కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.10 – ఒన్ఱుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 4.1 – ఒరునాయగమాయ్

శ్రియః పతి అయిన సర్వశ్వరుడు ఆత్మల పట్ల గొప్ప దయతో, అర్చావతార రూపాల్లో ఈ భూమిపైకి దిగి వచ్చి వారి కోసం ఎదురుచూస్తున్నారు, కాని ఈ ఆత్మలు ఆయనచే నియమించబడిన దేవతల దగ్గరకు వెళుతున్నారు. అది చూసిన ఆళ్వారు భగవానుడి ఆధిపత్యాన్ని వారికి వివరించి, వాళ్ళని సంస్కరించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ పదిగములో అర్చావతారము రూపము‌లో ఉన్న భగవానుడి యొక్క ఆధిపత్యాన్ని ఆళ్వారు వెల్లడించారు. ఈ దివ్య దేశము ఆళ్వారు జన్మస్థలం కాబట్టి, ఇక్కడ ఉన్న ఎంబెరుమానుడిపై ఆయనకున్న ప్రత్యేక అనుబంధం కూడా తెలుపుతున్నారు.

మొదటి పాశురము:  “ఎంబెరుమాన్ యొక్క సరళ స్వభావాన్ని స్థాపించే వచనాలను పలుకుతూ, అతి సరళుడైన సర్వేశ్వరుడు ఇక్కడ ఉండగా, మీరు ఇతర దేవతలను వెతుకుతున్నారు? అని  భౌతిక వాసులను ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

ఒన్ఱుం తేవుం ఉలగుం ఉయిరుం మఱ్ఱుం యాదుం ఇల్లా
అన్ఱు నాన్ముగన్‌ తన్నొడు దేవర్‌ ఉలగోడుయిర్‌ పడైత్తాన్
కున్ఱం పోల్‌ మణి మాడ నీడు తిరుక్కురుగూర్‌ అదనుళ్
నిన్ఱ ఆదిప్పిరాన్ నిఱ్క మఱ్ఱై త్తెయ్వం నాడుదిరే

దేవ గంధర్వులను, వాళ్ళ లోకాలను, ఇతర జాతులను, సమస్థ అస్థిత్వాలను ప్రళయ కాలములో నాశనం చేసి, భగవానుడిలో ఇమిడ్చ బడి ఉన్నప్పుడు, సమష్ఠి పురుష అని పిలువబడే బ్రహ్మను భగవాన్ సృష్టించాడు, దేవతలను వాళ్ళ లోకాలను సృష్థించాడు, ఇతర భిన్న విభిన్న జాతులను సృష్థించాడు; సర్వకారకుడు, మహోపకారి అయిన అటువంటి ఎంబెరుమాన్, పర్వతాలంత ఎత్తైన గోపురాలున్న ఆళ్వార్తిరునగరిలో కొలువై ఉండగా, మీరు సృష్టి లయలలో కొట్టుమిట్టాడుతున్న ఈ దేవతల దగ్గరకు వెళుతున్నారు.

రెండవ పాశురము:  భగవానుడి చేత సృష్టింపబడిన వారితో ఆళ్వారు ఇలా అంటాడు, “భగవత్ సృష్టి విషయానికి వస్తే మీరు, మీరు పూజించే దేవతలు ఒకటే; అందువల్ల, మీరు తిరునగరిని ఆశ్రయించండి, అక్కడ నిత్య సంపదగా సర్వేశ్వరుడు కృపతో మీకోసము వెలసి ఉన్నాడు”.

నాడి నీర్‌ వణంగుం దెయ్వముం ఉమ్మైయుం మున్ పడైత్తాన్
వీడిల్‌ శీర్‌ ప్పుగళ్‌ ఆదిప్పిరాన్ అవన్ మేవి ఉఱై కోయిల్
మాడ మాళిగై శూళ్‌ందళగాయ తిరుక్కురుగూర్‌ అదనై
ప్పాడియాడి ప్పరవి చ్చెన్మింగళ్ పల్లులగీర్‌  పరందే

సృష్టి ఆదిలో నిన్ను, నీవు ఆశ్రయిస్తున్న దేవతలను సృష్టించి, మొట్ట మొదటి పోషకత్వం వహించినవాడు సర్వేశ్వరుడు. ఔన్నత్యము, జ్ఞానము, శక్తి వంటి నిత్య మంగళ గుణాలతో కూడినవాడు అతడు. అటువంటి భగవానుడు గొప్ప రాజభవనాలు, గోపురాలు చుట్టూ వ్యాపించి అందంగా ఉన్న దివ్య తిరునగరిలో స్థిరంగా కొలువై ఉన్నాడు; ఓ! వివిధ లోకాలలో నివసిస్తున్న వారా! మీరు అతడిని అన్ని వేళలా అన్ని చోట్లా స్తుతించండి, పాడండి, ఆడండి.

మూడవ పాశురము:  “ఈ విశ్వం యొక్క రక్షణ మొదలైనవి ఒకే కారణం యొక్క ఫలితము, ఇది అత్యోన్నత ప్రభువు యొక్క ఆధిపత్యాన్ని తెలుపుతుంది” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పరంద దెయ్వముం పల్లులగుం పడైత్తు అన్ఱుడనే విళుంగి
క్కరందుమిళ్ందు కడందిడందదు కండుం తెళియగిల్లీర్‌
శిరంగళాల్‌ అమరర్‌ వణంగుం తిరుక్కురుగూర్‌ అదనుళ్
పరన్ తిఱం అన్ఱి ప్పల్లులగీర్‌ ! దెయ్వమ్‌ మఱ్ఱిల్లై పేశుమినే

అనేక దేవతలను, వాళ్ళకి విస్తారమైన అనేక లోకాలు సృష్టించి, ప్రళయ కాలములో ఆ లోకాలన్నింటినీ తాను మ్రింగి తనలో దాచిపెట్టుకొని, ప్రళయము తరువాత వాటిని తనలో నుంచి బయటికి ఉమ్మి వాటికి స్థానమిచ్చి, వాటిని సంరక్షించాడు సర్వేశ్వరుడు అని తెలుసుకున్న తరువాత కూడా మీకు స్పష్టత రాలేదు. తిరునగరి భగవానుడి ప్రాకారం (స్వరూపము) లో భాగము కాని స్వతంత్ర దేవతలు ఎవరూ లేరు;  సమస్థ దేవతలు నమస్కరించి పూజించబడుతున్న వాడతడు; ఓ! అనేక దివ్య లోక వాసులారా! అలాంటి దైవము ఇంకెవరైనా ఉంటే చెప్పండి.

నాలుగవ పాశురము:  “దేవతాంతరములకి ప్రభువు, నిష్కల్మషమైన వేదములను వెల్లడి చేసినవాడు, సర్వేశ్వరుడు అయిన భగవానుడి అత్యోన్నత ఆధిపత్య గుణాన్ని తిరస్కరించే నైయైయికులకి ఏమి ఫలితము దొరుకును?  అని ఆళ్వారు అడుగుతున్నారు.

పేశ నిన్ఱ శివనుక్కుం పిరమన్‌ తనక్కుం పిఱర్‌క్కుం
నాయగన్ అవనే కబాలనన్ మోక్కత్తు క్కండు కొణ్మిన్
తేశ మా మదిళ్‌ శూళ్‌ందళగాయ తిరుక్కురుగూర్‌ అదనుళ్
ఈశన్ పాల్‌ ఓర్‌ అవం పఱైదల్ ఎన్నావదు ఇలింగియర్‌క్కే

రుద్రుడికి, బ్రహ్మకి, ఇతర దేవతలకి ఏకైక  ప్రభువు సర్వేశ్వరుడు (శ్రీమన్నారాయణుడు);  రుద్రుని చేతిలో నుండి కపాలము ఎలా మాయము చేయబడిందో మీరు మహాభారతంలో చూడవచ్చు; సర్వేశ్వరుడు దేవుడు కాడని అల్పంగా భోదించే  లింగ పురణము మొదలైనవాటిని ప్రమాణముగా భావించే అనుమానికులకు వచ్చే ప్రయోజనం ఏమిటి? గొప్ప కోటలు చుట్టూ వ్యపించి ఉన్న తిరునగరిలో అందమైన దివ్య తేజస్సుతో విరాజిల్లి ఉన్న భగవానుడు  సహజంగానే అందరికీ దేవుడు.

ఐదవ పాశురము:  బాహ్యా కుదృష్టులను తిరస్కరించిన ఆళ్వారు, “తిరునగరిలో కొలువై ఉన్న ఎంబెరుమాన్ అందరి కంటే ఉన్నతమైనవాడు” అని చెబుతున్నారు.

ఇలింగత్తిట్ట పురాణత్తీరుం శమణరుం శాక్కియరుం
వలిందు వాదు శెయ్వీర్గళుం మఱ్ఱు నుం దెయ్వముం ఆగి నిన్ఱాన్
మలిందు శెన్నెల్‌ కవరి వీశుం తిరుక్కురుగూర్‌ అదనుళ్‌
పాలిందు నిన్ఱ పిరాన్ కండీర్‌ ఒన్ఱుం‌ పాయ్యిల్లై పోఱ్ఱుమినే

ఓ తామస పురాణాలను అనుసరించి నమ్మే కుదృష్ఠులారా ! ఓ జైనులారా! ఓ బౌద్దులారా! ఓ వైశేషికులారా! వితండ వాదనలు చేసేవారా! మీరు పొందాలను కొని లక్ష్యముగా పెట్టుకొన్న ఆ భిన్న భిన దేవతలు ఎంబెరుమానుడికి పరతంత్రులు. సమృద్ధిగా ఉన్నలేతా వరి పంటలు ఇటు అటు ఊగులాడుతూ వింజామర వీస్తున్నట్టున్న ఆ తిరునగరిలో కొలువై ఉన్న సర్వేశ్వరుడిని మీరందరూ స్తుతించండి. ఇలా అనుకోవడంలో ఎటువంటి అబద్ధము లేదు.

ఆరవ పాశురము:  “మనకు తెలియకుండా కర్మాధారంగా ఈ భౌతిక జగత్తును ఎలా ఏలుతున్నాడు అన్నది ఎంబెరుమాన్ యొక్క నైపుణ్యతను తెలుపుతుంది”. అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పోఱ్ఱి మఱ్ఱోర్ దెయ్వం పేణప్పుఱత్తిట్టు ఉమ్మైయిన్నే
తేఱ్ఱి వైత్తదు ఎల్లీరుం వీడు పెఱ్ఱాల్‌ ఉలగిల్లై ఎన్ఱే
శేఱ్ఱిల్‌ శెన్నెల్‌ కమలం ఓంగు తిరుక్కురుగూర్‌ అదనుళ్‌
ఆఱ్ఱ వల్లవన్ మాయం కండీర్ అదఱిందఱిందోడుమినే

ఈ విధంగా మిమ్మల్ని తన నుండి దూరంగా ఉంచి, దేవతాంతరములను స్తుతించి సేవించేలా చేయడంలో పరమార్థము ఏమిటంటే ప్రతి ఒక్కరూ ముక్తిని పొంది మోక్షాన్ని చేరుకున్నట్లయితే, ఈ ప్రపంచంలోని నిషేధాలు / ఆజ్ఞలు మటుమాయమౌతాయి. ఈ కారణంగా – లేత తామర పుష్పముల మడుగులతో, పుష్కలమైన వరి సంపదతో వర్ధిల్లుతున్న ఆళ్వార్తిరునగరిలో నివాసుడై ఉన్న ఎంబెరుమాన్, వారి కర్మ ఫలితాలను అనుభవింపజేయుటలో మహా సామర్థ్యం కలిగి ఉన్నవాడు – అటువంటి ఎంబెరుమానుడికి ఈ ప్రకృతితో (ఈ భౌతిక ప్రపంచము) ఉన్న సంబంధాన్ని ‘మాయ’ అని పిలుస్తారు; ఆ మాయ గురించి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ భౌతిక ప్రపంచాన్ని దాటడానికి ప్రయత్నించండి.

ఏడవ పాశురము:  “అన్య దేవతల నుండి నీవు ఇప్పటి వరకు ఏది పొందావో అది మాత్రమే పొందగలవు; కాబట్టి, గరుడ ధ్వజము కలిగి ఉన్న సర్వకారకుడికి దాసుడిగా మారు” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఓడియోడి ప్పల పిఱప్పుం పిఱందు మఱ్ఱోర్ దెయ్వం
పాడియాడి పణిందు పల్పడిగాల్‌ వళి ఏఱి క్కండీర్‌
కూడి వానవర్‌ ఏత్త నిన్ఱ తిరుక్కురుగూర్‌ అదనుళ్
ఆడు పుట్కొడి ఆది మూర్‌త్తిక్కు అడిమై పుగువదువే

ఇతర దేవతలను స్తుతించి పాడుట ఆడుట, వాళ్ళని అనేక రకాలుగా ఆరాధించుట, శాస్త్ర విధంగా వాళ్ళని మరింతగా ఆశ్రయించడం, అనేక జన్మలనెత్తి పరుగులాడటం, ఇవన్నీ మీరు గమనించి సర్వకారకుడైన సర్వేశ్వరుడికి దాసులుకండి, సమస్థ దేవతలచే స్తుతింపబడుతూ గరుడ ధ్వజముతో ఆ ఆళ్వార్తిరునగరిలో కొలువై ఉన్న సర్వేశ్వరుడికి శరణు వేడుకొండి.

ఎనిమిదవ పాశురము:  “ఎంబెరుమాన్ అన్య దేవతలకు ఇచ్చిన శక్తి కారణంగా, వాళ్ళని ప్రార్థించిన వారి కోరికలు వాళ్ళు తీర్చగలుతారు. ఉదాహరణకి, నారాయణుడు ఇచ్చిన శక్తి సామర్థ్యముతో మార్కణ్డేయుని కోరికలను రుద్రుడు తీర్చగలిగాడు” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పుక్కడిమైయినాల్‌ తన్నై క్కండ మార్కణ్డేయన్ అవనై
నక్క పిరానుం అన్ఱుయ్య క్కొండదు  నారాయణన్ అరుళే
కొక్కలర్‌ తడంతాళై వెలి త్తిరుక్కురుగూర్‌ అదనుళ్
మిక్క ఆదిప్పిరాన్ నిఱ్క మఱ్ఱై త్తెయ్వం విళంబుదిరే

రుద్రుడు దిగంబరంగా ఉండుట వలన అతడిని ‘నగ్న’ అని పిలుస్తారు. తన పురాణము ద్వారా ప్రసిద్ది చెందిన మార్కణ్డేయుడిని ప్రళయం సమయంలో రక్షించగా, అతడి సేవకు మెచ్చి రుద్రుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, నారాయణుని కృపతో మార్కణ్డేయుని ఉద్దరణకై భగవత్భక్తుడిగా చేసాడు. అందువల్ల, సర్వోన్నతుడు, సర్వకారకుడు అయిన నారాయణుడు పచ్చని ఆకులతో,  తెల్లని పూలతోటలలో కప్పి ఉన్న  ఆళ్వార్తిరునగరిలో కొలువై ఉన్నాడు.

తొమ్మిదవ పాశురము:  “మీరు రక్షింపబడాలంటే, బాహ్య కుదృష్థులు తమ వితండ వాదనలతో నాశనము చేయలేని, ఎంబెరుమాన్ కొలువై ఉన్న ఆళ్వార్తిరునగరిని ఆశ్రయించండి”. అని ఆళ్వారు వివరిస్తున్నారు.

విళంబుం ఆఱు శమయముం అవై యాగియుం మఱ్ఱుం తన్ పాల్
అళందు కాండఱ్కరియన్ ఆగియ ఆదిప్పిరాన్ అమరుం
వళం గొళ్‌ తణ్‌ పణై శూళ్ందళగాయ తిరుక్కురుగూర్‌ అదవై
ఉళం గొళ్ జ్ఞానత్తు వైమ్మిన్ ఉమ్మె ఉయ్యక్కొండు పోగుఱిలే

సర్వకారకుడు సర్వోపకారి అయిన ఎంబెరుమాన్, వేదాల్ని ధిక్కరించి తిరస్కరించే ఆ ఆరు తత్వశాస్త్రాల యొక్క సమిష్టి సమూహాల కుదృష్థులకు, తన విషయాలను చూసి గ్రహించడం కష్టకరంగా చేసే స్వభావము ఉంది. మీరు ఉద్ధరింపబడాలనుకుంటే, ఆకర్షణీయమైన నీటి వనరులతో వ్యాపించి ఉన్న  ఆళ్వార్తిరునగరిలో స్థిర నివాసమున్న భగవానుడిని మీ ఆంతరిక జ్ఞానంలో ఉంచుకోండి, మీ బాటను సులభకరం చేసుకోండి.

పదవ పాశురము: “శరీరి, అతిసులభుడు, తన లీలలతో అందరి హృదయాలను ఆకర్షంచే ఎంబెరుమానుడికి సేవ చేయడం సముచితము మరియు మన అదృష్థము కూడా” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఉఱువదావదు ఎత్తేవుం ఎవ్వులగంగళుం మఱ్ఱుం తన్పాల్
మఱువిల్‌ మూర్‌త్తియోడొత్తు ఇత్తనైయుమ్‌ నిన్ఱ వణ్ణం నిఱ్కవే
శెఱువిల్‌ శెన్నెల్‌ కరుంబొడోంగు తిరుక్కురుగూర్‌ అదనుళ్
కుఱియ మాణ్‌ ఉరువాగియ నీళ్‌ కుడక్కూత్తనుక్కాట్చెయ్వదే

అన్ని వర్గాల దేవతలు, సమస్థ లోకాలు, చిదచిత్తులు, అన్నితత్వాలు అతడి స్వరూపంలోని భాగముగా ఎంబెరుమాన్ తన గుణాలను మరియు గుర్తింపుని కోల్పోకుండా వాళ్ళ స్వరూపాలకు ఒక ప్రత్యేక గుర్తింపు నిచ్చి నిలుచొని ఉన్నాడు; అతడు సారవంతమైన భూములతో ఎత్తైన చెరుకు పంటలు, వరి పంటలతో ఉన్న తిరుక్కురుగూర్లో కూడా కొలువై ఉన్నాడు.  బ్రహ్మచారిగా వామన రూపములో,  కుదక్కూత్తుని ప్రదర్శించిన కృష్ణుడిగా నిత్య ఆనందాన్నిచ్చే అటువంటి ఎంబెరుమానుడిని సేవించడం మన అదృష్థము. మనకి సముచితమైన పురుషార్థము కూడా.

పదకొండవ పాశురము: “ఈ పదిగం నేర్చుకున్న వారికి పరమపదము పొందుట అతి సులభమగును” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఆట్చెయ్దు ఆళి ప్పిరానై చ్చేర్‌ందవన్ వణ్‌ కురుగూర్‌ నగరాన్
నాట్కమళ్‌ మగిళ్‌ మాలై మార్బినన్ మాఱన్ శడగోపన్
వేట్కైయాల్‌ శొన్న పాడల్ ఆయిరత్తుళ్‌ ఇప్పత్తుం వల్లార్
మీట్చి ఇన్ఱి వైగుంద మానగర్‌ మఱ్ఱదు కై యదువే

మహా విశిష్టత కలిగిన ఆళ్వార్తిరునగరికి నాయకుడైన ఆళ్వారుకి “శఠకోపుడు” అనే దివ్య నామము, “మారాన్” అనే ఇంటి పేరున్న ఆళ్వారు, చక్రధారి అయిన భగవానుడికి తన వాక్కు ద్వారా సేవలందించారు. వెయ్యి పాసురములలో ఈ పది పాసురములను పాట రూపంలో పాడారు. ఈ పది పాసురములను పఠించగలిగిన వారు, మరళా తిరిగి రాలేని దివ్య శ్రీవైకుంఠాన్ని చేరుకుంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము:https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-4-10-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment