రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 41- 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్శిక

నలభై ఒకటవ పాశురము:  భగవాన్ చేత సవరిచబడని ఈ ప్రపంచము ఎంబెరుమానార్ అవతారముతో చక్కగా సరిదిద్దబడిందని వారు తెలియజేస్తున్నారు.

మణ్మిశై యోనిగళ్‌ తోఱుం పిఱందు। ఎంగళ్‌ మాదవనే
కణ్ణుఱ నిఱ్కిలుం। కాణగిల్లా * ఉలగోర్గళ్‌ ఎల్లాం
అణ్ణల్  ఇరామానుశన్ । వందు తోన్ఱియ అప్పొళుదే।‌
నణ్ణరుం ఞ్ఙానం తలైక్కొండు। నారణఱ్కాయినరే॥ (41)

శ్రియః పతి అయిన భగవాన్, నిత్యానపాయిని ఈ భూజనుల కళ్ళ ముందు అనేక రూపాలలో (మనిషి, జంతువు మోదలుగా గల) అవతరించినపుడు, వారు అలా అరుదెంచినది ‘భగవాన్’ అని తెలుసుకొనలేదు. భగవత్ భక్తుల లాభ నష్టాలు తమవిగా భావించే రామానుజులు అవతరించిన పిమ్మట వాళ్ళ సొంత ప్రయత్నాలతో సాధించలేని జ్ఞానాన్ని పొంది వారు శ్రీమన్నారాయణుని యొక్క భక్తులుగా మారారు.

నలభై రెండవ పాశురము:  తాను లౌకిక వ్యవహరాలలో మునిగిపోయి ఉన్నపుడు    తన అత్యున్నత కృపను కురిపిస్తూ ఎంబెరుమానార్ తనను రక్షించారని ఆనందముతో పేర్కొనుచున్నారు.

ఆయిళ్లైయార్।‌ కొంగై తంగుం। అక్కాదల్‌ అళత్తు అళుంది
మాయుం ఎన్ ఆవియై। వందెడుత్తాన్ ఇన్ఱు* మామలరాళ్
నాయగన్ ఎల్లా ఉయిర్గట్కుం నాదన్। అరంగన్ ఎన్ను౦
తూయవన్। తీదిల్‌ ఇరామానుశన్ తొల్‌ అరుళ్‌ శురందే॥ (42)

తగిన ఆభరణములతో అలంకరించుకున్న స్త్రీ స్తనములను తప్ప ఇంక దేనినీ చూడాలని కోరక ఊబిలో చిక్కుకొని ఉండేవాడిని నేను.  సమస్థ ఆత్మలకు స్వామి అయిన శ్రీ లక్ష్మీపతి, ఏ మచ్చలేని నిర్హేతుక కరుణామయుడైన పెరియ పెరుమాళ్ ఈ ఆత్మను ఆ ఊబి నుండి బయటకు తీసి నన్ను రక్షించాడు

నలభై మూడవ పాశురము: రామానుజులు తనను వారి నీడలోకి ఎలా తీసుకున్నారో సంతోషముగా గుర్తుచేసుకుంటూ, ఈ ప్రపంచ ప్రజల వైపు చూసి, రామానుజుల దివ్య నామ జపము చేసి అన్ని ప్రయోజనాలు పొందమని చెబుతున్నారు.

శురక్కుం తిరువుం ఉణర్వుం। శొలప్పుగిల్‌ వాయ్‌ అముదం
పరక్కుం। ఇరు వినై పత్తు అఱ ఓడుం * పడియిల్ ఉళ్ళీర్
ఉరైక్కిన్ఱనన్ ఉమక్కు యాన్ అఱం సీఱుం ఉఱు కలియై ।‌
తురక్కుం పెరుమై। ఇరామానుశన్ ఎన్ఱు శొల్లుమినే॥ (43)‌

ఎంబెరుమానార్ అవతారము కారణము చేత అదృష్థము పొందిన జనులారా! ఈ విషయము యొక్క గొప్పతనాన్ని గుర్తించని వాళ్ళకు చెపుతున్నాను. అధర్మ పూరితమైన ఈ కలియుగములో కలిని పారద్రోలే క్షమత ఉన్నవారు రామానుజులు. ఎంబెరుమానార్ల యొక్క దివ్య నామాలను జపించండి. జపించడం ప్రారంభించిన తరువాత మీ భక్తి సంపద రెట్టింపవుతుంది; జ్ఞానము వికసిస్తుంది; మీ నాలుకలపైన తేనెను చవి చూస్తారు. అన్ని ఘోర పాపాలు పూర్తిగా మాయమౌతాయి.

నలభై నాల్గవ పాశురము: ఎంబెరుమానార్ల గొప్పతనము గురించి తాను సూచించిన తరువాత కూడా వారి విషయాల పట్ల ఆసక్తి చూపించని జనుల ప్రవృత్తిని చూసి దుఃఖిస్తున్నారు.

శొల్లార్।‌ తమిళ్‌ ఒరు మూన్ఱుం । శురుదిగళ్‌ నాన్గుం ఎల్లై
ఇల్లా । అఱనెఱి యావుం తెరిందవన్ * ఎణ్‌ అరుం శీర్
నల్లార్‌ పరవుం ఇరామానుశన్। తిరునామం నమ్బి
క్కల్లార్‌ అగల్‌ ఇడత్తోర్‌। ఎదు పేఱెన్ఱు కామిప్పరే ॥ (44)

ఈ విశాల ప్రపంచములో జీవిస్తున్న మనుషులు తమకు ఏది అత్యంత ప్రయోజనకరమో అది తెలుకోవాలనుకుంటారు. రామానుజులు తమిళములోని మూడు శైలులలో (సంగీతము, నాటకీయము, గద్యము) ప్రావిణ్యము ఉన్నవారు; ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదములు తెలిసి ఉన్నవారు; అనేక ధర్మ శాస్త్రములు క్షున్నముగా తెలిసినవారు; అనేక కల్యాణ గుణములు కలిగి ఉన్నవారు; శ్రీవైష్ణవులచే కీర్తింపబడేవారు. ఇటువంటి రామానుజుల దివ్య నామాలను జపించమని నొక్కి చెప్పినపుడు, వారు జపించకుండా అత్యంత ప్రయోజనకరమైనది ఏది అని ఇంకనూ ప్రశ్నిస్తున్నారు. అయ్యో! ఇలా ఎందుకు ఉన్నారు?

నలభై ఐదవ పాశురము: ఈ లౌకిక జనాలలా రామానుజులకు విముఖంగా తానున్నప్పుడు రామానుజులు నిర్హేతుకముగా తనను సరిదిద్ది ఎంత ఉపకారము చేశారో మాటలలో చెప్పలేనని అముదనార్లు చెబుతున్నారు.

పేఱు ఒన్ఱు మత్తిల్లై నిన్ శరణన్ఱి । అప్పేఱు అళిత్తఱ్కు
ఆఱు ఒన్ఱుం ఇల్లై। మత్త చరణన్ఱి * ఎన్ఱి ప్పొరుళై
త్తేఱుం  అవర్‌క్కుం ఎనక్కుం। ఉనై త్తంద శెమ్మై శొల్లాల్‌
కూఱుం పరమన్ఱు। ఇరామానుశ మెయ్‌మ్మై కూఱిడిలే॥ (45)

ఓ రామానుజ! నీ దివ్య తిరువడి తప్పా ప్రయోజనకరమైనది ఇంకేది లేదు. ఆ ప్రయోజనాన్ని పొందేందుకు నీ దివ్య పాదాలే సాధనము. ఈ రెండు సత్యాలను గుర్తించిన వారికి, ఈ విషయములో ఏ స్పష్టత లేని నాకు మధ్య ఏ భేదం చూపించకుండా నన్ను నీ నీడలోకి చేర్చుకున్నావు. నేను మాటలలో వర్ణించలేనిది ఈ స్థితి.

నలభై ఆరవ పాశురము: రామానుజులు తనపై కురిపించిన కృపను గుర్తుచేసుకుంటూ వారి దివ్య తిరువడిని ఆరాధిస్తున్నారు.   

కూఱుం శమయంగళ్‌ ఆఱుం కులైయ। కువలయత్తే
మాఱన్ పణిత్త। మఱై ఉణర్‌ందోనై * మదియిలియేన్
తేఱుం పడి ఎన్ మనం పుగుందానై। తిశై అనైత్తుం
ఏఱుం కుణనై। ఇరామానుశనై ఇఱైంజినమే॥ (46)

ఈ ప్రపంచానికి నమ్మాళ్వార్ కృపతో అందించిన ద్రావిడ వేదముగా కీర్తింపబడే తిరువాయ్మొళి 6 బాహ్య మఠాలను (వేద విరుద్దమైనవాటిని) ధ్వసం చేసింది. తిరువాయ్మొళిని అధ్యయనము చేసిన రామానుజ, దయతో తిరువాయ్మొళి యొక్క జ్ఞానము లేని నేను కూడా ఆ స్పష్థతను పొందాలని నా హృదయములోకి ప్రవేశించారు (పై పాశురములో ప్రయోజనము, దానిని పొందే సాధనము తెలిపినటుల). నలు దిక్కులా వారి మంగళ గుణాల ఖ్యాతి వ్యాపించిన రామానుజులకు నేను నమస్కరిస్తున్నాను.

నలభై ఏడవ పాశురము: ఎంబెరుమానార్లు భగవానుని పట్ల రుచిని కలిపింపజేస్తారు. రామానుజులు తనకు చేసిన ఉపకారాన్ని గుర్తుచేసుకుంటూ, వారికి సరితూగే వారెవరు లేరని అముదనార్లు వివరిస్తున్నారు.

ఱైంజ ప్పడుం పరన్ ఈశన్ అరంగన్ ఎన్ఱు। ఇవ్వులగ
త్తఱం శెప్పుం  అణ్ణల్‌ ఇరామానుశన్ * ఎన్ అరువినైయిన్‌
తిఱం  శెత్తు ఇరవుం పగలుం విడాదు। ఎందన్ శిందైయుళ్ళే
నిఱైందొప్పఱ ఇరుందాన్। ఎనక్కారుం నిగర్‌ ఇళ్ళైయే॥ (47)

అత్యున్నత తత్వము కేవలము పెరియ పెరుమాళ్ మాత్రమే అని,  ఆశ్రయించదగవాడని, అందరిచే ఆరాధించదగవాడన్న ఈ పరమ సత్యాన్ని కృపతో రామానుజులు తెలియజేశారు. అటువంటి రామానుజులు నా మనస్సులోకి ప్రవేశించి, స్థిరపడి, రాత్రి పగలు తేడా లేకుండా, ఆ స్థానానికి సమానమైనది ఇంకొకటి లేనట్టుగా ఉండిపోయి, స్వప్రయత్నముతో నెను తొలగించుకోలేని నా పాపాల మూటని వారు తొలగించారు. వారి దయ కారణంగా నాకు సమానులైన వారెవరూ లేరు.

నలభై ఎనిమిదవ పాశురము: ఇది విని, అముదనార్లు తనను విడిచినా, తాను అముదనార్లను విడిచినా ఈ సంతోషము ఎక్కువ కాలము ఉందదని రామానుజులంటారు.  దానికి స్పందిస్తూ, తన అల్పత్వానికి ఆశ్రయము రామానుజుల కృప అయి, రామానుజుల కృప యొక్క లక్ష్యము అల్పులకి ఆశ్రయము ఇవ్వడము అయినప్పుడు, ఒకరి నుండి ఒకరు విడిపోయే ఆస్కారమే లేదు అని అముదనానార్లు చెబుతున్నారు.

నిగర్‌ ఇన్ఱి నిన్ఱ ఎన్ నీశదైక్కు।  నిన్ అరుళిన్ కణ్‌ అన్ఱి
ప్పుగల్‌ ఒన్ఱుం ఇల్లై । అరుట్కుం ఆహుదే  పుగల్ ‌* పువ్మైయిలోర్‌
పగరుం పెరుమై ఇరామానుశ। ఇని నాం పళుదే
అగలుం పొరుళ్‌ ఎన్। పయన్ ఇరువోముక్కుం ఆన పిన్నే ॥ (48)

సమాంతరత లేని నా అల్పత్వానికి, నీ దయ తప్పా వేరే శరణు లేదు, నా అల్పత్వము కారణముగానే నేను స్వీకరించబడ్డాను. ఆ కృపకు కూడా అల్పులే పాత్రులు. కావున, నా అల్పత్వమే నీ శరణుకి కారణము. ఏ లోపములు లేనివారు కీర్తించే గొప్పతనము గల ఓ రామానుజ! ఇది ఇరువురికీ లాభదాయకము కాబట్టి, విడిపోవుటకు కారణమేమి?

నలభై తొమ్మిదవ పాశురము:  రామానుజుల అవతారముతో ఈ ప్రపంచానికి లభించిన సమృద్ధిని గుర్తుచేసుకుంటూ ఆనందపడుతున్నారు.

ఆనదు శెమ్మై। అఱనెఱి పొయ్‌మ్మై, అఱు శమయం
పోనదు పొన్ఱి। ఇఱందదు వెంగలి * పూంగమల
త్తేన్ నది పాయ్‌ వయల్‌ తెన్ అరంగన్। కళల్ శెన్ని వైత్తు *
త్తాన్ అదిల్‌ మన్ను౦। ఇరామానుశన్ ఇత్తలత్తుదిత్తే ॥(49)

వికసించిన కమల పుష్పాల నుండి తేనె నీళ్ళలాగా కారుతూ ఆ తేనె ప్రవహముతో పంట సాగు చేయబడుతున్న శ్రీ రంగములో, అద్భుత విశాలమైన ఈ ఆలయములో శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ యొక్క దివ్య చరణాలను తన శిరస్సుపై  ఉంచుకొని దానిలో మునిగి అనుభవిస్తున్నారు రామానుజులు. ఈ భూమిపైన ఎంబెరుమానార్ అవతరించి సంపూర్ణముగా వేద మార్గములో పయనించడంతో,  తప్పుదారి పట్టిన ధర్మమార్గము తిరిగి పునరుజ్జీవించింది. వేద విరుద్దంగా ప్రవర్తించిన ఆరు మతాలూ ధ్వంసంగావించబడ్డాయి, ఘోర కలి కూడా నాశనమయ్యె.

యాభైయో పాశురము: రామానుజుల దివ్య తిరువడి పట్ల తనకున్న అమితమైన ప్రేమను గురించి చింతన చేస్తూ సంతోషపడుతున్నారు.

ఉదిప్పన ఉత్తమర్‌ శిందైయుళ్‌ । ఒన్నలర్‌ నెంజమంజి
క్కొదిత్తిడ । మాఱి నడప్పన * కళై  వన్ కుత్తం ఎల్లాం‌
పదిత్త ఎన్ పున్ కవి ప్పావినం పూండన పావు తొల్‌ శీర్
ఎది త్తలై నాదన్। ఇరామానుశకన్ తన్ ఇణై అడియే॥ (50)

ఎంబెరుమానార్ల యొక్క దివ్య చరణ కమలాలు, సహజమైన ప్రాచీనమైన దివ్య మంగళ గుణాలు కలిగి ఉండి ఈ ప్రపంచమంతా వ్యాపించి యతులందరికీ స్వామి వంటివి, సర్వోత్తముల దివ్య హృదయాలలో ప్రకాశించే గుణము కలిగి ఉన్నవి. ఆ దివ్య పాదయుగళి, వేదములను ఖండించు వారి హృదయాలలో మరియు వారికనుకూలముగా వేదాముల తప్పుడు భాష్యములు తెలుపు వారి హృదయాలలో  భయం పుట్టిస్తాయి. అటువంటి వారి దివ్య తిరువడి లోపాలతో కూడిన నా పాశురములను స్వీకరించాయి.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-41-50-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment