ఉత్తర దినచర్య శ్లోకం 7 – త్వం మే

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 6

శ్లోకము 

త్వం మే బన్దు: త్వమసి జనకః త్వం సఖా ,దేశికస్త్వం

విద్యా వృత్తం సుకృత మతులం విత్తమ ప్యుత్తమం త్వమ్ !

ఆత్మా శేషీ భవసి భగవన్నాన్తర శ్శాసితా త్వం

యద్వా సర్వం వరవరమునే ! యద్య దాత్మానురూపమ్ !! 

ప్రతి పదార్థము:

హే వరవరమునే = స్వామి వరవరముని 

త్వం = తమరు దాసుడికి 

బన్దు అసి = ఆప్త బంధువు

త్వం జనక అసి = జ్ఞాన భిక్ష పెట్టినందువలన మీరే దాసుడికి తండ్రి 

త్వం సఖా అసి = 1. ఆపదలో ఆదుకునే మిత్రులు 2. భగవదనుభవ కాలంలో తోడూ కూడా మీరే 

త్వం దేశిక అసి = తెలియని విషయాలను తెలియజెప్పే ఆచార్యులు తమరే 

త్వం విద్యా అసి = ఆచార్యులు ప్రేమతో బోధించే విద్య కూడా తమరే

త్వం వృత్తం అసి = ఆచార్యులు బోధించిన విద్య వలన వచ్చిన నడత,నమత్ర  దాని వలన వచ్చే వృత్తం కూడా తమరే

త్వం అతులం సుకృతం అసి = ( స్నేహితులు బంధువుల వలన ధనము ,లాభము మాత్రమే లభిస్తుంది ) అసమానమైన పుణ్యము రావటానికి కారణం తమరే

త్వం వుత్తమం సిద్దం అసి = ఎన్నటికి తొలగి పోనీ ఉన్నతమైన సంపద మీరు .( లోకలోని సంపదలన్నీ కొంత కాలం ఉండి తరవాత పోతాయి. వాటి వలన దుఃఖం మాత్రమే ఏర్పడుతుంది.)

త్వం ఆత్మా అసి = పైన ఉదాహరించిన వాటినన్నిం టిని భరించే ఆత్మ మీరే

త్వం శేషీ భవసి = ఆత్మకు స్వామి కూడా మిరే 

హే భగవన్ = జ్ఞానం ప్రేమ కరుణ అన్నీ అపారంగా కలిగిఉన్న మామునులైన మీరు నాపాలిట భగవంతుడే  

త్వం అన్తర శ్శాసితా అసి = 1. నాలోకి ప్రవేశించి శాసించేది మీరే 2. అంతర అనబడే పరమాత్మను నియమించే అనంతరుడైన జ్ఞానీ కూడా మీరే  

యద్వా = ఇలా ఎన్నని చెప్పగలను?

ఆత్మానురూపమ్ = విరోధిని తొలగించి భగవత్ భాగవత ఆచార్య కైంకర్యములు చేసే భాగ్యమైన ఆత్మానురూపాన్ని  ఇచ్చేది మీరే 

యద్యత్ భవతి = జీవాత్మస్వరూపానికి కావలసినవి ఎమేమున్నాయో 

అసి = అవన్నీ తమరే

భావము; 

బద్నాతి ఇతి బన్దు…..మనల్ని ఎప్పుడూ వదలక మనతో పాటే మన సుఖ దుఖాలన్నీ అనుభవించే బంధువు, సఖుడు , స్నేహితుడు. మనకు కష్టం కలిగినప్పుడు దానిని పోగొట్టేవాడు, మనం భగవదనుభవంలో  ఉన్నప్పుడు ‘ బోధయంతం పరస్పరం’( భగవద్గీత-10-9 ) అన్నట్లు మంచిని బోధించేవాడు. ఇంకా “ తన్జమాగియ తన్దై తాయోడు  తానుమాయ్ “ (3-6-9)అని తిరువాయిమోళిలో అన్నట్లు కాపాడే తండ్రి, తల్లి మరియు స్వయంగా వారు తానే అయ్యారు. ఆళ్వార్లు ‘ నాన్ ‘ అని చెప్పాల్సిన చోట           ‘ తామ్ ‘ అని అంటున్నారు. త్వం ఆత్మా అసి ‘ ……అన్న ప్రయోగానికి ‘ తమరు ఆత్మాగా ఉన్నారు ‘ అని అర్థంగా చెప్పుకోవచ్చు . 

శేషి భవసి,  అన్తర శ్శాసితా భవసి…అన్న మాటలకు నన్ను దాసుడిగా చేసుకున్న వారు,పరమాత్మలా నాలో ప్రవేశించి నియమించే వారు అన్నీ మీరే  అవుతున్నారు అని అంటున్నారు .

అన్తర శ్శాసితా…అన్న ప్రయోగానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు 1. అన్తరః అంటే అన్తరే భవః మనసులో ఉన్న పరమాత్మ .2. ఆత్మానః అన్తరః…. బృ.ఉప . 5-7-22 లో అన్తరః.అన్న పదానికి ఆత్మకు లోపల ఉండే పరమాత్మ అని అర్థంచెప్పటం వలన . అన్తరస్య అయం …లోపల ఉన్న పరమాత్మ లోపల కూడా ఉండి ఆ  పరమాత్మను నియమించే జ్ఞాని  అని అర్థం. ‘ జ్ఞానీతు ఆత్మైవ మే మతం ‘ ( గీత-7-18) జ్ఞాని తనలో ఉండి తనను నియమించే వాడిగా పరమాత్మ గీతలో తనే చెపుతున్నారు. దీనికి ప్రమాణంగా ‘ యద్వా ..’  ఆత్మకు సమానమైనది మరొకటి ఏది ఉంది? ఏది లేదు. 

త్వం ఆత్మా అసి … తమరే దాసుడిగా మారుతున్నారు, అని వీరు తమకు మామునులతో చెప్పుకున్న సామ్యము  జీవాత్మలన్నింటికీ సామ్యము చెప్పటం కాదు. శేష శేషి భావముతోను నియంతృత్వ భావనతోను ‘ శేషి భవసి అన్తరః శ్శాసితా భవసి….’అని చెప్పటం వలన స్పష్ట మవుతుంది. ఈ ప్రేమ తమకు పరమాత్మతోఉన్న శాస్త్ర సిద్ద మైనది ‘ పీదకవాడై పిరానార్ పిరమ గురువాగి వందు ‘ (పెరియాల్వార్ల తిరుమొళి 5-2-8 )అన్నట్లు మాము నులు పరమాత్మయోక్క అవతారమైనందు వలన వీరు తమకు ఆ మామునులతో సామ్యమును చెప్పుకున్నారని భావించవచ్చు. 

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-7/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *