కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 3.3 – ఒళివిల్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 2-10 కిళరొళి

srinivasan -ahzwar

“పావనమైన నీ పవిత్ర కైంకర్యంలో విరోధమయ్యే ఈ శరీరాన్ని తొలగించు” అని భగవంతుడిని నమ్మాళ్వార్ ప్రార్థిస్తున్నారు. “నీ ఈ శరీరంతో  కైంకార్యాన్ని స్వీకరించడానికి నేను ఉత్తర తిరుమల (తిరువేంగడం) లో వేంచేసి ఉన్నాను, ఇక్కడికి వచ్చి పరమానందాన్ని పొందు” అని భగవాన్ స్పందిచగా ఆళ్వార్ సంతోషించి తనకు నిత్య కైంకార్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నారు.

మొదటి పాశురము:  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరువెంకటముడయానుడికి అన్ని రకాల సేవలలో పాలుపంచుకోవాలని, ఆళ్వారు తనతో పాటు తన సంబంధం ఉన్న వారందరినీ  కోరుతున్నారు.

ఒళివిల్‌ కాలం ఎల్లాం ఉడనాయ్‌ మన్ని
వళువిలా అడిమై శెయ్య వేండునాం
తెళి కురల్‌ అరువి త్తిరువేంగడత్తు
ఎళిల్‌ కొళ్‌ శోది ఎందై తందై తందైక్కే

మనం ఏ సేవలూ వదలకుండా, అన్ని వేళలా ఏ ఆటంకములు లేకుండా, మన పూర్వాచర్యుల వంశ నాయకుని వీడకుండా అతనితో కలిసి ఉండాలి; అంటే దివ్య తేజోమయ రూపములో ఉన్న తిరువెంకట శ్రీనివాసునితో ఉండాలి. జలపాతాల సవ్వడులతో ద్వనిస్తున్న తిరుమల తిరువేంగడంలో ఉన్నందున అతడు అతి సుందరుడైనాడు అని తెలుపుతున్నారు.

రెండవ పాశురము:  అత్యున్నతుడు అయిన ఈ స్వామి యొక్క విశిష్ట గుణాలను మరియు రూపాలను ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.

ఎందై తందై తందై తందై తందైక్కుం
ముందై వానవర్ వానవర్‌ కోనొడుం
శిందు పూ మగిళుం తిరువేంగడత్తు
అందమిల్‌ పుగళ్ కారెళిల్‌ అణ్ణలే

మన పూర్వీకుల అవిఛిన్నమైన పరంపరలో ఎంబెరుమాన్ ప్రథముడు; పుష్పమండము అని పిలువబడే తిరుమలలో వికసించిన ఆ పుష్పాలతో విశ్వక్సేనునితో పాటు అతడిని నిత్యసూరులందరూ నిత్యమూ సేవిస్తారు; అంతులేని కల్యాణ గుణాలతో నల్లని అతిసుందర స్వరూపముతో తిరుమలలో నివాసుడై ఉన్నాడు ఆ సర్వాధికారుడు.

మూడవ పాశురము: అటువంటి శ్రేష్ట స్వరూప గుణాలతో ఉన్న ఎంబెరుమానుడిని నిత్యసూరులు సేవించెదరు” అని ఆళ్వారు తెలుపుచున్నారు.

అణ్ణల్‌ మాయన్ అణి కొళ్‌ శెందామరై
కణ్ణన్ శెంగని వాయ్ క్కరుమాణిక్కం
తెణ్ణిఱై చ్చువైనీర్ త్తిరువేంగడత్తు
ఎణ్ణిల్‌ తొల్‌ పుగళ్ వానవర్‌ ఈశనే

ఎర్రటి దొండపండు వంటి పెదవులతో, ఆకర్షనీయమైన నల్లని నీల రత్నములా మెరిసే దివ్య సౌందర్యముతో, అద్భుత లక్షణాలతో, పుణ్డరీకాక్షునిగా ఎంబెరుమాన్ తన ఆధిపత్య గుణాన్ని వ్యక్తం చేస్తున్నారు. తేటనైన  తెల్లని జలాలతో నిండిన కొలనులు ఉన్న తిరుమలలో కొలువై ఉండుటచేత ఈ భగవాన్ అనంత కోటి మంగళ గుణాలకు అధిపతి అయినాడు, నిత్యసూరులకు ప్రభువువైనాడు.

నాలుగవ పాశురము:  “అతి అల్పుడనైన నాలో ఐక్యమైన ఎంబెరుమాన్, పరమ జ్ఞానులైన నిత్యసూరుల‌కు తనను తాను అర్పించాడని అనడంలో ఆశ్చర్యముందా?” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

ఈశన్ వానవర్‌క్కు ఎన్బన్ ఎన్ఱాల్‌ అదు
తేశమో తిరువేంగడ త్తానుక్కు
నీశనేన్ నిఱై  ఒన్ఱుం ఇలేన్ ఎన్‌ కణ్
పాశం వైత్త పరంజుడర్‌ చ్చోదిక్కే

“నిత్యసూరులను నియంత్రించువాడు భగవాన్” అని నేనంటాను. నేనలా అనడంలో ఏమైన గొప్పదనం ఉందా? లేదు. ఎందుకంటే, అసంపూర్ణుడు అతి అల్పుడైన నాతో, పరిపూర్ణుడు అనంతకోటి మంగళ గుణాలున్న తాను నిత్య సంబంధాన్ని పెట్టుకున్నాడు. తిరుమలలో స్థిరనివాసుడై ఉన్న (అతని సరళత తెలుస్తుంది) కారణంగా అతడు పరిపూర్ణమైన, ప్రకాశవంతమైన రూపాన్ని పొందాడు.

ఐదవ పాశురము: “అతను కేవలం ‘శీలవన్’ ఏనా (సులభుడు, శుభ లక్షణాలతో ఉన్నవాడు)? అటువంటి ఎంబెరుమానుడిని, సరళుడే కాకుండా అనుభవించదగినవాడు కాబట్టి, సర్వేశ్వరుడు అని కీర్తిస్తారు” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

శోదియాగి ఎల్లా ఉలగుం తొళ్లుం
ఆది మూర్తి ఎన్ఱాల్ అళవాగుమో
వేదియర్‌ ముళు వేదత్తముదత్తై
తీదిల్‌ శీర్‌  త్తిరువేంగడ త్తానైయే

ఒకవేళ తైత్తిరియ ఉపనిషత్తు‌లో “ఆనందో బ్రహ్మ” (సర్వోన్నత బ్రహ్మయే బ్రహ్మానందము) “రసో వై సః” (అతడు అన్ని రుచులతో నిండి ఉన్నావాడు) అని తిరువేంగడవాసుడిని వేదము కీర్తిస్తుంది. ఏ అమంగళములు లేకుండా కేవలము శుద్ద మంగళ గుణాలతో నిండిన అతడిని మంగళ స్వరూపుడైన ‘సర్వేశ్వరుడు’ అని స్తుతించారు. సర్వమూ వ్యాపించి సర్వ కారకుడిగా పక్షపాత రహితుడిగా విచక్షణ లేకుండా ఆరాధింపబడుతున్నడు, అందులో గొప్పతనం ఏముంది? అనగా – సర్వకారకుడిగా, సర్వవ్యాపిగా, అందరికీ ఆశ్రితుడిగా, అతడి ఆధిపత్య గుణానికి, అతడి సరళతకి, మాధుర్య గుణానికి మధ్య  సామ్యము లేదు అని అర్థమౌతుంది.

ఆరవ పాశురము: మనలో ప్రతికూలమైన అంశాలు తొలగిన పిదప, ఎంబెరుమాన్ యొక్క ఆశ్రయం సులువుగా పొంది, పరమానందాన్ని అనిభవించడంలో దోహదపడుతుందని ఆళ్వారు కృపతో వివరిస్తున్నారు.

వేంగడంగళ్‌ మెయ్‌మ్మేల్‌ వివై ముఱ్ఱవుం
తాంగళ్‌ తంగట్కు నల్లనవే శెయ్వార్
వేంగడత్తుఱై వార్‌క్కు నమవెన్న
లాం కడమై అదుశుమందార్ కట్కే

తిరుమలలో నిత్యనివాసుడై ఉన్న స్వామి పట్ల “నమః” అనే పదాన్ని వారి మనస్సులో తలంచి, అనుసరించే వారికి, వాళ్ళు ఆర్జించిన గత పాపాలు, ఉత్తరాగములు (శరణాగతి తరువాత పోగుచేసుకున్న పాపాలు) కాలి బూడిద అవుతాయి; ఇది నిజం. ప్రతికూల అంశాలు అవంతకవే మాయమౌతాయి కాబట్టి, వారు భగవత్ అనుభవంలో మాత్రమే పాల్గొని వారి స్వభావానికి అనుగుణంగా పరమానందాన్ని పొందుతారు.

ఏడవ పాశురము: “మన శరణాగతి ఫలితముగా, అతడి నివాసమైన తిరుమల మనకి  అత్యున్నత సామ్యపత్తిని [ఎనిమిది గుణాలతో ఉన్న భగవానుడికి సమానమైన] అనుగ్రహిస్తుంది” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

శుమందు మామలర్ నీర్‌ శుడర్ దూబం కొణ్డు
అమర్‌ందు వానవర్‌ వానవర్‌ కోనొడుం
నమన్ఱెళుం తిరువేంగడం నంగట్కు
శమన్ కొళ్‌ వీడు తరుం తడంగున్ఱమే

లౌకిక సుఖాలలో అణుమాత్రం ఆసక్తి లేని అనన్య ప్రయోజనులుగా కీర్తించబడుతున్న నిత్యసూరులు, వారి నాయకుడైన విశ్వక్సేనుడు భక్తి , అనురాగములతో, ఉత్తమమైన పుష్పాలు, శుద్ద జలము, విశిష్ట ధూప దీపాలు తీసుకెళ్ళి ఆ విశాల తిరుమల దివ్య కొండకు సమర్పించి, నమస్కరించి పరిపూర్ణులైనారు. అటువంటి తిరుమల, మనకు మోక్షాన్ని అనుగ్రహించి పరమ సామ్యపత్తిని (ఎనిమిది గుణాలలో భగవానుడికి సమానముగా) పొందేలా చేస్తుంది.

ఎనిమిదవ పాశురము: “అటువంటి తిరుమలను దర్శించి అనుభవించడం ద్వారా మన లక్ష్య సాధనలో అడ్డంకులు అవంతకు అవే అదృశ్యమవుతాయి” అని ఆళ్వారు చెబుతున్నారు.

కున్ఱం ఏంది క్కుళిర్‌ మళై కాత్తవన్
అన్ఱు జ్ఞాలం అళంద పిరాన్ పరన్‌
శెన్ఱుశేర్ తిరువేంగడ మామలై
ఒన్ఱుమే తొళ నం వినై ఒయుమే

గోవర్ధన గిరిని తన చిటికెన వ్రేలుతో ఎత్తి రేపల్లె వాసులను మరియు గోవులను  రక్షించిన ఆ దేవాది దేవుడు, సర్వరక్షకుడిగా తన పాదముతో భూమిని కొలిచి మహాబలి నుండి రక్షించిన ఆ దేవాది దేవుడు వెళ్లి దివ్య కొండ అయిన తిరుమలకి చేరుకున్నాడు. మనము ఆ తిరుమలకి చేరుకొని వేంకటనాథుని దర్శించడం చేతనే మన అవరోధాల రూపములో ఉన్న మన పాపాలు మాయమౌతాయి.

తొమ్మిదవ పాశురము: “దేశికుడు (నాయకుడు) అయిన తిరువేంగడముడైయాన్ మన అడ్డంకులను తొలగించగల సామర్థ్యం అతడికి తిరుమలతో ఉన్న సంబంధం కారణంగా లభించినది” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

ఓయుం మూప్పు ప్పిఱప్పిఱప్పుప్పిణి
వీయుమాఱు శెయ్వాన్  తిరువేంగడత్తు
అయన్ నాళ్‌ మలరాం అడి త్తామరై
వాయుళ్ళుం మనత్తుళ్ళుం వైప్పార్గట్కే

తిరుమలలో కొలువై ఉన్న ఆ కృష్ణుడి లేత తామర పాద పద్మాలను తమ మనస్సులో వాక్కులో ఎవరైతే నిలుపుకుంటారో, వారి జన్మ, మృత్యు, జరా, వ్యాధుల బాధలను ఆ ఏడు కొండలవాడు నాశనము చేస్తాడు.

పదవ పాశురము: “పరమానందనీయమైన తిరుమలని తమ అత్యున్నత లక్ష్యంగా స్వీకరించండి” అని ఆళ్వారు తన సొంత జనులకు చెబుతున్నారు.

వైత్త నాళ్‌ వరై ఎల్లి కుఱుగిచ్చెన్ఱు
ఎయ్‌త్తిళైప్పదన్ మున్నం అడైమినో
పైత్త పామ్బణైయాన్  తిరువేంగడం
మొయ్‌త్త శోలై మొయ్‌ పూం‌ తడం తాళ్వరే

తిరుమల లోని ఏడు కొండలు, విప్పిన పడగలతో సర్వేశ్వరుడికి మెత్తని శయ్యగా ఉన్న ఆదిశేషుని పోలి ఉన్న కారణంగా తిరుమల కీర్తింపబడుతూ వస్తుంది; అటువంటి విశాలమైన దివ్య తిరుమల కొండలు, అందమైన పువ్వులతో, తోటలతో సుసంపన్నమై  ఉంది; మీ ఇంద్రియాలు మరియు హృదయం క్షీణించకముందే,  మీ జీవితంలోని అంతిమ దశ ప్రారంభమైయ్యెలోగా వెళ్లి తిరుమల  కొండకు చేరుకోండి.

పదకొండవ పాశురము:  ఈ పదిగం ఫలితంగా కైంకార్య సంపదను సంపాదించ గలమని ఆళ్వారు వివరిస్తున్నారు.

తాళ్‌ పరప్పి మణ్‌ తావియ ఈశనై
నీళ్‌ పొళిల్ కురుగూర్ చ్చడగోపన్ శొల్
కేళిల్‌ ఆయిరత్తు ఇప్పత్తుం వల్లవర్
వాళ్వర్  వాళ్వెయ్ది జ్ఞాలం పుగళవే

ఈ వెయ్యి పాసురములలో ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్లు, తన దివ్య పాదాలతో ముల్లోకాలను కొలిచిన సర్వేశ్వరుని వర్ణిస్తున్నారు; ఈ పదిగాన్ని పఠించగలిగే వాళ్ళు (అర్థాలను ధ్యానించడంతో పాటు), అద్భుతమైన కైంకార్య సంపదను పొందుతారు, ఈ ప్రపంచం మొత్తంలో ప్రశంసింపబడుతూ అద్భుతంగా జీవిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-3-3-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment