ఆర్తి ప్రబంధం – 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<< ఆర్తి ప్రభందం – 3

ramanuja showing paramapadham

ప్రస్తావన

ఈ భౌతిక శరీరమును అవరోధముగా క్రింది పాశురములో చెప్పబడినది. ప్రస్తుత పాశురములో ఈ దేహమును జీవాత్మ కట్టుబడియుండు చెరసాలగా వర్ణిoచబడెను. మణవాళ మామునులు శ్రీ రామానుజులను ఈ చెరసాల నుండి విముక్తి ఇవ్వవలెనని ప్రార్ధించుచుండెను. ఈ పాశురమున, వారు రామునుజులు ఒక్కరే ముక్తి ప్రసాదించగలరని తెలియజేస్తున్నారు.

పాశురం 4

ఇంద ఉడఱ్చిఱై విట్టు ఎప్పొళుదు యాన్ ఏగి
అందమిల్ పేరిన్బత్తుళ్ ఆగువేన్ – అందో?
ఇరంగాయ్ ఎతిరాసా! ఎన్నై ఇని ఉయ్గై
పరంగాణ్ ఉనక్కు ఉణర్న్దు పార్

ప్రతి పద్ధార్ధం

ఎతిరాసా! – ఓ యతిరాజా!!!
ఎప్పొళుదు – ఎప్పుడు
యాన్ – నేను
విట్టు – విముక్తి అగుట
చిఱై – చెరసాల నుండి
ఇన్ద ఉడల్ – ఈ దేహము
ఏగి – అర్చిఱాది మార్గమున పరమదము చేరుట (అర్చిఱాది మార్గము ముక్త జీవాత్మాలు  – శ్రీమన్ నారాయణనుని నిత్య విభూతి అగు పరమపదము చేరు మార్గము)
ఆగువేన్ – (ఎప్పుడు) నాకు
పేరిన్బత్తుళ్ – నిత్యముగా ఆనందము ఉండు పరమపదము నందు ప్రవేశించుటకు
అన్దో? – అయ్యో!!!
ఇరన్గాయ్ – (ఓ! యతిరాజ!!!) దయతో అనుగ్రహించుము
ఎన్నై – నన్ను
ఇని – ఇప్పటినుండి
పరమ్ కాణ్ – సాధ్యము
ఉనక్కు – మీ వలన మాత్రమే
ఉయ్గై – (నన్ను) రక్షించుట
ఉణర్న్దు – (కావున దయ చెసి) ఆలోచించి
పార్ – దాని గూర్చి విచారించుము

సామన్య అర్ధం

మణవాళ మామునులు ఈ భౌతిక శరీరము జీవాత్మను కట్టుబడి ఉంచు చెరసాలగా వర్ణించుచున్నారు. ఒక జీవాత్మ జనన మరణ చక్రమునందుండి విముక్తి పొంది అర్చిరాది మార్గమున పరమపదమును చేరవలెను. అప్పటివరకు జీవాత్మ ఎడతెగని అవస్తను అనుభవించవలెను. మణవాళ మామునులు శ్రీ రామనుజులను తన జీవాత్మను విముక్తి పొందుటకు ఎదైన చెయ్యమని ప్రార్ధించుచున్నారు. వారొక్కరే విముక్తిని ప్రసాదించగలరు. అందుకే శ్రీ రామానుజులను మరల మరల విచారించి, ఆలోచించి తనకు ముక్తిని ప్రసాదించమని విన్నపించెను.

వివరణ

శ్రీ కృష్ణులు తన శ్రీ భగవత్ గీతలో ఈ కాయమును ఒక క్షేత్రముగా ( ఇదం శరీరం – శ్రీ భగవత్ గీతా 13.2) చెప్పెను. క్షేత్రముగా చెప్పబడిన ఈ దేహమును ఈ పాశురమున ముక్తికి అవరోధముగా ఉన్న చెరసాలగా వర్ణించుచున్నరు. ఈ దేహము పతనమైన తరువాత జీవాత్మ ముక్తి పొంది శ్రీమన్ నారాయణుని నిత్య విభూతి అయిన పరమపదమునకు చేర వలెను. అది అంతులేని ఆనందముతో నిండిన స్థలము. అక్కడ చేరు మార్గము మిక్కిల్లి వైభవోపేతమైన అర్చిరాది మార్గము. మణవాళ మామునులు అపార ఙ్ఞానము గల మరియు ఈ సంసార బంధము యొక్క ప్రభావములేని శ్రేష్టమైన భక్తులతో పరమపదమునందు కూడి ఉండుటకు అపేక్షించెను. మణవాళ మామున్నులు తన వేదనను “అయ్యో” అని వ్యక్త పరెచెను. వారు వెంటనే ఎప్పటిలాగ శ్రీ రామానుజులను తలిచి “ఓ యతిరాజా” అని మొఱపెట్టి, “మీరు యతులకు మాత్రమే నాయకులు కారు, మీ పాదకమలమును తప్ప ఆశ్రయించుటకు వేరే చోటు లేని మా వంటి శరణార్ధులకు కూడ మీరే ప్రభువు అని విన్నపించెను. శ్రీమన్ నారాయణులే నా వంటి వారిని ” క్షిపామి (శ్రీ భగవత్ గీతా 16.19)” అని రక్షించక తోసివేసెను. నా వంటి ఇంకెందరినో అగణిత పాపములు చేరినందు వలన వారు రక్షించలెకుండెను. నాకు (మరియు మా వంటి వారికి) మీరు మరియు మీ పాదపద్మములను తప్ప వేరు దిక్కు లేదు. హే! యతిరాజా, మీరొక్కరే కాపాడగలరు. దయచేసి దీని గూర్చి విచారించుము”.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-4/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment