తిరుప్పళ్ళి యెళుచ్చి – 5 – పులంబిన

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

4వ పాశురం

srirangam golden vimana historyశ్రీరాముడు శ్రీరంగవిమానమును  మరియు శ్రీరంగనాథుణ్ణి , శ్రీవిభీషణాళ్వాన్ కు అనుగ్రహించుట

పాశుర అవతారిక:

  • నఙ్ఞీయర్ వ్యాఖ్యానమున- తొండరడిపొడి ఆళ్వార్ ,  ఎంపెరుమాన్ ను ఇలా ప్రాధేయపడుతున్నారు ‘భక్తులయందు తారతమ్యం చూపని  ఎంపెరుమాన్ సన్నిధికి  దేవతలందరు పూమాలికలతో ఆరాధించుటకు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు,  కనుక మీరు మేల్కొని వారందరి కైంకర్యమును స్వీకరించుము’.
  • పెరియవాచ్చాన్ పిళ్ళై – క్రిందటి పాశుర వ్యాఖ్యానమున , పచ్చిక బయళ్లయందు పడుకున్న తుమ్మెదల గురించి ప్రస్తావించారు, ఈ పాశురమున ఆళ్వార్ తోటలలో పడుకున్న పక్షులగురించి వివరించారు. పచ్చిక బయళ్ళలో పడుకున్న ఈ తుమ్మెదలు సూర్యోదయం మునుపే సులువుగా మేల్కొంటాయి- ఈ స్థితి ఇంద్రియనిగ్రహము ఉన్న భక్తులను సూచిస్తుంది. కాని తోటలలో పడుకున్న  పక్షులు పూర్తిగా సూర్యోదయం అయిన తర్వాత మేల్కొంటాయి- ఈ స్థితి ప్రాపంచిక సుఖములయందు తమ ఇంద్రియాలను  వినియోగించే బద్ధజీవులను సూచిస్తుందని వివరణ.

పులంబిన పుట్కళుం పూమ్  పొళిళ్ కళిన్ వాయ్                                                                                            పోయిత్తు క్కంగుళ్ పుగుందదు పులరి                                                                                                                కలన్దదు కుణదిశై కనై కడలరవం                                                                                                                            కళి వణ్డు మిళత్తియ కలమ్బగన్ పునైన్ద                                                                                                          అలంగళ్ అమ్ తొడై యళ్ కొణ్డు అడియిణై పణివాన్                                                                                                అమరర్ గళ్ పుగున్దనర్ ఆదలిల్ అమ్మా                                                                                                            ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్                                                                                                          ఎంబెరుమాన్ పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం

పూమ్=వికసించిన                                                                                                                                             పొళిళ్ కళిన్ వాయ్=తోటలయందు
పుట్కళుం= పక్షులు
పులంబిన=(మేల్కొని)=కూస్తున్న
క్కంగుళ్=రాత్రి
పోయిత్తు=పోయినది
పులరి=ఉషఃకాలము
పుగుందదు=ప్రవేశించెను
కుణదిశై= తూర్పుదిక్కున
కనై= శబ్దించు
కడల్= సముద్ర
అరవం=ఘోష
కలన్దదు=వ్యాపించెను
కళి=మదించిన(మధువును సేవంచిన)
వణ్డు= తుమ్మెదలు
మిళత్తియ= పాడుచున్నవి(ఝుంకారం చేస్తున్నవి)
కలమ్బగన్ పునైన్ద= అనేక/వివిధ పూలతో కూర్చిన
అమ్= అందమైన
అలంగళ్ తొడై యళ్ కొణ్డు=కదిలే పూమాలికలను తీసుకొని
అమరర్ గళ్= దేవతలు
అడియిణై పణివాన్=పాదద్వయమును సమర్పింప
పుగున్దనర్= ప్రవేశించిరి                                                                                                                                    – ఆదలిల్ = కనుక                                                                                                                                     అమ్మా=సర్వ స్వామీ!
ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్=లంకాధిపతి అయిన విభీషణాళ్వాన్ శ్రీరంగమున దాస్యముచేయు
ఎంపెరుమాన్ = ఓ నన్నుఏలిన స్వామి!
పళ్ళియెళుందరుళాయే= పవళించిన స్వామి మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

బాగా విరబూసిన పుష్పములతో ఉన్న ఆ తోటలలో పక్షులు హృదయ ఉల్లాసమైన కిలకిలరావాలు చేస్తున్నాయి.రాత్రి ముగిసినది తెల్లవారుజాము ఆరంభమైనది. తూర్పు  సముద్రపు ఘోష అన్నివైపులా వినబడుతుంది .  మధువును త్రావిన తుమ్మెదలు మత్తుగా,  ఆనందంగా  ఝుంకారములు చేస్తున్న పరిమళభరిత పుష్పములతో కూడిన మాలలను దేవతలందరు చేబూని తమ దివ్యపాదారవిందములను ఆరాధించుటకై వచ్చి ఉన్నారు. లంకాధిపతియైన విభీషణాళ్వాన్ చేత ఆరాధింపడు , శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! ఇక లెమ్ము కృపతో మమ్ములను అనుగ్రహింపుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

  • ప్రతివారిని ఆవహించి నిద్రకు ఉపక్రమించేలా  చేయు   తమోగుణము  రాత్రితో సూచించబడుతున్నది. ప్రతివారియందు ప్రాతః కాలమున  సత్త్వగుణం ఉద్భవించు ను కావున ఆ ప్రాతః కాలము ఎంపెరుమాన్ ను ఆరాధించుటకు అనుకూలమైన/అనువైన సమయం .
  • విభీషణాళ్వాన్,  తనతో అత్యంత శత్రుత్వము ఉన్న రావణుడి సోదరుడైనప్పటికి లంకాధిపతిగా పట్టాభిషేకమును ఎంపెరుమాన్  చేశారు. తాను  కేవలం విభీషణాళ్వాన్ లోని  భక్తిని మాత్రమే చూసి తన సోదరునిగా  అంగీకరించాడు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

  • తొండరడిపొడిఆళ్వార్  తమ తిరుమాలై ప్రబంధము 14వ పాశురమున ” వణ్డినం ఉరులుంశోలై మయిల్ ఇనమ్ ఆలుం శోలై కొణ్డల్ మీదు అణవుం శోలై”– దీనర్థం :    “తుమ్మెదలు  ఆనందంగా ఝుంకరిస్తున్న , నెమళ్ళు గుంపులుగా గుంపులుగా  నాట్యమాడుచున్నఅందమైన తోటలతో , కారు(మబ్బులు)మేఘము కమ్ముకొని ఉండటం  వలన చల్లగా ఉండును శ్రీరంగము” అని వివరించిరి. ఆ శబ్దములన్నీ  పెరియ పెరుమాళ్ ఇంకను  పవళించి ఉన్నారే?” అని   ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నవి.
  • పెరియవాచ్చాన్ పిళ్ళై – ప్రయోజనాంతపరులగు( తమ  స్వార్థ కోరికలు నెరవేర్చుకొను) దేవతలు పెరియపెరుమాళ్ ను సేవించుకొనుటకు వేచి ఉన్నారు. కాని పెరియపెరుమాళ్ ఇంకను మేల్కొనలేదు. – పెరియ పెరుమాళ్ శ్రీరంగమున దక్షిణ ముఖంగా    శయనించి రావణుని కనిష్ఠ సోదరుడై, లంకానగరానికి   పట్టాభిషేకం చేసిన విభీషణాళ్వాన్   కోసం ఎదురుచూస్తూ  పరున్నావా?వారు వస్తే కాని మేల్కొనవా?  అని    పెరియవచ్చాన్ పిళ్ళై ప్రస్తావిస్తున్నారు.
  • ఆళ్వార్, విభీషణాళ్వాన్ ను ప్రస్తావిస్తూ  ఇలా అంటున్నారు ” మీరు  విభీషణాళ్వాన్ చే ఇక్కడ కొనితేబడ్డారు/తీసుకరాబడ్డారు. దానికై వారు వచ్చి మేల్కొలిపితే గాని లేవరా?”
  • మరలా ఇలా అంటున్నారు- ‘వళిపాడు సేయ్ గై'(ఆరాధన)- ఎంపెరుమాన్ సంకల్ప ప్రకారం నడుచుకుంటాము. ఎంపెరుమాన్  ఆశ్రిత పరాధీనుడు(భక్తుల పరాధీనుడు). వాస్తవానికి పెరియపెరుమాళ్ తాను విభీషణాళ్వాన్ చేత లంకానగరమునకు తీసుకొనిపోబడుతున్నారు, ఆ క్రమంలో తాను లంకకు వెళ్ళక అందరిని ఉద్దరించుటకు  శ్రీరంగముననే  స్థిరబడిపోయారు. మరి ఆ కోరిక నెరవేర్చుకొనుటకు మీరు లేచి మమ్ములను అనుగ్రహింపుము స్వామి అని ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు.

సాధారణంగా పదవ పాశురం తప్ప మిగిలి పాశురాలలో అరంగత్తమ్మా అని (మకుటం) ప్రయోగించబడినది, కాని ఈ పాశురమున ఎంపెరుమాన్ అని ప్రస్తావించబడినది. పెరియపెరుమాళే ” ఎంపెరుమాన్” అనగా  నా (ఆళ్వార్ యొక్క) ఇష్ఠమైన దైవం అని అర్థం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-5-pulambina/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment