జ్ఞానసారము 11

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 10

10341639_946710622009229_2282824162362598681_n

అవతారిక

‘ ఆసిలరుళాల్ ‘ అన్న పాశురములో శ్రీమన్నారాయణుని తప్ప అన్య ప్రయోజనములను ఆశించని భక్తుల హృదయములో శ్రీమన్నారాయణుడు ఆనందముగా ఉండుట గురించి చెప్పారు. ‘నాళుం ఉలగుం ‘ అన్న పాశురములో  శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తూనే  అన్య ప్రయోజనములను ఆశించే భక్తుల హృదయములో   ఉండుటము ఎంత కష్టమో  చెప్పారు. ప్రస్తుత పాశురములో భగవంతుని తప్ప మరేదీ కోరని భక్తుడు చిన్న వాడైనా ప్రేమతో అర్పించేది చిన్న వస్తువే అయినా ఎంత ప్రీతితో పెద్ద బహుమానముగా భావించి స్వీకరిస్తాడో తెలియ జేస్తున్నారు.  ‘….. పొయ్యమొళి ‘అన్న పాశురములో “తినై తుణై నన్ఱి సెయ్యినుం పనై త్తుణైయగ కొళ్వార్ పయన్ తెరివార్ ”  ఇదే విషయాన్ని తెలుస్తున్నది. ఈ సందర్భములో ‘ సమస్త లోకములను కొలిచిన సందర్భములో ” ఉయర్దవర్రుక్కు ఉదవియ ఉదవియొప్పవే ” అన్నారు కంబర్.

పాశురము 11

తన్ పొన్నడి అన్ఱి మఱ్ఱొన్రిల్ తాళ్వు సెయ్యా

అన్బర్ ఉగందిట్టతు అణు వెనిలుం- పొన్ పిఱళుం

మేరువై కొళ్ళుం విరయార్ తుళాయ్ అలంగల్

మారిమా  కొండల్ నిగర్ మాల్

ప్రతి పదార్థము

విరయార్  = సువాసనతో నిండిన

తుళాయ్ అలంగల్ = తులసి మాలలుధరించిన వాడైన

మారిమా కొండల్ నిగర్ = ఘనమేఘముల వంటి శ్యామల వర్ణము కలవాడు

మాల్ = భక్తులపై పిచ్చి ప్రేమ గల శ్రీయఃపతి

తన్ పొన్నడి అన్ఱి = తన అందమైన బంగరు పాదములను తప్ప

మఱ్ఱొన్రిల్ = ఇతరములపై

తాళ్వు సెయ్యా = మనసు లయించని

అన్బర్ = భక్తులు

ఉగందిట్టతు = ప్రేమతో ఇచ్చే

అణు వెనిలుం- = అణువునైనా

పొన్ పిఱళుం = బంగారు (వెలలేని)

మేరువై = మేరు పర్వతముగా భావించి

కొళ్ళుం = స్వీకరిస్తాడు

వ్యాఖ్యానము

తన్ పొన్నడి అన్ఱి -ఇక్కడ  తన్ ‘ అంటే పరమాత్మ నిర్హేతుకముగా, సహజముగా సమస్త జీవాత్మలకు నాయకుడని స్పష్టమవుతున్నది. ‘ పొన్నడి’ అనటము వలన  జీవాత్మలకు కోరతగినవి , అందమైనవి అని బోధపడుతున్నది. ‘ తన్ పొన్నడి ‘ అనటములో భగవంతుడి శ్రీపాదములు, సకల జీవులు పొందుటకు  అధికారము గలవి , ఉన్నతమైనవి అని అర్థము.

‘ మఱ్ఱొన్రిల్ తాళ్వు సెయ్యా అన్బర్ ‘ ఆ పాదములను పొందు  అందరికీ అధికారము గలదు.  అందరూ కోరతగినవి , అందమైనవి. మఱ్ఱొన్రిల్-అనగా ఇతరములందు …సంపద, ఆత్మానుభవము, మొదలైనవి . ”  లయించుట- అనగా  ఇతరములందు లయించక పోవుట అని చెపుతున్నారు. ‘ శదిరమడవాళ్ తాళ్చియయై మదియాదు. ‘అన్న పాశురములొ ‘ తాళ్చి ‘ (తక్కువ తనము ) లాగానే ఇక్కడ ‘తాళ్వు ‘ ప్రయోగించారు.

ఉగందిట్టతు — ఆనందము… ఇచ్చినదానితో తృప్తిని పొందుట. దాస్యములో రెండు విధములు కలవు. శాస్త్ర  విహితముగా నడచుకొనుట ఒకటి , అనగా శాస్త్రములో చెప్పినందు వలన   దాసుడై వుండుట . ఉదా: భార్య శాస్త్రములో చెప్పినందు వలన భర్త పట్ల పాతివ్రతము పాటించుట , సేవలు చేయుట .’ తర్కాత్తు తర్కొండాన్ పేణి’  అని వళ్ళువర్ ఈ విషయముగా అన్నరు. రెండవది ప్రేమతో దాస్యము చేయుట , ప్రేమ వలన భర్త భార్యకు సేవలు చేయుట . శాస్త్రములో చెప్పినందు వలన కాక ప్రేమతో కైంకర్యము చేయాలని పెద్దలు చెపుతారు.దీనిని ‘ ఉగందు పణి సెయ్వదు ‘ (ప్రేమతో చేయుట  ) అంటారు.

‘ఉఱ్ఱేన్ ఉగందు పణీ సెయ్దు ఉనపాదం

పెఱ్ఱేన్ ,ఈతేఇన్మై వేండువదెంతాయ్ ‘ (తిరువాయిమొళి-10-8-10)

ఇక్కడ ‘ ఉగందు పణి సెయ్వదు ‘ (ప్రేమతో చేయుత ) అని నమ్మాళ్వార్లు అన్నరు.

ఈ విధముగా దాసులు ప్రేమతో అర్పించునవి అణువంత అయినా ……….

పొన్ పిఱళుం మేరువాయి కొళ్ళుం—అన్నారు. అనగా భక్తుడు సమర్పించే స్వల్పమైన కానుకలను మేరువంత పెద్దదిగా , గొప్పదిగా భావిస్తాడని అర్థము. దాసుడు సమర్పించే స్వల్ప వస్తువులను కాక అతడిలోని అపారమైన  ప్రేమను చూస్తాడు. దానితో భగవంతుడికి సంతుష్టీ ఏర్పడుతుంది. ఈయన ఎలాంటి వాడంటే….

విరైయార్ తుళాయలంగల్ మారిమా కొండల్ నిగర్ మాల్—సువాసనగల తులసి మాలలను ధరించి శోభిల్లువాడు.  నీలమేఘశ్యామలవర్ణుడు .

భావము: ఇంతటి నిండు మనసు కలవాడని చెప్పుట వలన ‘అన్య ప్రయోజనములను ఆశించని తన భక్తులకు తను నిండైన నీలమేఘవర్ణ రూపమును కటాక్షించి వారు ఎల్లప్పుడు ఆరూపమును చూసి తరించేందుకు వారిలో భక్తిని అభివృధ్ధి చేస్తాడు.

విరైయార్ తుళాయ్ అలంగల్, మామిమాకొండల్ నిగర్మాల్ ,తన్ పొన్నడి యన్రి మత్తొన్రిల్ తాళ్వు సెయ్య అన్బర్ ఉగందిట్టు అణువెనినుం పొన్ పిఱళుం మేరువాయ్ కొళ్ళుం ( సువాసనగల తులసి మాలలను ధరించినవాడు, నీలమేఘశ్యామలవర్ణుడు, తన భక్తులు ప్రేమతో సమర్పించే అణువంత వస్తువైనా మేరు సమానముగా ఆనందముగా స్వీకరిస్తాడు)అని అర్థము చేసుకోవాలి .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-11-than-ponnadi/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *