ఆర్తి ప్రబంధం – 52

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 51

పరిచయము:

మాముణులు తాను చేసిన కాల యాపనకి పశ్చాత్తాప పడే అవకాశం కలిగిందని ఇదివరకటి పాశురములో వివరించారు. శ్రీ రామానుజుల అనన్య కృప కారణంగా, వారి అనుగ్రహము వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని కూడా వివరిస్తున్నారు. అనంతరం, ఈ పాశురములో మాముణులు శ్రీ రామానుజుల కోసమై, పెరియ పెరుమాళ్ళు తన వద్దకు వచ్చే విధానాన్ని కీర్తిస్తున్నారు. “శ్రీమాన్ సమారూఢపదంగరాజః” అనే వాఖ్యములో ఆతడు తన వద్దకు ఎలా వచ్చారో వర్ణించారు.

పాశురము 52:

కనక గిరి మేల్ కరియ ముగిల్ పోల్
వినదై శిఱువన్ మేఱ్కొణ్డు
తనువిడుం పోదు ఏరార్ అరంగర్ ఎతిరాశర్ క్కాగ ఎన్పాల్
వారా మున్నిఱ్పర్ మగిళ్ందు

ప్రతి పద్ధార్ధములు:

కరియ ముగిల్ పోల్ – పైన తేలియాడు మేఘాలు లాగా
కనక గిరి మేల్ – “మేరు” అనే బంగారు పర్వతం పైన
అరంగర్ – పెరియ పెరుమాళ్ళు
శిఱువన్ –  “వైనతేయుడు” మరియు “పెరియ తిరువడి” అని పిలువబడే వానిపైన ఎక్కి వస్తారు
వినదై – “వినతా” అనే ఒక స్త్రీ
మేఱ్కొణ్డు–  పెరియ పెరుమాళ్ళు ‘వినదై శిఱువన్’ పైన (తమ వాహనమైన గరుడుని పై) సవారీ చేస్తూ వేంచేస్తారు
తనువిడుం పోదు – ఎప్పుడు నా ఈ శరీరం రాలి పడిపోతుందో
అరంగర్ – పెరియ పెరుమాళ్ళు
ఆర్ – నిండి ఉన్న
ఏర్  – సౌందర్యము
ఎన్పాల్ వారా – నేను ఉన్న చోటికి వస్తారు
ఎతిరాశర్ క్కాగ– యతిరాజుని కొరకై (ఒక తల్లిలాగ)
మున్నిఱ్పర్ – వచ్చి నా ముందు నిలబడతారు
మగిళ్ందు  – చాలా ఆనందంతో
(పెరియ పెరుమాళ్ళు వచ్చి, చిరుమందహాసముతో నిండిన తన ముఖాన్ని చూపించి నన్ను ఆనందింపజేస్తాడు. ఇది నిజం)

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తమ చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు తాను ఉన్న చోటికి వచ్చే విధానాన్ని కీర్తిస్తున్నారు. “వినదై శిఱువన్”, “పెరియ తిరువడి” (గరుడ వాహనము) పైన ఆతడు వేంచేస్తారని మాముణులు వివరిస్తున్నారు. తాను ఉన్న చోటికి వచ్చి అతడి అందమైన చిరుమందహాసముతో నిండి ఉన్న ముఖారవిందాన్ని దర్శింపజేస్తారు. ఇవన్నీ అతడు ఎంబెరుమానార్ల కొరకై చేస్తాడు.

వివరణ: 

మాముణులు ఇలా అంటాడు, “కాంచనస్ప గిరేశ్శృంగే సగతిత్తో యదోయదా”,  “మంజుయర్ పొన్మలై మేల్ ఎళుంద మాముగిల్ పోన్ఱుళర్ (పెరియ తిరుమొళి 9.2.8)” అని దివ్యప్రబంధములో వివరించినట్లుగా, నల్లని వర్ణముతో కూడిన మేఘాలు స్వర్ణమయమైన “మేరు” పర్వతముపై విహరించినట్లు, నేను ఈ భూమిపై నా ఈ శరీరాన్ని విడిచిపెట్టే చివరి క్షణాలలో,  “పెరుం పవ్వం మణ్డియుణ్డ పెరు వయిఱ్ఱ కరు ముగిల్” అని తిరునెడుంతాండకం 24వ పాశురములో వివరించినట్లుగా, పెరియ పెరుమళ్ళు గరుడారూడూడై వేంచేస్తాడు. గరుడను “పెరియ తిరువడి” అని, “వినతా” కుమారుడు అయినందున “వినదై శిఱువన్” అని కూడా పిలుస్తారు. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, ఒక తల్లిలా పెరియ పెరుమళ్ళు వస్తాడు. సౌందర్యములో అన్ని హద్దులు దాటిన ఆతడు, ఆ సమయంలో నేను ఉన్న చోటికి వస్తాడు, ఎంబెరుమానార్ల కోసం ఆతడు సంతోషంగా వస్తాడు. తన చిరునవ్వుతో నిండిన శ్రీ ముఖారవిందాన్నినాకు దర్శింపజేస్తారు. ఇది తద్యం.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-52/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment