జ్ఞానసారము 40

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 39

అవతారిక 

                    ఆచార్య భక్తి భాగవత దాసత్వము చాలా వివర్ముగా చెప్పబడింది . అంత చెప్పినప్పటికి లోకుల దృష్టిలో వీరు వింతగానే కనపడతారు.  వడుగ నంబిగారి వృత్తాంతమును ఉదహరిస్తున్నారు . ఒక సారి శ్రీరంగములో  శ్రీరంగనాధుల ఉస్తవము జరుగుతున్నది . శ్రీరంగనాధుల శోభా యాత్ర  స్వామి రామానుజుల మఠము దగ్గరకు వచ్చింది . స్వామి రామానుజులు శిష్యులతో వీధిలోకి వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకోవటానికి బయలు దేరుతూ చూడగా ఆ గొష్టిలో వడుగ నంబి కనపడలేదు. స్వామి , ‘వడుగా !శ్రీరంగనాధులను సేవించుకోవటానికి రండి ‘ అనీ పిలిచారు. దానికి ‘ మీ పెరుమాళ్ళను సేవించుకోవటానికి వస్తే ఇక్కడ మా పెరుమాళ్ళ పాలు పొంగి పోతాయి ‘ అనారు వడుగ నంబి .

       సమాన్యులకు ఈ కథ వింతగా తోచవచ్చు . శ్రీరంగనాధులను సేవించుకోవటము కంటే పాలు కాచడము అంత గొప్ప విష్యమా అనిపించవచ్చు ,అమ్ర్యాదగా మాట్లాదవచ్చు . భగవద్భక్తులు కూడా భగవంతుడిని కాక మానవమాత్రుడైన ఆచార్యులకు కైకర్యము చెస్తూ కాలము గడుపుతున్నారే ,ఆఖరికి మొక్షమునిచ్చే భగవతుదిని కూడా నిరాదరిస్తున్నారే అని అనుకోవచ్చు . ప్రతూత పాశురములో పై ప్రస్నలన్నిటికి సరీయిన జవాబులు ఇవ్వబడ్డయి  .స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ భాగవత దాసుల గొప్పతన్నన్ని కూడా వివరించారు .

Arjuna_meets_Krishna_at_Prabhasakshetra

 

పాశురము

అల్లి మలర్ పావైకు అన్ బర్ అడిక్కు అన్ బర్

సొల్లుం అవిడు సురుదియాం

నల్ల పడియాం మను నూర్కవర్ సరిదై పార్వై

సెడియార్ వినై తొగైకుత్ తీ

ప్రతి పదార్థము

అల్లి మలర్ పావైక్కు  = తామర పై వేంచేసి వున్న ,తామర వంటి శ్రీమహాలక్ష్మి అమ్మవారికి

అన్ బర్ = ప్రియమైన శ్రీమన్నారాయణుడి

అడిక్కు అన్ బర్ = శ్రీపాదమునకు దాసులు

అవిడు సొల్లుం = సరదాగా చెప్పే మాటలు

సురుదియాల్ = వేదమునకు సమానమవుతుంది

అవర్ సరిదై = వారి చరిత్రలు

మను నూర్కు = మను శాస్త్రమునకు 

నల్ల పడియాం = మంచి ఉదాహరణగా ఉంటుంది

పార్వై = వారి చూపులు

సెడియార్ = బుధ్ధికి బాగా తుప్పు పట్టి వున్న

వినై తొగైకు = పాపాత్ములను తొలగదోయటానీకి

తీ = నిప్పు వంటిది అవుతుంది

వ్యాఖ్యానము

                   అల్లి మలర్ పావైక్కు..అన్ బర్ ..అడిక్కు అన్ బర్…. తామర పై వేంచేసి వున్న ,తామర వంటి శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రియమైన శ్రీమన్నారాయణుడు. భగవంతుడి శ్రీపాదములను చేరాలంటే అమ్మవారి పురుషకారము ఉండాలి . అందుకే శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రియమైన శ్రీమన్నారాయణా అనే ప్రార్థించాలి అని తెలియచేయటానికే ఇలా సంబోధించారు . శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రియమైన శ్రీమన్నారాయణుడి శ్రీపాదములపై ప్రేమ గలవారు …అనగా భగవద్భక్తులు ,భాగవతులు అని అర్థము .

సొల్లుం అవిడు సురుదియాం…….అలాంటి వారు సరదాగా మాట్లాడే మాటలలో వేద సారము ఉండటము వలన అవి శృతికి సమానము . గురుపరంపరా ప్రభావములో దీనికి సంబంధించిన ఉదాహారణలను చూడవచ్చు . ఉడయవర్ల వార్తలుభట్టర్ వార్తలు కూరత్తాళ్వాన్ వార్తలునంబిళ్ళై వార్తలుతిరుక్కోళూర్ అమ్మాళ్ వార్తలు మొదలైనవాటిలో వేద వేదాంగములలోని అతి సూష్మమైన విషయాలు ప్రస్తావింపబడతాయి .వాయ్ తందన కూరుదియో మఱై తంద వాయాల్” (నోటికి వచ్చింది చెపుతున్నావా శాస్త్రము ఇచ్చిన నోటితో !)అని కంబ రామాయణములో రాముడు లక్ష్మణుడితో అంటాడు . పేడయయై పిడిత్తు తన్నై పిడిక్క వందడైంద పేదై వేడవనుక్కు  ఉదవి సెయ్దువిఱగిడై వెందీ మూట్టి పాడుఱు పసియై నోక్కి తన్ ఉడల్ కొడుత్త పైంపుళ్ వీడు పెఱ్ఱు ఉయరంద వార్తై వేదతిన్ విళుమిదు అన్ఱో?”( పెంటిని పట్టి తనను కూడా పట్టాలనుకున్న వేటగాడి ఆకలి బాధ తీర్చడముకోసము తానే మంటను చేసి అందులోకి దూకిన పక్షి చేసిన పని వేదసారము కదా! ).  కంబ రామా యణములో శరణాగతి శాస్త్రమును వివరిస్తూ చెప్పిన విషయము ఇది . ఒక పక్షి నోటి నుండి వెలువడిన మాట వేద సారమైనది  అని ఈకథను ఇక్క డ ఉదహరించారు .

నల్ల పడియాం మను నూర్కవర్ సరిదై…….. భగవద్భక్తుల నడత వారి చరిత్రలుగా స్థిరపడతాయి. అనగా మను శాస్త్రములో చెప్పిన విధముగా ఉంటాయి . ధర్మ శాస్త్రములువర్ణాశ్రమ  ధర్మములు వారి నడతకు ఉదాహరణగా నిలుస్తాయి . వారిని అనుసరించే వారు కూడా అదే విధముగా ప్రవర్తిస్తారు . సామాన్యులకు ఈ విధానము నేర్చుకున్నా రాదు . అయినప్పటికి ధర్మశాస్త్రమును నేర్చుకోవటానికి ,అనుసరించటానికి ప్రయత్నము చేస్తారు . కావున పెద్దల నడవడి ఇతరులకు ఆచరణయోగ్యముగానుశాస్త్రప్రమాణముగాను నిలుస్తుంది . దీనికి ఉదాహరణగా కంబరామాయణములో నుండి ఈ క్రింది పాశురమును ఉదహరించారు .

” ఎనైతు ఉళమఱై అవై ఇయంబఱ పాలన

పనైత్తిరన్ కరక్కరి భరదన్ సెయ్ గయే

అనైత్తడిఱం అల్లన అల్లఅన్నదు

నినైత్తిలైయెన్వయిన్ నేయ నెంజినాల్

  (కంబ రామాయణంఅయొధ్య కాండము తిరువడి సూట్టు పడలం – 44)

ఈ మాటలు శ్రీరాముడు లక్ష్మణుని ఉధ్ధేశించి చెప్పినవి .

లోకమునకు విధి విధానములను నిర్ణయించినది వేదము .భరతుని ఆచరణ అన్యులకు ప్రమాణముగా నిలిచింది.   భరతుడు ఆచరించనివి వేదములో చెప్పినప్పటికీ స్వీకరింప దగినవి కావు అన్న విషయాన్ని శ్రీరాముడు లక్షమణుని వివరిస్తున్నాడు అని కంబ రామాయణములో చెప్పారు .               

పార్వై సెడియార్ వినై తొగైకుత్ తీ ……….భాగవతోత్తములైన వారి దృష్టి అనాదిగా తుప్పు పట్టి పోయిన అజ్ఞానాన్ని తుత్తునియలు చేసి జ్ఞానాన్ని ఇవ్వగలదిగా చెపుతున్నారు.

భావము

                  శ్రీమహాలక్ష్మి నాయకుడైన శ్రీమన్నారాయణుని శ్రీపాదములపై భక్తి చేయు వారు ,మామూలుగా మాట్లాడు మాటలు ,వేదప్రమాణములుగా గ్రహించతగినవి . వారి ఆచరణ మనుశాస్త్రమును పోలి ఉంటుంది . వీరి ఆచరణ అసలుగాను శాస్త్రము పోలికగాను భాసిల్లుతుంది .వీరి చూపులు అనాది పాపములను దూదిపై పడ్డ నిప్పులాగా కాల్చివేస్తుంది . వీరి చూపు పడ్డ వారు పునీతులై జ్ఞానాందమును పొందుతారు అని చెప్పి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ ప్రబంధమును పరిపూర్తి చేశారు . 

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/05/gyana-saram-40-alli-malar-pavaikku/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Comment