ – అందమైన పూలతో కూడిన మాలను ధరించియున్న
వమ్బవిళ్ – అందమైన పూలతో కూడిన మాలను ధరించియున్న
ఆర్త్తియినాల్ – వాస్తవమును తెలిసుకొండుంటచే దుఃఖితులైన (మణవాళ మామునులు)
కాల్ – అతని పాద పడ్మము
పొరుందా – ఇక్కడ ఉండుటకు అర్హులుకాని
అమ్ – అందమైన
పువియిల్ – భువిలో, కావున అతను
విరైంద – శీగ్రముగా అతను ప్రయత్నముచేసెను
చెల్ల – ఆరోహించు
విణ్ణులగిల్ – పరమపదము ( ఉన్నతోన్నతమైన శ్రీమన్ నారాయణుని నిత్య విభూతి )
తొళుమ్ – పూజించబడుచున్న
ఉమ్బర్ – నిత్యసూరులు
నణ్ణి – అతని దృడమైన మరియు స్థిరమైన నమ్మకముచే అది సాధ్యమైయ్యెను
పదంగళ్ – పాదపద్మములు
యతిరాశన్ – ఎమ్పెరుమానార్

సామాన్య అర్థం/ అనువాదం

ఇప్పుడే వికసించిన పూలతో సంగ్రహించిన మాలను ధరించి దర్శనమిచ్చు మణవాల మామునులు ఆర్తి ప్రభందం అను రచనను మనకు ప్రసాదించెను. మామునులు, తాను ఈ అందమైన భువిలో ఉండుటకు అర్హులుకాదని తలచి, వెంటనే నిత్యసూరుల పూజ్యస్థలమైన, పరమపదమునకు ఏగ వలెనని కంక్షించేను. అది మామునులకు, ఎమ్పెరుమానుల కృపతో మాత్రమే సాధ్యమగును.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-thaniyans/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment