ఆర్తి ప్రబంధం – 51

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 50

పరిచయము:

మాముణులతో ఎంబెరుమానార్లు, “నీవు ఇతర ప్రాపంచిక మనుషుల గురించి ఎందుకు మాట్లాడాలి? మునుపటి నీ స్థితి ఎలా ఉండింది?” అని ఆలోచిస్తున్నారు. “అనాదిగా నేను కూడా వారిలాగే సమయాన్ని వృథా చేస్తూ ఉండేవాడిని, అలా సమయము వ్యర్థము చేస్తున్నందుకు బాధ పశ్చాతాపము కూడా నాలో ఉండేది కాదు”, అలాంటి నాకు, మీ ఔన్నత్యము కారణంగా నేను ఇంతకాలం ఏమి కోల్పోయానో గ్రహించాను”, అని మాముణులు తెలుపుతూ తాను పొందిన ఫలితాన్ని కీర్తిస్తున్నారు.

పాశురము 51:

ఎన్ఱుళన్ ఈశన్ ఉయిరుం అన్ఱే ఉండు ఇక్కాలం ఎల్లాం
ఇన్ఱళవాగ ప్పళుదే కళింద ఇరువినైయాల్
ఎన్ఱు ఇళవిన్ఱి ఇరుక్కుం ఎన్నెంజం ఇరవు పగల్
నిన్ఱు తవిక్కుం ఎతిరాశా నీ అరుళ్ శెయ్ద పిన్నే!!!

ప్రతి పద్ధార్ధములు:

ఎన్ఱుళన్ ఈశన్ – “నాన్ ఉన్నై అన్ఱి ఇలేన్ కణ్డాయ్ నారణనే నీ ఎన్నై అన్ఱి ఇలై” (నాన్ముగన్ తిరువందాది 7) వాఖ్యము ప్రకారం, పరమాత్మ శ్రీమన్నారాయణుడు మరియు ఆత్మల (జీవాత్మ) మధ్య సంబంధం శాశ్వతమైనది, ఎట్టి పరిస్థితులలో విడదీయరానిది. అనగా ఈశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుడు కూడా నిత్యుడు అని అర్థము.
ఉయిరుం – శ్రీమన్నారాయణ చేత నియంత్రించబడు ఆత్మ
అన్ఱే ఉండు – కూడా నిత్యమైనది
ఇక్కాలం ఎల్లాం – ఈ కాలమంతా
ఇన్ఱళవాగ– ఇప్పటివరకు
ఇరువినైయాల్– బలమైన నా కర్మల (మంచి చెడు కర్మలు) కారణంగా
ప్పళుదే కళింద ఎన్ఱు – నేను ఈ సమయాన్ని “పూర్తిగా వృధా” గా గడిపాను.
ఇళవిన్ఱి ఇరుక్కుం – అంతకన్నా దారుణంగా, ఈ నష్టానికి నేను పశ్చాత్తాపము కూడా  పడలేదు.
ఎతిరాశా – (అయినా కానీ) ఎంబెరుమానారారే!!!
నీ అరుళ్ శెయ్ద పిన్నే–  మీ ప్రియమైన అనుగ్రహాలు నాపై పడిన తరువాత!!!
ఎన్నెంజం – నా మనస్సు
నిన్ఱు – దృఢముగా
తవిక్కుం – పశ్చాత్తాప పడటం ప్రారంభించింది
ఇరవు పగల్ – రాత్రిం బగళ్ళు

సరళ అనువాదము:

మాముణులు ఈ పాశురములో, ఇప్పటి వరకు వృధా చేసిన సమయం గురించి తాము పశ్చాత్తాపపడేలా ఎంబెరుమానార్ల అనుగ్రహము చేసింది అని కీర్తిస్తున్నారు. ఎంబెరుమానార్ల అనుగ్రహానికి పూర్వము, మాముణులకు అనాదిగా తాను కోల్పోయిన విలువైన సమయానికి పశ్చాత్తాప భావన ఉండేది కాదు. కానీ ఎంబెరుమానార్ల అనుగ్రహము పొందిన పిదప మాముణులు రాత్రింబగళ్ళు ఈ విషయము గురించి మాత్రమే ఆలోచించసాగారు.

వివరణ: 

“నాన్ ఉన్నై అన్ఱి  ఇలేన్ కణ్డయ్ నారణనే ని ఎన్నై అన్ఱి ఇలై”, అని నాన్ముగన్ తిరువందాది 7వ పాశురములో తిరుమళిశై ఆళ్వార్ల వివరణ ప్రకారం, ఏ కాలములోనైనా జీవాత్మ పరమాత్మ శ్రీమన్నారాయణల మధ్య సంబంధం నిత్యమైనది, ఎన్నటికీ తెగనిది. అంటే సర్వనియామకుడు ఈశ్వరుడు అయిన శ్రీమన్నారాయణ నిత్యమైనవాడు. అదే విధంగా, నియంత్రణలో ఉన్న “ఆత్మ” లేదా “జీవాత్మ” అని పిలువబడేవాడు నిత్యమైనవాడు కూడా. అనగా వీరు లేని కాలము అంటూ లేదని అర్థము.  అందరికీ తండ్రి వంటి వాడైన శ్రీమన్నారాయణ, ఆత్మలందరూ ఎప్పటికీ నిత్యము ఉన్నవారే. కానీ, మీ (ఎంబెరుమానార్లు) అనంతమైన కృప నాపై చూపించిన ఈ క్షణము వరకు నా బలమైన కర్మ (మంచి చెడు రెండూ) ప్రభావాలను అనుభవిస్తూ నేను సమయాన్ని గడిపాను. అంతకన్నా దారుణమేమిటంటే, ఇంత కాలమూ, సమయ వృధా చేసిన నేను ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. కానీ మీ ఆశీర్వాదం నాపై పడిన తరువాత, నేను చేసుకొన్న ఆ నష్టము గురించి మాత్రమే రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాను. ఎంతటి అపారమైన కృప. నాపై ఎంత కరుణ!!! అని మాముణులు వివస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-51/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment