తిరువెళుక్కూట్ఱిరుక్కై 1వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< అవతారిక

అవతారికలో తెలిపినట్లుగా ఈ ప్రబంధములో ఆళ్వార్లు తమ ఆకించన్యమును,  అశక్తతను తెలియజేసుకుంటున్నారు.  అదే సమయములో పరమాత్మ సర్వ శక్తతను తెలియజేస్తున్నారు.తమను   సంసారము  నుండి బయట  పడవేయమని   తిరుక్కుడందై ఆరావముదుడిని శరణాగతి చేస్తున్నారు.

kshirabdhinathan

1-2-1( అంకెలు రథము ఆకారములో అమరుటకు పాశురములో ప్రయోగించబడినవి)

ఒరు పేరుంది ఇరు మలర్ తవిసిల్   ఒరు ముఱై అయనై ఈన్ఱనై

ప్రతిపదార్థము:

  • ఇరుపెద్ద
  • తవిసిల్ఆసనము
  • ఉంది –  (నీ పవిత్రమైన)నాభి
  • మలర్ – (తామర)పూవు
  • పేర్గొప్ప
  • ఒరుసమానమైన
  • ఒరు ముఱైఒక సారి(సృష్టి కాలములో)
  • ఈన్ఱనైనువ్వు సృజించావు
  • అయనై –  బ్రహ్మను

భావము:

            నిర్హేతుక కృపతో  ప్రళయానంతరము, లోకాలను   సృజించావు. బ్రహ్మను తామర వంటీ నీ నాభి నుండి సృజించి ఆయనలో అంతర్యామిగా నువ్వుండి సమస్త పదార్థములను, సృజించావు. (ఇవన్నీ సునాయాసముగా చేసిననీకు, నాకు  మోక్షమివ్వటము  మాత్రము కష్టమా!)

వ్యాఖ్యానము:

ఒరు పేరుంది—:   ఒక గొప్ప నాభికమలము.  అది శ్రీమన్నారాయణుని నాభికమలము. “పేర్అనాది .. కాల ప్రమాణములకు  అందని నాభి కమలము.  బ్రహ్మకు జన్మ స్థానము. బ్రహ్మ అజుడు. తమిళములో అయన్ అంటారు.

ఒరు ముఱై:    శ్రీమన్నారాయణుడు, ఒకానొకప్పుడుఒకొక్క  ప్రళయము తరవాత బ్రహ్మను సృజిస్తాడు.

 ‘అవిభక్త తమస్సుగా నామరూపములు లేకుండా వున్న కాలములో ,వాటిని `విభజించి, నామరూపములనిచ్చాడు.  తరువాతఅక్షరము,  ‘అవ్యక్తము`, ఆతరువాత `మహాన్, అహంకారము`,   మళ్ళీ అహంకారము నుండి  సబ్ద,స్పర్శ, రూప, రస, గంధములను సృజిస్తాడుఆకాశము, వాయువు, అగ్ని, ఆప/జలము , పృధ్వి అనే  పంచ భూతములను సంకల్ప మాత్రమున సృజిస్తాడు. దీనిని సమిష్టి సృష్టి అంటారు. బ్రహ్మను  సృష్టి చేసి ఆయనలో అంతర్యామిగా వుండి వ్యష్టి సృష్టిని చేసాడు. అవి నాలుగు విధములు. క్రమముగా   1.దేవతలు 2. మనుష్యులు, 3. తిర్యక్కులు  (జంతువులు) 4. స్థావరములు (చెట్లు).

విషయములను  పిళ్ళై లోకాచర్యులు తత్వ త్రయములో ప్రస్తావించారు.

 చిత్ (బ్రహ్మ తో సహా), అచిత్తుల మధ్య బేధము లేదు. ఇవి అన్నీ పరమాత్మకు లోబడినవే. ఆయన తత్వమును తెలుసుకొని ఆనందించినప్పుడు  మాత్రమే  బేధము తెలుస్తుంది.

 ఒక రైతు పంటను వేసి,  రక్షించి,  కలుపును తొలగించి కాపా డు కున్నట్టు,  నువ్వు చేస్తున్నావని తేటతెల్లముగా  కనపడుతున్నది. మరి, మాకు మోక్షమివ్వటము నీకు అసాధ్యమెందుకవుతుంది  అని తిరుమంగైఆళ్వార్లు,  పరమాత్మను అడుగుతున్నారు.

 అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/06/thiruvezhikurrirukkai-1/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment