శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< తనియన్
పాశురం 1
ఎందై తిరువాయ్మొళి పిళ్ళై ఇన్నరుళాల్
వంద ఉపదేశ మార్గత్తై శిందై శెయ్ దు
పిన్నవరుమ్ కఱ్క ఉపదేశమాయ్ పేశుకిన్ఱేన్
మన్నియ శీర్ వెణ్బావిల్ వైత్తు
మొదటి పాశురము:- ఈ పాశురములో మామునులు తమ ఆచార్యులకు నమస్కరించి, తాను ఈ ప్రబంధము ద్వారా తెలియజేయు విషయమును స్పష్టముగా తెలియపరుస్తున్నారు.
తమ స్వామి, జ్ఞాన పితృలైన తిరువాయ్మొళి పిళ్ళై పరమ కృపతో తమకు సమకూర్చి ఉపదేశించిన విషయములను సంపూర్ణముగా అర్థం చేసుకొని తమ సమకాలికులకు సులభముగా నేర్చుకొనుటకు మరియు క్షుణ్ణముగా తెలుసుకొనుటకు తమ ఈ కవిత్వము ద్వారా తెలుపుచున్నారు.
పాశురు 2
రెండవ పాశురము :- మణవాళమామునులను తమ పవిత్ర/దివ్య మనసు “సత్సంప్రదాయమును ఎవరైతే ఇష్టపడరో వారు పొందగలరా” అని అడగినట్లుగా భావించి అటువంటి ప్రస్తావనము వలన తనకెటువంటి కొఱత లేదని తమ మనసును సమాధాన పరుస్తున్నారు.
కత్తోర్ గళ్ తాముగప్పర్ కల్వితన్నిలాశై యుళ్ళోర్।
పెత్తోమెన వుగన్దు పిన్పుకఱ్పర్ – మత్తోర్ గళ్। మాచ్చరియత్తాల్ ఇగళిల్, వన్దదు ఎన్ నెఞ్జే, ఇగళ్ గై ఆచ్చరయమోదాన్ అవర్కు॥
ఎవరైతే ఈ సత్సంప్రదాయము గురించి బాగుగా తెలిసికొనియున్నారో వారు ఈ గ్రంథమును సూక్ష్మమైన మరియు విశేషమైనదిగా స్వీకరిస్తారు. పెద్దలనుంచి మంచి విషయములను తెలుసుకోవాలని అనుకునే వారు దీనిని ఆధారముగా చేసుకొని ఆధరిస్తారు. పై రెండు సమూహములు కాని వారు ఈర్ష్యతో ఎగతాళి చేస్తారు. అది వారి సహజ లక్షణము దీనిలో ఆశ్చర్యమేమున్నదని దాని గురించి చింతించనవసరము లేదని తమ అందమైన మనసును సమాధాన పరుచుచున్నారు.
పాశురం 3
మూడవ పాశురము. ఈవిధముగా తమ మనసును సమాధాన పరచి పాశురములను వ్రాయ సంకల్పించి మొట్ట మొదటగా అమంగళములన్నీ తొలగి పోవునట్లు మంగళాశాసనముతో మొదలు పెడుతున్నారు.
ఆళ్వార్ గళ్ వాళి అరుళిచ్చెయల్ వాళి। తాళ్ దుమిల్ కురవర్ తామ్ వాళి, ఏళ్ పారుమ్ ఉయ్య అవర్గళురైత్త వైగళ్ తామ్ వాళి। శెయ్యమఱై తన్నుడనే శేర్ న్దు॥
ఆళ్వార్లకు పల్లాండు మరియు వారిచే కృపచేయబడిన దివ్య ప్రబంధములకు పల్లాండు. ఆళ్వార్లు చూపిన మార్గములో నడుచుట ద్వారా తమకు ఎటువంటి కొఱత లేనటువంటి మన ఆచార్యులకు పల్లాండు. ఈ లోకమంతా ఉజ్జీవించాలని కోఱు మంచి ఉపదేశములకు పల్లాండు. వీటన్నిటికీ ఆధారమైన వేదములకు, పురాణ, ఇతిహాసాది వాజ్ఞ్మయమునకు పల్లాండు.
అడియేన్ వేదగోపురం వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు
మూలము – https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-1-3-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org