జ్ఞానసారము 10

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 9

998931_10153082622610375_989954565_n

అవతారిక

భగవంతుడిని తప్ప ఇతరములేవీ కోరని భక్తుని హృదయములో ఉండుట చాలా ఆనందదాయకమని ముందటి పాశురములో చెప్పారు. ఇక్కడ అది కూడా చాలా ధుఃఖ దాయకమని ఇక్కడ చెపుతున్నారు. అన్య ప్రయోజనములను ఆశించని చోట ఉండటము చాలా కష్టమైన పని అని ఈ పాడురములో చెపుతున్నారు.

పాశురము – 10

నాళుం ఉలగై నలిగిన్ర  వాళరక్కన్

తోళుం ముడియుం తుణిత్తవన్ తన్ -తాలిల్

పొరుందాదార్ ఉళ్ళ్త్తు పూమడందై కేళ్వన్

ఇరుందాలుం ముళ్ మేల్ ఇరుప్పు

ప్రతిపదార్థము

నాళుం = ప్రతి రోజు

ఉలగై = లోకమునంతా

నలిగిన్ర  = ఇడుముల పాలు చేస్తున్న

వాళరక్కన్ = కడ్గమునే ఆయుధముగా ధరించిన వాడు (రావణుడు)

తోళుం = ఇరవై  భుజములును

ముడియుం = పది తలలను

తుణిత్తవన్ = ఉత్తరించిన వాడు

పూమడందై = పద్మోద్భవి

కేళ్వన్ తన్ = ప్రియుడి

తాలిల్ = శ్రీపాదములను

పొరుందాదార్ = ఆశ్రయించని వారి

ఉళిల్ = హృదయములో

ఇరుందాలుం = ఉన్నా

ముళ్ మేల్ ఇరుప్పు  = ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది.

భావము

నాళుం ఉలగై నలిగిన్ర  : అవసరార్థమో, ఆకలికో కాక ఇతరులను హింసించడమే నిత్యకృత్యముగా గల వాడు, అది కూడా ఎవరో ఒకరిని కాక లోకులందరినీ ఇడుముల పాలు చేయుట , అది కూడా కొంచము కూడా వ్యవధానము లేకుండా చేయుట . పర హింసయే వృత్తిగా గల వాడు అని అర్థము.

వాళరక్కన్ : కడ్గమునే ఆయుధముగా గల వాడు. సివుడి వరము చేత   పొందిన కడ్గమును ఆయుధముగా ధరించిన  రావణాసురుడు . ” శంగరన్ కొడుత్త వాళుం ‘ అని కంబ రామాయణములో చెప్పబడింది.

తోళుం ముడియుం తుణిత్తవన్ తన్ – అలాంటి రావాణాసురుని ఇరవై భుజములను, పది తలలను ఉత్తరించిన వాడు. ” న్నిళ్ కడల్ సూళిలగై కోన్ తోళ్గళ్ తలై తుణి సెయ్దాన్. తాళ్గళ్ తలై వణంగి , నాళ్ కడలై అళిమినే” ( నీటిచే ఆవరింపబడిన లంకకు అధిపతి , ఇరవై భుజములు, పది తలలు గలవాడిని సమ్హరించిన వాడి శ్రీపాదముల మీద తలనుంచి కాలమనే సముద్రాన్ని దాటండి)అన్నారు నమ్మళ్వార్లు. దీని భావమేమంటే శతృవు దొరికాడు కదా సమ్హరించి పారేద్దామనుకోకుండా ఇంకా బుధ్ధి వస్తుందేమే నని ముందుగా ఇరవై చేతులును, తరవాత పది తలలను ఉత్తరించాడు.

“తాన్ పోలుమెన్రెళుందాన్ ధరణియాళన్

అతు కండు తరిత్తిరుప్పనరక్కర్ తంగళ్

కోన్ పోలుం ఎన్రెళుందాన్ కున్ర మన్నన్

ఇరుపదు తోళుడన్ తుణింద ఒరువన్ కండీర్ ” (పెరియ తిరుమొళి 4-4-6)

తలైగళ్ పత్తైయుం వెట్టి తళ్ళి పొళుదు పోగ

విళైయాడినార్పోల కొన్రవన్

చరంగలై తురందు విల్ వళైందందు ఇలగై మన్నన్

సిరంగళ్ పత్తరుత్తు తిరంద సెల్వర్ మన్ను పొన్నిడం ” ( తిరుచ్చంద విరుత్తం-802)

పూమడందై కేళ్వన్ : పద్మోద్భవి, నిత్య యవ్వనవతి అయిన శ్రీమహాలక్ష్మికి భర్త అయిన శ్రీమహావిష్ణువు. ఇక్కడ ఈ ప్రయోగము చేయుటలో అంతరార్థము, రావాణాసురుని  సమ్హరించింది లోక కంటకుడని మాత్రమే కాదు శ్రీమహాలక్ష్మి అంశ అయిన సీతా దేవిని చెరపట్టడము కారణము  అని అంటున్నారు.

సురికుళల్ కని వై తిరువినై పిరింద

కొడుమైర్ కడు విసై అరక్కన్

ఇలంగై పాళ్పడుప్పదర్కెణ్ణి” ( పెరియ తిరుమొళి 5-5-7)

ఇక్కడ కూడా తిరుమగై ఆళ్వార్లు సమ్హార రహస్యము అమ్మవారిని వాడు అపహరించతమేనని చెప్పారు. అమ్మ స్వామి అన్యోన్నత ఇక్కడ అవగతమవుతున్నది.

తన్ -తాలిల్ పొరుందాదార్ ఉళ్ళ్త్తిల్ : తన శ్రీపాదములను పట్టుకొన్నా ఇతర ప్రయోజనములను ఆశించియే పట్టుకున్న వాడి మనసు ఇక్కడ నిలవదు. అలాంటి వారిని “పొరుందాదార్ ” అంటున్నారు. వెలయాలు ఒక పురుషుడితో ఉంటూనే మరొకడిని మనసులో తలచినట్లు….

ఇరుందాలుం : అలాంటి వారి హృదయములో ఉండడు. ఒకవేళ ఉన్నా అదేలా వుంటుంది

ముళ్ మేల్ ఇరుప్పు : ముళ్ళ మీద ఉన్నట్లుగా వుంటుంది. కష్టముగా వుంటుంది అని అంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-10-nalum-ulagai/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Comment